fake baba
-
నాగ్ బాబా హల్ చల్
-
మంత్రాలతో మర్డర్ చేస్తా!
సాక్షి, హైదరాబాద్: నకిలీ బాబాగా అవతారం ఎత్తిన ఓ మాజీ రౌడీïÙటర్ మంత్రాలతో మర్డర్లు చేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన అత్తింటి వారిపై ఉన్న కక్షను ఇతడి ద్వారా తీర్చుకోవాలని భావించిందో మహిళ. అత్తింటికి వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తూ తీసిన వీడియోను వారికి చేరేలా చేసింది. ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో నకిలీ బాబాకు సౌత్–ఈస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నట్లు మంగళవారం అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు వెల్లడించారు. కేసు పూర్వాపరాలను ఆయన ఇలా వివరించారు. ష్యూరిటీ నేపథ్యంలో బాబా పరిచయం.. నగరంలోని బహదూర్‌పురా హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్ కలీంకు నేరచరిత్ర ఉండటంతో గతంలో కాలాపత్తర్ పోలీసులు రౌడీïÙట్ తెరిచారు. హత్య, హత్యాయత్నం సహా అయిదు కేసుల్లో నిందితుడైన ఇతగాడు 2022 నుంచి కాలీగా పేరు మార్చుకుని నకిలీ బాబా అవతారం ఎత్తాడు. ఇళ్లకు రంగులు వేసే పని చేస్తూనే పూజలు, మంత్రాల పేరుతో పలువురిని బురిడీ కొట్టిస్తున్నాడు. అనారోగ్యం తగ్గడానికి తాయత్తులు, తాళ్లు కడుతూ డబ్బు వసూలు చేస్తున్నాడు. పాతబస్తీకే చెందిన నజియా కొన్నాళ్ల క్రితం ఓ మహిళకు రూ.50 వేలు అప్పుగా ఇచి్చంది. అప్పట్లో ఆమె తరఫున ష్యూరిటీ ఇవ్వడానికి వచి్చన కాలీతో నజియాకు పరిచయం ఏర్పడింది. అత్తింటి వారిపై కక్ష తీర్చుకోవాలని.. నజియాకు తన అత్తింటి వారితో స్పర్థలు వచ్చాయి. దీంతో వారిపై కక్షగట్టిన ఆమె హత్య చేయించాలని భావించింది. దీనికోసం కాలీని సంప్రదించగా రూ.10 వేలు ఇస్తే చేతబడితో చంపేస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తం తీసుకున్న అతగాడు నజియా అత్త, ఆడపడుచు, మరిది పేరుతో బొమ్మలు తయారు చేసి క్షుద్రపూజలు చేశాడు. ఈ తతంగం మొత్తాన్ని నజియా వీడియో చిత్రీకరించింది. గత నెల 2న నజియా మరిదికి ఫోన్ చేసిన కాలీ... క్షుద్రపూజల విషయం చెప్పడంతో పాటు 48 గంటల్లో చనిపోతారంటూ అలీ్టమేటం ఇచ్చాడు. ఆ వెంటనే వాట్సాప్ ద్వారా చేతబడి చేస్తున్న వీడియోను పంపాడు.నిద్రాహారాలు మానేసిన కుటుంబం.. ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ కుటుంబం నిద్రాహారాలు మానేసింది. తమకు ఏదో జరుగుతోందని భయపడుతూ దైనందిన వ్యవహారాలకు దూరంగా ఉంది. ఎట్టకేలకు ధైర్యం చేసిన నజియా మరిది ఇర్ఫాన్ మాలిక్ బండ్లగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం సౌత్–ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ నేతృత్వంలో ఎస్సైలు షేక్ కవియుద్దీన్, ఎం.మధు, పి.సాయిరాం రంగంలోకి దిగారు. మంగళవారం కాలీని పట్టుకుని అతడి నుంచి చేతబడి సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని బండ్లగూడ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న నజియా కోసం గాలిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రీట్మెంట్ నెపంతో నవ వధువుపై నకిలీ బాబా లైంగిక దాడికి పాల్పడ్డాడు. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలోని బజార్ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించిన బాబా.. అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. విషయం బయటికి పొక్కడంతో నకిలీ బాబా పరారయ్యాడు. అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా, ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు. తల్లిదండ్రుల సహాయంతో భవాని నగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు సైతం న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. నకిలీ బాబాకు బండ్లగూడ పోలీసులు సహకరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. చదవండి: అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది? -
మేకులు కొడితే దోషం పోతుందంట..! బురిడీ బాబా బాగోతం బట్టబయలు
సాక్షి, కృష్ణాజిల్లా: నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. 35 లక్షలతో కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో మౌలాల అనే దొంగ బాబాను రజనీకి ఓ భక్తురాలు పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలంటూ మౌలాల సూచించాడు. రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు పాతి పెట్టిన మౌలాల.. నమ్మకం కుదిరేందుకు 100 గంజాలు అమ్ముడుపోయేలా చేశాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడం మొదలుపెట్టాడు. మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ.. ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది. చదవండి: నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య -
అత్యాచారం కేసు: పూర్ణానంద రిమాండ్ పొడిగింపు
సాక్షి, విశాఖ: పూర్ణానంద అత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈనెల 17వ తేదీన దిశ పోలీసులు.. ఐడెంటిఫికేషన్ టెస్టు పెరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. మరోవైపు.. ఈ కేసులో దిశ పోలీసులు.. అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’ -
పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’
సాక్షి, విశాఖపట్నం: భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక, తాజాగా పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి -
పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్
పాలమూరు: మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడ్ని నేను.. నా చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయ్. నేనే పరమాత్ముడ్ని.. అవతారపురుషుడ్ని.. రండి.. నా చెంతకు రండి.. నేనే దేవుడ్ని.. అంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి హల్ చల్ చేయగా.. ఆ పిలుపు అందుకుని భక్తులు కుప్పులు కుప్పలుగా క్యూ కట్టేశారు మరి. దీంతో అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి.. తాను దేవుడ్ని అంటూ.. రోగమేదైనా ఇట్టే నయం చేస్తానంటూ పాలమూరులో సెటిల్ అయ్యాడు. కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్ దగ్గర కొలువుదీరాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి.. శేషతల్పంపై నిద్రిస్తూ ఇద్దరు లక్ష్ములు(భార్యలు)ను చూపి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నాడు. భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా.. దీంతో స్వామీజీని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. చివరకు.. పోలీసులు ఆ దొంగ బాబా గుట్టు రట్టు చేశారు. ఈ దొంగ బాబాకు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చామని స్థానిక ప్రజలకు వివరించారు. ఇదీ చదవండి: ఆశ్రమంలో కీచక పర్వం.. దిశ పోలీసుల ఎంట్రీతో.. -
లేడీసంతా కలిసి కుమ్ముడు కుమ్మేసారు
-
నకిలీ బాబా గుట్టురట్టు..దేహశుద్ధి చేసిన మహిళా సంఘాలు
సాక్షి, మహబూబాబాద్: మహిళలను వేధింపులకు గురి చేస్తున్న నకిలీ బాబా గుట్టురట్టయ్యింది. మహిళా సంఘాలు అతడికి దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పగించారు. రెండు నెలలగా ఓ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురిచేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఓ నకిలీ బాబా మహిళలను తన మాయమాటలతో లోబర్చుకుని వారిని వేధిపులకు గురి చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. అతను మహిళలను క్షద్ర పూజల పేరుతో లోబర్చుకుని నగ్న వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేయడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో హైదరాబాద్‌కు చెందిన మహిళ ఈ నకిలీ బాబాను ఆశ్రయించగా.. ఇదే అదునుగా తీసుకుని ఆమెను వేధిపులుకు గురి చేయడం ప్రారంభించాడు. గత రెండు నెలలుగా ఆ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఇక అతడి వికృత చేష్టలకు తాళలేక ఆ మహిళ సంఘాలను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన మహిళా సంఘాలు రెక్కీ నిర్వహించి మరీ ఆ దొంగ బాబాను పట్టుకుని అతడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతనని పోలీసులకు అప్పగించారు. (చదవండి: అప్సర కేసు: అర్థరాత్రి జడ్జి ముందుకు.. పూర్తికాని అటాప్సీ! సాయికృష్ణ అమాయకుడా?) -
‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా..
మంత్ర తంత్రాల మాటున మహిళలను చెరబట్టిన ‘జిలేబీ బాబా’ పాపం పండింది. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడు ఎట్టకేలకు దోషిగా తేలాడు. ఆ వివరాలు.. జిలేబీ బాబా అసలు పేరు అమర్‌పురి అలియాస్ అమర్‌వీర్. అతనిది పంజాబ్‌లోని మాన్సా ప్రాంతం. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. తొహనా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. ఈక్రమంలో భార్య కన్నుమూయడంతో అమర్‌వీర్ రెండేళ్లు పత్తాలేకుండా పోయాడు. తర్వాత తొహనాకు తిరిగొచ్చి తాంత్రిక విద్యలు తెలుసంటూ నాటకానికి తెరతీశాడు. సమస్యలేవైనా తొలగించేస్తా అంటూ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. జనాల దృష్టిని ఆకర్షించాడు. ఆధ్యాత్మిక చింతన పేరుతో కొందరిని బురిడీ కొట్టించి బాబా బాలక్‌నాథ్ గుడిలో పూజారిగా కూడా పని చేయడం ప్రారంభించాడు. ఆత్మలు ఆవహిస్తాయని... మాయమాటలు చెప్పి ఎందరో మహిళలను లొంగదీసుకున్నాడు. తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఆత్మలు వారిని ఆవహిస్తాయని నమ్మించేవాడు. తర్వాత వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ లేకుండా చేసేవాడు. తర్వాత వారిపై అకృత్యానికి ఒడిగట్టేవాడు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు. ఆ వీడియోలను సదరు బాధితులకు చూపించి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము రాబట్టేవాడు. మరికొందరిని తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. అయితే, ఒక వీడియో బాబా బాగోతాన్ని బట్టబయలు చేసింది. జిలేబీ బాబా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే అదనుగా కొందరు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా నివాసముంటున్న చోట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో 120కి పైగా వీడియోలు, కొన్ని మత్తు పదార్ధాలు లభించాయి. దాంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన హరియాణా కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. -
Hyd: కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బయటపడ్డ ఫేక్ బాబా అరెస్ట్ వ్యవహారంలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు సయ్యద్ హుస్సేన్. వాళ్ల కష్టాలు తీర్చే శక్తి తనకుందని నమ్మబలుకుతూ.. నిస్సహాయత ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ హుస్సేన్(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టి.. అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని స్వస్థలం కర్నాటక బీదర్ జిల్లా బసవకళ్యాణ్. కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్. మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తాము అని మాయమాటలు చెప్పి నగ్నంగా వాళ్లను ఫోటోలను తీశాడు సయ్యద్. ఈ మేరకు సయ్యద్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి గ్యాలరీని పరిశీలించారు పోలీసులు. అంతేకాదు.. గులాం తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే.. ఆ ఫోటోలను ఎక్కడికి పంపిస్తున్నాడు అనే దానిపై విచారణ జరుగుతున్నట్లు ఫలక్‌నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించారు. గుల్బర్గాలో ఉన్న గులాం గురించి సెర్చ్ టీమ్స్ ను పంపించినట్లు తెలిపిన ఆయన.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని కోరుతున్నారు. ఫిజిక్‌ను బట్టి రేటు.. తన దగ్గరకు వచ్చే మహిళలను అందరినీ సయ్యద్ హుస్సేన్ టార్గెట్ చేయడం లేదు. ఆకర్షణీయంగా ఉండే ఫిజిక్‌ను బట్టే వాళ్లను రప్పించుకుంటున్నాడు. ముఖం.. కాళ్లు మినహాయించి కేవలం శరీరాన్ని మాత్రమే నగ్నంగా చిత్రీకరించి పంపినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి ఈ వ్యభిచార ముఠాను వెలుగులోకి తేగలిగారు. కలబురిగి ప్రాంతానికి గులాం.. వ్యభిచార గృహాల నిర్వాహకుడిగా ఓ అంచనాకి వచ్చారు. గులాం చెబితే.. వారం కిందట హుస్సేన్ పాతబస్తీ చేరాడు. బార్కస్ ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు మాటలతో గాలం వేసేవాడు. తన గదిలో వాళ్లను నగ్నంగా ఫొటోలు తీశాడు. వాళ్ల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్ ఛాటింగ్‌ల ఆధారంగా తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు తెలుస్తోంది. -
Hyderabad: బాబా అవతారమెత్తి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సమస్యలు తీరుస్తానంటూ..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలో ఉన్న ఘజియాబాద్ సమీపంలోని షహద్ర ప్రాంతం నకిలీ బాబాలకు అడ్డాగా మారింది. లోకల్, యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తున్న ఈ బురిడీ బాబాలు అందినకాడికి కాజేస్తున్నారు. ఇలాంటి ఓ బాబా వల్లో పడిన నగర యువతి ఏకంగా రూ.47 లక్షలు కోల్పోయింది. బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి బాబా చేతిలో పడి గతేడాది పాతబస్తీకి చెందిన యువతి రూ.లక్ష, మరో మహిళ రూ.4 లక్షలు ‘సమర్పించుకుని’ పోలీసు వద్దకు వచ్చారు. నగరానికి చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. జాతకాలు, పూజలపై నమ్మకం ఉన్న ఈమె కొన్ని వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ప్రత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ (ఇన్స్టాగ్రామ్)లో వచ్చిన ఓ యాడ్ ఆమె దృష్టికి ఆకర్షించింది. అందులోని ఫోన్ నెంబర్లో సంప్రదించారు. తన విషయాన్ని బురిడీ బాబాకు చెప్పగా సమస్యలు పరిష్కరిస్తానంటూ నమ్మబలికాడు. తన పేరు గోపాల్ శర్మగా చెప్పుకున్న అతను తొలుత ఆమె వివరాలు తెలుసుకున్న బురిడీ బాబా ఏదో పరిశీలనలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. చదవండి: 3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. పెట్రోల్ పోసుకొని వివాహిత ఆత్మహత్య చివరకు జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని, నివారణ పూజలు చేసి సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి, ఇతర ఖర్చులకు రూ.32 వేలు చెల్లించాలని కోరాడు. ఇలా మొదలెట్టిన అతగాడు దఫదఫాలుగా రకరకాల పేర్లు చెప్పి డబ్బు దండుకున్నాడు. పూజ మొదలెట్టానని, సామాగ్రి ఖరీదు చేయడానికని, ఆపై మరికొన్ని సామాన్లు కొనాలంటూ కారణాలు చెప్పాడు. ఆపై ఆమెను సంప్రదించిన బాబా పూజ మధ్యలో ఆగిందంటూ చెప్పాడు. అలా ఆగిపోతే విషాదం జరుగుతుందని, ఆనారోగ్యం పాలవుతావని భయపెట్టాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పి ఆమె నుంచి రూ.47 లక్షలు వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ఆమె యూపీఐతో పాటు రెండు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసింది. ఓ సందర్భంలో పూజ పూర్తి చేయడానికంటూ కొంత మొత్తం డిమాండ్ చేశాడు. మరుసటి రోజు ఉదయానికి ఆ డబ్బు పంపాలన్నాడు. ఆమె నగదును ఆ రోజ సాయంత్రానికి బదిలీ చేయగా... టైమ్ దాటాక పంపడంతో పూజ తంతు కాలేదని, మళ్ళీ అంతే మొత్తం పంపాలన్నాడు. చివరకు తాను మోసపోయానని తెలుసుకుంది. దీంతో బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు బాధితురాలు నగదు బదిలీ చేసిన యూపీఐ ఖాతా నెంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. షహద్ర ప్రాంతానికి చెందిన బురిడీ బాబాలను పట్టుకోవడం పెద్ద సవాల్‌గా మారుతోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయం కోరితే విషయం నిందితుడికి చేరుతుంది. అలా కాకుండా నేరుగా దాడి చేస్తే గ్రామం మొత్తం దాడులకు పాల్పడతారని చెప్తున్నారు. ఈ బురిడీ బాబాలు చేసిన వాటిలో వెలుగులోకి రాని మోసాలు అనేకం ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాళ్ళు బయటకు రాలేదని భావిస్తున్నారు. తాజాగా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ముంచిన బురిడీ బాబాను పట్టుకోవడానికి మరో టీమ్‌ను ఉత్తరాదికి పంపాలని నిర్ణయించారు. -
షాకింగ్ ఘటన: మగ సంతానం కోసమని.. భార్యకు అందరి ముందు..
పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త. మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్‌ఘడ్‌కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ ! -
విక్రమార్కుడు సీన్ రిపీట్.. నగలు ఇస్తే పూజలు చేసి ఇస్తామని చెప్పి
సాక్షి, మనోహరాబాద్(మెదక్): ఫకీర్‌లమంటూ వచ్చి మాయమాటలు చెప్పి, మందు చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో షేక్ సాదుల్ల, జరీనాబేగం నివసిస్తున్నారు. షేక్ సాదుల్లా చికెన్ దుకాణ వ్యాపారి. ఈనెల 15వ తేదీ ఉదయం దుకాణానికి వెళ్లాడు. అతను వెళ్లిన కొంతసేపటికి ఇద్దరు ఫకీర్లు వచ్చారు. మీ ఇంటికి నజర్ బాగా ఉంది పోవడానికి రూ.1100 ఇస్తే నజర్ తీసేస్తామంటూ, ఇంట్లోకి బలవంతంగా వచ్చి కూర్చున్నారు. నీ భర్త మరో మూడు రోజుల్లో చనిపోతాడు, అతడికి ఎమీ కావద్దంటే నీ బంగారు ఆభరణాలు ఇవ్వాలని జరీనా బేగంను భయపెట్టారు. నీకు బంగారం ముఖ్యమా? భర్త ఆరోగ్యం ముఖ్యమా? అని కంగారుపెట్టారు. ఆ భయంతో తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారపు నల్లపూసల దండ, తులం బంగారు చెవికమ్మలు, కాళ్లకు పెట్టుకున్న 15 తులాల వెండి పట్టీలు, 8 తులాల వెండిచైన్, 4 తులాల వెండి బ్రాస్లెట్, తులం వెండి ఉంగరాలు ఇచ్చింది. నగలు తీసుకున్న ఫకీర్లు జరీనాపై మందు చల్లడంతో సృహకోల్పోయింది. కొంత సేపటికి సృహ రావడంతో లేచి చూడగా వాళ్లు కనిపించలేదు, నగలు కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చూమంతర్ బాబా.. అమావాస్య రోజు పూజలుచేస్తే డబ్బులు రెట్టింపు..
సాక్షి, కరీంనగర్: హైదరాబాద్‌లో ఓ చూమంతర్ బాబా ఉన్నాడు. అమావాస్య రోజున పూజలుచేస్తే సంచుల్లో ఉన్న డబ్బుకట్టలు రెట్టింపు అవుతాయి. మీ వద్ద ఎంత ఉంటే అంత తీసుకుని రండి ఓ వ్యక్తి చెప్పిన విషయాన్ని నమ్మిన గంగాధరవాసులు నిలువునా మోసపోయిన వైనమిది. రెట్టింపు కాకపోగా.. ఉన్న డబ్బుల మూటలు మాయంకావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో ఓ వ్యక్తి అత్యాశకు పోయి.. అప్పు తెచ్చి మరీ డబ్బులు బాబా చేతికి ఇచ్చాడు. తీరా మోసం చేయడంతో అంతా విలపిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరుగుతోన్న ఈ నయా మోసం వివరాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. వివరాలివీ..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్‌చంద్‌కు గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన భాషవేని వీరయ్యతో పరిచయం ఉంది. ఇటీవల ప్రేమ్‌చంద్ గంగాధరకు వెళ్లాడు. వీరయ్య, అతని మిత్రులు మహేందర్, రాజయ్యను కలిశాడు. తనకు హైదరాబాద్‌లో ఇటీవల ఓ బాబా పరిచయమయ్యాడని.. అతనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పాడు. అతని మాయమంత్రాలతో డబ్బుల మూటలను పదింతలు చేసిస్తాడని నమ్మబలికాడు. సంగారెడ్డిలో డెమో.. నాంపల్లిలో మోసం..! ►తొలుత వీరెవరూ ప్రేమ్చందర్ మాటలు నమ్మలేదు. దీంతో వారిని డెమో కోసం సంగారెడ్డి తీసుకెళ్లాడు. అక్కడ పాత మసీదు వద్ద ఉన్న బాబా తనకున్న కనికట్టు విద్యలతో వారిఎదుట డబ్బులు కుప్పలుగా వచ్చేలా చేశాడు. ఇదంతా తన వద్ద స్ప్రేతో చేశానని, మీకు కావాలంటే రూ.12.30 లక్షలు చెల్లించి కొనుక్కోవాలని సూచించాడు. ►కళ్లముందు కుప్పలుగా డబ్బులు చూసేసరికి ఆ ముగ్గురు అత్యాశకు పోయారు. డబ్బు కోసం ఇళ్లకు పరుగులు తీశారు. మొత్తానికి రూ.12 లక్షలు సేకరించారు. ఇందులో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. బాధితుల్లో వీరయ్య వద్ద డబ్బులేదు. నగదు కోసం మహేందర్ వద్ద కొన్ని కాగితాలపై సంతకం పెట్టాడు. ►అంతా కలిసి ఓ రోజు ప్రేంచంద్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లారు. నాంపల్లి స్టేషన్ వద్ద ఆ బాబాను కలిశారు. భోజనం చేశాక రూ.12 లక్షలు తీసుకున్న బాబా.. ప్రార్థనలు చేయాలని చెప్పి నగదుతో ఉడాయించాడు. దీంతో బాధితులు ప్రేంచంద్‌ను నిలదీశారు. డబ్బు ఎక్కడికీ పోదని ధైర్యం చెప్పిన ప్రేంచంద్ పోయిన డబ్బులో రూ.ఆరు లక్షలు చెల్లిస్తానని నోటు రాసిచ్చాడు. ►బయటపడిందిలా..! ఒప్పందం ప్రకారం.. తనకు భూమి అమ్ముతానని చెప్పి ఇంతవరకూ రిజిస్ట్రేషన్ చేయడం లేదని మహేందర్ లాయరు ద్వారా వీరయ్యకు లీగల్ నోటీసులు పంపాడు. దీంతో వీరయ్య తాను కేవలం సంతకాలే పెట్టానని, ఏనాడూ భూమిని విక్రయిస్తాననలేదని వాపోతున్నాడు. మరోవైపు తమ మధ్య ఒప్పందం జరిగిందని మహేందర్ వాదిస్తున్నాడని సమాచారం. అటు బాబా, ఇటుస్నేహితుడి చేతిలో మోసపోయానని వీరయ్య నెత్తీనోరు బాదుకుంటున్నాడు. తనకు న్యాయం చేయాలని ఇప్పటికే కరీంనగర్ సీపీ కార్యాలయం, గంగాధర పోలీసులను ఆశ్రయించానని, మోసం జరిగింది రాజధానిలో కాబట్టి, అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారన్నాడు. ఈ ముగ్గురే కాకుండా.. గంగాధర, నమిలికొండ, వేములవాడకి చెందిన కొందరు వ్యాపారస్తులు కూడా అదే దొంగబాబాని నమ్మి దాదాపుగా దాదాపు రూ.ఇరవై లక్షలు మోసపోయారని సమాచారం. ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో సదరు బాబా ఏజెంట్లను నియమించుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. -
మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం: మార్కాపురం లాడ్జిలో యువతి ఆత్మాహత్యయత్నం కేసులో విస్మయానికి గురి చేసే విషయం వెలుగు చూసింది. చదువుల తల్లి అయిన ఆ విద్యార్థిని.. పిచ్చిగా మూఢనమ్మకంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ కేసులో పూర్తి వివరాలు తెలిశాక తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం షాక్ తిన్నారు. ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది సదరు యువతి. పరీక్షలు అయిపోవడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. అయితే ఇంటికని చెప్పి బయలుదేరిన ఆమె.. మార్కాపురంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏప్రిల్ 27వ తేదీన బసచేసింది. అక్కడి నుంచి ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయన సకాలంలో స్పందించి పోలీసులను అప్రమత్తం చేయడంతో.. విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె అసాధారణమైన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నం వెనుక ఒక బాబా ప్రమేయం ఉందని తెలిపింది. ఇంతకీ ఆ బాబా ఏం చెప్పాడంటే.. ఆమె కుటుంబానికి పాము పగ పట్టిందని, దాని వెనుక ఉంది ఆమెనే అని. గతంలో ఆమె నీడ పడి రెండు పాములు రక్తం కక్కుకుని చచ్చిపోయాయట. వాటి పగతో శాపం తగిలిందని, ఆమె కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆ బాబా చెప్పాడట. ఈ విషయాన్ని ఆమె బలంగా నమ్మింది. ఇదంతా తన వల్లే అనుకుంది. అందుకే నాలుగు పేజీల లేఖ రాసి స్వగ్రామం మాచర్లలో నివసిస్తున్న తన తండ్రికి వాట్సప్ ద్వారా ఫోటో తీసి పంపించింది. అనంతరం బ్లేడు తో చేయి కోసుకుంది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బతికింది. ఇంత చదువు చదివి.. ఇలాంటి మూఢనమ్మకాలకు లొంగిపోవడమేంటంటూ ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
దొంగ బాబా: భూత వైద్యం పేరుతో మహిళను లొంగదీసుకొని.. ఆ తర్వాత..
దేశంలో ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా దెయ్యాలు, భూతాల పేరుతో ఓ దొంగ బాబా.. 19ఏళ్లుగా మహిళపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధితురాలు కరన్పుర్లో నివాసం ఉండేది. కాగా, ఆమె 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అదే ప్రాంతంలో ఉండే పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను ఆత్మల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించాడు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తు మందులు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, 2006లో సదరు దొంగ బాబా ఆ ప్రాంతం వదిలి డెహ్రాడూన్‌కు వెళ్లిపోయాడు. అనంతరం 2012లో ఆమెకు ఓ మానసిక రోగితో వివాహం జరిపించాడు. కానీ, ఆమెతో మాత్రం సంబంధం కొనసాగించాడు. తాజాగా ఆమె కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. దీవెనెల పేరుతో ప్రవీణ్ గుజ్రాల్ తనను అనుచితంగా తాకేవాడని తెలిపింది. బాబా ఇచ్చే ఔషధాల వల్ల తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని వాపోయింది. 2021 మే నెలలో తన కూతుళ్లతో బాబా కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తన వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఆమె ఆరోపణలపై గుజ్రాల్ స్పందిస్తూ.. మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధితురాలి ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇదిలా ఉండగా గతంలోనూ బాబాపై మహిళ ఇలాగే ఆరోపణలు చేసినట్లు సమాచారం. కాగా, ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు ఇది కూడా చదవండి: కట్నం కోసం బంధువులతో అత్యాచారం.. వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి.. -
యువతితో దొంగ బాబా.. ఆ ఆశ్రమంలో ఏం జరిగింది..?
చెన్నై: స్వయం ప్రకటిక దైవం (దొంగ బాబా) అకృత్యాలకు మరో బాలిక బలైంది. మూలికలు, పూజల నెపంతో ఓ బాబా యువతికి వైద్యం అందిస్తున్న క్రమంలో ఆమె ఆ వైద్యానికి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన హేమమాలిని(20) బీఎస్సీ చదువుతోంది. అయితే, ఆమె కొద్ది రోజులుగా కడుపు నొప్పి, మెడ నొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా.. వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు యువతిని ఆమె తల్లిదండ్రులు తిరువళ్లూరులోని మునుస్వామి ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో మునుస్వామి.. హేమమాలినికి దోషం ఉందని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పూజలు చేయాలని, మూలికల వైద్యం అందించాలని సూచించాడు. బాధితురాలిని ఆశ్రమంలోనే ఉంచాలని తెలిపాడు. దీంతో ఆమె అక్కడే ఉండి అనేక పూజలు చేస్తూ, మునుస్వామి అందిస్తున్న వైద్యాన్ని తీసుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం హేమమాలిని ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. విపరీతంగా వాంతులు చేసుకోవడంతో ఆమెతో పాటే అక్కడే హేమమాలిని అత్త ఇంద్రాణి.. వెంటనే మునుస్వామిని కలిసి ఆసుపత్రికి తీసుకెళ్తానని కోరింది. అయితే, హేమమాలినికి చిక్సిత జరుగుతోందని ఈ సమయంలో బయటకు పంపించలేమని మునుస్వామి చెప్పాడు. దీంతో మునుస్వామితో బాధితురాలి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో చివరకు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు హేమమాలిని మృతి చెందినట్టు తెలిపారు. పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్బంగా బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మునుస్వామి వైద్యంతో తమ బిడ్డను చంపేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో హేమమాలినిని కాలేజీకి వెళ్లేందుకు కూడా మునుస్వామి అనుమతించలేదని అన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మునుస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి విచారణలో పూజలు, మూలికల చికిత్సతో రోగాలు నయం చేస్తున్నట్టు మునుస్వామి చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. -
ఇక్కడా ఓ డేరా బాబా!
Fake Baba in Visakha Payakaravupeta: విశాఖ జిల్లా పాయకరావుపేటలో దేవుడి పేరుతో రాసలీలలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ కృష్ణలంకకు చెందిన అంబటి అనిల్ రైల్వేలో కారుణ్య నియామకం కింద టికెట్ కలెక్టర్‌గా చేరాడు. ఐదేళ్ల క్రితం బెజవాడ నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేటకు మకాం మార్చి, ప్రేమదాసు పేరుతో బాబాగా మారాడు. భక్తుల నుంచి భారీగా విరాళాలు సేకరించి, పాయకరావుపేట శ్రీరంపురంలో అధునాతన భవంతి నిర్మించాడు. యువతీ యువకులను లోబరుచుకొని ఆ భవనంలో వారితో వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని చేష్టలు భరించలేకపోయిన ఆ యువతి, మరికొందరు యువకులు గురువారం పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, 344, 354, 506, 493, 374, 312, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు పాయకరావుపేట సీఐ నారాయణరావు తెలిపారు. గురువారం రాత్రి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠచందోల్ ఆ భవనాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న యువతుల నుంచి సీడీపీవో, పోలీసులు స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. వారిలో కొంతమంది ఇష్టపూర్వకంగా ఇక్కడ ఉంటున్నట్లు చెబుతున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వెంటనే స్పందించారు. సీఐ నారాయణరావు, తహసీల్దార్ పి.అంబేద్కర్, ఎంపీడీవో సాంబశివరావు, ఎస్ఐ ప్రసాద్, సీడీపీవో నీలిమలతో సమావేశం ఏర్పాటు చేశారు. వీరంతా ఒక కమిటీగా ఏర్పడి, భవనంలో ఉన్న వారిని బంధువులకు అప్పగించాలని ఆదేశించారు. -
దొంగ బాబా దారుణం.. మహిళ ఇంట్లో సమస్యలు తీరుస్తానని చెప్పి రెండేళ్లుగా..
ముంబై: తనకు మహిమలు ఉన్నాయని ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడతానని ఓ దొంగ స్వామీ ఒక మహిళను రూ. 32 లక్షలు మోసం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన బాబాన్ బాబూరావు పాటిల్‌ను పోలీసులు గర్తించారు. వివరాల ప్రకారం.. కాల్వ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని వాటిని తరిమివేసే శక్తి తనకు ఉందని నమ్మించాడు ఓ దొంగ బాబా. అయితే బాబా మోసాన్ని గ్రహించలేని ఆ మహిళ 2019 డిసెంబర్ నుంచి నిందితుడుకి పలు మార్లు డబ్బులు ఇచ్చింది. ఈ రకంగా పాటిల్ ఆమె నుంచి మొత్తం రూ.31.60 లక్షలతో పాటు కొన్ని ఖరీదైన వస్తువులను తీసుకున్నాడు. అయితే ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తను ఇంట్లో సమస్యలు పరిష్కారం కాకపోయే సరికి ఆ మహిళ దొంగ బాబా అసలు స్వరూపం తెలుసుకుని మోసపోయానని గ్రహించింది. దీంతో సమీప పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి జరిగినదంతా చెప్పి పాటిల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. చదవండి: స్కూల్లో ఉన్న విద్యార్థినిని బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి లైంగిక దాడి -
మార్కెట్ లోకి కొత్త బురడి బాబా
-
అధిక శక్తులు ఉన్నాయని లక్షలు దండుకుంటున్న కేటుగాడు
హైదరాబాద్: పూజల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం.. లోయర్ ట్యాంక్ బండ్‌కు చెందిన సదరు మహిళ తన ఇంట్లో నెలకొన్న ఆర్థిక, అనారోగ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రాకేష్ అనే వ్యక్తిని ఆశ్రయించింది. ఈ క్రమంలో అతగాడు.. తనకు అధిక శక్తులు ఉన్నాయని, మంత్రాలతో మహిళ సమస్యలను దూరం చేస్తానని నమ్మించాడు. అయితే, దీనికోసం అమ్మవారికి పూజ చేయాలని దానికి పెద్ద మొత్తంలో ఖర్చుఅవుతుందని తెలిపాడు. అంతటితో ఆగకుడండా.. పూజలు చేస్తానని చెప్పి ఆ మహిళ నుంచి 1,60,000ల నగదు, 5 తులాల బంగారాన్ని రాకేష్ తీసుకున్నాడు. పూజల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించిన ఆ వ్యక్తి మాటను దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళకు అనుమానం వచ్చి.. తాను ఇచ్చిన నగదు, బంగారం తిరిగి ఇచ్చేయాలని వేడుకుంది. ఈ నెల (ఆగస్టు) 10 న మహిళ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరింది. దీంతో మోసగాడు.. బాధిత మహిళను అసభ్యపదజాలంతో దూషించి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించి నెరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోనికి తీసుకుని పలుసెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణలో రాకేష్ ఇప్పటికే మరో 5 గురిని కూడా మోసం చేసినట్లు గుర్తించారు. చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు... -
దొంగ స్వాముల కలకలం.. దైవశక్తులు ఉన్న ప్రతిమలంటూ..
విజయంనగరం: విజయనగరంలోని ఎస్.కోటమండలంలో దొంగస్వాములు పూజలు చేస్తామని గ్రామస్తుల దగ్గర నగదు వసూళ్లు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, మూషిడిపల్లి గ్రామంలో కొంత మంది దొంగస్వాములు.. దేవుడి పూజలు చేస్తామని స్థానికులను నమ్మించారు. అంతటితో ఆగకుండా.. దైవశక్తులు ఉన్న దేవుడి ప్రతిమలంటూ గ్రామస్తులనుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితులు.. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు.. దొంగ స్వాములను ఆలయంలో బంధించి దేహశుద్ధి చేశారు. బాధితుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, దొంగ స్వాములను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. -
బాబా అవతారమెత్తిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
-
బీటెక్ చదివి బాబా.. తాయత్తులు, హోమాలు.. అబ్బో కథ పెద్దది!
సాక్షి, నల్లగొండ క్రైం: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలతో బాధపడుతున్నారా..? అమావాస్య, పున్నమికి రండి.. ప్రత్యేక పూజలు చేసి మీ చింత తీరుస్తా.. అని నమ్మబలుకుతూ అమాయకుల మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న బురిడీ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ. కోట్లు దండుకున్నాడు. మహిళ ఫిర్యాదుతో.. ఇటీవల తనకు బాగుచేస్తానని సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్ బాండ్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రవచన బ క్కులను ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గత ఆరు నెలలుగా బురిడీ బాబా.. సాయిబాబా భక్తునిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పూర్తిస్థాయిలో విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రసాదం ఇవ్వడానికి వెళ్లిన బాలికపై స్వామీజీ అఘాయిత్యం..
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్): మండలంలోని ఇస్పూర్ మథురతండాకు చెందిన బాలికపై ఓ స్వామీజీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నేరడిగొండ ఎస్సై భరత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం దుర్గానగర్‌కు చెందిన జాదవ్ ఆత్మారాం మహరాజ్(26) ఏడేళ్లుగా రాజుర గ్రామ శివారులోని గుట్టపై ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. గుట్టపై శివాలయంలో పూజలకు భక్తులు వెళ్తుంటారు. వేసవి కాలం కావడం, ఆ ఆశ్రమం వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో ఇస్పూర్ మథురతండా గ్రామస్తులు మహరాజ్‌ను గ్రామంలోని ఆలయం వద్ద గల ఆశ్రమంలో ఉంచారు. ఈ నెల 16న రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రసాదం మహరాజ్‌కు ఇచ్చి రావాలని బాలికను తల్లిదండ్రులు పంపించారు. బాలిక వెళ్లి అరగంట అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆశ్రమానికి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులను బద్దలు కొట్టారు. లోపల బాలిక అపస్మారక స్థితిలో పడిఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత స్వామీజీ తనపై అఘాయిత్యం చేశాడని తల్లిదండ్రులకు తెలిపింది. సోమవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి నేరడిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో మహరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ఫేక్ ఆఫీసర్..! రహస్యంగా తీసిన వీడియోలతో బ్లాక్మెయిల్ -
‘చరణ్‌తో మీ బిడ్డ పెళ్లి చేయకపోతే ప్రాణ నష్టం’
సాక్షి, చిత్తూరు: మదనపల్లె లాంటి సంఘటనలు చూస్తే.. సాంకేతికత మీద మూఢనమ్మకాలదే గెలుపు అనిపిస్తుంది. మనలోని భయం మన చేత అలా చేయిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగ స్వామీజీలు, బాబాలు జనాలను మోసం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన చిత్తూరు బి కొత్తకోటలో చోటు చేసుకుంది. పూజల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. వెంకట్ రెడ్డి అనే వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి తన అనుచరుడు చరణ్‌తో కలసి దందాలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి కన్ను స్థానికంగా ఉన్న కృష్ణా రెడ్డి కుటుంబం మీద పడింది. (చదవండి: బంగారు తల్లులను చంపేసుకున్నాం.. సారీ డాడీ!) ఈ క్రమంలో ‘‘మీ బిడ్డను ఫలానా వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలి. లేకుంటే కుటుంబంలో ప్రాణ నష్టం తప్పదు’’ అని వెంకట్ రెడ్డి.. కృష్టా రెడ్డిని బెదిరించాడు. అతడి మాటలతో బెంబెలేత్తిన కృష్టా రెడ్డి మెడిసిన్ చేస్తోన్న తన కుమార్తెని వెంకటరెడ్డి అనుచరుడు చరణ్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇక పెళ్లైన కొద్ది రోజులకే చరణ్ భార్యను చిత్ర హింసలకు గురిచేయడం ప్రారంభించాడు. మోసపోయామని తెలిసి కృష్టా రెడ్డి కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బయటపడుతున్న దొంగ బాబా బాగోతాలు
సాక్షి, నిజామాబాద్ : భూత వైద్యం పేరుతో మహిళల మానాలతో ఆటలాడుతున్న పోతుల శివప్రసాద్‌పై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ అనేక మంది బాధితులు బయటపడుతున్నారు. భూతవైద్యం పేరుతో తల్లీబిడ్డలపై అత్యాచారం చేసిన దొంగబాబా బాగోతాలు ఈనెల 13న బయపడిన విషయం తెలిసిందే. తాజాగా అతనిపై మరో మహిళ నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీర్ఘ కాల వ్యాధులు అనారోగ్య సమస్యలతో బాధడపతున్న తనవద్ద నుంచి మెడిటేషన్, భూత వైద్యం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడని లైంగికంగా కూడా ఇబ్బందులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దొంగబాబాపై నలుగురు బాధితులు ఫిర్యాదు చేశారు. (దొంగబాబా దారుణాలు: తల్లీకూతుళ్లపై అత్యాచారం) మరోవైపు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూతవైద్యం పేరుతో దాదాపు 20 మందికి పైగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పుసల గల్లీలో దొంగబాబు బాగోతాలు బయటపడటంతో మహిళా సంఘాల ప్రతినిధిలు అతనికి దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. తాజాగా మరో కేసు నమోదు కావడంతో విచారణను మరింత వేగవంతం చేశారు. బాబాల పేరుతో చలమణీ అవుతున్న మోసగాళ్లను నమ్మవద్దని పోలీసులు, ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు. -
దొంగబాబా దారుణాలు: తల్లీకూతుళ్లపై అత్యాచారం
సాక్షి, నిజామాబాద్ : భూతవైద్యం పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగబాబా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో అతని బాగోతాలు బయటపడుతున్నాయి. గతంలో తాము కూడా అనేక వేధింపులకు గురయ్యామని బాధితులు వాపోతున్నారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూసల గల్లీలో ఐదేళ్ళ నుంచి భూత వైద్యం మెడిటేషన్ పేరుతో బాబా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. మెడిటేషన్, క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం అంటూ అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లొంగదీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపతున్న మెట్‌పల్లికి చెందిన తల్లీ, కూతురు ఇటీవల బాబాను ఆశ్రయించారు. (బాలికపై అత్యాచారం.. దొంగబాబాకు బడితపూజ) అమాయకులైన వారికి మాయమాటలు చెప్పిన ప్రబుద్ధుడు తల్లీకూతుళ్లను లోపరుచుకున్నాడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగికదాడికి పాల్పడం, ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. ముందు తల్లిపై ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత మూడు నెలలుగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాధితులు షాకింగ్‌కు గురయ్యారు. దారుణాన్ని తెలుకుని బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించడం బాబా బాగోతం బయటపడింది. దీంతో దొంగ బాబా కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు కామాంధుడిని చితకబాదారు. చెప్పులు, చీపుర్లతో కిందపడేసి కసితీరా కొట్టారు. మరోవైపు బాబా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దొంగబాబా పోలీసుల అదుపులో ఉండగా.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజా ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల జీవితాలతో ఆటలాడుతున్న ప్రబుద్ధిడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
దొంగబాబాకు బడితపూజ
-
బాలికపై అత్యాచారం.. బాబాకు బడితపూజ
సాక్షి, నిజామాబాద్ : భూత వైద్యం పేరుతో మహిళలను మోసం చేస్తు అత్యాచార యత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తికి బాధితులు, మహిళలు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పతున్న దొంగ బాబాకు బడితపూజ చేశారు. అభంశుభం తెలియని బాలికను బెదిరించి లైంగిక వాంఛను తీర్చుకుంటున్న ఘటన నిజామాబాద్ నగరంలో మంగళవారం వెలుగుచూసింది. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగుతూ.. మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా బాలికపై ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. (గర్భం దాల్చిన మైనర్ బాలిక) దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు దొంగబాబాను చితకబాదారు. అయితే భూతవైద్యం పేరుతో మరికొంతమంది మహిళలపై కూడా గతకొంతకాలంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
మెదక్ జిల్లా పెద్దచీకోడ్లో బయటపడ్డ బాబా బాగోతం
-
బాబాల్..పాపాల్..శాపాల్..!
-
దొంగ బాబా మాయలో నిజామాబాద్ యువతి
-
అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు!
అతని పేరు.. సత్యం శివం సుందరం. ఈ పేరు చూసే పెద్ద స్వామీజీ వచ్చారు అనుకొని ఆలయంలో పూజారి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ గుడినే దిగమింగేందుకు వచ్చిన కాలాంతకుడు అని అప్పుడు గ్రహించలేకపోయారు. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనీ, వాటి కోసమే అతడు స్వామీజీ వేషం కట్టాడన్న విషయం నాలుగేళ్ల తర్వాతగానీ గుర్తించలేకపోయారు. చివరికి అతను ఓ స్మగ్లర్, మనీల్యాండరర్.. పక్కా 420 అని తెలుసుకొని పోలీసులకు పట్టిచ్చారు. ఇదిగో ఆలయంలో వీళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కూర్చున్న ఆలయ పూజారి తాను పూజలు చేసే గుడిలో ఏం చేయిస్తున్నాడో తెలుసా? వీళ్లు తవ్వుతున్నది ఆలయంలో కొత్త నిర్మాణ పనుల కోసం కాదు.. అర్థరాత్రి వేళ అతి రహస్యంగా ఓ ముఠా వచ్చి ఆలయ గర్భగడి ముందు సాగిస్తున్న గుప్త నిధుల వేట ఇది. ఈ ముఠా నాయకుడు ఇక్కడ కూర్చొని తవ్వకాలు చేయిస్తున్న ఆలయ పూజారే. ఆలయ పూజారేంటి? గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయించడం ఏంటి అన్న డౌట్ వస్తుందా? నిజానికి ఇతను పూజారి కాదు. గుప్తనిధుల వేట కోసం వేసుకున్న వేషమే ఈ స్వామీజీ వేషం. ఇతగాడి పేరు.. సత్యం శివం సుందరం. పేరు ఎంత సినిమాటిగ్గా ఉందో.. తీరు అంతకు మించిన డ్రమటిగ్గా ఉంటుంది. ఆ డ్రామాను రక్తి కట్టించే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం సమీపంలోని జన్నాయిగుట్టపైకి చేరాడు. అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇతగాడు ఐదేళ్ల క్రితమే టార్గెట్ చేశాడు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చత్రపతి శివాజీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలోనే బస చేశారని స్థలపురాణం చెబుతోంది. శివాజీనే అప్పట్లో ఆలయ అభివృద్ధికీ విశేషంగా కృషి చేశారట. అందుకే ఈ ఆలయ ఆవరణలో గుప్త నిధులు ఉంటాయని కన్నేశాడు ఈ 420. అసలు పేరు తెలియదు.. కానీ ఇక్కడున్న వారికి తానొక స్వామీజీని అంటూ పరిచయం చేసుకున్నాడు. పరపతి కోసం చిన్నజీయర్ స్వామి పేరునూ అడ్డంగా వాడేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం స్థానికుల్ని నమ్మించి ఆలయంలో పూజారిగా చేరాడు. వాళ్లు కూడా ఆలయంలో ఎప్పుడూ ఒకరు ఉండటం మంచిదేనని భావించి అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించారు. ఆలయం ఉన్న జన్నాయిగుట్టకూ రావిరాల గ్రామానికీ చాలా దూరం ఉండటం.. ఉదయం సాయంత్రం మాత్రమే భక్తులు రావడం వల్ల మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ దొంగ బాబా తవ్వకాలు సాగించేవాడు. ఆధునిక యంత్రాలను, స్కానర్లను ఉపయోగించి ఆలయంలో నిధుల కోసం అన్వేషించాడు. వాటి ప్రకారం పలుచోట్ల తవ్వకాలు జరిపాడు. ఇలా రాత్రి మొత్తం తవ్వకాలు జరిపే ఈ ముఠా.. మూడోకంటికి తెలియకుండా ఆ గోతులు పూడ్చివేసేది. ఈ దొంగ బాబా ముఠాలో ఉండే ఓ వ్యక్తి ఇతగాడితో విభేదించి.. తాను రహస్యంగా తీసిన వీడియోను గ్రామస్తులకు షేర్ చేశాడు. దాన్ని చూసి షాక్ తిన్న గ్రామస్తులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నెల 15న ఈ అసత్యబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతడి గత చరిత్రను తవ్వే పనిలో ఉన్నారు. ఈ దొంగ బాబా పూజారి ముసుగులో వేసుకున్న స్మగ్లర్, మనీ ల్యాండరర్, పక్కా 420 అని కూడా బయటపడుతోంది. గతంలో మహిళలతో ఆలయంలో అసభ్యంగా ప్రవర్తించాడనీ, స్థానికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడనీ ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. అంతేకాదు తరచూ మహారాష్ట్ర వెళ్లి వచ్చేవాడనీ, అంతర్ రాష్ట్ర గుప్తనిధుల ముఠాలతో ఇతనికి సంబంధాలున్నాయని రావిరాల గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తం విచారణ పూర్తైతేగానీ ఈ సత్యం శివం సుందరం చేసిన అకృత్యాలన్నీ బయటపడవని అంటున్నారు. -
బురిడీ బాబాలకు దేహశుద్ధి
సాక్షి, రాజాపేట(నల్గొండ) : బాబాజీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన బురిడీ బాబాలకు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన ముగ్గురు బాబాజీలు రఘునాథపురం గ్రామంలో ఉదయం నుంచి సాధనాసురులమంటూ జాతకం చెబుతామంటూ ఇంటింటికీ తిరిగి ప్రజలను నమ్మబలికిం చారు. భయబ్రాంతులకు గురిచేస్తూ మోసపూరితమాటలతో ప్రజల నుంచి కొంతడబ్బు వసూలు చేశారు. వీరిపై మధ్యాహ్నం గ్రామస్తులకు అనుమానం రావడంతో వారిని నిలదీశారు. వారి ఆధార్ కార్డులను తీసుకుని చూసి అనుమానం రావడంతో మొసం చేస్తున్నారని గుర్తించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాబాజీలను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ బాబాకు దేహశుద్ధి
మనూరు(నారాయణఖేడ్): గ్రామాల్లోని ప్రజల ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని అమాయక జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ బాబాకు స్థానిక బోరంచ గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. గత ఆదివారం బోరంచలో గ్రామంలో ఓ యువకుడు ఫకీరు వేషధారణలో గ్రామంలో పర్యటిస్తూ మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని నిమ్మకాయలు, నీళ్లు చల్లుతూ తిరుగుతూ గ్రామానికి చెందిన రజాక్ ఇంటికి వెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తానని వారిని నమ్మబలికి వారి నుంచి రూ.5 వేలు నగదుతోపాటు ఒక సెల్‌ఫోను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించి గ్రామం చివరికి వచ్చి వేషం మార్చుకుని వెళ్లిపోయాడు. కాగా మళ్లి బోరంచ గ్రామం పక్కనే ఉన్న దుదగొండ గ్రామంలో సోమవారం ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా గ్రామస్తులకు నమ్మబలికే ప్రయత్నం చెయ్యగా ఈ విషయం ముందే తెలుసుకున్న గ్రామస్తులు సదురు వ్యక్తిని బంధించి బోరంచ గ్రామస్తులకు అప్పగించారు. దీంతో వారు నకిలీ బాబాను చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా యువకుడు కర్ణాటకలోని గుల్బర్గకు చెందిన మనోజ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. మారు వేషాలువేస్తూ అమాయక జనం ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని బురిడి బాబాగా తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా సంబంధిత యువకుడిని మనూరు పోలీసులకు అప్పగించారు. -
దిండివనంలో దొంగస్వామి కామలీలలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజల్లోని మూఢనమ్మకాల బలహీనతే అతడికి బలం. సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళలు, యువతుల సొమ్మును దోచుకోవడం, మాయమాటలతో వలవేసి తనలోని కామవాంఛను తీర్చుకోవడం అతని నైజం. స్వామి ముసుగులో సుమారు ఏడేళ్లుగా సాగుతున్న ఈ కామప్రకోపి బండారం ఓ బాధిత యువతి ఫిర్యాదుతో బట్టబయలైంది. సహకరించిన శిష్యురాలితో దొంగస్వామి సోమవారం కటకటాల పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలో ఒంగూరులో నివసించే సెల్వమణి (35) సొంతూరు కాంచీపురం జిల్లా సూనాంపేడు గ్రామం. మంత్రవాదిగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేయడం, మహిళలను లొంగదీసుకోవడాన్ని సహించలేని అతని భార్య, తన ఇద్దరు పిల్లలను తీసుకుని పదేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యా పిల్లలు లేకపోవడం వల్ల మరింత స్వేచ్ఛలభించడంతో సెల్వమణి తన వృత్తిని విస్తృతం చేసి భారీ ఎత్తున డబ్బు సంపాదించాడు. దీంతో అతనిలో మహిళలపై వ్యామోహం పెరిగిపోయింది. మంత్రాలు, చేతబడి, దోషపరిహార పూజల కోసం వచ్చే వివాహితలు, యువతులను శారీరకంగా లోబరుచుకునేవాడు. సుమారు పదేళ్ల క్రితం విల్లుపురం జిల్లా దిండివనంలోని ఒంగూరుకు వచ్చి ఒక చిన్నపాటి గుడికట్టి అదే వృత్తిని కొనసాగించాడు. మీపై కొందరు చేతబడి చేశారని భయపెట్టి తాంత్రిక మంత్రాలతో నయం చేస్తానని నమ్మించి భారీ ఎత్తున డబ్బులు గుంజేవాడు. విల్లుపురం, కాంచీపురం, సేలం, నామక్కల్, ధర్మపురి, కడలూరు జిల్లాలతోపాటు పుదుచ్చేరి రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. ఇలా వచ్చిన మహిళను వశపరచుకుని, భర్త నుంచి వేరుచేసి వారితో సంసారం సాగించేవాడు. అలాగే యువతులను లొంగదీసుకున్నా డు. ఇలా లొంగిపోయిన యువతులు మరి కొందరు యువతులను సెల్వమణికి అప్పగించేవారు. ఈ కోవలో మదురైకి చెందిన హేమ (40) అనే మహిళను కూడా భర్త నుంచి వేరుచేసి ఆమెతో ఒంగూరులో కాపురం పెట్టాడు. ఆమె శిష్యురాలి లా అవతారం ఎత్తి సెల్వమణికి సహకరించేది. కాంచీపురం యువతిపై లైంగికదాడి: ఇదిలా ఉండగా, కాంచీపురం ఉత్తర మాలైపాక్కం అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దొంగస్వామిని ఇంటికి ఆహ్వానించి తన కుమారుడి సమస్యల గురించి వివరించి పరిష్కరించాలని కోరాడు. ఈ సమయంలో ఇంటి యజమాని 17 ఏళ్ల కుమార్తెపై సెల్వమణి కన్నేశాడు. కుమారునికి పట్టిన పీడ తొలగాలంటే ఊళ్లో ఆలయాని నిర్మించాల్సి ఉంటుంది, అయితే ఆసమయంలో మీ కుమార్తె ఇంటిలో ఉంటే ప్రాణాలు పోతాయని భయపెట్టాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు తన ఇంటిలో పెట్టుకుని కన్నబిడ్డలా చూసుకుంటానని నమ్మించాడు. ఇందుకు ఆమె తండ్రి తటపటాయించాడు. ఆ సమయంలో హేమ అనే యువతి వచ్చి మీ కుమార్తె నావద్ద జాగ్రత్తగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదని తండ్రికి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాడు. ఆ తరువాత యువతిని ఇద్దరూ కలిసి ఒంగూరుకు తీసుకెళ్లి తానే ఖర్చుపెట్టి చదివించాడు. మీ అన్న సమస్యలు పరిష్కారం కావాలంటే నాతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకుంటే మీ కుటుంబమంతా నాశనం అయిపోతుందని సెల్వమణి ఆ యువతిని భయపెట్టి బలవంతంగా వశపరుచుకున్నాడు. ఇందుకు శిష్యురాలు హేమ కూడా సహకరించింది. సదరు యువతికి గత నెల 8వ తేదీకి 19 ఏళ్లు రావడంతో ఈ వయస్సులోని యవతిని పెళ్లి చేసుకుంటే మానవాతీతమైన శక్తులు సిద్ధిస్తాయని భావించిన సెల్వమణి తన ఉద్దేశాన్ని యువతి తండికి చెప్పాడు. ఇందుకు తండ్రి నిరాకరించి కుమార్తెను ఇంటికి పిలుచుకువచ్చాడు. ఇన్నాళ్లూ జరిగిన ఘోరాన్ని తండ్రికి చెప్పడంతో దిండివనం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దొంగస్వామి సెల్వమణి, సహకరించిన హేమను మంగళవారం అరెస్ట్ చేశారు. దిండివనం కోర్టులో ప్రవేశపెట్టి కడలూరు సెంట్రల్ జైల్లోకి నెట్టారు. బాధిత మహిళలు 50 మందికి పైనే.. దొంగస్వామి సెల్వమణి పలు గ్రామాల్లో సంచరిస్తూ సుమారు 50 మందికి పైగా మహిళలు, యువతుల జీవితాలను నాశనం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. బాధితులు పరువుకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఇన్నాళ్లూ గోప్యంగా ఉండింది. అయితే పోలీసులు అరెస్ట్ చేయడంతో బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. పగటి వేళలో టిప్‌టాప్ డ్రస్సుల్లో తిరుగుతూ రాత్రివేళలో పెట్టుడు గడ్డాలు, మీసాలు పెట్టుకుని స్వామి అవతారం ఎత్తేవాడు. పదో తరగతి మాత్రమే చదివిన సెల్వమణి...స్వామి వేషంలో బాగా సంపాదింవచ్చని ఈ మార్గంలోకి వచ్చాడు. దంపతుల మధ్య తగవులు, సంతానలేమి, వివాహం కాకపోవడం సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే మహిళలు, యువతులు మైకంలోకి వెళ్లేలా చేసి తన కామవాంఛలు తీర్చుకునేవాడు. -
మీ ఉంగరం దేవుడి దగ్గరకు వెళ్లింది
రాంగోపాల్‌పేట్: బాబా భక్తులమంటూ బాబా ఫొటో చేతిలో పెట్టి ఓ గుజరాత్ ముఠా బంగారు ఉంగరం నొక్కేసింది.మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ ఈ నెల 26న రిమోట్ కొనుగోలు చేసేందుకు ఆర్పీరోడ్‌కు వచ్చాడు. ఆర్పీరోడ్‌లోని కింగ్స్‌వే హైస్కూల్ వద్ద కారులో కూర్చుని ఉండగా ముగ్గురు వ్యక్తులు సాయిబాబా ఫొటోతో అక్కడికి వచ్చి తాము బాబా భక్తులమని ఏదైనా సహాయం చేయాలని కోరారు. దీంతో లక్ష్మణ్ రూ.60 వారికి ఇవ్వబోగా ‘మీ చేతికి ఉంగరం ఉంది ఉంగరం ఉన్న చేతితో దానం స్వీకరించం’ అని చెప్పారు. దీంతో ఆయన ఉంగరం చేతిలో పెట్టుకుని డబ్బుతో పాటు ఉంగరాన్ని వారి చేతిలో పెట్టాడు. వెంటనే ఉంగరాన్ని చేతితో తీసుకుని చుట్టూ తిప్పి నోట్లో వేసుకున్నట్లు నటించాడు. లక్ష్మణ్ చేతిలో బాబా బొమ్మ పెట్టి వెళ్లిపోతుండగా ఉంగరం ఇవ్వమని కోరాడు. ‘మీ ఉంగరం బాబా దగ్గరకు వెళ్లింది. దానం చేసిన తర్వాత మళ్లీ ఎలా అడుగుతారు అని దబాయిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో లక్ష్మన్ కారు దిగి వారి కోసం గాలించగా గల్లీల్లోనుంచి వెళ్లిపోయారు. దీంతో అతను మహంకాళి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఉంగరం సుమారు తులం బరువు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ ముఠా పనే? సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించన పోలీసులు నిందితులు గుజరాత్ ముఠాగా భావిస్తున్నారు. రంజాన్ సమయంలో వారు భిక్షాటన చేస్తున్నట్లు నటించి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడతారన్నారు. ముగ్గురు నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
కొరుకుడు బాబా..దొంగ లీల
సాక్షి, ఆత్మకూరు(ఎం) : యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల రాంరెడ్డికి 35 ఏళ్ల వ యస్సు ఉంటుంది. నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు లేకపోవడంతో జీవనోపాధికి బొంబా యికి వెళ్లాడు. అక్కడ సాంచాలు నడుపుకుంటూ జీవితం గడిపాడు. తర్వాత స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. గ్రామంలో అతని కున్న నాలుగు ఎకరాలను సాగు చేస్తున్నాడు. గ్రామంలోని పంచా యతీ కార్యాలయం వద్ద కిరాణం కొట్టును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంత చేసినా.. పెద్దగా లాభం లేదనుకున్నాడు. ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాధించాలనుకున్నాడు. అందుకు బాబాగా అవతారం ఎత్తడమే.. మేలని తలచాడు. చెర్వుగట్టు వద్ద.. కొన్ని జిమ్మిక్కులు నేర్చుకుని బాబాగా అవతారం ఎత్తాలనున్న రైతు కొప్పుల రాంరెడ్డి కట్టుబొట్టును మార్చాడు. జుట్టును పెంచాడు. కాషాయపు అడ్డలుంగీ చుట్టాడు. బాబాగా అవతారం ఎత్తాడు. కొన్ని జిమ్మింగ్లు నేర్చుకోవడాని ప్రతి అమవాస్య రోజున చెర్వుగట్టుకు వెళ్లుండేవాడు. అక్కడ శివసత్తుల పూనకాలను గ్రహించసాగాడు. తర్వాత గ్రామానికి వచ్చి పూనకం ఊగుతుంతేవాడు. తన కంటూ కొందరు శిష్యులను తయారు చేసుకున్నాడు. తనకు దైవ శక్తులు అవహించినట్లుగా.. నేనేది చెప్పితే అది జరిగి తీరుతుందని ప్రజల్లో శిష్యుల ద్వార ప్రచారం కల్పించుకున్నాడు. రాంరెడ్డి కాస్తా కొరుకుడుగా బాబాగా.. కొప్పుల రాంరెడ్డి కొరుకుడు బాబాగా మారాడు. కొద్ది రోజులనుంచి కొరుకుడు బాబా దగ్గరకు భ క్తులు రావడం ప్రారంభమైంది. దీర్ఘకాలిక వ్యాధులు, సంతానలేమితో బాధపడుతున్న వారు, వ్యాపార రంగంతో కలిసి రాక ఇబ్బందులు పడుతున్న వారు కొరుకుడు బాబా దగ్గరకు రావడం ప్రారంభమైంది. రానురాను వారి సంఖ్య పెరిగిం ది. గతంలో ప్రతి ఆదివారం మాత్రమే భక్తులను చూసే ఈ కొరుకుడు బాబా ఆదివారంతో పాటు శుక్రవారం కూడా చూడడం ప్రారంభించాడు. భక్తుడిని కొరుకుతున్న కొప్పుల రాంరెడ్డి, భక్తురాలి ఒళ్లంతా వత్తుతున్న దొంగబాబా (ఫైల్) పంటిగాటుతో వికృత చేష్టలు.. తన వద్దకు వచ్చే భక్తులకు చిన్న సమస్య అయితే చిన్న పంటి గాటు, పెద్ద సమస్య అయితే పెద్ద పంటి గాటు చేసేవాడు. వంటి మీద కాషాయం వస్త్రం పరిచి తన పంటితో గాటు వేస్తాడు. అయితే ఇందుకు పీజు రూ.200 నుంచి రూ.500 తీసుకునే వాడు. మగవాళ్లు అయితే పడుకోబెట్టి, ఆడవాళ్లు అయితే నిలబెట్టి శరీమంతా తడుముతూ పండి గాట్లు పెట్టేవాడు. అంతే కాకుండా మీ సమస్య జఠిలంగా ఉంది.. ఇక్కడ పరిష్కారం అయ్యేది కాదు.. మీ ఇంటికి వచ్చి చూడాలని అక్కడకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు పలువురు బాధితులు చెబుతున్నారు. కొబ్బరి కాయలు దందా చేస్తున్న భార్య ఓ.. వైపు ఇంట్లో కూర్చొని కొరుకుడా బాబా కొప్పుల రాంరెడ్డి తన పంటి గాట్లతో నాలుగు కాసులు సంపాధిస్తుంటే.. అతడి భార్య కవిత వచ్చే భక్తులకు కొబ్బరికాయలు అమ్ముతూ భర్తకు చేదోడుగా నిలుస్తోంది. కొబ్బరికాయ మార్కెట్లో రూ.18 ఉంటే.. ఇక్కడ రూ.100కు అమ్ముతుంటుంది. కొబ్బరికాయతో పాటు రెండు నిమ్మకాయలు. పసుపు, కుంకుమ ప్యాకెట్ కవరు భక్తులకు అందచేసి రూ.100 తీసుకుంటూ దైవం చాటు దందాగా చేస్తోంది. ఎవరైనా భక్తులు బయట నుంచి కొబ్బరికాయలు తీసుకొస్తే అవి ఇక్కడ పనికి రావు.. బాబా ఆగ్రహానికి గురికా వాల్సి వస్తుందని చెప్పడంతో.. భక్తులు చేసేది లేక రూ.100 పెట్టి కొబ్బరికాయ సెట్ తీసుకునేవారు. ఈ కొరుకుడు బాబా వద్దకు హైదరాబాద్, భువనగిరి, మోత్కూరు, ఆత్మకూరు(ఎం), తిరుమలగిరి నుంచి బాధితులు వచ్చేవారు. వాట్సప్‌లో వైరల్ కావడంతో.. కొరుకుడు బాబా లీలలు వీడియో ఇటీవల వా ట్సప్‌లో వైరల్ కావడంతో పోలీసులు స్పందిం చారు. దీంతో కొరుకుడు బాబాను స్థానిక ఎస్ఐ కనకటి యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ పి.జ్యోతి ఎదు ట బైండోవర్ చేశారు. దీంతో ఈ కొరుకుడు బా బా లీలలు ఒకోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రామస్తులు కూడా ఇటువంటి కార్యక్రమాలను పోత్సహించొద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈ బాబా ప్రస్తుతం గ్రామంలో ఉండకుండా.. బయట తిరుగుతున్నట్లు సమాచారం. -
భీమిలిలో ఉద్యోగాల పేరుతో జోతిష్కుడు టోకరా
-
దొంగ బాబా అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగ బాబాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు సోమవారం మీడియాకు తెలిపారు. గిరీష్ సింగ్ అనే వ్యక్తి బాబా అవతారమెత్తి భక్తి కార్యక్రమాల పేరిట తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుంచి రూ.50 నుంచి రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. పూజలు, భక్తి ప్రవచనాల పేరుతో ప్రజలను మోసం చేసేవాడని, కొత్త కొత్త ప్రక్రియల పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారం చేసాడన్నారు. యాప్స్ డెవలప్మెంట్ పేరుతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరిట సుమారు 300 మంది నుంచి డబ్బు వసూలు చేసాడని తెలిపారు. బాధితులు బాబా మోసాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుంచి 3 ఫోన్స్, ఒక లాప్టాప్, ఐదు భారత పాస్ పోర్టులు, ఆరు విలాస వంతమైన కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడు 30 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశాడని, ప్రజల సొమ్ముతో విదేశాల్లో దర్జాగా జల్సాలు చేశాడన్నారు. -
హైదరాబాద్‌లో దొంగ బాబా : యువతులకు డ్రగ్స్ ఇచ్చి..
సాక్షి, మేడ్చల్ : తాము దైవాంశ సంభూతులమని చెప్పుకుంటూ మోసాలకు, లైంగిక దాడులకు పాల్పడుతున్న దొంగ బాబాల బండారం బయటపడుతున్నా ప్రజలు కళ్లు తెరవడం లేదు. దీంతో దొంగ బాబాల దురాగతాలకు అంతం లేకుండా పోతోంది. తాజాగా మేడ్చల్‌లో దొంగ బాబా వ్యవహారం బయటపడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదుమకుంట గ్రామంలో ఓమోజయ బాబా తన ఆశ్రమంలోకి దూర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి డ్రగ్స్ బానిసలుగా చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. యువతుల తల్లిదండ్రులు, హిందూ వాహినీ కార్యకార్తలు ఆందోళనకు దిగడంతో అసలు విషయం బయటపడింది. మానసిక ప్రశాంత పేరుతో యువతులను అక్రమంగా నిర్భందించి డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారని హిందూ వాహినీ కార్యకర్తలు ఆరోపించారు. గతంలో ఎన్నిసార్లు పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నకిలీ బాబాల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆశ్రమం ముందు ధర్నాకు దిగారు. -
హైదరాబాద్‌లో నకిలీ బాబా అరెస్ట్
-
నకిలీ బాబా అరెస్ట్.. టీవీ చానళ్లకు నోటీసులు
గచ్చిబౌలి: ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు శక్తి యాగం చేస్తే ఇట్టే సమస్యలు తొలగిపోతాయని మాయ మాటలు చెప్పి తులాల కొద్ది బంగారం దోచుకున్న నకిలీ బాబాను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. కలది కేరళకు చెందిన శివోహం రామ శివానుజం అలియాస్ రామ శివ చైతన్య స్వామి, కేరళలోని శివోహం జ్ఞాన గురుపీఠంలో పెరిగారు. వివిధ ప్రాంతాల్లో తిరిగిన అతను హైదరాబాద్ చేరుకుని 2009లో తేజస్విని వివాహం చేసుకున్నారు. యూసూఫ్‌గూడలో తత్వపీఠం పేరిట అధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అతను 2018లో ఎర్రగడ్డకు మకాం మార్చారు. శక్తి యాగం చేస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని ప్రచారం చేసుకునేవాడు. అవసరమైన వారు కోరితే ఆశ్రమంలో గాని, లేదా వారి ఇంట్లో పూజలు, యజ్ఞాలు చేస్తానని నమ్మబలికే వాడు. పూజలు చేసే క్రమంలో కలశంలో బంగారాన్ని వేయించి దానిపైన గుడ్డతో కట్టి ఉంచేవారు. 60 రోజుల తరువాత తానే దానిని తెరువాలని, మీరు తెరిస్తే బియ్యం, రాళ్లు వస్తాయని భయపెట్టేవాడు. అదును చూసుకొని బంగారం ఉన్న కలశాన్ని తీసుకొని బియ్యం రాళ్ల కలశాన్ని అక్కడ ఉంచే వాడు. ఒకవేళ భక్తులు బంగారం లేదని చెబితే నగదు తీసుకొని తానే బంగారాన్ని కొని కలశంలో వేసేవాడు. ఈ బంగారాన్ని తేజస్విని మణపురం, ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువబెట్టి సొమ్ము చేసుకునేది. వీరిపై బోయినపల్లి పీఎస్ పరిధిలో మూడు, ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో రెండు, వనస్థలిపురం, జీడిమెట్ల, రాజేంద్రనగర్, మైలార్‌దేవర్‌పల్లి పీఎస్ , పచ్చిమ గోదావరిలోని బొమ్మూరు, కృష్ణా జిల్లాలోని కంచికిచెర్ల పీఎస్ పరిధిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కలశంలో 62 తులాలు(వడ్డాణంతో సహా), 25 తులాలు, 24 తులాలు వేసిన వారు ఉన్నారు. ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి భార్య సైతం ఇతని చేతిలో మోసపోయినట్లు తెలిపారు. మధ్యవర్తిగా ఉంటూ భక్తులను మోసగించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 1163 గ్రాముల బంగారు ఆభరణాలు, 760 గ్రాముల బంగారం, ఎక్స్‌యూవీ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టీవీ చానళ్లకు నోటీసులు శివోహం రామ శివానుజం అలియాస్ రామ శివ చైతన్య స్వామి జెమినీ, భక్తి టీవీ, మహాన్యూస్, సీవీఆర్, ఓం టీవీల్లో పెయిడ్ ఆర్టికిల్స్ ప్రసారం చేయడంతో అమాయకులు నమ్మి మోసపోయారని సీపీ తెలిపారు. ఆయా చానళ్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
బోల్తా కొట్టించిన బురిడీ స్వామిజీ!
కంచికచర్ల (నందిగామ): అమాయక ప్రజలను నమ్మించి రూ.లక్షలు కాజేసి ఉడాయిస్తున్న బురిడీ స్వాములకు తెలుగు రాష్ట్రాల్లో కొదువలేకుండా పోతోంది. కృష్ణాజిల్లా కంచికచర్లలోని ఓ మహిళకు మాయమాటలు చెప్పి రూ.2లక్షలతో ఉడాయించిన ఓ బురిడీస్వామి ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ దావాల సందీప్ తెలిపిన కథనం మేరకు హైదరాబాద్‌కు చెందిన తత్వపీఠ చైతన్యమఠం శ్రీ రామ శివచైతన్యం స్వామి, తేజస్వి మేనేజింగ్ ట్రస్టు సభ్యులు నాలుగు రోజుల క్రితం కంచికచర్ల సర్పంచి గద్దే ప్రసాద్ వద్దకు వచ్చి జాతకం చూస్తామని, ఆర్థిక, ఆనారోగ్య సమస్యలుంటే పూజలు చేసి పరిష్కరిస్తామని నమ్మబలికారు. దీనికి ఖర్చు రూ. 5లక్షల వరకు అవుతుందని తెలిపారు. అయితే తమ వద్ద అంత నగదు లేదని సర్పంచి ప్రసాద్ భార్య పావని రూ.2లక్షలు వారికి ముట్టజెప్పింది. మరిన్ని పూజలు చేయాల్సి ఉందని, మరలా తిరిగి వస్తామని చెప్పి బంగారపు శ్రీ చక్రం ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం పావని స్వామీజీ ఇచ్చిన శ్రీచక్రంను బంగారు షాపులో చూపించగా శ్రీ చక్రం నకిలీదని తేలింది. దీంతో పావని శ్రీరామ శివచైతన్యం స్వామి, తేజస్వినిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తత్వ పీఠ చైతన్య మఠం శ్రీరామ శివ చైతన్యం స్వామీ ఇటీవల రాజమండ్రిలోని పావని బంధువుల వద్దకు వెళ్లి పూజలు చేస్తామని చెప్పి వారి నుంచి కూడా ఇలాగే దాదాపు రూ.50లక్షలు కాజేశాడని తెలిసింది. సర్పంచి బంధువులు ఈ విషయాన్ని గద్దే ప్రసాద్‌కు తెలియ జేశారు. కాగా, శ్రీ రామ శివచైతన్యం స్వామితో పాటు తేజస్విని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
పూజల పేరుతో అమాయక మహిళలను..
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని ప్రచారం చేసుకున్నాడు. తన మాటలు నమ్మి వచ్చిన ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షల్లో స్వాహా చేశాడు. ఈ క్రమంలో స్వామిజీని నమ్మి గద్దె పావని అనే మహిళ రూ. 2 లక్షల ను ముట్టుజెప్పింది. అయితే ఆయన అసలు రూపం గుర్తించిన సదరు మహిళ కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 30 లక్షల మేర వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ చేపడుతున్న పోలీసులు నకిలీ బాబాను అదుపులోకి తీసుకోనున్నారు. -
నకిలీ బాబా పట్టివేత
కరీంనగర్ క్రైం: ఉద్యోగాలు ఇప్పిస్తానని.. అనారోగ్య సమస్యలు పరిష్కరిస్తానని, ధనప్రాప్తి సిద్ధించేలా పూజలు నిర్వహించడంతో పాటు భూతాలను దిగ్బంధం చేసి సర్వ సమస్యలు తోలగిస్తానంటూ.. ఎనిమిదేళ్లుగా పూజల పేరిటా అమాయక ప్రజలను మోసం చేస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్న నకిలీ బాబాను టాస్క్ఫొర్స్ పోలీసులు అదివారం పట్టుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లికి చెందిన బండారి పొచమల్లు(47) ఎనిమిదేళ్లుగా తనకు మంత్రతంత్రాలు తెలుసునని ప్రచారం చేసుకున్నాడు. తన మాటలు నమ్మి వచ్చిన ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మొదట రూ. 50 నుంచి రూ.100 రూపాయలు తీసుకుని కొబ్బరికాయ ఇచ్చి ఇంటి ఎదురుగా కట్టుమని చెబుతాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోక మళ్లీ తన వద్దకు వచ్చే వారికి మరింత భయబ్రాంతులకు గురి చేసి ఇంటికి వచ్చి పూజలు చేయాలని చెప్పి వారి ఇంటికి వెళ్లి వివిధ రకాల పూజలు చేసి వారి నుంచి రూ.5 నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తాడు. ఇలా కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది అతడి వ్యవహారం. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ఫొర్స్ పోలీసులు ఆదివారం పూజలు చేస్తున్న అతడి ఇంటిపై దాడి చేని పొచమల్లును రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి నుంచి పూజలకు ఉపయోగించే డమరుకం, జాకేట్బట్టలు, కాళ్ల గజ్జెలు, ఈరగోల, ఊదుచిప్ప, ఇత్తడి తాంబూలంతో పాటు రూ.6720 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని రూరల్ పోలీసులకు అప్పగించగా.. వారు కేసు నమోదు చేశారు. నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దని అందుబాటులో ఉన్న శాస్త్రీయ విధానాన్ని ఆశ్రయించాలని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌పొర్స్ సీఐలు శ్రీనివాసరావు, మాధవి, ఎస్సైలు రమేశ్, వివేక్, సిబ్బంది పాల్గొన్నారు. -
అసలే దొంగ బాబా.. ఆపై హత్యాయత్నం
నెల్లూరు(వేదాయపాళెం): మంత్ర పీఠికల పేరిట భక్తులను మోసం చేసిన అనంతబొట్ల సుధాకర్‌రావు అలియాస్ సుధాకర్ మహరాజ్‌ను ఎట్టకేలకు నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి వివరాలను వెల్లడించారు. నగరంలోని మైపాడుగేట్ ప్రశాంతినగర్ వద్ద సుధాకర్ ఆశ్రమం ఉంది. ఇందులో 108 రోజుల పాటు యాగం నిర్వహించ తలపెట్టాడు. మంత్ర పీఠికలు కోసం భక్తుల నుంచి నగదు డిపాజిట్లు తీసుకున్నాడు. సుమారు రూ.10 కోట్ల వసూలు చేయగా అందులో కొంత మొత్తాన్ని పలువురికి డిపాజిట్ సొమ్ము కన్నా అదనంగా చెల్లించాడు. సుధాకర్‌కు ఆశ్రమంలోని నాగవాసవి, మరికొందరు సహకరించారు. సుధాకర్ మోసం బయటపడటంతో ఆశ్రమంలోనే పురుగు మందు తాగి హైడ్రామా ఆడి సింహపురి ఆస్పత్రిలో చేరాడు. బుధవారం ఆస్పత్రి నుంచి డిచార్జి అవుతున్న విషయం తెలుసుకుని నెల్లూరు రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. మోసానికి పాల్పడిన వ్యక్తుల నుంచి ఆస్తుల రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
పోలీసుల అదుపులో బురిడీ బాబా
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బురిడీ బాబా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నెల్లూరులోని సింహపురి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బురిడీ బాబా అలియాస్ సుధాకర్ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని, బాబా చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేస్తామని డీఎస్పీ రాఘవరెడ్డి అన్నారు. నగరంలోని కిసాన్‌నగర్‌లో నివాసముంటున్న సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108 రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితంగా ఇవ్వడం ఆపేశారు. తర్వాత పుస్తకానికి వెయ్యి రూపాయల ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి నాలుగు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు. ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ. కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
దీపం ఆరేలోపు అత్యాచారం
మధుర : క్షుద్ర పూజల పేరిట మహిళపై లైంగిక దాడికి పాల్పడిన దొంగ బాబాకు.. యూపీలో ఓ న్యాయస్థానం పాతికేళ్ల శిక్షను విధించింది. ఈ ఘటన మధురలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హత్రాస్‌కు చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. బృందావన్‌లోని ద్వారకాదాస్ ఆశ్రమానికి వెళితే ఫలితం ఉంటందని నమ్మి గత సంవత్సరం జూలైలో తన భర్తతో పాటు ఆశ్రమానికి వెళ్ళింది. ఇక (నీబు పూజ) క్షుద్రపూజల పేరిట ఆమె భర్తను దీపాన్ని ఇచ్చి.. అది ఆరిపోయేవరకు పైకి రాకూడదని హెచ్చరించాడు. ఆపై పైఅంతస్థులో ఉన్న గదిలోకి గృహిణిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది దుష్టశక్తులను తరిమికొట్టే ప్రయత్నంలో భాగమని. ఎవరికైనా విషయం చెబితే కుటుంబం మొత్తం సర్వనాశనమౌతుందని హెచ్చరించాడు. ఆపై మరికొన్ని రోజుల తర్వాత ఆమెను బెదిరించి మరోసారి లొంగదీసుకున్నాడు. దీంతో మహిళ భర్తకు అసలు విషయం చెప్పేసింది. ఘాపై ఆ దంపతులు మధుర పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టిన మధుర ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ద్వారకాదాస్‌కు 25ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.27వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని యెడల మరో 27 నెలలు అదనంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తేల్చేసింది. -
అసహజ శృంగారం : లిప్‌స్టిక్ బాబా అరెస్ట్
జైపూర్ : భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ బాబాను రాజస్థాన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అసహజ శృంగారం.. ఓ భక్తుడి ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలతో పింక్ బాబాపై కేసు నమోదయ్యింది. ఎట్టకేలకు బుధవారం జైపూర్‌లో ఫేక్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఝలవార్‌కు చెందిన 20 ఏళ్ల యువరాజ్ సింగ్ కుటుంబం కొన్నేళ్ల నుంచి కుల్దీప్ సింగ్ ఝాల కు భక్తులుగా ఉంటున్నారు. మహిళ వేషధారణతో కుల్దీప్.. ‘లిప్ స్టిక్ బాబా’గా ఫేమస్ అయ్యాడు. ఇక యువరాజ్ తరచూ ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఈ క్రమంలో బాబాతో లైంగిక కార్యకలాపాల్లో నెరపాలంటూ బాబా అనుచరులు యువరాజ్‌ను బలవంతం చేసేవారు. ప్రాణ భయంతో యువకుడు అందుకు అంగీకరించాడు. అయితే కొన్నాళ్ల క్రితం యువరాజ్‌కు ఇంట్లో వాళ్లు వివాహం నిశ్చయించారు. అది తెలిసిన లిప్‌స్టిక్ బాబా మరింత వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఫిబ్రవరిలో సూసైడ్ నోట్ రాసి యువరాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాని ఆధారంగా తల్లిదండ్రులు.. లిప్‌స్టిక్ బాబాపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో లైంగిక వేధింపులు నిజమని తేలటం.. పైగా యువరాజ్ వాట్సాప్‌కు కుల్దీప్ పంపిన అసభ్య సందేశాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. మరికొందరు భక్తులపై కూడా కుల్దీప్ గతంలో ఇదే తరహా వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఇంకా అజ్ఞాతంలోనే సూత్రధారి వాసవి
నాడు రెండు గదుల చిన్న ఇంటికి అద్దె చెల్లించటానికి తంటాలు పడ్డాడు. నేడు సినీ, రాజకీయ ప్రముఖులు అతని ఇంటి ముందు బారులు తీరారు. దీనిని గమనించిన అమాయక ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వెంటనే క్యాష్ కౌంటర్లు తెరుచుకున్నాయి. రోజుల వ్యవధిలో రూ.3.70 కోట్లు వసూలు చేశారు. చివరకు అంతా మాయ అని తేలటంతో బాబా ఆస్పత్రి బాట పట్టగా వసూలు చేసిన కీలక సూత్రధారి రాష్ట్రాలు దాటేసింది. చివరకు బాబును నమ్మి డబ్బులు కట్టిన జనం ఆయన ఇంటి ముందు న్యాయం చేయాలని రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. ఇది నెల్లూరు కిసాన్‌నగర్ సమీపంలోని ప్రశాంతినగర్‌లోని నయా బాబా సుధాకర్ మహరాజ్ మోసం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని కిసాన్‌నగర్‌లోని ప్రశాంతి నగర్లో ఉన్న సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితం ఆపేశారు. పుస్తకానికి రూ.వెయ్యి ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి మూడు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు. ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ.కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతసేపు హైడ్రామా నడుమ బాబాను అతని అనుచరులు సింహపురి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. రాజకీయ అండతో బాబాగా.. 15 ఏళ్ల క్రితం ముదివర్తిపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరిన సుధాకర్ ఇంటి అద్దె చెల్లించటానికి నానా ఇబ్బందులు పడేవాడు. అక్కడ బాకీలు పడి ప్రశాంతినగర్‌కు మకాం మార్చారు. నగరంలో ఒక ప్రముఖ సినీ థియేటర్ యజమానితో స్నేహంతో అక్కడ 20 అంకణాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించాడు. కాలక్రమంలో ఇంటిపై రెండు ఫ్లోర్లు నిర్మించాడు. అంతా సాయి కృప అని చెప్పుకుంటూ ఇంటి సమీపంలోని స్థలాల్లో తరచూ హోమాలు నిర్వహిస్తుండేవాడు. టీడీపీ నేతలు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు సుధాకర్‌కు భక్తులుగా మారిపోయారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలోకి ఇతని పరిచయాలు విస్తరించారు. దీంతో ఇద్దరు పాత తరం హీరోలు, ప్రొడ్యూసర్లు, సంగీత దర్శకులు బాబా వద్దకు క్యూకట్టారు. అలాగే చెన్నై, హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో హోమాలు నిర్వహించి అక్కడ సర్కిల్‌ను పెంచుకున్నాడు. చివరకు 108 రోజుల మహాయాగం పేరుతో వసూళ్లకు పాల్పడటం, వసూలు చేసిన నగదుతో సూత్రధారిగా ఉన్న వాసవి పరారు కావటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 270 దాటిన ఫిర్యాదులు సుధాకర్బాబాపై నమ్మకంతో భక్తులు తమ ఇళ్లలోని బంగారం, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ ఆశ్రమంలో నగదు చెల్లించారు. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఇప్పటి వరకు 270 మంది నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.3.70 కోట్లు వసూలైనట్లు నిర్ధారించారు. వాసవి కోసం సీరియస్‌గా నగదుతో పరారైన వాసవి విషయాన్ని తొలుత పోలీసులు సీరియస్‌గా తీసుకునున్నారు. అయితే వారం దాటినా కనీస పురోగతి లేదు. సుధాకర్ హాస్పిటల్లో ఉండటం, వాసవి పరారీలో ఉండటంతో న్యాయం చేయాలని బాబా భక్తులు ఆయన ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి గురువారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. వాసవిది ఒంగోలు నగరంలోని మిర్యాలపాళెంలో నివసిస్తోంది. ఆమె ఇద్దరు వ్యక్తులను పెళ్లిచేసుకుని ప్రస్తుతం వేరుగా ఉంటోంది. ఒంగోలులోని ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వాసవి రూ.కోట్ల సంచులను విజయవాడలోని ఓ రైల్వే అధికారికి, తన కుటుంబ సభ్యులు, సహజీవనం చేసే వ్యక్తికి అందజేసిందని భక్తులు భావిస్తున్నారు. కాగా వాసవికి ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి సహకారం అందించినట్లు సమాచారం. -
కోట్లు వసూలు చేసిన కిలేడి..
నెల్లూరు సిటీ: భక్తి ముసుగులో మోసానికి పాల్పడిన కిలాడి లేడీ మెతుకు వెంకట నాగవాసవిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నగరంలోని ప్రశాంతినగర్‌లో గురుదత్తాత్రేయ ఆశ్రమాన్ని అడ్డాగా చేసుకొని భక్తుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మహిళ పరారైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఒంగోలు నగరంలోని మిర్యాలపాళేనికి చెందిన మెతుకు వెంకటనాగవాసవికి తొమ్మిదేళ్ల క్రితం సునీల్ అనే వ్యక్తితో వివాహమైంది. విభేదాలతో దంపతులిద్దరూ విడిపోయారు. అనంతరం ఆంజనేయులును రెండో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయనకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ని ట్రంక్‌రోడ్డులో ఓ ఫర్నిచర్ దు కాణాన్ని నిర్వహిస్తున్న బాషా అలియాస్ మస్తాన్‌తో స్నేహం చేస్తోంది. మహామంత్రయా గం పేరు తో నెల్లూరులోని ప్రశాంతినగర్‌లో కొన్ని వారాలుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భక్తులను ముగ్గులోకి దించుతూ వాసవి రూ. కోట్ల మేర వసూలు చేసింది. ఇలా దాదాపు రూ.నాలుగు కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా నగదు బదిలీ వాసవి పక్కా స్కెచ్‌తో గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లను కుటుంబసభ్యులకు చేరవేసిందనే ఆరోపణలు ఉన్నా యి. దాదాపు రూ.రెండు కోట్ల నగదుతో కూడిన సంచులను కుటుం బసభ్యులకు అందజేసినట్లు తెలు స్తోంది. ఒంగోలులోని తన స్నేహితుడు బాషా అలియాస్ మస్తాన్, సోదరుడు మెతు కు రాజా, విజయవాడలో మామయ్య అయిన రైల్వే ఉద్యోగి వెంకటసురేష్‌బాబుకు సంచుల నిండా నగదును భారీగా అందజేసినట్లు సమాచారం. పరారీలో కిలాడి లేడీ వాసవి ముందస్తు ప్రణాళికలో భాగంగా తన ఆరేళ్ల చిన్నారితో కలిసి పరారైంది. ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వాసవికి సుధాకర్‌బాబాతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రణాళికలో భాగంగా జరిగిందా.. లేక వాసవి నమ్మించి మోసానికి పాల్పడిందా అనే విషయం తెలియాల్సి ఉంది. -
కరీంనగర్లో దొంగ బాబా అరెస్ట్
-
ఈ బాబా కేన్సర్ కూడా నయం చేస్తాడు..
రాంగోపాల్‌పేట్: బంగారం, నగదు పెట్టి పూజలు చేస్తే రోగాలు మాయమవుతాయని నమ్మిస్తూ పెద్ద మొత్తంలో వాటిని కాజేసిన ఓ దొంగబాబాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1.372 కేజీల బంగారం, రూ.3.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్ టాస్క్‌పోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాధాకిశన్రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లులు వివరాలు వెల్లడించారు. టోలీచౌకికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ (34) అలియాస్ అబ్బా జాన్ అక్కడే ఉంటే అటో డ్రైవర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసే వాడు. అందులో పెద్దగా ఆదాయం రాకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని బాబా అవతారం ఎత్తాడు. మానసిక సమస్యలు... శారీరక రోగాలు మాయం చేస్తానని సయ్యద్ ఇస్మాయిల్ నెల్లూరులోని బారా షాయిద్ దర్గా, రహ్మతాబాద్ దర్గాలకు వెళ్లి ఖురాన్‌లోని దుహాస్ అభ్యసించాడు. అక్కడ ఉండే సమయంలో కొంత మంది ఇతని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయించుకునే వారు దీంతో వాళ్లు తమకు మేలు జరిగిందని భావించే వాళ్లు. దీన్నే ఉపాధిగా మలచుకుని అమాయకులను మోసాలు చేయాలని భావించి హైదరాబాద్‌కు వచ్చి టోలీచౌకిలోని హెకెమ్పేట్ కుంటలో మకాం పెట్టాడు. వివిధ రోగా లతో, మానసిక జబ్బులతో బాధపడే వారికి తనకు ఉన్న అతీత శక్తులతో మాయం చేస్తానని ప్రచారం చేసుకున్నారు. ఇలా సంవత్సర కాలంగా ఆ ప్రాం తంలో బాగా ప్రాచుర్యం పొందాడు. ఇలా వచ్చిన వారిలో బాగా డబ్బున్న వారు వస్తే వారి వద్ద ఉన్న నగలు, నగదును ఒక కుండలో పెట్టి, దర్గా ఫొటోల వద్ద వాటిని ఉంచి 40 రోజులు పూజలు చేయాలని చెప్పేవాడు. దీన్ని నమ్మి వారు తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని, నగదు తెచ్చి ఇతనికి ఇస్తే వారి ముందు ఒక చిన్న కుండలో పెట్టి మూతపెట్టి పూజలు చేసేవాడు. ఇలా 40 రోజులు అయిన తర్వాత కూడా తమ జబ్బు నయం కాలేదని ఎవరైనా వస్తే మరో రెండు నెలలు, మూడు నెలలు ఉంచాలని నమ్మించే వాడు. ఇలా పెద్ద మొత్తంలో నగదు, బంగారం కొల్లగొట్టాడు. కేన్సర్ కూడా నయం సయ్యద ఇస్మాయిల్ సాదారణ జబ్బులతో పాటు కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తానని నమ్మించాడు. దీంతో 2016 ఏప్రిల్‌లో అదే ప్రాంతానికి చెందిన రజియా బేగం (67) లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఇతన్ని సంప్రదించింది. ఇంట్లో ఉన్న బంగారం, నగదు తెచ్చి పూజలు చేయాలని చెప్పడంతో ఆమె 14 తులాల బంగారం తెచ్చి ఇచ్చింది. రెండు నెలల తర్వాత వచ్చి చూడగా ఈ బాబా అక్కడి నుంచి మకాం మార్చేశాడు. ♦ అదే సంవత్సరం జూన్ నెలలో కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతీక్ ఉన్నిసా (40) ఇతన్ని నమ్మి 39 తులాల బంగారం ఆభరణాలు పూజ చేసేందుకు అని ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ నెలలో వచ్చి బాబా అక్కడ లేడని తెలుసుకుంది. ♦ 2016 జూన్ నెలలో ఫాతిమ హసన్ అనే మహిళ మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ వాటిని తగ్గించుకునేందుకు బాబాకు 40 తులాల బంగారంతో పాటు నగదును సమర్పించుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు టోలిచౌకి ప్రాంతంలో ఉండగా శనివారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. తదుపరి విచారణ కోసం నిందితున్న బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ♦ మణప్పురంలో తాకట్టు ఇలా మోసం చేసి సంపాదించిన బంగారాన్ని నిందితుడు టోలిచౌకి, చింతల్, వికారాబాద్‌లలోని మణప్పురం గోల్డ్‌లోన్ వద్ద తాకట్టు పెట్టి న గదును తెచ్చుకున్నాడు. పోలీసులు 1కేజీ 372 గ్రాముల బంగారాన్ని నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అతీత శక్తుల పేరుతో నకిలీ బాబా మోసం
-
సికింద్రాబాద్‌లో నకిలీ బాబా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నకిలీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న బంగారానికి పూజలు చేస్తే రోగాలు నయమవుతాయంటూ పలువురి బంగారాన్ని కాజేసినట్టు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీబాబాపై నిఘా పెట్టిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కిలోన్నర బంగారం, రూ. 3 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబాగా చెలామణి అవుతున్న నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఇస్మాయిల్‌గా గుర్తించారు. -
షాక్.. వెలుగులోకి మరో డేరా బాబా
-
షాక్.. వెలుగులోకి మరో డేరా బాబా
సాక్షి, న్యూఢిల్లీ : మరో ఫేక్ బాబా గుట్టు రట్టయ్యింది. దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్‌కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున్న సెక్స్ రాకెట్ నడుపుతున్నాడంటూ దీక్షిత్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన అమ్మాయిలకు విముక్తి కలిపించారు. వీరేంద్రను తక్షణమే అరెస్ట్ చేయాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ డిమాండ్ చేస్తున్నారు. తనపై బాబా వీరేంద్ర లైంగికదాడికి పాల్పడినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 100 మందికి పైగా మహిళలు ఆశ్రమంలో బందీలుగా ఉన్నారని.. వారిని జంతువుల్లా హింసిస్తున్నారని అడ్వొకేట్ నందిత రావ్ కోర్టుకు వివరించారు. పెద్ద ఎత్తున్న అమ్మాయిలతో ఆశ్రమంలోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆమె వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సీబీఐకి సోదాలు నిర్వహించాల్సిందిగా బుధవారం ఆదేశించింది. దశాబ్దం పైగానే... ఆధ్యాత్మిక విశ్వవిద్యాయంలో కొందరు మహిళలను, బాలికలను 14 సంవత్సరాలుగా బందీలుగా ఉంచారని ఓ ఎన్జీవో హైకోర్టుకు జారీ చేసిన పిటిషన్లో పేర్కొంది. తాను ఆశ్రమం నుంచి తప్పించినట్లుగా పేర్కొన్న ఓ యువతిని ఈ సంస్థ కోర్టులో హాజరుపరిచింది. డ్రగ్స్ ఇచ్చి తనకు బ్రెయిన్ వాష్ చేసి ఆశ్రమంలో బంధీగా ఉంచినట్లు ఆ యువతి కోర్టుకు తెలిపింది. యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదని ఎన్జీవో తెలిపింది. ఆశ్రమంలో పలువురు మహిళలు గతంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కానీ పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఎన్జీవో ఆరోపించింది. న్యాయస్థానం ఆదేశం మేరకు ఢిల్లీ పోలీసులు, బుధవారం ఆశ్రమంపై దాడి నిర్వహించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, న్యాయవాదుల బందం కూడా ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడున్న మహిళలను కలవడానికి తమకు రెండు గంటలు పట్టిందని స్వాతిమలివాల్ చెప్పారు. 150 మందికిపైగా బందీలు.. ఆశ్రమంలో సొరంగం కూడా ఉన్నట్లు పోలీసుల దాడిలో బయటపడింది. సొరంగాన్ని నీటిని నింపారని, అది కూడా ఆదరా బాదరాగా ఇటీవలే నింపారని పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో 150 మందికి పైగా మహిళలు, బాలికలను బందీలుగా ఉంచినట్లు దర్యాప్తు బందం కోర్టుకు తెలిపింది. వారిని ఇనుప సంకెళ్లతో బంధించి ఉంచారని, వారిని నిరంతరం హింసిస్తూ.. లైంగిక బానిసలుగా చూసేవారని దర్యాప్తు బందం తెలిపింది. స్నానం చేయడానికి, పడుకోవడానికి కూడా మహిళలకు ప్రైవసీ లేదని దర్యాప్తు బందం తెలిపింది. ఆశ్రమం నుంచి ఎవరూ పారిపోకుండా ఉండడం కోసం నాలుగు దిక్కులా ఎత్తయిన గోడలు నిర్మించి ముళ్లకంచెలు, లోహపు తలుపులు అమర్చారని వారు తెలిపారు. ఆశ్రమంలో దేహ వ్యాపారం జరుగుతోందని స్థానికులు దర్యాప్తు బందానికి తెలిపారు. రాత్రి పూట ఆశ్రమం గేటు ఎదుట లగ్జరీ కార్లు నిలబడి ఉంటాయని వారు చెప్పారు. దర్యాప్తు విషయం తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు తమను కూతుళ్లను కలవనిచ్చేవారు కాదని, వారిని బందీలుగా ఉంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. -
మరో నకిలీ బాబా ఆటకట్టు
-
మరో నకిలీ బాబా వ్యవహారం గుట్టురట్టు..
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): ఇటివల కాలంలో దేశంలో దొంగ బాబాల అరెస్టులు సంచలనం సృష్టించాయి. తనకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని చెప్పుకొంటున్న దొంగబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని సనత్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. నగరంలో ఓ దొంగ బాబా ఏ సమస్యనైనా పరిష్కరిస్తానని చెబుతూ అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న దొంగ బాబాను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ రాష్ట్రం ముస్తఫాబాద్‌కు చెందిన శంషద్ మాలిక్(40) మరో ముగ్గురు స్నేహితులు షాజద్ మాలిక్, అసిఫ్, ఫిరోజ్ మాలిక్‌లతో కలిసి నకిలీ బాబా అవతారమెత్తాడు. అమాయకులను కలిసి తమకు దైవ శక్తులు ఉన్నాయని, వారం రోజుల్లో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తామని నమ్మబలికారు. వారు నమ్మే విధంగా కళ్ల ముందు ఏదో మ్యాజిక్ చేస్తుంటారు. దీనిని నమ్మిన అమాయక ప్రజల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారవుతుంటారు. గతంలో ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్న శంషద్ మాలిక్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
భవిష్యవాణి పేరుతో బురిడీ
హైదరాబాద్, నాగోలు : భవిష్య వాణి, పూజలు, హోమాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న నకిలీ స్వామీజీని రాచకొండ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రూ. 5 లక్షల నగదు, ఇన్నోవా కారు, 5 కేజీల వెండి, నకిలీ పిస్టల్, నకిలీ సీబీఐ ఐడీ కార్డును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. బుధవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా, గుడిమెల్లాకు చెందిన వెంకటా లక్ష్మినర్సింహాచారి, అలియాస్ చారి, అలియాస్ విష్ణు ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. జ్యోతిషం నేర్చుకున్న అతను ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి బాలాపూర్‌లోని అయోధ్యనగర్‌లో ఉంటూ మీర్పేట్ పరిధిలో గాయత్రినగర్ చౌరస్తాలో భవిష్య వాణి కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. భవిష్య వాణి చెబుతానంటూ పలు టీవీ చానళ్ళలో చర్చా వేదికలు నిర్వహించేవాడు, కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానని తన ఫోన్ నెంబర్ ఇచ్చి కార్యాలయానికి వచ్చి సంప్రదించమని చెప్పేవాడు. అతని మాటలు నమ్మిన పలువురు అతడిని సంప్రదించేవారు. భార్యాభర్తల మధ్య గొడవలను ఆసరాగా చేసుకుని మహిళలకు మాయమాటలు చెప్పి వారిని శారీరకంగా వేధించేవాడు. వారి బలహీనత ఆధారంగా రూ.లక్షల్లో వసూలు చేసేవాడు. ఈ నేపథ్యంలో వనస్థలిపురం పరిధిలో భార్యాభర్తలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చారిని సంప్రదించారు. పూజలు చేసి వారికి బాగు చేస్తానని నమ్మించి రూ.లక్ష నగదు, 1.25 కేజీల వెండి తీసుకున్నాడు. సమస్య పరిష్కారం కానందున తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా, అతను స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో తప్పిపోయిన యువతి ఆచూకీ తెలిపేందుకు రూ. మూడు లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మీర్పేట్ పరిధిలోనూ బాధితుల నుంచి రూ. 1,70 లక్షల నగదు, 1.5 కేజీల వెండి ఆభరణాలు తీసుకున్నాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ.. నర్సింహాచారి స్వామీజీగా (బాబా) చెప్పుకుంటూ గాయత్రినగర్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరులలో తన భవిష్యవాణి కార్యాలలయాలను ఏర్పాటుచేశాడు. పలు టీవీ ఛానెళ్ళలో భవిష్య వాణి కార్యక్రమం నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ ఇచ్చేవాడు. ఇలా రెండు రాష్ట్రాలల్లో దాదాపు వంద మందికి పైగా మోసం చేశాడు. ఎవరైనా డబ్బులు తిరిగి అడిగితే సీబీఐ నకిలీ ఐడీ కార్డును తయారుచేసుకుని, డమ్మీ పిస్టల్‌తో వారిని బెదిరించేవాడు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి డమ్మీ పిస్టల్, పూజ సామాగ్రి, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, రెండు తులాల బంగారం, ఐదు కేజీల వెండి,, రూ.5 లక్షల నగదు, ఒక కారు, నకిలీ సీబీఐ ఐడీ కార్డు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఇన్చార్జ ఏసీపీ మల్లారెడ్డి, ఎస్ఓటీ సీఐలు వెంకటేశ్వరరావు, నవీన్‌కుమార్, వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ మహేష్, ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులు పాల్గొన్నారు. -
భవిష్యవాణి పేరుతో దొంగబాబా బురిడీ
-
హైదరాబాద్‌లో రంగురాళ్ల బాబా అరెస్ట్
-
మాయ మాటలతో మోసం
బాన్సువాడ టౌన్(బాన్సువాడ) : కూతురి ఆరోగ్యాన్ని బాగు చేస్తామని నమ్మించి ఆభరణాలతో పరారైన ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు, ఇద్దరు కాదు.. చాలా మందికి టోకరా వేసినట్లు వెలుగులోకి వచ్చింది. మోసానికి పాల్పడింది ఒక్కరు కాదు.. ఓ ముఠా అని తేలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనను ‘సాక్షి’ గురువారం ప్రచురించిన విషయం విదితమే. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. దొంగ బాబాల చేతిలో తాము కూడా మోసపోయామని ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. ‘సాక్షి’ ప్రతిని«ధులతో బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 17న గ్రామంలో యాపకల్లు, తేనె అమ్మేందుకు వచ్చిన ఓ మహిళ ఇంటింటికీ తిరుగుతూ, ఏయే ఇంట్లో ఏయే సమస్యలున్నాయో అడిగి తెలుసుకుంది. తనకు తెలిసిన స్వామీజీ ఉన్నారని, ఆయన ఎన్నో రోగాలను నయం చేస్తాడని, తన బంధువుకు కూడా నయం చేశాడని స్థానికులను నమ్మబలికింది. ఆయనకు చెబితే ఏ సమస్య అయినా రెండు, మూడ్రోజుల్లో పరిష్కారమవుతుందని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాతి రోజే, అల్లం మురబ్బా విక్రయించేందుకు గ్రామంలోకి వచ్చిన దొంగ బాబాను స్థానికులు పిలిచి ఒక్కొక్కరుగా తమ సమస్యలు వివరించారు. సదరు బాబా ఒక ఫోన్ కాల్ చేయగా, పది నిమిషాల వ్యవధిలోనే రెండు సుమోల్లో మరో 8 మంది దొంగబాబాలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారికి పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు, తల పాగాలు పెట్టుకొని నగ్నంగా వచ్చిన దుండగులు.. బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వారి చేతిలో రాయి పెట్టి మంత్రం వేస్తున్నట్లు నటించి రుద్రాక్షలు, తాయత్తులు, శివలింగాలు ప్రత్యక్షం చేయడంతో గ్రామస్తులు వారిని నమ్మారు. దొంగ బాబాలు అడిగిన మేర డబ్బులు సమర్పించుకున్నారు. ఇలా 15 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారు రూ.3 వేల వరకు వసూలు చేసి, అక్కడి నుంచి ఉడాయించారు. అయితే, ఈ వ్యవహారం బయటకు రాలేదు. అయితే, రెండున్నర తులాల బంగారం, నగదు కోల్పోయిన ఓ కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నాకు రుద్రాక్ష ప్రత్యక్షమైంది ఈనెల 18న మా ఊరికి కొందరు స్వాములు నగ్నంగా వచ్చారు. నా చేయిలో రాయి పెట్టి ఏమేమో చేశారు. వెంటనే నా చేయిలో రుద్రాక్ష ప్రత్యక్షమైంది. దాన్ని మెడలో వేసుకోమన్నారు. వేసుకున్నా. ఇప్పటికీ రుద్రాక్ష నా మెడలోనే ఉంది. వారి మోసాలను ఊరిలోని వాళ్లందరం కూడా గమనించలేకపోయాం. – పండరిగౌడ్, బాధితుడు ఊర్లో నగ్నంగా తిరిగారు మూడు, నాలుగు రోజుల కింద చాలా మంది స్వాములు వచ్చారు. వారికి పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు ఉన్నాయి. శరీరంపై ఎలాంటి దుస్తులు లేవు. వారిని చూస్తే నిజంగా స్వాముల వలే ఉన్నారు. అయితే చాలా మంది వద్ద డబ్బులు, బంగారం ఎత్తుకెళ్లారని తెలిసింది. ఇలాంటివారిపై అధికారులు నిఘా ఉంచాలి. – సురేందర్‌గౌడ్, బుడ్మి -
నకిలీ బాబాల్లో నిత్యానంద ఎందుకు లేడు?
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారత అఖార పరిషద్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో స్వామి నిత్యానంద పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాబాల్లో ఒకడైన నిత్యానందపై 2009లో కర్ణాటకలో రేప్ కేసు దాఖలైంది. ఆయన స్థాపించిన ఫౌండేషన్‌పై ఏడు అవినీతి కేసులు ఉన్నాయి. అమెరికా నుంచి కూడా ఆయనకు అక్రమంగా నిధులందాయన్న ఆరోపణలూ ఉన్నాయి. నకిలీ బాబాల జాబితాలో నిత్యానంద పేరును కూడా చేర్చాలని జునా అఖారాకు చెందిన హరిగిరి ప్రతిపాదించినప్పటికీ మహానిర్వాణి అఖారాలు తీవ్రంగా అభ్యంతరం పెట్టడంతో ఆయన పేరు జాబితాలో చేరలేదని నిర్వాణి అఖారాకు చెందిన చీఫ్ ధరమ్ దాస్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 అఖారాలు ఆదివారం నాడు అలహాబాద్‌లో సమావేశమై నకిలీ బాబాల జాబితాను తయారు చేశారు. నకిలీ బాబాల కారణంగా అసలైన బాబాల ప్రతిష్ట కూడా దిగజారిపోతోందని, అందుకనే నకిలీ బాబాల జాబితాను విడుదలచేసి వారికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఈ 13 అఖారాల్లో ఏడు శైవ తెగకు చెందిన అఖారాలుకాగా మూడు వైష్ణవ తెగకు, మూడు సిక్కు తెగకు చెందిన అఖారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏర్పాటయినదే అఖిల భారత అఖార పరిషద్. 2013, అలహాబాద్ కుంభమేళాలో నిత్యానంద్‌కు మహామండలేశ్వర్, మహానిర్వాణి అఖారాకు చెందిన ప్రధాన పూజారి పట్టాభిషేకం చేసినందున ఆయన పేరును నకిలీ బాబాల జాబితాలో చేర్చేందుకు మహానిర్వాణి అఖారాలు నిరాకరించారు. నకిలీ బాబాల జాబితాలో గుర్మీత్ సింగ్ సహా ఆరెస్సెస్ సభ్యుడు అసీమానంద్ లేదా ఆశారామ్, ఆయన కుమారుడు నారాయణ్ సాయి, రాధేమా, సచ్దానంద్ గిరి, నిర్మల్ బాబాల పేర్లు చోటుచేసుకున్నాయి. సమాజం నుంచి నకిలీ బాబాలను నిర్మూలించడం పట్ల మహానిర్వాణి అఖారాలకు చిత్తశుద్ధి లేదని, దిగంబర అఖారాకు చెందిన బాబా హఠ్ యోగి విమర్శించారు. అఖారాల్లో చాలా మంది పేరుకే సాధువులని, వారు డబ్బులు తీసుకొని కావాల్సిన బిరుదులు ఇస్తుంటారని నిర్వాణి అఖారాకు చెందిన సత్యేంద్ర దాస్ ఆరోపించారు. నకిలీ బాబాల జాబితా నుంచి నిత్యానందను తప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన అఖిల భారత ఆఖార పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరిపైనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రియల్టర్ వ్యాపారం చేసే ఆయనకు ఓ బారు కూడా ఉందన్నది అందులో ఓ ఆరోపణ. -
వారికి ఫిదా అవుతున్న ప్రజలు..!
► అమాయక ప్రజలే టార్గెట్ ► పూజలు చేçస్తూ పట్టుబడ్డ వైనం ► 56 విగ్రహాలు స్వాధీనం ► నకిలీ బాబాలను పట్టుకుంటాం: సీపీ కమలాసన్‌రెడ్డి కరీంనగర్: 18 ఏళ్లుగా ఓ నకిలీ బాబా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు. వాస్తు, గుప్తనిధులు, సంతానం కల్గించడం, ఉద్యోగ, వివాహ ప్రాప్తి, పంటల దిగుబడి ఎక్కువగా తెప్పించడం, అప్పులు రాబట్టడానికి పూజలు చేస్తానని నమ్మించేవాడు. ఇలా మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన నకిలీ స్వామిని టాస్క్‌ఫోర్స్, కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్ క్వార్టర్లో గురువారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నేరం చేసే విధానం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూర్ జిల్లాకేంద్రానికి చెందిన పిడదల వెంటకస్వామి(60) 23 ఏళ్ల క్రితం తమిళనాడులో వాస్తు, దోషనివారణ, బోరు వేయడానికి పూజలు చేయడం నేర్చుకున్నాడు. అక్కడినుంచి 18 ఏళ్ల క్రితం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి అమాయక ప్రజలను వివిధ రుగ్మతల నివారణ పేరిట పూజలు చేస్తానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఇదేం మోసం ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అమాయక ప్రజలు. నకిలీ బాబాల లీలలకు ఫిదా అవుతూ ఇల్లు గుల్లా చేసుకుంటున్నారు. ఈ నకిలీ బాబాలు అందినకాడికి డబ్బులు దండుకుంటూ కనిపించకుండా పోతున్నారు. పాపం.. ఈ బాబాలను నమ్మినవారు చివరికి బాధితులుగా మారిపోతున్నారు. పట్టుబడిన తీరు గంగాధర మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జిట్టవేని శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబసభ్యులకు ఆరోగ్యం బాగా లేదని, తండ్రి మద్యం మానడం లేదని ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సమయంలో నకిలీ బాబాను ఆశ్రయించాడు. వెంకటస్వామి పలు పూజలు చేయాలని నమ్మించి అతడి వద్ద నుంచి రూ.30వేలు వసూలు చేశాడు. వారి పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో బాధితుడు కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ బృందం, కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. పూజలు చేస్తుండగా పట్టుకున్నారు. అరెస్టు చేసి 56 ప్రతిమలు, ఉంగరాలు, తాయత్తులు, చెట్టు వేర్లు. ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. వెంకటస్వామిపై పీడీ యాక్ట్ అమలు చేయనున్నాం. ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేస్తాం. బాబాల పేరుతో మోసం చేస్తున్నారనే సమాచారముంది. త్వరలో వారిపై దాడులు చేస్తాం. – సీపీ కమలాసన్‌రెడ్డి -
కరీంనగర్లో నకిలీ బాబా అరెస్ట్
కరీంనగర్: పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాస్తు పేరుతో ప్రత్యేక పూజలు చేయించి డబ్బులు దండుకుంటున్న నకిలీ బాబాను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటస్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాబా అవతారమెత్తి అమాయక ప్రజలను దోచుకుంటున్నాడు. వ్యవసాయ భూములను పరిశీలించి అందులో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ప్రత్యేక పూజల పేరుతో లక్షల్లో డబ్బు దండుకొని చివరకు తన తీసుకొచ్చిన ఇత్తడి విగ్రహాలను భూ యజమానికి తెలియకుండా ఏదో ఓ ప్రాంతంలో పాతి పెట్టి అక్కడ తవ్వకాలు జరిపిస్తున్నాడు. అనంతరం వీటిని ప్రత్యేక మూలికలతో శుద్ధి చేయాలి.. దానికి చాలా ఖర్చు అవుతుందని నమ్మిచి వారి వద్ద నుంచి దండిగా డబ్బు లాగి మోసం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఈ రోజు నకిలీ బాబాను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఇత్తడి ప్రతిమలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో నకిలీబాబా అరెస్ట్
-
దోష పరిహారమని అత్యాచారం..
► బెంగళూరులో ఘరానా జ్యోతిష్యుని అరెస్టు బెంగళూరు: కుమారుని మూర్చరోగం నయం చేస్తానని నమ్మించి తల్లిపై అత్యాచారానికి పాల్పడి, భారీగా డబ్బు, బంగారం కాజేసిన కామాంధ జ్యోతిష్యుణ్ని బెంగళూరు విజయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు విజయనగరలోని ఆర్పీసీ లేఔట్ కు చెందిన 35 ఏళ్ల మహిళకు 10 నెలల కొడుకు ఉన్నాడు. చిన్నారికి మూర్ఛ లక్షణాలు కనిపించేవి. కనకపురకు చెందిన జ్యోతిష్యుడు ప్రసన్నకుమార్ అలియాస్ కార్తీక్ విజయనగరలో ఓ గదిని అద్దెకు తీసుకుని జ్యోతిష్యం చెబుతుండేవాడు. బాధితురాలు చిన్నారిని చూపిద్దామని జ్యోతిష్యున్ని కలిసింది. జ్యోతిష్యుడు మహిళకు శారీరక లోపం ఉందని నమ్మించి ఆమె నగ్న ఫోటోలను తీశాడు. తనతో గడిపితే దోషం పోతుందని నమ్మించి ఆమెపై ఏడుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బంగారం, నగదు దానం చేస్తే కుమారుడి జబ్బు నయమవుతుందని ఆమె నుంచి రెండు బంగారునెక్లెస్లు, రెండు చైన్లు, ఆరు చెవికమ్మలు, మూడు చేతి ఉంగరాలు లాక్కున్నాడు. వీటితో పాటు రూ.20 లక్షల 70 వేల నగదు కూడా తీసుకున్నాడు. తరువాత అడ్రస్ లేకుండాపోయాడు. బాధితురాలు మోసపోయానని గ్రహించి వారం క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి సోమవారం నిందితుణ్ని అరెస్టు చేశారు. ఇతడిపై అత్యాచారం, వంచన, దోపిడీ కేసులు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. -
మాటలతో దోచేశాడు
-
పోలీసుల అదుపులో నకిలీ బాబా
హైదరాబాద్: ఓ నకిలీ బాబాను ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వై.వి.శాస్త్రి అనే వ్యక్తి సంతానం లేని వారికి పూజలు చేసి సంతానం కలిగిస్తామని, హోమాలు, పూజలతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి లక్షలలో డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఇతనిపై గతంలో వనస్థలిపురం, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి రూ.లక్షా 6 వేల నగదు, 5 సెల్ఫోన్లు, ,2 టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసుల అదుపులో నకిలీ బాబా
-
ఇల్లాలికి టోకరా ఇచ్చిన దొంగ స్వామి
-
రాజమండ్రిలో దొంగ బాబ
-
డిస్కో బాబా స్టెప్పులకు పోలీసులే స్టన్!
-
డిస్కో బాబా స్టెప్పులకు పోలీసులే స్టన్!
ఆయన ఘరానా బాబా.. ఇత్తడి బిస్కెట్లు, ఆర్టిఫిషియల్ రాళ్లను బంగారం బిస్కెట్లు, వజ్రాలు చేస్తానని నమ్మించి ప్రజలను బురిడీ చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ బాబా వద్ద ఓ స్పెషాలిటీ కూడా ఉంది. అదేమిటంటే.. చెమ్కీలతో మెరిసిపోయే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకున్నాడంటే.. అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటాడు. 'ఐయామ్ ఏ డిస్కో' డ్యాన్స్ అంటూ దుమ్ములేపుతాడు. తాజాగా ఆ బాబా తన డ్యాన్స్ టాలెంట్ ను పోలీసులకు చూపించాడు. ఆయన స్టెప్పులను స్వయంగా చూసిన పోలీసులు, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ విస్తుపోయారు. దెయ్యాలు, భూతాల పేరుతో అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్న 16 మంది మంత్రగాళ్లను హైదరాబాద్‌లోని దక్షిణ మండలం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఈ డిస్కో బాబా ఒకరు. టప్పా చబుత్రాకు చెందిన యునాని వైద్యుడు అన్వరుల్లాఖాన్.. డిస్కో బాబా పేరిట పాతబస్తీలో మోసాలకు పాల్పడుతున్నాడు. తన వద్ద ఉన్న ఇత్తడి బిస్కెట్లు, ఆర్టిఫిషియల్ రాళ్లను బంగారం బిస్కెట్లు, వజ్రాలు అంటూ నమ్మించి మోసం చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. రియాసత్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఇఫే్తకార్ హుస్సేన్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధులు తీస్తానంటూ నమ్మించి రూ.38 లక్షలు వసూలు చేశాడు. ఇతనిపై నగరంలోని ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, కుల్సుంపురా, షాయినాయత్ గంజ్ తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
పాతబస్తీలో దొంగ బాబాల హల్చల్
-
నగరంలో 16 మంది మంత్రగాళ్ల అరెస్టు
చాంద్రాయణగుట్ట:దెయ్యాలు, భూతాల పేరుతో అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్న 16 మంది మంత్రగాళ్లను దక్షిణ మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని మంత్రతంత్రాలు చేస్తున్న అడ్డాలపై పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో 13 మంది పాత మంత్రగాళ్లు ఉండగా.. ముగ్గురు కరడుగట్టిన మంత్రగాళ్లు ఉన్నారు. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిస్కో బాబా, కంచన్ బాగ్ పరిధిలోని ఫయాజ్ మహ్మద్ అన్సారీ, ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో బండి రామకృష్ణ, డి.యాదయ్య, మహ్మద్ రసూల్‌ఖాన్, నితిన్, షేక్ ఇక్రముద్దీన్, భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సయ్యద్ అన్వర్(42), షాకీర్ అలీ(50), అబ్దుల్ మాజీద్, సమహా మసూర్ అలియాస్ చుమ్మా చావూస్, మొఘల్‌పురాకు చెందిన బల్వీర్ సింగ్(75), ముఖేష్‌కుమార్(33), సంజయ్ కుమార్(33), ఎం.ఎ.రహీం(45), ఖైసర్(22)లను అరెస్ట్ చేశారు. కాగా ఇందులో కరడుగట్టిన ముగ్గురు మంత్రగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు నగర పోలీస్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామని ఈ సందర్భంగా డీసీపీ తెలిపారు. ఈ రోజుల్లో కూడా మంత్రాలను నమ్మడం సరైంది కాదని ఆయన ప్రజలకు సూచించారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, సంతోష్‌నగర్ ఏసీపీ వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరూ ఇద్దరే... హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఫయాజ్ అన్సారీ మత పెద్ద ముసుగులో మంత్రాలు చేస్తున్నాడు. అరబ్ దేశాలలో ఉద్యోగాలు చేసే వారి కుటుంబాలు ఎంచుకొని వారి ఇళ్లలోని పిల్లలకు దెయ్యాలు పట్టాయంటూ నమ్మించి మంత్రాలు చేయడం ఇతని నైజం. ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసే పిల్లలను గుర్తించి, వారికి దెయ్యాలు సోకాయని బాగు చేస్తానంటూ చిన్నారులను చిత్రహింసలకు గురి చేస్తాడు. ఒకరిద్దరు మహిళలను కూడా ఇతడు లోబర్చుకున్నాడని పోలీసులు వెల్లడించారు. టప్పా చబుత్రాకు చెందిన యునాని వైద్యుడు అన్వరుల్లాఖాన్ అలియాస్ డిస్కో బాబా గుప్త నిధులు తీస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. తన వద్ద ఉన్న ఇత్తడి బిస్కెట్లు, ఆర్టిఫిషియల్ రాళ్లను బంగారం బిస్కెట్లు, వజ్రాలు అంటూ నమ్మించి మోసం చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. రియాసత్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఇఫే్తకార్ హుస్సేన్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధులు తీస్తానంటూ నమ్మించి రూ.38 లక్షలు వసూలు చేశాడు. ఇతనిపై నగరంలోని ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, కుల్సుంపురా, షాయినాయత్ గంజ్ తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
నకిలీ బాబా హల్చల్
అట్లూరు: మండలంలో ఓ నకిలీ బాబా ఎనిమిది నెలలుగా హల్చల్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కొంత మందితో తెలంగాణ అంటాడు, మరి కొంత మందితో చిత్తూరు అంటాడు, ఇంకొందరితో మన జిల్లాలోని పెద్దముడియం అని చెబుతాడు. పేరు అడిగితే వెంకటసుబ్బయ్య అని, సుబ్రమణ్యంస్వామి అని పేర్కొంటాడు. ఈయన ఏం చేస్తాడో తెలియదు గానీ, కాషాయి వస్త్రాలు ధరించడం, గోచీ కట్టుకుని పంగనామాలు పెట్టుకుని ఉంటాడు. జాతకాలు, వాస్తుతోపాటు సంతానం లేని వారికి సంతానం కలుగజేస్తానని నమ్మబలుకుతాడు. అట్లూరు పునరావాస కాలనీలోని శివారులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఈయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇతర జిల్లాల నుంచి కూడా సుమోలు, స్కార్పియోల్లో ఇలా ఖరీదైన వాహనాల్లో వచ్చి ఆయనతో మంతనాలు చేసి పోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పూజలు చేస్తున్నాడా, ఏదైనా వ్యాపారం చేస్తున్నాడా, గుప్త నిధుల అన్వేషణ సాగిస్తున్నాడా? అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. ఆ నోటా ఈ నోటా ద్వారా ప్రచారం సాగింది. పోలీసుల అదుపులో... బాబాపై ప్రజల్లో అనుమానాలు బలపడటంతోపాటు పోలీసులకు కూడా అనుమానం రావడంతో తిరుపతికి చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే చిరుతపులి చర్మం, పొడదుప్పి చర్మంతోపాటు అమ్మవారి పంచలోహ విగ్రహం, మరికొన్ని చిన్న విగ్రహాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయనను విచారణ చేయాలని అట్లూరు పోలీస్‌స్టేçÙన్లో అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై అట్లూరు ఎస్ఐ చంద్రశేఖర్‌ను వివరణ అడుగగా.. నకిలీ బాబా అదుపులో ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. విచారణ పూర్తి కాలేదని, పూర్తి వివరాలు సోమవారం విలేకరుల సమావేశంలో నిర్వహించి తెలుపుతామని ఆయన పేర్కొన్నారు. బాబా ఫొటో మాత్రం తీయవద్దని నిరాకరించారు. -
బురిడీ బాబాకు ఐదురోజుల కస్టడీ
డబ్బులు రెండింతలు చేస్తానని నమ్మించి లైఫ్ స్టైల్ యజమాని మధుసూధన్‌రెడ్డిని బురిడీ కొట్టించిన బురిడీ బాబా శివానందను విచారణ జరిపేందుకు నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. పూజల పేరిట మధుసూధన్‌రెడ్డి వద్ద నుంచి రూ. 1.33 కోట్లతో ఉడాయించిన బుడ్డప్పగారి శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు శివను పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో.. సమ్మతించిన కోర్టు బురిడీ బాబాను ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. -
కరెన్సీ వర్షం కురుస్తుంది!
- బురిడీ బాబా.. ‘బారిష్’ మంత్ర - దొంగబాబా శివానంద మోసాలు చేసేది ఇలా - పూజ చేస్తే కరెన్సీ ఎగురుకుంటూ వస్తుందని టోకరా సాక్షి, హైదరాబాద్: ‘లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని రూ.1.33 కోట్లకు టోకరా వేసిన దొంగ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద స్వామి జనాలను బురిడీ కొట్టించడానికి ‘బారిష్’ మంత్రం వేస్తుంటాడని పోలీసులు చెబుతున్నారు. దీని ద్వారానే డబ్బు రెట్టింపు అవుతుందంటూ నమ్మబలుకుతాడంటున్నారు. గత శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన శివ విచారణలో ఆసక్తికర విషయాలు బయటపెట్టాడని అధికారులు తెలిపారు. శివే కాదు.. పూజల పేరుతో టోకరా వేసే అనేక మంది దొంగ బాబాలు బాధితులపై బారిష్ మంత్రాన్నే ప్రయోగిస్తుంటారట. బారిష్ అంటే వర్షం అని అర్థం. తాంత్రిక పూజ చేయడం ద్వారా డబ్బు వర్షంలా వస్తుందని, చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, బ్యాంకు లాకర్ల నుంచే ఈ మొత్తం ఎగురుకుంటూ వస్తుందని నమ్మిస్తుంటారట. ఈ పూజ సఫలీకృతం కావాలంటే 21 గోళ్లు ఉన్న తాబేలు(సాధారణంగా తాబేలుకు 18 గోళ్లే ఉంటాయి), 4.5 కేజీల కంటే ఎక్కువ బరువున్న రెండు తలల పాము(దీని తల, తోక ఒకే సైజులో ఉంటాయి), రైస్ పుల్లర్‌గా పిలిచే ఇరీడియం, కాపర్ కాయిన్‌ల్లో ఏదో ఒకటి ఉండాలని ఎర వేస్తారు. వీటికే చుట్టుపక్కల ఉన్న డబ్బును ఆకర్షించి, పూజలో పెట్టిన దాన్ని రెట్టింపు చేసే శక్తి ఉంటుందని నమ్మిస్తారు. ఈ మూడింటి పేర్లతో జరిగే మోసాలు ఎన్నో ఉంటున్నాయని, అలాంటి ముఠాలు తరుచుగా నగరంలో చిక్కుతున్నాయని అధికారులు చెప్తున్నారు. శివ సైతం బాధితుల ఇళ్లల్లో పూజకు కూర్చునేప్పుడు 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే కాపర్ కాయిన్ తన వద్ద ఉన్నట్లు చెప్పేవాడు. పూజ నేపథ్యంలో రైస్‌పుల్లర్‌ను చూపించమని ఎవరైనా అడిగితే.. పగడ్బందీగా పార్శిల్ చేసిన ఓ డబ్బాను చూపించి కాయిన్ అందులోనే ఉందని నమ్మించి పూజలో పెట్టేవాడు. మధ్యాహ్నం 1.30-2.00 గంటల ప్రాంతంలో పూజ పూర్తయినా.. డబ్బు పెరగకపోవడంతో బాధితులు శివను ప్రశ్నిస్తే.. అది లంచ్ సమయం కావడంతో బ్యాంకులు పని చేయవని, అందుకే డబ్బు ‘బారిష్’ కాలేదని, బ్యాంకులు తెరుచుకున్న తర్వాత వస్తుందని కాలయాపన చేసేవాడు. చివరకు అదును చూసుకుని ఉమ్మెత్త గింజలు, సీసం కలిపిన ‘ప్రసాదం’ పెట్టి వారు మత్తులోకి జారుకున్నాక డబ్బుతో ఉడాయించేవాడు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైల్లో ఉన్న శివను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై న్యాయస్థానం నిర్ణయం వెలువరించనుంది. కోర్టు అనుమతిస్తే శివను అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో ప్రశ్నించడానికి, అతడి ద్వారా ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
గురువుతో కలిసే తొలి బురిడీ!
కేపీహెచ్బీలో తొలిసారి నకిలీ బాబా శివ మోసం ఇప్పటికి ఆరుసార్లు అరెస్టు, మూడింట్లో వాంటెడ్ నాలుగు ఠాణాల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు ఏడేళ్లలో రూ.4.25 కోట్లకు పైగా మోసాలు సిటీబ్యూరో: ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డిని ‘రెట్టింపు’, ‘రైస్‌పుల్లింగ్ కాయిన్’ పేర్లతో బురిడీ కొట్టించిన బుడ్డప్పగారి శివ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగర పోలీసులు ఇతడితో పాటు సహకరించిన దామోదర్, శ్రీనివాసరెడ్డిల్నీ శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసగాడు ‘తొలి పూజ’ను తన గురువుతో కలిసే చేసినట్లు వెల్లడైంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి రమణ విద్యుత్ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందారు. 1996లో ఇంటర్నీడియట్ చదువును మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బెంగళూరు చేరాడు. ఉద్యోగం... ఏజెన్సీ... ‘ఆశ్రమావతారం’... బెంగళూరులో రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతడి ద్వారా శివ శాంతి సాగర్ హోటల్లో ఉద్యోగంలో చేరాడు. ఆపై అక్కడి తిప్పసముద్రం ప్రాంతంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా విద్యుత్, పారిశుద్ధ్య కార్మికుల్ని పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకూ ఈ పనీ మానేసిన శివ బెంగళూరులోని శివ సాయిబాబ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. అక్కడ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడులో ఉన్న మరో ఆశ్రమానికి వచ్చినా... మళ్లీ పాత ఆశ్రమానికే చేరాడు. కొన్నాళ్లు అక్కడ పని చేసిన తర్వాత తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి హ్యూమన్ బాడీ లాంగ్వేజ్, ఆయుర్వేద వైద్యం అంశాలు నేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఇతరులకు మత్తు ఇవ్వచ్చనే విషయం తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ శివ సాయిబాబ ఆశ్రమానికే చేరాడు. గురువుతో కలిసి కేపీహెచ్బీలో పంజా.... ఈ ఆశ్రమంలో శివకు అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే లక్ష్మీ పూజలతో నగదు రెట్టింపు, అష్టదిగ్భంధనమంటూ మోసం చేయడం ఎలానో నేర్చుకున్నాడు. ఆపై 2009లో ఈ గురువుతోనే కలిసి నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశారు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చమ్రాజ్నగర్లో రూ.10 లక్షలు పట్టుకుపోయాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ ఆపై తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. శివ తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, తంతు ముగిసే సమయానికి ఆ మొత్తం రెట్టింపు అవుతుం దని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచి న నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. ఆపై రెట్టింపు మొత్తాన్ని భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఆపై ఈ బురిడీ బాబా అసలు కథ ప్రారంభించి అందినకాడికి దండుకుంటాడు. రెండు నెలల నుంచీ ప్రిపరేషన్... ఏడాదిన్నరగా ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డితో పరిచయం కొనసాగిస్తున్న, గతంలోనే రూ.లక్ష ‘లాభం’ చేకూర్చిన శివ రెండు నెలల క్రితమే ‘ముగ్గులో దించేందుకు’ పథకం వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అన్నీ ‘కొత్తవి’ సిద్ధం చేసుకున్నాడు. రెండు నెలల క్రితమే బెంగళూరు శివార్లలోని సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లేఔట్లో కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ‘ఆపరేషన్ మధుసూదన్‌రెడ్డి’ తర్వాత ఇక్కడే తలదాచుకోవాలనే ఉద్దేశంతో ఈ చిరునామా తన స్నేహితులు, బంధువులు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. సిమ్‌కార్డులు, ఫోన్లు సైతం కొత్తగా ఖరీదు చేసి పక్కా పథకం ప్రకారం రంగంలోకి దిగాడు. బుధవారం మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ‘పూజ’ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదునూ తీసుకుని దేవాలయాలకు తిప్పాడు. అప్పటికే ‘ఉమ్మెత్త మత్తు’లో ఉన్న మధుసూదన్‌రెడ్డి కుమారుడిని చేతులు కడుక్కోవాలంటూ బస చేసిన ఓరిస్ హోటల్లోని తన గదికి తీసుకువచ్చాడు. ‘ధ్యాన’మంటూ తాళాలు కాజేశాడు... ఆ సమయంలో డబ్బుతో కూడిన సంచి మధుసూదన్‌రెడ్డి కుమారుడి కారు డిక్కీలో, కారు తాళం ఆయన దగ్గరే ఉంది. ఇక్కడా బురిడీ స్వామి తెలివిగానే వ్యవహరించాడు. డబ్బు రెట్టింపు కావడానికి ధ్యానం చేయాల్సి ఉందంటూ మధుసూదన్‌రెడ్డి కుమారుడికి చెప్పాడు. గదిలో ధ్యానంలో కూర్చునే ముందు నీ దగ్గర ఎలాంటి లోహపు వస్తువులూ ఉండకూడదు అంటూ చెప్పి కారు తాళాలతో సహా అన్నీ పక్కన పెట్టిం చాడు. ఆపై చాకచక్యంగా కారు తాళాలు తీసుకుని పార్కింగ్‌లోకి వెళ్లిన శివ... నగదు సంచిని తాను వచ్చిన ట్యాక్సీలోకి మార్చేసి తాళాలు యథాస్థానంలో ఉంచేశాడు. ఈ నేపథ్యంలోనే మధుసూదన్‌రెడ్డి కుమారుడు ఇంటికి చేరుకునే వరకు డిక్కీలోని నగదు పోయిన విషయం గుర్తించలేదు. ఏడేళ్లల్లో రూ.4.25 కోట్ల మోసాలు.... బురిడీ బాబా శివ 2009 నుంచి ఇప్పటి వరకు 10 ఉదంతాల్లో రూ.4.25 కోట్ల మేర స్వాహాలకు పాల్పడ్డాడు. మధుసూదన్‌రెడ్డి కేసుతో సహా రూ.2.05 కోట్లకు సంబంధించి బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ, మైలార్‌దేవ్‌పల్లి చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టయ్యాడు. రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్‌లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ఈ ఘరానా నేరగాాడిపై రాజంపేట, నెల్లూరు, కుంబులుగుడ్డు, కేపీహెచ్పీ ఠాణాల్లో నాలుగు నాన్-బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నాయి. వెలుగులోకి రావాల్సిన మోసాలు మరిన్ని ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఈ అంశాలపై దృష్టి పెట్టనున్నారు. -
దొంగ బాబా శివ అరెస్ట్
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబానికి మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన దొంగబాబా శివను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను పట్టుకున్నారు. చోరీ అనంతరం పరారైన శివ బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి, 'లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపిన భోజనం ఇచ్చి, రూ.1.33 కోట్లతో దొంగ బాబా శివ పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఇతడు గతంలో తిరుపతిలో కూడా ఇదే తరహాలో కొంతమందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్ శివస్వామి, శివబాబా... నకిలీ బాబాగా అవతారమెత్తాడు. గత రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్చల్ చేశాడు. లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. అంతేగాక లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేవాడు. ఇతని చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తర్వాత ఎలా బయటకు వచ్చాడో, ఇక్కడ ఎలా మోసానికి పాల్పడ్డాడో మాత్రం తెలియలేదు. -
కోటి రూపాయలు కొట్టేసిన నకిలీ బాబా ఇతడే!
పూజల పేరుతో మోసం చేసి ఏకంగా రూ. 1.30 కోట్లతో పరారైన నకిలీ బాబాను పోలీసులు గుర్తించారు. లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదనరెడ్డి ఇంట్లో వాళ్లందరికీ మత్తుమందు ఇచ్చి, దోపిడీకి పాల్పడింది శివ అనే పాత నేరస్తుడని పోలీసులు తెలిపారు. ఇతడు గతంలో తిరుపతిలో కూడా ఇదే తరహాలో కొంతమందిని మోసం చేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్ శివస్వామి, శివబాబా... నకిలీ బాబాగా అవతారమెత్తాడు. గత రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్చల్ చేశాడు. లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. అంతేగాక లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేవాడు. ఇతని చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తర్వాత ఎలా బయటకు వచ్చాడో, ఇక్కడ ఎలా మోసానికి పాల్పడ్డాడో మాత్రం తెలియలేదు. మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి వాళ్లను పూజల పేరుతో బురిడీ కొట్టించి కోటి రూపాయలకు పైగా సొత్తుతో ఇతగాడు ఉడాయించిన విషయం తెలిసిందే. -
నకిలీ బాబా బురిడీ కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్: లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డిని నకిలీ బాబా బురిడీ కొట్టించిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారి ఇంటిలో పూజలు నిర్వహించాడు. అనంతరం మధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్రెడ్డితో కలిసి నకిలీ బాబా పూజలో పెట్టించిన రూ.కోటి ముప్పై లక్షల డబ్బును తమతో పాటు తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఆలయాల్లో బాబా పూజలు చేసి...బంజారాహిల్స్‌లో బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఆ సమయంలో సందేశ్రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని బాబాకు చెప్పడంతో, విశాంత్రి తీసుకోవాలని మాయ మాటలు చెప్పిన బురిడీ బాబా కారు కీని దొంగిలించి.. కారులోని డబ్బు మూటను తీసుకుని ఉడాయించాడు. కొంతసేపటి తర్వాత తేరుకున్న సందేశ్ సాయంత్రం 5గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లోని అతని తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన సందేశ్రెడ్డి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వెంటనే జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
‘ముగ్గు’లోకి దించి కోటి కొట్టేశాడు!
- హైదరాబాద్‌లో దొంగ బాబా ఘరానా మోసం - బాధితుడు ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్: ఓ దొంగ బాబా.. భార్యా, పిల్లలతో ఓ అమాయకుడు.. మంత్రాలతో ఉన్న బంగారాన్ని రెండింతలు చేస్తానంటూ బాబా మాయమాటలు.. నెక్ట్స్ సీన్.. గోల్డ్ బాబా చేతికి.. చిప్ప బాధితుడి చేతికి! - ఇది రీల్ కథ కర్ణాటక నుంచి ఓ దొంగ బాబా.. యజమాని ఆహ్వానం మేరకే ఇంటికొచ్చాడు.. కుటుంబానికి పట్టిన కీడు తొలగిస్తానన్నాడు.. ముగ్గులేసి ఏవేవో పూజలు చేశాడు.. ఇంట్లో ఉన్న సొమ్మంతా తెచ్చి పెట్టమన్నాడు.. ఒకటి కాదు రెండు కాదు.. రూ.కోటి 30 లక్షలు తెచ్చి పెట్టారు.. కాసేపటికి బాబా ప్రసాదం పెట్టాడు.. అది తిన్న యజమాని, భార్య, కొడుకు స్పృహ కోల్పోయారు.. ఇంకేముంది ఆ డబ్బుతో బాబా పరార్!! - ఇది ‘రియల్’ మోసం అచ్చూ సినీపక్కీలో జరిగిన ఈ ఘరానా మోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇచ్చి దొంగ బాబా రూ.కోటి ముప్పై లక్షలతో ఉడాయించాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన తన కుటుంబానికి పట్టిన కీడు తొలగిపోవాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని కర్ణాటకకు చెందిన ఓ బాబాను సంప్రదించాడు. తాను పూజలు చేస్తే ఎంతటి కీడైనా తొలగిపోతుందని, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని బాబా నమ్మించాడు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మధుసూదన్‌రెడ్డికి సూచించారు. మంగళవారం ఉదయం కర్ణాటక నుంచి వచ్చిన బాబాకు మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో బస కల్పించారు. పూజకు కావాల్సిన సామగ్రిని మంగళవారమే కొనుగోలు చేయించారు. బుధవారం ఉదయం.10.30 గంటలకు మధుసూదన్‌రెడ్డి ఇంటికి వచ్చిన బాబా హాల్లో ముగ్గులు వేసి నిమ్మకాయలతో అలంకరించాడు. మధుసూదన్‌రెడ్డితో పాటు ఆయన భార్య విద్యావతి, కొడుకు సందేశ్‌రెడ్డిలను పూజల్లో కూర్చోబెట్టాడు. డబ్బు ఎంత ఉంటే అంత పూజ దగ్గర పెడితే అంతా మంచి జరుగుతుందని, దోషాలు తొలగిపోతాయని, గ్రహాలు అనుకూలిస్తాయని చెప్పాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి తన వద్ద ఉన్న రూ.కోటి 30 లక్షల నోట్ల కట్టలను ముగ్గులో పేర్చాడు. ప్రసాదం తినగానే కుప్పకూలిన వైనం.. మధ్యాహ్నం దాకా బాబా ఏవేవో పూజలు చేశాడు. 3.30 గంటల ప్రాంతంలో పూజలు అయిపోయినట్లు ప్రకటించిన బాబా మధుసూదన్‌రెడ్డికి, ఆయన భార్య, కొడుకుకు ప్రసాదం ఇచ్చాడు. ఆ ప్రసాదం తిన్న కొద్ది క్షణాలకే ఆ ముగ్గురూ కుప్పకూలారు. వాళ్లు కింద పడిపోగానే బాబా తన చేతికి పని చెప్పాడు. ముగ్గులోని నగదును బ్యాగులో సర్దుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటికి పని మనుషులు, డ్రైవర్ లోనికి వచ్చారు. ముగ్గురూ కిందపడి ఉండటం చూసి అపోలో ఆస్పత్రికి తరలించారు. తేరుకున్న సందేశ్ జరిగిన విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మధుసూదన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చారు. విద్యావతి, సందేశ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మధుసూదన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి కోలుకుంటే ఈ దొంగ బాబాకు సంబంధించిన మరింత సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు. బాబా కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. బాబా కారు డ్రైవర్ శివను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాబా జాడ కోసం రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో నిఘా ఉంచారు. బెంగళూరు రహదారిలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. -
రూ. కోట్లు వసూలు చేసిన దొంగబాబా
ఆధ్యాత్మిక ముసుగులో రూ. కోట్లు వసూలు బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు హైదరాబాద్: ఆధ్యాత్మిక ముసుగులో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి బినామీ పేర్లతో ఆస్తులు కొంటున్న ఓ దొంగ బాబాను చైతన్యపురి పోలీసు లు అరెస్ట్ చేశారు. సీఐ నవీన్‌కుమార్ కథనం ప్రకారం...కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన మద్దూరు ఉమాశంకర్ (49) పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం 2004లో హైదరాబాద్ నగరానికి వచ్చిన అతను డబ్బు సంపాదన కోసం ఉమాశంకర్ స్వామి అవతారం ఎత్తాడు. జాతకాలు చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్కేపురంలో ఉంటూ తన స్నేహితులు దుర్గాప్రసాద్, సీఎంకే.రావు సహకారంతో ‘అవర్ ప్లేస్’ పేరుతో భక్తుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. దీనికితోడు రాజమండ్రి, గుడివాడ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించి వ్యాపారులను, బడా వ్యక్తులను మోసం చేసి వచ్చిన డబ్బుతో శంషాబాద్‌లో బినామీ పేర్లతో 4.25 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని చేతిలో మోసపోయిన కొత్తపేట ఇన్‌కాంట్యాక్స్ కాలనీకి చెందిన వెంకటరమణారావు బుధవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దాదాపు 50 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం పోలీసులు ఉమాశంకర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ఇతను సుమారు రూ. 30-40 కోట్లు వసూలు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
యువతి పట్ల దొంగ బాబా ఆశ్లీల చేష్టలు
-
దొంగబాబా అరెస్టు
ఎమ్మిగనూరు(కర్నూలు): పూజల పేరుతో ప్రజల్ని మోసగిస్తున్న ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న హసన్ అలీ అలియాస్ తాజుద్దీన్ క్షుద్ర పూజలతో స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. అయితే ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్టు చేసి విచారణ చేశారు. దీంతో అతడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం దొంగ బాబా పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నాడు. పులివెందులలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
దొంగబాబాకు దేహశుద్ధి
-
దొంగబాబాకు దేహశుద్ధి
బంట్వారం : ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు దొంగబాబాకు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనం బంట్వారం మండలం తుర్మామిడి గ్రామంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రెయిన్‌బాబా అనే వ్యక్తి గ్రామంలోని ఓ వ్యవసాయపొలంలో చిన్నకుటీరం వేసుకుని జాతకాలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ జాతకం చెప్పించుకోవడానికి బాబా దగ్గరకు వెళ్లింది. తన భర్త 3 సంవత్సరాల నుంచి కనిపించడం లేదని ఎక్కడున్నాడో తెలపాలని బాబాను కోరింది. అయితే రాత్రికి రండి అని చెప్పి పంపించాడు .ఆ మహిళ ఆదివారం రాత్రి తన తల్లితో కలిసి బాబా దగ్గరకు వచ్చింది. తల్లిని బయట ఉంచి కూతుర్ని లోపలికి రమ్మని చెప్పాడు. లోపలికి వెళ్లిన తర్వాత సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో వారు దొంగస్వామిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సాములోరి వేషాలతో.. సంతానం కలుగుతుందట!!
-
రెచ్చిపోతున్న దొంగ బాబాలు
-
దొంగ బాబాకు దేహశుద్ధి!
-
సంతానం పేరుతో బురిడి పట్టిస్తున్న బాబా