ప్రతీకాత్మక చిత్రం
మధుర : క్షుద్ర పూజల పేరిట మహిళపై లైంగిక దాడికి పాల్పడిన దొంగ బాబాకు.. యూపీలో ఓ న్యాయస్థానం పాతికేళ్ల శిక్షను విధించింది. ఈ ఘటన మధురలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హత్‌రాస్‌కు చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. బృందావన్‌లోని ద్వారకాదాస్ ఆశ్రమానికి వెళితే ఫలితం ఉంటందని నమ్మి గత సంవత్సరం జూలైలో తన భర్తతో పాటు ఆశ్రమానికి వెళ్ళింది.
ఇక (నీబు పూజ) క్షుద్రపూజల పేరిట ఆమె భర్తను దీపాన్ని ఇచ్చి.. అది ఆరిపోయేవరకు పైకి రాకూడదని హెచ్చరించాడు. ఆపై పైఅంతస్థులో ఉన్న గదిలోకి గృహిణిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది దుష్టశక్తులను తరిమికొట్టే ప్రయత్నంలో భాగమని. ఎవరికైనా విషయం చెబితే కుటుంబం మొత్తం సర్వనాశనమౌతుందని హెచ్చరించాడు. ఆపై మరికొన్ని రోజుల తర్వాత ఆమెను బెదిరించి మరోసారి లొంగదీసుకున్నాడు. దీంతో మహిళ భర్తకు అసలు విషయం చెప్పేసింది.
ఘాపై ఆ దంపతులు మధుర పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టిన మధుర ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ద్వారకాదాస్‌కు 25ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.27వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని యెడల మరో 27 నెలలు అదనంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తేల్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment