Rajapeta
-
హిమబిందు మృతదేహం లభ్యం
-
దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం లభ్యం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలోని రాజపేట మండలం, కుర్రారం గ్రామం దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం లభ్యమైంది. పారుపల్లి సమీపంలో మృతదేహం లభించింది. సింధూజ మృతదేహం లభించిన ప్రాంతానికి చేరువలోనే హిమబిందు మృతదేహం ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. గల్లంతైన మూడు రోజులకు మృతదేహాలు లభ్యమవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం వాగులో ఇద్దరు యువతులు సింధూజ, హిమబింధు కొట్టుకుపోయిన విషయం విదితమే ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. -
యాదాద్రిలో విషాదం: దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతు
-
యాదాద్రిలో విషాదం: దోసల వాగులో ఇద్దరు యువతుల గల్లంతు
యాదాద్రి: రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతు అయ్యారు. హిమబిందు, సింధుజ అనే యువతులు ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి గల్లంతైన యువతులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటనాస్థలికి కొంతదూరంలో కొట్టుకుపోతున్న సింధుజను గమనించిన స్థానికులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం సింధుజను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింధుజ మృతి చెందింది. వాగులో గల్లంతైన హిమబింధు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అధికారులకు చిక్కిన చిరుత మృతి
సాక్షి, హైదరాబాద్/నల్గొండ : నల్గొండ జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. ఈ విషయాన్ని నెహ్రూ జూపార్కు అధికారులు స్వయంగా తెలిపారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మర్రిగూడం మండలం రాజపేట తండా వద్ద అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో చిరుత చిక్కుకొంది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతకు మత్తు ఇచ్చి జీప్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. చిరుత కంచెలో ఇరుక్కు పోవడంతో దానికి బాగా గాయాలయి రక్తం బాగా పోయిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడిమికి తట్టుకోలేక చిరుత మృతి చెందినట్లుగా నిర్థారించారు. -
బురిడీ బాబాలకు దేహశుద్ధి
సాక్షి, రాజాపేట(నల్గొండ) : బాబాజీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన బురిడీ బాబాలకు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన ముగ్గురు బాబాజీలు రఘునాథపురం గ్రామంలో ఉదయం నుంచి సాధనాసురులమంటూ జాతకం చెబుతామంటూ ఇంటింటికీ తిరిగి ప్రజలను నమ్మబలికిం చారు. భయబ్రాంతులకు గురిచేస్తూ మోసపూరితమాటలతో ప్రజల నుంచి కొంతడబ్బు వసూలు చేశారు. వీరిపై మధ్యాహ్నం గ్రామస్తులకు అనుమానం రావడంతో వారిని నిలదీశారు. వారి ఆధార్ కార్డులను తీసుకుని చూసి అనుమానం రావడంతో మొసం చేస్తున్నారని గుర్తించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాబాజీలను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పీడీఎస్ బియ్యం వ్యాపారానికి అడ్డాగా పుట్టగూడెం
సాక్షి, రాజాపేట (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పుట్టగూడెం తండా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది. గ్రామస్తులు నిత్యం ఆదే పనిగా వ్యాపారం కొనసాగిస్తూ టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యం సేకరించి నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా వ్యాపారం మాత్రం ఆపడంలేదు. బియ్యం కొనుగోలులో బడా నాయకుల హస్తం ఉందని, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని రైస్‌మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. 9 మే 2017న సిద్దిపేట జిల్లాకు తరలిస్తుండగా 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని ఓ వ్యాపారిపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. కింది స్థాయి పోలీసుల కనుసన్నల్లో ఈ పీడీఎస్ బియ్యం వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో సుమారు వెయ్యి మంది గిరిజనులు ఉంటారు. కాగా వీరికి ప్రధాన కులవృత్తి లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి భూమిలో జొన్న, మొక్కజొన్న, వరి, పత్తి, కంది వంటి పంటలు సేద్యం చేస్తారు. మిగతా కాలంలో ఖమ్మం, విజయవాడ వంటి జిల్లాలకు చెరుకు నరి కేందుకు ఎడ్లబండ్లపై వలస వెళ్తుంటారు. తిరిగి వచ్చే సమయంలో ఉప్పు కొనుగోలు చేసి ఇక్కడి ప్రజలకు విక్రయిస్తారు. కాగా మారుతున్న కాలనుగుణంగా వర్షాలు లేకపోవడంతో ఈ గ్రామంలో జీవనోపాధి కరువై కొందరు సారాయి విక్రయిస్తూ ఉపాధి పొందారు. ప్రభుత్వం సారా తయారీదారులు, విక్రయదారులపై కఠినచర్యలు తీసుకుంటూ పీడీ యాక్టు నమోదు చేయడంతో దానిని మానేశారు. దీంతో కొందరు గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలకు ఇటుక, కంకర, ఇసుక వంటి ముడిసరుకులు అందిస్తూ వ్యాపారులుగా మారారు. కాగా కొంతమంది మాత్రం పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. పీడీఎస్ బియ్యం సేకరిస్తూ గ్రామంలోని రహస్య ప్రాంతాల్లో నిల్వచేస్తూ గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని సందర్భాల్లో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో దాడులుచేసి కేసులు నమోదు చేయగా భయపడిన కొందరు ఈ వ్యాపారాన్ని మానేయగా మరి కొందరు కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలో మూడేళ్లుగా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం సాగుతూనే ఉంది. కాగా గ్రామంలోని గిరిజనులకు ఉపాధి కరువైందని, ప్రభుత్వాలు పని కల్పిం చాలని, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు అందివ్వాలని కోరుతున్నారు. వ్యాపారం ఇలా... గ్రామంలోని కొందరు తమ కుటుంబంతో కలిసి తెల్లవారుజామున నిత్యం ఆలేరు, జనగాం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో కేజీకి రూ.10 ఇస్తూ పీడీఎస్ బియ్యం, నూకలను సేకరిస్తారు. ఇలా సేకరించిన బియ్యాన్ని తిరిగి మధ్యాహ్నం సమయంలో స్వగ్రామానికి చేరుకుని గ్రామంలోని మరో రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని మూడు రోజులకు ఒకసారి రాత్రివేళలో గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో మెదక్, సిద్దిపేట జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేసులు నమోదు పుట్టగూడెం గ్రామంలో గత ఏడాది కాలంగా పోలీసులు ఐదు సార్లు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ 400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మూడు వాహనాలను పట్టుకొని 16 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీఐ ఆంజనేయులు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారంపై విచారణ రాజాపేట : మండలంలోని పుట్టగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం డంపులపై ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించిన సంగతి విధితమే. కాగా పీడీఎస్ డంపులు పట్టుకున్న సమయంలో ఎస్ఓటీ పోలీసులపై వ్యాపారులు దాడికి పాల్పడి పోలీసులను గాయపరిచిన సంఘటనపై భువనగిరి ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐలు ఆంజనేయులు, నర్సింహారావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్ఓటీ పోలీసులు ఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజు, కానిస్టేబుల్ సురేందర్‌రెడ్డి సివిల్ డ్రెస్సుల్లో వెళ్లగా అక్రమ వ్యాపారులు రాళ్లతో దాడిచేయగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వ్యాపారులు అక్కడున్న పల్సర్ ద్విచక్రవాహనాన్ని, కొంత పీడీఎస్ డంపు నిల్వను దహనం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 35 టన్నులు (350) క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారులు మాడోతు చంటి, శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ సీతారామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి, ఆలేరు ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్
రాజాపేట : దేశంలోని 20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవాసమితి రంగారెడ్డి జిల్లా, ౖహైదరాబాద్ ఆరోగ్యశిబిరం ఇన్చార్జి ఎస్.సేతురామన్ తెలిపారు. మండలంలోని నెమిల గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయం ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా సేతురామన్ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకుని 20 శ్రీ సత్యసాయి బాబా అవతార్ దినోత్సవం వరకు స్వచ్చ్సే దివస్ తక్ పేరుతో భారత దేశంలోని 20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూడిద కవిత, ఎంపీపీ పులి సత్యనారాయణ, సమితి కన్వీనర్ కృష్ణమూర్తి, సేవాదల్ సభ్యులు నారాయణ్, రామచంద్రం, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దేశ గౌరవాన్ని కాపాడుకోవాలి
రాజాపేట : భారతదేశ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షణమధ్య క్షేత్ర (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల ప్రచారక్ ఏలె శ్యామ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షణా శిబిరంలో భాగంగా శుక్రవారం సార్వజనికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ హిందూ సమాజాన్ని సంఘటితం చే స్తూ శక్తివంతంగా చేసేందుకు గత 91 సంవత్సరాలుగా కృషి చేస్తుందని తెలిపారు. మొదటగా ఒక్కరిగా సంఘం ఏర్పడి నేడు భారత దేశవ్యాప్తంగా 60 వేల గ్రామాలకు విస్తరించిందని తెలిపారు. భారతదేశం ఎంతో శక్తివంతమైన దేశమని, విదేశీ శక్తులు విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. దేశంలో హిందుత్వం ఆధారంగా పరిపాలన జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాజవంశీయులు వజ్రేందర్‌రావు, సంచాలకులు ఎడ్ల నారాయణరెడ్డి, వర్గ అధ్యక్షుడు బల్ల దామోదర్, సర్పంచ్ ఊట్కూరి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఎర్రగోకుల కృష్ణ, గ్రామ ప్రముఖులు మాడిశెట్టి సత్యనారాయణ, పులిగిల్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
మోసం చేస్తున్న సీఎం
రాజాపేట : రైతుల సమస్యలను విస్మరించి మాటల గారడీతో ప్రజలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నారని అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బీ కోటేశ్వర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఎంఎల్ (న్యూడెమోక్రసీ) సబ్‌డివిజన్ నాయకులు రేగు శ్రీశైలం అధ్యక్షతన ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. భువనగిరి ప్రాంతానికి గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగునీరు అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎంల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, డివిజన్ కార్యదర్శి ఆర్ జనార్దన్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బెజాడి కుమార్, నాయకులు ఆర్ గీత, సీహెచ్ సత్యనారాయణ, రాజయ్య, టీ కొండయ్య, ప్రమీల, ఎన్ శ్రీను, బీ శ్రీను, నరేష్, సిద్ధులు, కనకయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
రాజాపేట : భువనగిరిలో జరిగిన డివిజన్‌స్థాయి క్రీడోత్సవాలకు రాజాపేట బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూర్గు మహేందర్‌రెడ్డి, పీడీ సుంకి కుమారస్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17కు ఎం శ్రీనివాస్, అండర్–14 నుంచి ఎం.తరుణ్, సంతోష్, మహీపాల్లు జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల17, 18 తేదీలల్లో మిర్యాలగూడ మండలంలోని ముకుందాపురం ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
రాజాపేట : భువనగిరిలో జరిగిన డివిజన్‌స్థాయి క్రీడోత్సవాలకు రాజాపేట బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూర్గు మహేందర్‌రెడ్డి, పీడీ సుంకి కుమారస్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17కు ఎం శ్రీనివాస్, అండర్–14 నుంచి ఎం.తరుణ్, సంతోష్, మహీపాల్లు జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల17, 18 తేదీలల్లో మిర్యాలగూడ మండలంలోని ముకుందాపురం ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో డ్రైవర్ ఆత్మహత్య
రాజాపేట ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బేగంపేట మదిర గ్రామం నీలోనిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మూల రాజు (34) ఏపీఎస్ ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపోలో బస్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజుకు భార్య సునిత, కుమారుడు భవిచందర్ అన్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురైన రాజు ఉదయం రోజులాగే డ్యూటీకి వెళ్లడం కోసం టిఫిన్ బ్యాగ్‌తో బస్కెక్కాడు. గ్రామం పొలిమేరలో బస్సుదిగి తన వ్యవసాయ బావివద్దకు నడుచుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తెలిసిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మరణించిన రాజును చూసి బోరున విలపించారు. రాజు భార్య సునిత ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
చరిత్ర కనుమరుగుచేసే కుట్ర
రాజాపేట : త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కనుమరుగు చేసే కుట్ర జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటర్రెడ్డిలు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 68వ వార్షికోత్సవం సందర్భంగా అమరులైన వారిని స్మరించేదుకు సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్ర ఆదివారం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా రఘునాథపురం, చల్లూరు, బేగంపేట, రేణికుంట, రాజాపేట, కుర్రారం, బొందుగుల గ్రామల్లో పోరాటంలో అమరులైన బద్దం బాల్‌రెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, చింతలాపురి రామిరెడ్డి, పాశం రామిరెడ్డి, కూతూరు పోచయ్య, బొందుగుల నారాయణరెడ్డి, చెడిదీపు నారాయణ, మూల బాలయ్యల స్థూపాలవద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 200లకు పైగా మోటార్ సైకిల్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రతాప్‌రెడ్డి, జిలా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, నాయకులు గోద శ్రీరాములు, మండల కార్యదర్శులు చెక్క వెంకటేశ్, చెడిదీపు రామస్వామి, నాయకులు రాంగోపాల్‌రెడ్డి, కల్లెం కృష్ణ, సోములు, వెంకట్రాంరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
కుమారులు ఆదరించడం లేదని..
– మనస్తాపంతో వద్ధుడి బలవన్మరణం – ఆగ్రహించి కుమారులను చితకబాదిన గ్రామస్తులు రాజాపేట : అవసాన దశలో కుమారులు ఆదరించడం లేదని మనస్తాపతో ఓ వద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లాలో గురువారం వెలుగుచూసిన ఈ విషాదకర ఘటన వివరాలు.. రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన చెడిదీపు శివుడి(80)కి ఇద్దరు కుమారులు. కులవత్తి చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వారికి వివాహాలు కాగానే జీవనోపాధి నిమిత్తం పెద్ద కుమారుడు నాగభూషణం గజ్వేల్, చిన్న కుమారుడు ఆంజనేయులు హైదరాబాద్‌కు వలసెల్లారు. పెదకుమారుడు బట్టల వ్యాపారం, చిన్న కుమారుడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. శివుడు తన భార్యతో గ్రామంలోనే సాంచాలు నేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం భార్య కూడా మతిచెందడంతో ఒంటరయ్యాడు. జీవిత చరమాంకంలో ముద్దపెట్టడం లేదని పెద్ద మనుషులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల గ్రామస్తులు బలవంతంగా శివుడిని అతడి పెద్ద కుమారుడి వద్దకు పంపించారు. అయితే అక్కడ కుమారుడు సరిగా చూడకపోవడంతో మరుసటి రోజే ఇంటికి తిరిగి వచ్చి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి గ్రామానికి వచ్చిన కుమారులను గ్రామస్తులు చితకబాదారు. -
జనగామలో కలపడం సరికాదు
రాజాపేట : ఆలేరు, రాజాపేట, గూండాల మండలాలను జనగామలో కలిపితే ప్రజా ఉద్యమమే నిర్వహింస్తామని డీసీసీ ప్రసిడెంట్ బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని పాముకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలేరు, రాజాపేట, గూండాల మండలాల ప్రజలు, రైతులు గత కొన్న సంవత్సరాల నుంచి భువనగిరి డివిజన్‌తో అనుబంధాన్ని కలిగి ఉంన్నారని, నేడు ఈ మండలాలను జనగామలో కలిపేందుకు చూస్తున్న ప్రభుత్వ ఆలోన సరైందికాదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసాయని, ఎప్పటికప్పుడు కాకి లెక్కలు చెబుతూ కాలం వెళ్లదీస్తు ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. కరువుతో రైతులు అప్పులపాలు అవతున్నారని, వారిని వెంటనే అదుకోవాలని కోరారు. మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నీలం పద్మ, మండల పార్టీ అధ్యక్షుడు నెమిల మహేందర్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నాయకులు రాంరెడ్డి, ఎన్.వెంకటస్వామి, ఏ.బాలయ్య, పి.యాదయ్య, శ్రీరాములు పాల్గొన్నారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
రాజాపేట : రాత్రివేళలో పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మండలంలోని పాముకుంట చౌరస్తాలో బుధవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పుట్టగూడెం తండా నుంచి జెగిదేవపూర్‌కి చెందిన వ్యాపారి ఐత కృష్ణకు సంబంధించిన అనుచరులు రాత్రివేళలో లారీలో పీడీఎస్ బియ్యాన్ని ౖహె దరాబాద్‌కు తరలిస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ బీసన్న, పోలీసులు లారీలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఉదయం ఎస్ఐ బీసన్న రెవెన్యూ ఆర్ఐ సంతోష్‌కుమార్‌లు కలిసి పంచనామా నిర్వహించారు. లారీలో 220 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
రాజాపేటలో సినిమాషూటింగ్
రాజాపేట: మండలంలోని హరిష్‌రావ్ ఫామ్‌హౌజ్‌లో బుధవారం బీ ఫామ్‌హౌజ్ సినిమా షూటింగ్ నిర్వహించారు. ఎంఅండ్ఎస్ క్రియేషన్స్, లక్ష్మీ ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్స్ వారి బీ ఫామ్‌హౌజ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్ పాల్ వివరాలను తెలిపారు. కథ, డైరక్టర్, నిర్మాత ఎస్ పాల్, కెమెరామెన్, స్క్రీన్‌ప్లే వీఎన్ రాజు, రణదీప్‌రెడ్డి, హీరో రిషి, అక్షయ్, హీరోయిన్ రమ్యారెడ్డిలు నటిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులు క్రితం సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు, ఈ సినిమా షూటింగ్ సన్నివేశాలను హైదరాబాద్‌లోని అమీర్‌పేట, చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నినిమా మొత్తం హర్రర్, సెంటిమెంట్, క్రైం సన్నివేశాలల్లో మొత్తం 15 మంది పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. తనకు ఈ సినిమా మొదటిదని దీపావళి వరకు బీ ఫామ్‌హౌజ్ సినిమా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
విద్యార్థులు లక్ష్యసాధనకు కృషిచేయాలి
రాజాపేట : విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరుతేవాలని ఎన్ఆర్ఐ జాగృతి కోకన్వీనర్ గౌలీకర్ నర్సింగరాజ్, సర్పంచ్ గుంటి కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని కాల్వపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గౌలీకర్ నర్సింగరాజ్ దుస్తులు, నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైయ్యే దుస్తులు, నోట్‌పుస్తకాలు, బోర్డులు, బల్లాలు, నీటి వంటి మౌలిక వసతులు కలిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ గౌలీకర్ నర్సింగరాజ్ దాతృత్వాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి, ఉపాధ్యాయులు స్వప్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
రాజాపేట : రైతులు పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, తద్వారా అన్ని విధాలా ప్రయోజనం ఉంటుందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ బండారి శ్రీనివాస్, ఏడీఏహెచ్ యుగేందర్ సూచించారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన రైతు 18 ఎకరాలలో సాగు చేసిన బత్తాయి తోటను పరిశీలించారు. సేద్యం, దిగుబడి, ఖర్చు తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిజేస్తుందన్నారు. కాబట్టి రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కోరారు. డ్రిప్, పాలీహౌస్ విధానంలో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వారు సద్వినియోగం చేసుకోవాలనపి కోరారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు వెంకట్‌రెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీత, దేవాలయ ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్న సాగర్’పై రాజకీయం తగదు
రాజాపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని వరంగల్ జిల్లా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ దేవస్థానం వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం దబగుంటపల్లిలోని శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన 22 ఎకరాల్లో 2,150 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీతారెడ్డి, దేవాలయ ధర్మకర్త నర్సింహమూర్తి ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ బండారి శ్రీనివాస్, ఏడీఏహెచ్ యుగేంధర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
రాజాపేట: వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీహెచ్ఓ డాక్టర్ రామయ్య, ప్రధానోపాధ్యాయులు కే.రవిందర్నాయక్లు అన్నారు. బుధవారం మండలంలోని బొందుగుల గ్రామంలో రాష్ట్రీయ బాలస్వస్త్(ఆర్బీఎస్కే) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 164 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేవారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఐరన్ లోపంతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అశ్వినీ కుమార్, శ్రియ, కార్తికేయ, జయంతి, హెచ్ఈఓ కృష్ణమూర్తి, సూపర్వైజర్లు వనతాదేవి, అనసూర్య, ఏఎన్ఎంలు వనిత తదితరులు పాల్గొన్నారు. -
రఘునాథపురంలో చుట్టుకాముడు
రాజాపేట: మండంలోని రఘునాథపురం గ్రామంలో వర్షాలు కురియాలని మంగళవారం మహిళలు చుట్టుకాముడు ఆడారు. వర్షాలులేక నాటిన విత్తనాలు, మొలకలు ఎండిపోతున్నాయని మంచినీళ్ల బిందెల్లో పసుపు, కుంకుమ, వేపకొమ్మలు వేసి శివుడిని ఆరాధిస్తూ బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం రామస్వామిగుట్ట ఉన్న దేవాలయంలో పూజలు చేశారు. -
వాటర్‌ఫిల్టర్ ప్రారంభించిన విప్ సునీత
రాజాపేట: మండలంలోని సోమారం గ్రామంలో స్వచ్చంధ సంస్థ ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్‌ను ఆదివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫిల్టర్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షంచాలని అన్నారు. ప్రజల కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటుచేసిన స్వచ్చంధ సంస్థ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
రాజాపేటలో చిరుత సంచారం
రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరు పడమటిగుట్ట సమీపంలో బుధవారం చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రాల సమీపంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు ఆవు దూడ మృతిచెంది ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చిరుత దాడి చేసి ఆవు దూడను చంపిందని నిర్ధరించుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.