వీడియో: ట్రాఫిక్‌లో ఓల్వో బస్సు బీభత్సం.. వాహనాలు నుజ్జునుజ్జు | Bangalore Volvo Bus Driver Loses Control And Rams Into Vehicles | Sakshi
Sakshi News home page

వీడియో: ట్రాఫిక్‌లో ఓల్వో బస్సు బీభత్సం.. వాహనాలు నుజ్జునుజ్జు

Published Tue, Aug 13 2024 3:23 PM | Last Updated on Tue, Aug 13 2024 3:23 PM

Bangalore Volvo Bus Driver Loses Control And Rams Into Vehicles

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్‌ ట్రాఫిక్‌ ఉన్న రోడ్డుపై ఓల్వో బస్సు ఒకటి అదుపు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. బెంగళూరులోని హెబ్బాల్‌ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్‌ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ముందుకు సాగుతుండటంతో సెకన్ల కాలంలోనే ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.  ముందుగా బైక్‌లను ఢీకొట్టిన బస్సు.. ఆపై రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది.

ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియో బస్సును కంట్రోల్‌ చేసేందుకు డ్రైవర్‌ ఎంత ప్రయత్నించాడో చూడవచ్చు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement