suneetha
-
ఆమె ఒడి... అనాథల బడి
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు. ‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్‌లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు! సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్‌రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్‌మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్‌కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుకు భరోసా!ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్‌కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్‌ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది. – సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్ – తుమాటి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
ఏపీ ఎన్నికల వేళ తెరపైకి వివేకా కేసు
తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు పొంతన లేదు. పైగా ఉన్నపళంగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకోవడంతో.. ఆమె ఏ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతుందో స్పష్టమవుతోంది. ఇక వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. అలాంటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది?.. సంబంధం అంటగడుతూ ఈనాడు ఎందుకు కథనాలు ఇవ్వాలి? ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆ మధ్య ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. అదే సమయంలో.. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒకటిన్నర పేజీలు ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏంటసలు?.. సునీత ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలు కొన్ని.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాష్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? సునీత నుంచి సమాధానాలేవీ? ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా?.. ఆ దుర్బుద్ధి బయటపడిందిలా.. వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాష్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఇదీ చదవండి: వివేకా వర్థంతిన సునీత రాజకీయం! ఆ లేఖ దాచింది నర్రెడ్డి దంపతులు కాదా? ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. పెద్ద మనుషుల ముసుగులో కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజు, వివేకా కేసులో షర్మిల, సునీత, లాంటి వాళ్లను మార్చుకుని ఎన్నికలకు వెళ్తున్నారుఘ ఈ క్రమంలోనే సీఎం జగన్‌పై జరుగుతున్న కుట్రలో భాగంగా తెరపైకి వచ్చిందే.. వివేకా హత్య కేసు. ఈ కుట్రలో ఈనాడు అధినేత రామోజీరావు కూడా భాగమే అయ్యారు. ‘‘వివేకా హత్య జరిగి రేపటికి అయిదేళ్లు.. అయినా కొలిక్కిరాని దర్యాప్తు.. కారణం జగనే!.. నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తుల ప్రయోగం’’ అంటూ అడ్డగోలు రాతలతో తాజాగా ఈనాడు ఇచ్చిన కథనమే ఇందుకు నిదర్శనం. ఈ కేసులో తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుందో.. అవే నర్రెడ్డి సునీత నుంచి మొదటి నుంచి చేస్తోంది. పైగా ఆమె స్టేట్మెంట్ను టీడీపీ అనుకూల మీడియా సంస్థలు హైలైట్ చేస్తూ వస్తున్నాయి. అందునా ఈమధ్య చంద్రబాబుకి, టీడీపీ అండ్ మిత్రపక్ష నేతలకు ఆమె ఢిల్లీ ప్రెస్ మీట్లో కృతజ్ఞతలు చెప్పారు. అయితే.. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్నే ప్రముఖంగా ప్రస్తావించిన రామోజీ మీడియా.. బాబు అండ్ కోకి ఆమె చెప్పిన కృతజ్ఞతల్ని పట్టించుకోలేదు. వీటన్నంటికి తోడు.. వివేకా వర్థంతి నాడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రకటన చేయాలని ఆమె నిర్ణయించుకోవడం, టీడీపీ తరఫునే బరిలోకి దిగాలని ఆమె ప్రయత్నిస్తుండడం.. ఇవన్నీ చూశాక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరిగింది కాదంటే ఎవరైనా నమ్మగలరా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అందుకే హీరోయిన్గా చేయలేదు : సింగర్ సునీత
స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. సునీత గానం ఎంత మధురంగా ఉంటుందో.. రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అందగత్తె అయిన ఈ సింగర్‌కి హీరోయిన్గా కూడా బోలెడన్నీ అవకాశాలు వచ్చాయట. చాలా మంది దర్శక నిర్మాతలు హీరోయిన్గా చేయమని అడిగారట. కానీ ఆమె మాత్రం ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించారట. సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే, హీరోయిన్గా కూడా అవకాశాలు వచ్చాయట. కానీ ఆమె నటించడానికి భయపడ్డారట. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సునీతకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. కానీ హీరోయిన్ గా మారితే కష్టాలు ఉంటాయని, వాటిని దగ్గర నుంచి చూశానని.. అలాంటి జీవితం తనకు వద్దు అంటూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా సున్నితంగా తిరస్కరించారట సునీత. అలాగే రామ్ గోపాల్ వర్మ ‘అనగనగా ఒక రోజు’సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం ఇస్తే కూడా నో చెప్పారట. ఈ విషయాలన్నీ ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది సునీత. మరి ఇప్పుడు అవకాశం వస్తే చేస్తారా ? అనే ప్రశ్నకు సునీత ఆసక్తికర సమాధానం చెప్పారు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకని.. ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని సమాధానం ఇచ్చింది. సునీత చెబుతున్న ప్రకారం హీరోయిన్ కావడం అంటే ప్రశాంతతను కోల్పోవడమే అన్న మాట అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు -
రెండు ఊళ్ల గొడవ
అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో కేబీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా పతాకంపై మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే నిజాయతీగా, కష్టపడి సినిమా తీసినట్లు తెలుస్తోంది. నేను సినిమా నిర్మించేందుకు హీరోల కోసం వెతుకుతున్నా. మా బడ్జెట్‌కు తగిన హీరోలు దొరకడం లేదు. చిన్న చిత్రాల ద్వారానే కొత్త హీరోలు వచ్చే అవకాశముంది’’ అన్నారు. ‘‘టైటిల్లో ఉన్నట్లు ఇది కోనాపురంలో జరిగే కథ కాదు. రెండు ఊళ్ల మధ్య గొడవల నేపథ్యంలో మర్డర్ మిస్టరీగా సాగుతుంది’’ అన్నారు కేబీ కృష్ణ. ‘‘వాస్తవ సంఘటనలతో రాసిన కథ కావడంతో ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యా’’ అన్నారు మచ్చ వెంకట్ రెడ్డి. ‘‘మా నాలుగేళ్ల కల ఈ సినిమా. యువతరం మెచ్చే వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశాన్ని జోడించాం’’అని పల్లె వినయ్‌కుమార్ అన్నారు. నిర్మాత ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: ఈరుపుల శ్రీకాంత్. -
నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే
‘‘నిర్మాణంలో ముగ్గురు, నలుగురు ఇన్వాల్వ్ అయినప్పుడు వ్యత్యాసాలు రావడం సహజం. కానీ, మా అందరిలో ఒకరి బలం ఏంటో మరొకరికి తెలుసు. అలా అందరం కలసి సాఫీగా వర్క్ చేశాం. మా అందరి రథసారథి సురేశ్‌బాబు’’ అని సునీత తాటి, వివేక్ కూచిభొట్ల అన్నారు. సమంత లీడ్ రోల్లో లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్ బాబు, సునీతా తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు ‘కొరియర్ బాయ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను. 2017లో ‘ఓ బేబీ’ సినిమా మొదలైంది. ఈ పాత్రకు లక్ష్మీగారు బావుంటారన్నది నందినీరెడ్డి ఐడియా. రాజేంద్రప్రసాద్ లుక్ బాగా సెట్ అయింది. ఆయన లుక్‌ని అల్లు అర్జున్ కూడా బాగా అభినందించారు. ‘ఓ బేబీ’ను హిందీలో రీమేక్ చేస్తాం. ఆలియా భట్ హీరోయిన్ అయితే బాగుంటుందనుకుంటున్నాం. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుంది. కన్నడ, బెంగాలీలోనూ రీమేక్ కోసం అడుగుతున్నారు. చైనాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాను బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్తున్నాం. ఇంత మంచి కథ ఇచ్చినందుకు మేం వాళ్లకు ఇవ్వబోయే గౌరవం అది’’ అన్నారు సునీత. వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన తొమ్మిదో రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్‌లో ఉంది. ఓవర్సీస్లో కూడా బాగా ఆడుతోంది. సినిమా నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే. ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీగా అనిపించేట్టు సురేశ్‌బాబు చేశారు. ఆయన సినిమాల్లో ప్రాఫిట్స్ ఇచ్చి మాకు పాఠాలు నేర్పారు. ప్రస్తుతం మేం చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమా 70శాతం పూర్తయింది. దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. మా ముగ్గురి కాంబినేషన్లో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే వివరాలు చెబుతాం’’ అన్నారు. -
కోనాపురంలో ఏం జరిగింది?
అనీల్ మొగిలి, సునీత జంటగా కె.బి. కృష్ణ (బాలు) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. పోషం మట్టారెడ్డి సమర్పణలో మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కె.బి.కృష్ణ (బాలు) మాట్లాడుతూ– ‘‘మనిషిని మనిషిగా చూడకపోవడం తప్పు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన పరిణామాలు ఏంటి? అనేది మా చిత్ర కథాంశం. సమాజంలో మార్పు కోసం చేస్తున్న చిన్న ప్రయత్నమిది. కొన్నేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా సినిమా కథంతా ఒక ఊరిలో జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న ఆ ఊరు కొన్ని ఘటనలతో ఉలిక్కి పడుతుంది. ఆ ఊరి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఈ ఘటనలకు కారణమైన నేపథ్యం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. మంచి ప్రేమ కథ ఉంటూనే ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు. రేయాన్ రావుల్, హలీమ్ ఖాన్, ‘జబర్దస్త్’ కుమార్ నటించారు. సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: శ్రీకాంత్. -
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి అనుమతి నిరాకరించడంతో ఓ ప్రేమజంట పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. లింగగూడెనానికి చెందిన సాయి, సునీత ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించకపోవడంతో గ్రామ సమీపంలోని సుబాబుల్ తోటలో వాళ్లిద్దరూ శనివారం ఈ సంఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం సాయి, సునీత జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శిక్షణలో స్నేహం, వివాహం..
నర్సంపేట: చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్ పూర్తి చేశా. 2012 లో గ్రూప్–1కు ఎంపికై పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ అన్నారు. మంగళవారం ఆమె ‘సాక్షి’ ఇంటర్వూ్యలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్. మేము నలుగురం సంతానం. అక్క, అన్న, చెల్లెలు కూడా ఉన్నత చదువులు చదివారు. నాన్న సోమశేఖర్ కోరిక మేరకు నేను గ్రూప్–1కు ఎంపికయ్యా. 2012లో నాకు మొదటి పోస్టింగ్ నల్లగొండ సీసీఎస్‌లో ఇచ్చారు. రెండో పోస్టింగ్ సూర్యాపేట డీఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివి. మూడో పోస్టింగ్ నర్సంపేట ఏసీపీగా వచ్చా. భర్త చంద్రమోహన్‌తో ఏసీపీ సునీతామోహన్ శిక్షణలో స్నేహం, వివాహం.. గ్రూప్–1కు ఎంపికైన తర్వాత శిక్షణ సమయంలో మా బ్యాచ్‌కు చెందిన ఆదిలాబాద్ జిల్లా వాసి చంద్రమోహన్‌తో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి వివాహం వరకు వెళ్లింది. మా ఇద్దరి అభిప్రాయాలను తల్లిదండ్రులు అంగీకరించారు. 2013 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నం. చంద్రమోహన్ ప్రస్తుతం కరీంగనర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. చాలెంజ్‌గా తీసుకుంటా.. విద్యా, ఉద్యోగాల్లో మహిళలు కూడా రాణించడం సంతోషకరం. పోలీస్ శాఖలో మహిళలు రాణించాలంటే ప్రత్యేక ప్రణాళికలు అవసరం. ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్తా. ఒత్తిడికి గురికాకుండా పోలీస్ ఉద్యోగాన్ని చాలెంజ్‌గా తీసుకుంటా. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటా. యువత లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. ఇది వరకు ఏదైనా రంగంలో పనిచేసిన వారు ఆదర్శనీయులుగా ఉండడం సహజమే. ఏ రంగంలో లేని వారు కూడా మంచి పనులు చేస్తూ గుర్తింపు పొంది ఆదర్శవంతంగా ఉంటారు. యువత ప్రత్యేక లక్ష్యాన్ని ఎంచుకుని తల్లిదండ్రుల ఆశయలను నెరవేర్చాలి. ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలి. చెడు మార్గంలో పయనించి సమాజానికి చేటును తెచ్చే వారు తల్లిదండ్రులను కూడా ఇబ్బందిపెట్టిన వారు అవుతారు.. -
అలవాటు లేక పొరబాటు!
సాక్షి, కాకినాడ : కాకినాడ ఆర్డీవో కార్యాలయ సమీపంలో గురువారం పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. ఏదో రిబ్బ¯ŒS కత్తిరించి ఊరుకోకుండా వాహనంలో పెట్రోల్ నింపడానికి సిద్ధపడ్డారు. అలవాటు లేని పనికావడంతో అదికాస్తా నేలపాలైంది. దాంతో మంత్రిగారు ఇదిగో ఇలా నాలిక్కరుచుకున్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటే గుణ పాఠం తప్పదు
ఆలేరు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే గుణపాఠం తప్పదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించేవాళ్లమని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. తుమ్మిyì హెట్టి ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే ఆ పత్రాలను బయటపెట్టాలని కోరారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్నదే ప్రభ్యుత ధ్యేయమన్నారు. అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలు ఛీకొడతారన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, వైస్ ఎంపీపీ కొరకొప్పుల కిష్టయ్య, ఆకవరం మోహన్‌రావు, మొగులగాని మల్లేశం, చింతకింది మురళి, బెంజారం రవి, బాకీ ఆనందం, మొరిగాడి వెంకటేశ్, కర్రె అశోక్, దూడం మధు, ముస్తాఫా, దానియల్, గిరికుమార్, జల్లి నర్సింహులు, గంపల విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మహా’ ఒప్పందం చరిత్రాత్మకం
గుండాల : మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న జల ఒప్పందం చరిత్రాత్మకంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమైక్యాంధ్ర నాయకులు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. 40 సంవత్సరాలుగా వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నప్పటికీ తెలంగాణకు చుక్క నీరు ఇవ్వని అసమర్థులు కాంగ్రెస్ వారు అని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ కుదుర్చుకున్న 3 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కానుందని కాలేశ్వరం ప్రాజెక్టుతో గంధమల్ల , బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నట్లు ఆమె తెలిపారు. కొత్త ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిందం ప్రకాశ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ గార్లపాటి సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి, కో–ఆఫ్షన్ మెంబర్ ఎండీ షర్పోద్దీన్, నాయకులు మూగల శ్రీనువాస్, ఇమ్మడి దశరథ, లగ్గాని రమేష్, తదితరులు ఉన్నారు. -
ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు
యాదగిరిగుట్ట : జల యజ్ఞాన్ని ప్రవేశపెట్టి ధనయజ్ఞంగా మార్చింది మీరేనని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ధ్వజమెత్తారు. యాదగిరిగుట్ట టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను మింగిన కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గ్రామాల్లో చిచ్చు రేపుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోజూస్తున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి నేతనుల తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అల్డా చైర్మన్ పిచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సుమలత, జెడ్పీటీసీలు కర్రె కమలమ్మ, బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీలు గడ్డమీది స్వప్న, కాసగల్ల అనసూయ, గుట్ట సర్పంచ్ బూడిద స్వామి, నాయకులు కాటబత్తిని ఆంజనేయులు, గడ్డమీది రవీందర్‌గౌడ్, పడాల శ్రీనివాస్, ఆకవరపు మోహన్‌రావు తదితరులున్నారు. -
వాటర్‌ఫిల్టర్ ప్రారంభించిన విప్ సునీత
రాజాపేట: మండలంలోని సోమారం గ్రామంలో స్వచ్చంధ సంస్థ ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్‌ను ఆదివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫిల్టర్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షంచాలని అన్నారు. ప్రజల కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటుచేసిన స్వచ్చంధ సంస్థ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
హంతకుడెవరు?
మహిళ మృతి, వివాహేతర సంబంధం, సునీత భర్తా? ప్రియుడా? హత్యకు ప్రేరేపించిన వివాహేతర సంబంధం మిస్టరీగా గిరిజన వివాహిత హత్య వీరఘట్టం: శ్రీకాకుళం జిల్లాలో గిరిజన మహిళ హత్యకేసు మిస్టరీగా మారింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తుండగా.. ఇంతకీ హంతకుడు ఎవరన్నది అంతుచిక్కకుండా ఉంది. వీర ఘట్టం మండలంలోని దశుమంతుపురం పంచాయతీ పరిధిలోని పెద్దూరు గ్రామసమీపంలో వివాహిత బిడ్డిక సునీత(35) శనివారం హత్యకు గురైన ఘటన విదితమే. ఆమెకు వేరొక వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను భర్త అంతమొందించాడా? లేదా, ప్రియుడే కాలయముడయ్యాడా? తేలాల్సి ఉంది. పాలకొండ డీఎస్పీ సి.హెచ్ ఆదినారాయణ, సీఐ ఎన్.వేణుగోపాలరావు ఆదివారం సంఘటన స్థంలో ఉన్న సునీత మృతదేహాన్ని పరిశీలించారు. ఇమె బంధువులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలపై పలువురిని అడిగి ఆరా తీశారు. ఈ హత్యపై వీఆర్వో రామమూర్తినాయుడు ఫిర్యాదు మేరకు వీరఘట్టం ఎస్సై బి.రామారావు కేసు నమోదు చేశారు. బంధువుల సమక్షంలో పంచనామా పెద్దూరు గ్రామస్తులు, మృతురాలి బంధువుల సమక్షంలో పోలీసులు శవ పంచనామా చేశారు.అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ వేణుగోపాలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే పోలీసులు, హతురాలి భర్త గుండయ్య (మూగవాడు) చెబుతున్న వివరాల ప్రకారం.. కొనేళ్ళుగా సునీతకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. రోజూ సునీతకు ఫోన్‌కాల్స్ వస్తుండేవని, ఇదే విషయమై ప్రశ్నిస్తే తన భార్య తన పట్ల నిర్లక్షంగా వ్యవహరించేదని గుండయ్య చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని జీడితోటలో ప్రియుడితో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సునీత కనిపించింది. దీంతో అతనికి గుండయ్యకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గుండయ్య తన భార్యను గట్టిగా చేతితో తలపై కొట్టడంతో ఆమె పక్కనే ఉన్న రాయిపై పడిపోయిందని, దీంతో ఆమె నోటికింద భాగంలో బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రియుడు పారిపోయాడని, అతను ఎవరనేది తెలుసుకొనేందుకు గుండయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రియుడే హంతకుడు? గిరిజన మహిళ కావడంతో ప్రియుడే ఆమెకు మాయ మాటలు చెప్పి మోసగించి, హతమార్చి ఉంటాడని మృతురాలి బంధువులు పోలీసులకు తెలిపారు. మూగవాడైన గుండయ్యకు ఏ పాపం తెలీదని డీఎస్పీ ఆదినారాయణకు వివరించారు. సంఘటనా స్థలంలో రెండు సెల్ఫోన్లు దొరకడంతో ఆ వ్యక్తి ఎవరనేది కొద్ది రోజుల్లోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. అనాథలుగా మిగిలిన పిల్లలు సీతంపేట మండలం జయపురానికి చెందిన గుండయ్యకు, అదే మండలం కుసుమి పంచాయతీ బిల్లుగూడకు చెందన సునీతకు 2003 సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు సంధ్యారాణి, సౌజన్య, కవిత అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మూగవాడు కావడం, తల్లి హత్యకు గురి కావడంతో ఆ ముగ్గురు పిల్లలు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలు కావడంతో అనాథలుగా మిగిలారు. ఆ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చైన్‌స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి
-
చైన్‌స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి
హైదరాబాద్: చైన్‌స్నాచర్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సునీత ( 40 ) శనివారం మృతి చెందారు. ఈ నెల 17 న ఓయూ లా కాలేజ్ వద్ద సునీత పై చైన్‌స్నాచర్ దాడి చేశాడు. స్కూటర్ పై వెళ్తున్న ఆమెపై దాడి చేసి 3 తులాల బంగారం దోచుకెళ్లారు. ఈ దాడిలో ఆమె స్కూటర్ పై నుండి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. కోమాలోకి వెళ్లిన సునీత హాస్పిటల్ లో చికత్స పొందుతూ శనివారం మృతి చెందారు.