
సాక్షి, రాజాపేట(నల్గొండ) : బాబాజీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన బురిడీ బాబాలకు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన ముగ్గురు బాబాజీలు రఘునాథపురం గ్రామంలో ఉదయం నుంచి సాధనాసురులమంటూ జాతకం చెబుతామంటూ ఇంటింటికీ తిరిగి ప్రజలను నమ్మబలికిం చారు. భయబ్రాంతులకు గురిచేస్తూ మోసపూరితమాటలతో ప్రజల నుంచి కొంతడబ్బు వసూలు చేశారు. వీరిపై మధ్యాహ్నం గ్రామస్తులకు అనుమానం రావడంతో వారిని నిలదీశారు. వారి ఆధార్ కార్డులను తీసుకుని చూసి అనుమానం రావడంతో మొసం చేస్తున్నారని గుర్తించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాబాజీలను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment