బెంగళూరులో దారుణం.. టోల్‌గేట్‌ వద్ద అరాచకం! | Car drags man At Bengaluru Toll Gate | Sakshi
Sakshi News home page

బెంగళూరులో దారుణం.. టోల్‌గేట్‌ వద్ద అరాచకం!

Published Sun, Feb 16 2025 12:09 PM | Last Updated on Sun, Feb 16 2025 1:13 PM

Car drags man At Bengaluru Toll Gate

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్‌గేట్‌ వద్ద ఓ వ్యక్తిని కారు కొంత దూరం లాకెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నెలమంగళలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టోల్‌బూత్‌ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్‌గేట్‌ వద్ద ఓ కారును మరో కారు ఓవర్‌ టేక్‌ చేయడంతో సదరు కారులో​ వ్యక్తి.. ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, టోల్‌బూత్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు కారులో డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.

ఈ క్రమంలోనే కారు స్టార్‌ చేసి.. వాగ్వాదానికి దిగిన వ్యక్తి కాలర్‌ పట్టుకుని కారును ముందుకు నడిపాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్‌ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement