న్యూఢిల్లీ: తల్లి వద్ద హాయిగా నిద్రిస్తున్న చిన్నారిని ఒక దుండగుడు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన మధుర రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం...మధుర రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం పై తల్లి బిడ్లలు హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఒక దుండగుడు వారి వద్దకు సమీపించి నెమ్మదిగా ఆ తల్లి వద్ద నిద్రిస్తున్న ఏడునెలల చిన్నారిని అపహరించాడు.
ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవి ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోలో సదరు దుండగడు వారిని సమీపంచి పిల్లాడిని ఎత్తుకుని ఫ్టాట్ ఫాం పై ఆగి ఉన్న రైలు వద్దకు పరుగెడుతున్నట్లు కనిపించంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బిడ్డ ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు.
ఆ బిడ్డ ఆచూకి కోసం పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు పోలీసులు నిందితుడు ఫోటోని విడుదల చేసి, అతని గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అలాగే మథురతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్, హత్రాస్‌లో కూడా తమ రైల్వే పోలీసు బృందాలు చిన్నారి కోసం వెతుకుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment