వాటర్‌ఫిల్టర్ ప్రారంభించిన విప్ సునీత
వాటర్‌ఫిల్టర్ ప్రారంభించిన విప్ సునీత
Published Sun, Jul 17 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
రాజాపేట: మండలంలోని సోమారం గ్రామంలో స్వచ్చంధ సంస్థ ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్‌ను ఆదివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫిల్టర్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షంచాలని అన్నారు. ప్రజల కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటుచేసిన స్వచ్చంధ సంస్థ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement