ఇలాంటి మేకవన్నె పులి మీకు తగిలిందా? మహిళలూ తస్మాత్‌ జాగ్రత్త! | Woman Groped Twice by Man During Morning Walk cctv footage goes viral | Sakshi
Sakshi News home page

ఇలాంటి మేకవన్నె పులి మీకు తగిలిందా? మహిళలూ తస్మాత్‌ జాగ్రత్త!

Published Mon, Aug 5 2024 3:25 PM | Last Updated on Mon, Aug 5 2024 5:35 PM

Woman Groped Twice by Man During Morning Walk cctv footage goes viral

బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వాకింగ్‌ వెళ్లిన మహిళను వేధింపులకు గురిచేశాడో ప్రబుద్ధుడు. తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటనసీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది.

బెంగళూరుకు చెందిన  మహిళ కోననకుంటె ప్రాంతంలో ఒంటరిగా మార్నింగ్ వాక్‌కు  బయలుదేరింది. మరికొద్దిసేపట్లో రానున్న తన స్నేహితురాలికోసం వెయిట్‌ చేస్తోంది.  ఇంతలో  ఎక్కడ నుంచి వచ్చాడో తెల్లని చొక్కాలో గుర్తు తెలియని వ్యక్తి  ఆమెపై ఎటాక్‌ చేశాడు. వెనుక నుంచి ఆమెను వాటేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విస్తుపోయిన బాధితురాలు తనను తాను విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఎలాగో వదిలించుకునే వెళ్లిపోతోంటే మళ్లీ దొరకపుచ్చుకున్నాడు. గట్టిగా  నోరుమూయాలని ప్రయత్నించాడు.  కానీ ఆమె గట్ టిగట్టిగా  అరవడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆమెకు పెద్ద ముప్పు తప్పి నట్టయింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ‘@peepoye’ అనే  పేరుతో ఉన్  ఖాతాలో ఈ వీడియో  షేర్ అయ్యింది.  బాధిత మహిళ రాజస్థానీ అని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సౌత్ పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

 కాగా ఈ ఘటనపై  నెటిజన్లు ముఖ్యంగా మహిళలు స్పందించారు.ఇలాంటి మేక వన్నె పులులు చాలామంది పొంచి ఉంటారంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  పాలవాడి నుంచి మొదలు, టీచర్లు, సొంతబంధువులు కూడా సమయం  చూసి ఇలాంటి వేధింపులకు పాల్పడుతూ ఉంటారంటూ తన అనుభవాలను షేర్‌ చేసు కున్నారు. గట్టిగా అరవడం, తిరిగి ఎటాక్‌ చేయడం లాంటివి  చేయాలని సూచించారు. అంతేకాదు కుటుంబం సభ్యుల సహకారంతో ఇలాంటి దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తద్వారా మరోమహిళ ఇలాంటి వేధింపులకు గురి కాకుండా చూడాలని  వ్యాఖ్యానించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement