Mathura
-
మూడువేల ఏళ్లనాటి శివపార్వతుల ప్రతిమలు లభ్యం
మధుర: యూపీలోని మధురలో అత్యంత పురాతన శివపార్వతుల విగ్రహాలు లభ్యమయ్యాయి. బెనారస్ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ)లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా మాట్లాడారు.మూడు వేల ఏళ్ల క్రితం నాటి శివుడు, పార్వతిలకు చెందిన మట్టి ప్రతిమలు మధురలో లభమయ్యాయని తెలిపారు. ఈ ఏడాది మేలో బ్రజ్‌లోని గోవర్ధన్ పర్వతం దగ్గర తవ్వకాలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా భూమికి 15 మీటర్ల దిగువన విగ్రహాలు కనుగొన్నామన్నారు. 4,800 ఏళ్ల క్రితం గణేశ్వర నాగరికత ఆధారాలు కూడా కనిపించాయన్నారు. మొదటి శతాబ్దం కాలం నాటి శివపార్వతుల ఆరాధనకు సంబంధించిన పురావస్తు ఆధారాలు లభించాయన్నారు.మధురలో మహాభారత కాలం నాటి సుమారు ఎనిమిది మీటర్ల మందపాటి పొర నిక్షేపం అంటే పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ కనుగొన్నామన్నారు. ఎండిపోయిన ఒక పురాతన నది కాలువ 23 మీటర్ల లోతులో ఉన్నట్లు తేలిందన్నారు. ప్రపంచ పురావస్తు శాస్త్రంలో ఇది అత్యంత అపూర్వమైన విజయయమని, బలి, అగ్ని దేవతల విగ్రహాల అవశేషాలు ఆ నాటి ఆధ్యాత్మిక,సాంస్కృతిక పద్ధతులను తెలియజేస్తాయన్నారు.ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
Uttar Pradesh: కలుషిత ఆహారం తిన్న 60 మందికి అస్వస్థత
మధురలో శ్రీకృష్ణాష్టమి వేళ విషాదం చోటుచేసుకుంది. పండుగ నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ బక్వీట్(గోధుమ తరహా ఆహారధాన్యం) పిండితో చేసిన పకోడీలు తిన్న 60 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన మధురలోని ఫరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బక్వీట్ పకోడీలు తిన్న కొద్దిసేపటికే చాలామంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. స్థానికులు వీరిని వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆరోగ్యం మరింతగా క్షీణించిన ఆరుగురిని ఆగ్రాలోని ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించారు. అలాగే 15 మంది బాధితులను మధుర జిల్లా ఆస్పత్రికి, 11 మందిని బృందావన్‌లోని ఆస్పత్రికి తరలించారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టాఫ్ నర్సు జస్వంత్ యాదవ్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగా 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారన్నారు. వీరింతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన అనంతరం జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అధికారులు బక్వీట్ పిండి విక్రయించిన ఇద్దరు దుకాణదారులపై కేసు నమోదు చేశారు. -
ఉడుపిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. దక్షిణాది మధురగా పేరొందిన కర్నాటకలోని ఉడుపిలో జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూసేందుకు ఉడుపికి తరలివస్తున్నారు.ఆలయంలో ఈ రోజున తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు ప్రారంభమయ్యాయి. ఇవి రోజంతా కొనసాగనున్నాయి. కర్నాటకలోని అత్యంత పురాతన దేవాలయాలతో ఉడుపి ఒకటి. ఈ ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ఎంతో విశిష్టమైనదని చెబుతారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని సాంప్రదాయక కళారీతిలో అలంకరించారు. ఉడిపిలోని వీధులు, వివిధ దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లో అందమైన ముగ్గులు వేసి, వాటిని పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఈరోజు ఉడుపిలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్)యూజర్ అను సతీష్ తన అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో శ్రీకృష్ణునికి పూలతో చేసిన అందమైన అలంకరణను, ఆలయశోభను చూడవచ్చు. Krishna Janmashtami TodayDivine Darshan of Udupi Shri Krishna to bless our day.. Janmashtami wishesShri Krishna's blessings to all 🙏✨️ pic.twitter.com/k43CJIQMFe— Anu Satheesh 🇮🇳🚩 (@AnuSatheesh5) August 26, 2024 -
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో గోపాల కృష్ణుని జన్మదిన వేడుకల కోసం ప్రముఖ బిర్లా ఆలయాన్ని అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.మధురలోని శ్రీ కృష్ణుని ఆలయం నేడు (సోమవారం) 20 గంటల పాటు తెరిచి ఉంటుందని, భక్తులకు నిరంతరాయంగా దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు మంగళ హారతి, పంచామృత అభిషేకం, పుష్ప సమర్పణలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ పండితుడు నృత్య గోపాల్ దాస్ నేతృత్వంలోని నేటి అర్ధరాత్రి మహా అభిషేక వేడుక రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 12.40 వరకు కొనసాగనుంది. తెల్లవారుజామున రెండు గంటలకు శయన హారతి నిర్వహించనున్నారు. #WATCH पन्ना, मध्य प्रदेश: श्री कृष्ण जन्माष्टमी के मद्देनजर जुगल किशोर जी मंदिर को रंग-बिरंगी लाइटों से सजाया गया। pic.twitter.com/BaKVkcGfpc— ANI_HindiNews (@AHindinews) August 25, 2024ఢిల్లీలోని బిర్లా ఆలయంలో పూల మాలలు, నెమలి ఈకలతో ప్రత్యేక అలంకరణ చేశారు. విద్యుత్ కాంతులు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక దుస్తులు ధరింపజేశారు. జన్మాష్టమి వేళ బిర్లా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ జరిగే భజన కీర్తనలు, శ్రీకృష్ణ లీలలను భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.#WATCH अहमदाबाद (गुजरात): श्री कृष्ण जन्माष्टमी से पहले इस्कॉन मंदिर में तैयारी चल रही हैं। pic.twitter.com/YplKgI5FpJ— ANI_HindiNews (@AHindinews) August 25, 2024నోయిడాలోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆలయం వద్ద ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జన్మాష్టమి నాడు ఇస్కాన్ ఆలయానికి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మధుర, బృందావనమే కాదు... ఇక్కడ కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి.. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకగా చేసుకునే పండుగ. ఈ ఏడాది ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చేసుకోనున్నారు. భారతదేశమంతటా ఈ పండుగ వేళ భక్తులలో ఆనందం వెల్లివిరుస్తుంది. జన్మాష్టమి వేడుకలు కేవలం మధుర-బృందావనంలోనే కాకుండా గుజరాత్, ముంబై, కేరళలో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. మధుర- బృందావనం (ఉత్తర ప్రదేశ్)బృందావనం శ్రీకృష్ణుని జన్మస్థలం. అందుకే జన్మాష్టమి వేళ ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బృందావనంలో జన్మాష్టమి వేడుకలు 10 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇక్కడి ఆలయాలను వివిధ రకాల అందమైన పూలతో అలంకరిస్తారు. రోజంతా భక్తులు భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఇక్కడి వాతావరణమంతా భక్తితో నిండిపోతుంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో నివసించే వారు జన్మాష్టమి నాడు మధుర, బృందావనాలను సందర్శిస్తుంటారు.ద్వారక (గుజరాత్)గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుని పురాతన ఆలయం ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే జన్మాష్టమి సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు.పూరి (ఒడిశా)ఒడిశాలోని పూరీలో కూడా మధుర-బృందావనంలో మాదిరిగానే వారం రోజుల ముందుగానే జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుని జీవితం ఆధారంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణునికి ఇచ్చే హారతిని చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ముంబై (మహారాష్ట్ర)జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే దహీ-హండీ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదర్, వర్లీ, థానే, లాల్బాగ్లలో నిర్వహించే దహీ హండీని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.గురువాయూర్(కేరళ)గురువాయూర్ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయాన్ని బృహస్పతి, వాయుదేవుడు నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి గురువాయూర్ దేవాలయం అని పేరు వచ్చిందంటారు. ఇక్కడ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయి. -
మధురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం
సోమవారం (ఆగస్టు 26) శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల శ్రీకృష్ణుని ఆలయం సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తుల కోసం 20 గంటల పాటు తెరిచివుంటుందని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ తెలిపింది.మధుర శ్రీకృష్ణుని ఆలయంలో నేటి (శనివారం) నుంచి ఉత్సవాలు ప్రారంభమై గురువారం వరకు కొనసాగుతాయని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవాసమితి కార్యదర్శి కపిల్ శర్మ, సభ్యులు గోపేశ్వర్ చతుర్వేది తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని 20 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. సోమవారం స్వామివారి మంగళ హారతి కార్యక్రమంలో షెహనాయ్ వాదన ఉంటుందన్నారు. ఉదయం 5.30 నుండి దర్శనాలు మొదలువుతాయన్నారు. ఉదయం 11.00 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు.జన్మాష్టమి నాడు సాయంత్రం వేళ శ్రీకృష్ణ లీలా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భరత్పూర్ గేట్ నుంచి ఊరేగింపు ప్రారంభమై హోలీగేట్, ఛట్టా బజార్, స్వామి ఘాట్, చౌక్ బజార్, మండి రాందాస్, డీగ్ గేట్ మీదుగా శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకుంటుందన్నారు. ఆలయంలో స్వామివారి అలంకరణ అద్భుతంగా ఉండబోతుందని అన్నారు. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో జిల్లా యంత్రాంగం షూ షెడ్లు, లగేజీ షెడ్లు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే వైద్య శిబిరాలు, విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
Mathura: రూ. ఒక కోటి 9 లక్షలతో పూజారి పరార్
ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆలయంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి గోవర్ధన్‌లో గల ముకుట్ ముఖారవింద్ ఆలయంలో భారీ చోరీ జరిగింది. పూజారే స్వయంగా ఈ దొంగతనానికి పాల్పడటం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముకుట్ ముఖారవింద్ ఆలయ పూజారి దినేష్ చంద్ రూ. ఒక కోటి 9 లక్షల రూపాయలతో పరారయ్యాడు. దినేష్ చంద్ ఈ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాడు. అయితే ఆ తరువాత ఆలయానికి తిరిగి రాలేదు. పూజారి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఈ ఉదంతంపై ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గోవర్ధన్ పోలీసులు నిందితుని కోసం గాలింపు మొదలుపెట్టారు.ఈ ఘటన గురించి ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ మాట్లాడుతూ ఆలయ పూజారి దినేష్ చంద్ ఆలయానికి సంబంధించిన సొమ్ములో సుమారు రూ. ఒక కోటి 9 లక్షలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దస్వీసా నివాసి అయిన నిందితుడు, పూజారి దినేష్ చంద్ ఇంటిలో నుంచి పోలీసులు రూ. 71 లక్షల 92 వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము గురించి ఆరా తీస్తున్నారు. ఆ పూజారి భార్య స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, ఆలయానికి సంబంధించిన సొమ్మును అప్పగించింది. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ నటి హ్యాట్రిక్.. అభినందించిన కూతురు!
ఈ ఏడాది జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సీనియనర్ నటి హేమ మాలిని విజయం సాధించింది. యూపీలోని మథుర లోక్‌సభ నియోజకవర్గం బరిలో నిలిచిన ఆమె వరుసగా మూడోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ ధన్గర్పై 5,10,064 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. తాజాగా ఈ విజయంపై ఆమె కూతురు, నటి ఇషా డియోల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభినందనలు మమ్మా.. హ్యాట్రిక్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. కాగా.. హేమ మాలిని 1999లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. తాజాగా హ్యాట్రిక్ కొట్టడంపై హేమమాలిని స్పందించారు. ప్రజలకు మూడోసారి సేవ చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by ESHA DEOL (@imeshadeol) -
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్‌ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్‌కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
Lok sabha elections 2024: శ్రీకృష్ణుని గోపికను నేను: హేమమాలిని
మథుర(యూపీ): గోపాలకృష్ణుని 16 వేల గోపికల్లో ఒకరినంటూ సినీ నటి హేమమాలిని తనను తాను అభివర్ణించుకున్నారు. మథురలో బీజేపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన హేమమాలిని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గోపికల్లో ఒక గోపికగా నన్ను నేను ఊహించుకుంటాను. మథుర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్రిజ్వాసులంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రేమ, అభిమానం. అందుకే బ్రిజ్వాసులను ఇష్టంతో సేవిస్తే కృష్ణ భగవానుని ఆశీస్సులు లభిస్తాయని నా నమ్మకం. అందుకే వారికి విశ్వాసంతో సేవ చేస్తున్నా’అని ఆమె అన్నారు. పేరు, ప్రఖ్యాతుల కోసమో, మరే ఇతర భౌతిక లాభాపేక్షతోనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. మథుర చుట్టుపక్కల 84 కోసుల పరిధి(252 కిలోమీటర్లు)లోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. -
ఓరి ‘దొంగ’.. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు..
లక్నో: నడుస్తున్న సమయంలో, పక్కన కూర్చున్నప్పుడు జర్నీలో దొంగతనాలు చేయడం సాధారణమే.. అయితే ఇటీవల దొంగలు విచిత్రంగా పడుకొని చోరీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలో ఓ దొంగ ఒక వ్యక్తి నిద్రపోతున్నట్లు నటిస్తూ పలు చోరీలకు పాల్పడ్డాడు. తొలుత ఒక ప్రయాణికుడి పక్కన అతడు పడుకొన్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు. తిరిగి పడుకొన్నాడు. మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడి పక్కన పడుకున్నాడు. అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ చోరీ చేశాడు. అనంతరం ఆ వెయిటింగ్ రూమ్ నుంచి జారుకున్నాడు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన రైల్వే పోలీసులు చివరకు ఆ దొంగను గుర్తించారు. నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేస్తున్న ఎటా జిల్లాకు చెందిన 21 ఏళ్ల అవినీష్ సింగ్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ‘The Sleeping Thief’: A Person has been arrested from UP’s Mathura for stealing from passengers sleeping on railway stations. The CCTV Footage shows the cunning modus operandi of the thief where he pretends to sleep beside a traveller & swiftly pick pockets the mobile phone. pic.twitter.com/6OVSYydwaZ — Tanishq Punjabi (@tanishqq9) April 10, 2024 -
మరో పదేళ్లు హేమామాలినీనే ఎంపీ?
యూపీలోని మధుర ఎంపీ హేమామాలిని విజయానికి ఇక ఢోకాలేదట! ఓ స్వామీజీ ఆమెను ఆశీర్వదిస్తూ, రోబోయే పదేళ్లూ విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంటారని చెప్పారట. ప్రస్తుతం హేమామాలిని మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె ఆచార్య ప్రేమానంద్ మహరాజ్‌ను కలిసేందుకు మధురలోని ఆయన ఆశ్రమానికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ప్రేమానంద్ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ హేమామాలినీని ఆశీర్వదిస్తూ ‘మీరు సాధువులకు దగ్గరగా ఉండటమే కాకుండా, భగవంతుని పాదాలను ఆశ్రయించారు. మీరు ప్రాపంచిక విజయాలనే కాకుండా, అతీంద్రియ విజయాలను కూడా అందుకుంటారు. శ్రీ కృష్ణునిపై మీకు కలిగిన ప్రేమ ఒక అతీంద్రియ విజయం . ఏది ఏమైనప్పటికీ మీరు మరో పదేళ్లు ఇలా విజయాలు సాధిస్తూనే ఉంటారు’ అని ఆశీర్వదించారు. హేమామాలిని ప్రేమానంద్ ఆశ్రమంలో 20 నిముషాల పాటు ఉన్నారు. -
Hema Malini Assets Worth: హేమమాలిని ఆస్తులు వంద కోట్లకు పైగానే..
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నటి హేమమాలిని..ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ బరిలో నిలిచారు. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి సుమారు రూ. 123 కోట్లుగా తెలిపారు. అయితే రూ. 1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. నటనను తన వృత్తిగా తెలిపిన హేమమాలిని.. అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా తెలిపారు. అలాగే తన భర్త, నటుడు ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. నటన, పెన్షన్, వడ్డీలు ఆయన ఆదాయవనులుగా తెలిపారు. అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, అల్కాజార్, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ. 43 లక్షల నగదు ఉన్నాయి. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని బీజేపీ తరపున మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. చదవండి: అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్ -
నాడు ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరిన వాజ్‌పేయి?
దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పండులని అంటుంటారు. దేశంలో 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఇప్పటికీ ఏదోవిధంగా గుర్తుకు తెచ్చుకుంటారు. దేశంలో 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలు వింత వైనాలు చోటుచేసుకున్నాయి. నాడు జన్‌సంఘ్ నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఒక ప్లాన్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 లోక్‌సభ ఎన్నికల్లో మథుర, బల్రాంపూర్, లక్నో ఈ మూడు చోట్ల నుంచి పోటీ చేశారు. బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఐదుసార్లు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి తొలిసారిగా మధుర లోక్‌సభలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన కారణంగానే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని తనకు తానుగా ఆహ్వానించుకున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు. ఈ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి బహిరంగ సభలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేవారు. తనకు కాకుండా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్‌కు ఓటువేయాలని కోరేవారు. ఇలా తాను వెళ్లిన ప్రతీచోటా ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరారట. ఎవరైనా అదేమిటని అడిగితే ఆయన తన లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదని, కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని నిర్ధారించడమేనని చెప్పుకొచ్చేవారు. నాటి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాజ మహేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. ఆయనకు 95 వేల 202 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ సింగ్ 69 వేల 209 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జనసంఘ్‌కు చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి నాలుగో స్థానంలో నిలిచారు. వాజ్‌పేయికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. -
కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్
మహాశివుడు కొలువైన కాశీలో రంగ్భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్‌లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి
లఖ్నో: మథురలో చాలాకాలంగా వివాదాల్లో నలుగుతున్న మందిర్–మసీద్ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ షాహీ ఈద్గా స్థానంలో కృష్ణునికి ఆలయం నిర్మించడంపై గట్టిగా దృష్టి సారిస్తామని సంకేతాలిచ్చారు. ‘‘కాశీ, అయోధ్య అనంతరం ఇప్పుడిక మథుర వంతు. అక్కడ మందిరం రూపుదిద్దుకోకుంటే కృష్ణుడు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఇందుకు వేదికైంది. ‘‘కాశీ, అయోధ్య, మథుర విషయంలో మొండితనం, రాజకీయాలు కలగలిసి ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారి పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేశాయి’’ అంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలపై విమర్శలు గుప్పించారు. మథురలో కృష్ణుని పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారన్న వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. -
కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లక్నో: కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ ఆదేశాలను జారీ చేసింది. మసీదు సర్వే చేసేందుకు కమిషనర్‌ను నియమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్‌ను నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ‘త్రిసభ్య కమిషన్ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలి. శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చు. పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టును కమిషన్ అందించాలి.' అని హైకోర్టు తీర్పు వెలువరించింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఈ నివేదికపై అభ్యంతరాలుంటే ఈద్గా తరఫు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించవచ్చు అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్వర్వులో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వును షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నౌకలపై దాడులు.. ఇంధన సరఫరాపై ప్రభావం: జై శంకర్ -
షాహీ ఈద్గా మసీదు సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
లక్నో: కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు -
షాహీ ఈద్గాలో సర్వే చేయండి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని మథుర నగరంలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గాను నిర్మించారంటూ దాఖలైన కేసు గురువారం కీలక మలుపు తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్‌ను నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ‘త్రిసభ్య కమిషన్ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలి. డిసెంబర్ 18న జరిగే ఈ కేసు తదుపరి విచారణలో సర్వే విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చు. పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టును కమిషన్ అందించాలి. ఈ నివేదికపై అభ్యంతరాలుంటే ఈద్గా తరఫు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్వర్వులో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా మని షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఆలయం–మసీదు వివాదాల్లో అలహాబాద్ హైకోర్టు ఇలా సర్వేకు ఆదేశాలివ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవలే వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలివ్వడం, సర్వే పూర్తయి భారత పురావస్తు శాఖ నుంచి తుది నివేదిక కోసం వేచి ఉన్న సంగతి తెల్సిందే. ‘‘మసీదు ప్రాంగణంలో కమలం ఆకృతిలో ఉన్న పునాదులతో ఒక నిర్మాణం ఉంది. అది హిందువులు పూజించే శేషనాగును పోలి ఉంది. పునాదిపై హిందూ మత సంబంధ గుర్తులు, నగిïÙలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’’ అని ఇటీవల పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ కోర్టులో వాదించారు. -
లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగిన రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి ఎక్కి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళ విద్యుదాఘాతానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడగా అందులో లోకోపైలట్ భాగోతం బయటపడింది. వీడియోలో ఢిల్లీ షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకోగానే అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన తర్వాత కిందకు దిగాడు. అంతలో మరో లోకో పైలట్ సచిన్ విధులు నిర్వహించేందుకు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతో రైలులోకి ఎక్కాడు. వీడియో కాల్లో బిజీగా ఉన్న సచిన్ భుజానికున్న బ్యాగును తీసి ఇంజిన్ రాడ్ పైన పెట్టాడు. ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలడంతో రైలు ముందుకు కదిలింది. मथुरा ट्रेन हादसे के समय मोबाइल देख रहा था ड्राइवर। CCTV से ट्रेन के प्लेटफॉर्म पर चढ़ने का राज खुला। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #MathuraJunction #TrainAccident #CCTV pic.twitter.com/muia6Zu2Gi — FirstBiharJharkhand (@firstbiharnews) September 28, 2023 ఇది గమనించకుండా సచిన్ వీడియో కాల్లో బిజీగా ఉన్నాడు. చూస్తుండగానే రైలు ప్లాట్‌ఫారంపైకి ఎక్కి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళా మాత్రం విద్యుదాఅఘాతానికి గురవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైలులోని ప్రయాణికులంతా రైలు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడి వారు. దీని కారణంగా మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్, దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచిన్ తోపాటు మరో నలుగురిని కూడా సస్పెండ్ చేసింది. यूपी के मथुरा में एक अजीबोगरीब हादसे में मथुरा जंक्शन रेलवे स्टेशन पर एक लोकल ट्रेन प्लेटफॉर्म से टकरा गई. किसी के हताहत होने की सूचना नहीं है.#Mathura #MathuraJunction pic.twitter.com/ODdtgKinUl — iMayankofficial 🇮🇳 (@imayankindian) September 26, 2023 ఇది కూడా చదవండి: పాముకాటుతో అటెండర్ మానస మృతి -
ప్రముఖ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలు..
మధుర, బృందావనం మొదలుకొని దేశవ్యాప్తంగా నేటి ఉదయం నుంచి పలు ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. శ్రీహరి అవతారాల్లో ఇది సంపూర్ణమైనదని చెబుతారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రెండు రోజులు నిర్వహిస్తున్నారు. కొందరు సెప్టెంబరు 6న జన్మాష్టమి వేడుకలు చేసుకోగా, మరికొందరు నేడు (సెప్టెంబరు 7)న ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో ఆలయాలన్నీ ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. #WATCH | UP: Mangala aarti underway in Krishna Janmabhoomi temple in Mathura, on the occasion of #Janmashtami pic.twitter.com/DSV80e7mbD — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉదయం స్వామివారికి మంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో ఆలయంలో శంఖనాదాలు చేశారు. ఆలయంలో కొలువైన రాధాకృష్ణులకు పసుపురంగు దుస్తులు ధరింపజేశారు. అలాగే పూలతో అలంకరించారు. #WATCH | West Bengal: Devotees celebrate & offer prayers at the Iskcon temple in Kolkata on the occasion of #Janmashtami pic.twitter.com/wEDQWVEs0D — ANI (@ANI) September 7, 2023 పశ్చిమబెంగాల్లోని ఇస్కాన్ ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో పూజలు, అర్చనలు విశేషరీతిలో జరిగాయి. కొందరు భక్తుల భగవానుని సమక్షంలో నృత్యాలు చేశారు. కొందరు శంఖనాదాలు చేశారు. #WATCH | Uttarakhand: Devotees throng Badrinath temple during the #Janmashtami celebrations pic.twitter.com/8bf3lhclIz — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఆలయాన్ని ఎల్ఈడీ వెలుగులతో నింపేశారు. #WATCH | Delhi: Tulsi aarti underway in Iskcon temple on the occasion of #Janmashtami pic.twitter.com/TpCbF6tsJ7 — ANI (@ANI) September 6, 2023 ఢిల్లీలోని ఇస్కాన్ మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి తులసి హారతి సమర్పించారు. ఆలయ పూజారులు, భక్తులు సంయుక్తంగా హారతి అందించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. #WATCH | UP: Mangala Aarti underway in Noida Iskcon temple, on the occasion of #Janmashtami pic.twitter.com/U0I5878Um9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 6, 2023 -
ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో ఘోర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. యూపీలో తీర్ధయాత్రకు వచ్చిన ఓ యాత్రికుడు ఆదమరచి ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలుడిని పట్టపగలు అందరూ చూస్తుండగా అదేపనిగా ఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటిబయటకు రావడంతో నెటిజన్లు, పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తీర్ధ యాత్రికుడు ఓంప్రకాష్(54) అనేక మార్లు నేలకేసి కొట్టాడని.. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆ వ్యక్తిని పట్టుకుని దేహ శుద్ధి చేసి తమకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికులు ఆ వ్యక్తిని చితకొట్టడంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడని అతడిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుడు స్పృహలోకి వస్తే తప్ప బాలుడిని ఎందుకు చంపాడన్న కారణాలు తెలియవని అన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యాత్రికుడు సప్తకోసి యాత్ర నిమిత్తం అక్కడికి వచ్చాడని బాలుడిని ఎందుకలా కొట్టి చంపాడన్న కారణాలు మాత్రం తెలియడం లేదని అన్నారు. చనిపోయిన బాలుడి తండ్రి అక్కడే ఒక జనరల్ స్టోర్స్ నడుపుతూ ఉంటాడని తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి ఇది కూడా చదవండి: 'వండర్లా'లో అపశ్రుతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. -
కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని కృష్ణజన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలను చేపట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. మధురలో రైల్వే భూభాగాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఆగష్టు 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే 100కు పైగా ఇళ్లను కూల్చివేశారు. అయితే.. ఇది పూర్తిగా అన్యాయమని బాధితులు సుప్రీకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ధర్మాసనం ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపి యధాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. రైల్వే ప్రాంతంలో నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుల తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. యూపీలో న్యాయవాదుల సమ్మె కారణంగానే కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఉన్నపళంగా వెళ్లగొడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేవలం 80 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఎన్నికల కమిటీ కీలక సమావేశం -
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసు వివాదంలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మధురు స్థానిక కోర్టు Mathura Court కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు అమిన్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 20వ(2023) తేదీలోగా సర్వే పూర్తి చేసి.. ఆ నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. జనవరి 2వ తేదీ తర్వాత నుంచి ఈ సర్వేను చేపట్టాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సూచించింది. షాహీ ఈద్గాలో ఉన్న 13.37 ఎకరాలు తమకు అప్పగించాలని హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ.. నోటీసులు జారీ చేసింది. అది కృష్ణ జన్మస్థలమని, మొగలు చక్రవర్తి ఔరంగజేబ్ అక్కడున్న ఆలయాన్ని కూల్చేయించి.. ఈద్గా కట్టించాడని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్‌లు వాదిస్తున్నారు. అంతేకాదు 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘ్‌కు, షాహీ మసీద్ ఈద్గాకు మధ్య జరిగిన ఒప్పందాన్ని సైతం వీళ్లు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇదిలా ఉంటే.. జ్క్షానవాపి మసీద్ కేసులోనూ వారణాసి కోర్టు ఇదే తరహాలో వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త.. ఆరేళ్ల తర్వాత షాక్..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలో షాకింగ్ ఘటన జరిగింది. భర్త చేతిలో హత్యకు గురైన భార్య ఆరేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షమైంది. మరొకరితో కలిసి హాయిగా జీవిస్తున్న ఆమెను చూసి భర్త షాక్ అయ్యాడు. ఆమె హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఏం జరిగిందంటే? ఆర్తి దేవి, సోను సైని 2015లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బృందావన్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముండే వారు. అయితే ఆర్తి కొద్ది రోజుల తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది తన కూతురిదే అని ఆర్తి తండ్రి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆర్తి భర్త సోను, అతని స్నేహితుడు గోపాల్‌పై హత్యానేరం కింద అభియోగాలు మోపారు. 2016లో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సోను 18 నెలలు, గోపాల్ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. హత్యను త్వరగా ఛేదించినందుకు పోలీసులకు రూ.15వేల నజరానా కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే సోను, గోపాల్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యారు. తన భార్య చనిపోలేదని భావించిన సోను ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆరేళ్ల తర్వాత ఆమెను మరొకరితో చూశాడు. వెంటనే మథుర పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన వారు.. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..