volvo bus accident
-
వీడియో: ట్రాఫిక్‌లో ఓల్వో బస్సు బీభత్సం.. వాహనాలు నుజ్జునుజ్జు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఓల్వో బస్సు ఒకటి అదుపు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ముందుకు సాగుతుండటంతో సెకన్ల కాలంలోనే ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా బైక్‌లను ఢీకొట్టిన బస్సు.. ఆపై రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది.ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియో బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించాడో చూడవచ్చు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. CCTV footage shows a Volvo bus going out of control and crashing into several vehicles. The incident, involving a BMTC AC Volvo bus, occurred at Hebbal in #Bengaluru. In this accident, two people were injured, and four cars and four bikes were damaged. pic.twitter.com/3AIMyhYVLK— Neelima Eaty (@NeelimaEaty) August 13, 2024 -
గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్
-
గాఢనిద్రలోనే... అనంతలోకాలకు
మిర్యాలగూడ అర్బన్: తెల్లవారుజాము.. బస్సు వేగంగా వెళ్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలిసేలోపు ఇద్దరి ప్రాణాలు పోయా యి. రాఖీ పండుగను జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వచ్చిన వారు పండుగను ముగించుకుని తిరిగి వెళ్తూ ప్రమాదం బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కామేపల్లి నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 40 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ బయలు దేరింది. తెల్లవారుజామున 3 గంటలకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకోగానే అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి బైపాస్‌పై చింతపల్లి క్రాసింగ్ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆస్పత్రి బయట తన ఇద్దరు పిల్లలతో దీనంగా కూర్చున్న క్షతగాత్రురాలు ముందుభాగంలో కూర్చున్న ప్రకాశం జిల్లా పెద్దకాల్వకుంటకు చెందిన మేడుగ మల్లికార్జున్ (40), ముక్కెనవారిపాలెంకు చెందిన కొత్త నాగేశ్వర్రావు (44) ఇద్దరూ లారీ, బస్సుకు మధ్యలో ఇరు క్కుని అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ వీరు జీవ నం సాగిస్తు న్నారు. రోడ్డు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుంటూరు జిల్లా నాగులవరం గ్రామానికి చెందిన సురభి జయరావు (42) మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 15 మంది, బస్సు డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సదానాగరాజు తెలిపారు. -
వోల్వో బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు.
-
వోల్వో బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు
-
ఆర్టీసీ బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ స్లీపర్ బస్సు హైవేపై లారీని తప్పించబోయి అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. కాగా కుమారి అనే మహిళ తలకు తీవ్ర గాయామైంది. ఆమెకు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో ప్రథమి చికిత్స చేసి.. కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అలాగే నిర్మల, దుర్గ అనే తల్లీకూతుళ్లకూ తీవ్ర గాయాలయ్యియి. వీరిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రమం హాస్పిటల్‌కు తరలించారు. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. -
వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితం
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద బుధవారం వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవ్వరు గాయపడలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులందరిని రక్షించారు. వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వోల్వో బస్సును రహదారిపై నుంచి పక్కకు తప్పించారు. ప్రయాణికులు మరో బస్సులో తమ తమ గమ్యస్థానాలకు పయనమవుతున్నారు. -
వోల్వో బస్సు ప్రమాదంలో నలుగురు మృతి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని వోల్వో బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బస్సు, లారీని ఢీ కొట్టడంతో బస్సు ముందుభాగం దాదాపుగా నుజ్జునుజ్జు అయింది. దాంతో నాలుగు మృతదేహాలు బస్సులో చిక్కుకుని పోయాయని.... వాటిని బయటకు తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారు హైదరాబాద్ లేద బెంగళూరు నగరానికి చెందిన వారా అనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 10మందికి గాయాలు
మెదక్ : మెదక్ జిల్లా మండలంలోనే బుదేరా శివారు 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు గురువారం లోయలోకి బోల్తా పడింది. సుమారు పదిమంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.... కర్ణాటకకు చెందిన ఓ ప్రేయివేటు ట్రావెల్స్ బస్సు బొంబాయి నుంచి హదరాబాద్ వస్తోంది. అయితే మండల పరిధిలోని బుదేరా చౌరస్తా సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. -
బస్సు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎంపీటీసీలకు గాయాలు
-
విహారయాత్రలో అపశ్రుతి: ఎంపీటీసీలకు గాయాలు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపీటీసీల విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సదరు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వోల్వో బస్సు మంగళవారం అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో ఆరుగురు ఎంపీటీసీలు గాయపడ్డారు. వారిని గుత్తిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీటీసీల బృందం విహారయాత్రకు బయలుదేరింది. -
వోల్వో బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటారం వద్ద కర్ణాటకకు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఆ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వోల్వో బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అధిక వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాలెం బస్సు ఘటనపై సీఐడీ చార్జిషీటు
-
పాలెం బస్సు ఘటన: జేసీ ప్రభాకర్ భార్య సహా 10 మందిపై చార్జిషీటు
పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనపై సీఐడీ విభాగం చార్జిషీటు దాఖలుచేసింది. వోల్వో బస్సు తయారీలోనే లోపాలున్నాయని, అందులోని డీజిల్ ట్యాంక్ టైర్లకు దగ్గరగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అందులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు సీట్ల డిజైన్ మార్చారని, అదికూడా ఈ ప్రమాదానికి కారణంగా మారిందని తెలిపారు. (చదవండి: వోల్వో బస్సు దగ్ధం - 44 మంది దుర్మరణం) ఈ కేసులో అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, జబ్బార్ ట్రావెల్స్, ఆర్అండ్బీ శాఖతో పాటు మొత్తం పదిమంది నిందితులపై చార్జి షీటు దాఖలైంది. ఈ బస్సు ప్రమాదంపై 400 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సీఐడీ పంపింది. మహబూబ్‌నగర్ కోర్టులో మే 7వ తేదీన చార్జిషీటు దాఖలు చేశారు. (చదవండి: ఎవరినీ వదిలిపెట్టం.. 40 రోజుల్లో ఛార్జిషీటు) -
వోల్వో బస్సు బోల్తా, 10 మందికి గాయాలు
కల్లూరు: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు సోమవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలోని పెద్దటేకూరు గ్రామ శివారులో బోల్తా పడింది. ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం ఎస్వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (కేఏ01 ఏఏ 9549) 48 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు పెద్దటేకూరు గ్రామం వద్ద లారీలో ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పింది. రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని పక్కనున్న పొలంలోకి పల్టీ కొట్టింది. బస్సు ముందు భాగంలోని పెద్ద అద్దాన్ని పగులగొట్టి డ్రైవర్ ప్రతాప్‌తో పాటు ప్రయాణికులంతా బయటకు వచ్చేశారు. గాయపడిన వారిని పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించి ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించారు. -
ప్రైవేటు వేయొద్దు ‘అనంత’ ఆర్టీఏ
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ప్రైవేట్ ఓల్వో బస్సు దుర్ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు వరుస దాడులతో తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ప్రైవేట్ బస్సుల యజమానులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురంలోని ఆర్టీఏ కార్యాలయం వద్దకు ప్రైవేట్ బస్సుల యజమానులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు బస్సులతో పాటు వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సుల యజమాని మునిరత్నం శ్రీనివాసులు మాట్లాడుతూ.. తలనొప్పి వస్తే.. వైద్యుడు తల తీసేయడని పేర్కొన్నారు. పాలెం దుర్ఘటన అనంతరం ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూపి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా బస్సులను సీజ్ చేయడం అన్యాయమన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు కంతులు కట్టలేక, సిబ్బందికి వేతనాలు చెల్లించలేక యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్ణాటకలోని హావేరి జిల్లాలో కూడా మరో ప్రమాదం జరిగిందని, అయితే అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను ఇలా సీజ్ చేయలేదని చెప్పారు. గతంలో విమాన ప్రమాదాలు కూడా జరిగాయని, మరి విమానాలను సీజ్ చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏవైనా సూచనలు, సలహాలు చేస్తే వాటిని ఆచరిస్తామని హామీ ఇచ్చారు. అలా కాకుండా దాడులు చేస్తే ఉద్యమాలతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. అనంతరం బస్సుల యజమానులు రవాణా శాఖ ఉప కమిషనర్(డీటీసీ) ప్రతాప్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు దాడులను ఆపేది లేదని స్పష్టం చేశారు. -
నిబంధనలు పాటించని బస్సులపై కేసులు
గన్నవరం, న్యూస్‌లైన్ : నిబంధనలకు విరుద్ధంగా బస్సు సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఉప రవాణాశాఖ కమిషనర్ సిహెచ్.శివలింగయ్య పేర్కొన్నారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అలిం డి యా పర్మిట్లు కలి గిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 225 ఉన్నాయన్నారు. వీటిలో 49 బస్సులకు సంబంధించి సర్వీసులు నడపలేమని యజమానులు పర్మిట్లను సరెండర్ చేశారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీ చేస్తున్న ప్రైవేటు బస్సులపై ప్రస్తుతం కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు ప్రమాదం జరగకముందు స్టేజ్ క్యారేజీ చేస్తున్న 200 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ఘటన అనంతరం ఇప్పటివరకు మరో 220 బస్సులపై కేసులు నమో దయ్యాయన్నారు. ఈ కేసులకు సంబంధించి బస్సుల యాజమానులు, డ్రైవర్లను కోర్టుల్లో హాజరుపరచగా, జరిమానాలు చెల్లించి బయటకు వస్తున్నారని తెలి పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం స్టేజ్ క్యారేజీ చేస్తున్న బస్సుల పర్మిట్లను మూ డు నెలల పాటు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.305 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ. 165 కోట్లు మాత్ర మే వచ్చిందని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, పన్నులు సక్రమంగా వసూలు కాకపోవడం ఇందుకు కారణాలని వివరించారు. ఇప్పటివరకు పన్నులు చెల్లించని వాహనాలకు సంబంధిం చి ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి సీజ్ చేస్తామని తెలిపారు. అవసరమైతే వాటి యాజమానులపై రెవె న్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పారు. హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్ల విధానాన్ని త్వరలో జిల్లాలో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి నంబరు పేట్ల తయారీ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించామని, 2015 డిసెంబరు నాటికి జిల్లాలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని శివలింగయ్య వివరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్ గరికపాడు (జగ్గయ్యపేట) : గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం వేకువజామున నిర్వహించిన తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సును సీజ్ చేసినట్లు చెక్‌పోస్టు ఇన్చార్జి మృత్యుంజయరాజు తెలి పారు. ఆరంజ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా తనిఖీ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీసు నిర్వహిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనిఖీల్లో వెహికిల్ ఇన్స్పెక్టర్లు నాయుడు, సోనిప్రియ, రాంబాబునాయక్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. -
వోల్వో బస్సు బోల్తా.. ఐదుగురి మృతి
కోలారు(కర్ణాటక), న్యూస్‌లైన్/సాక్షి, నెల్లూరు: పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే మరో వోల్వో బస్సు ప్రయాణికుల పాలిట మృత్యుశకటంగా మారింది. ఇంకో గంట గడిస్తే గమ్యానికి చేరాల్సిన వారిలో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నెల్లూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న వోల్వో బస్సు సోమవారం తెల్లవారు జామున కర్ణాటక రాష్ర్టం హొసకోటె వద్ద బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 28 మంది గాయపడ్డారు. మృతులందరూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావాసులే. మృతులు, గాయపడిన వారిలో అత్యధికులు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. శని,ఆదివారాలు సెలవు కావడం తో సొంత ఊళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు.. రాజేష్ ట్రావెల్స్‌కు చెందిన (కేఏ01ఏఏ7709) బస్సు ఆదివారం రాత్రి 10గంటలకు నెల్లూరు నుంచి 52 మంది ప్రయాణికులతో బెంగుళూరుకు బయలుదేరింది. తెల్లవారు జామున 5.30 గంటలకు బెంగళూరుకు 25 కిలోమీటర్ల దూరంలోని హొసకోటె సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై కుడివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొంది. కొంతదూరం అలాగే రాసుకుంటూ వెళ్లి ఎడమ వైపునకు బోల్తాపడింది. ఆ తర్వాత కూడా 30మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్లి నిలిచి పోయింది. దీంతో ఎడమవైపు సీట్లలో కూర్చున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రదీప్ బెంగుళూరులోని హాస్‌మాట్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందారు. గాయపడిన వారిని సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్న ఎంవీజీ వైద్య కళాశాల, బెంగుళూరులోని కొలంబియా ఏషియా, హాస్‌మాట్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా కుక్కల గుంపు అడ్డుగా రావడంతో కొద్దిగా కుడివైపుకు తీసుకోగానే బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి కొంతదూరం దూసుకెళ్లి బోల్తాపడిందనిడ్రైవర్ వెంకటప్ప తెలిపాడు. నెల్లూరుకు చెందిన అనూష (25), విజయ్‌కుమార్(32), మానస్‌కుమార్(06), గూడూరుకు చెందిన ప్రదీప్(25), పొదలకూరు మండలం వావింటపర్తికి చెందిన ప్రసాద్(28)లను మృతులుగా గుర్తించారు. తప్పులతడకగా ప్రయాణికుల జాబితా బస్సులో ఎక్కిన ప్రయాణికుల జాబితా తప్పులతడకగా ఉంది. ఒకరి పేరున మూడు రిజర్వేషన్లు, జాబితాలోని ఫోన్నంబర్ల వ్యక్తులు ప్రయాణం చేయకపోవడం, ప్రయాణం రద్దు చేసుకున్న వారి వివరాలు తెలపకపోవడంతో అసలు బస్సులో ఎవరు ప్రయాణిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రూ.లక్షఎక్స్గ్రేషియా: ఎంవీజీ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న క్షతగాత్రులను కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామన్నారు. బస్సు బీమా నుంచి కూడా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందుతుందని వెల్లడించారు. -
పాలెం బస్సు బాధితుల అరెస్ట్, పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు బాధితులను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేశారు. మంగళవారం వీరంతా హిమాయత్ నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి బయల్దేరగా.... పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యాయం చేయాలని కోరుతున్న తమను అరెస్ట్ చేయటం అమానుషమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ సీపీఐ నేతలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కాగా పాలెం బస్సు ప్రమాద బాధితులు ప్రధానంగా నాలుగు డిమాండ్లతో సినీ నటుడు శివాజీ నేతృత్వంలో నిన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బస్సు యజమాని జేసీ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అనుమతులతో ప్రైవేట్ బస్సులు నడిపించాలని వారు ఈ సందర్భంగా బొత్సను కోరారు. బాధితుల డిమాండ్లపై స్పందించిన బొత్స మాట్లాడుతూ బాధితుల డిమాండ్లు తీర్చే అధికారం తనకు లేదని, అయితే తన పరిధిలో న్యాయం చేస్తానని అన్నారు. ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రెండు రోజుల్లో లేఖ రాస్తానని చెప్పారు. -
కోటె సంతాప సభకు మెగాస్టార్ ఫ్యామిలీ
బెంగళూరు : కర్ణాటక మెగా ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షడు, దివంగత కోటె వెంకటేష్ యాదవ్ సంతాప సభ శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని టౌన్ హాలులో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు, అల్లు అరవింద్ కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువజన శాఖ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు ఆర్వీ దేవరాజ్, జమీర్ అహమ్మద్ హాజరు కానున్నారు. గత ఏడాది అక్టోబరు 29న తన సోదరి అనితతో కలిసి జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు ప్రమాదంలో కోటె వెంకటేష్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇటీవల వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి చిరంజీవి సోదరుడు నాగబాబు రూ.5 లక్షలు అందించారు. -
మాకే సాయం చేయలేని మీరు రాష్ట్రాన్నెలా పాలిస్తారు?
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత ఏడాది జరిగిన వోల్వో బస్సు దగ్ధం ఘటనలో బాధితులుగా మిగిలిన 45 మందికే సాయం చేయలేని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కోట్ల మంది రాష్ట్ర ప్రజలను ఏవిధంగా పాలిస్తారని, వారికి ఏవిధంగా సాయం చేస్తారని ‘పాలెం’ బాధితులు సూటిగా ప్రశ్నించారు. సీఎం పదవికి కిరణ్ అనర్హుడని, ఆయన వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఇక్కడ బస్సు దుర్ఘటన బాధితుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ పలువురు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బాధితులకు సాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్, బస్సు యాజమాన్యంపై కోర్టులో కేసు వేయాలని నిర్ణయించినట్టు తెలిపా రు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నేతృత్వంలో గురువారం అఖిలపక్ష బృందం సీఎంని కలువనున్నట్టు తెలిపారు. అనంతరం, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిసి, తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. -
ఎవరినీ వదిలిపెట్టం - 40 రోజుల్లో ఛార్జిషీట్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రయివేట్ వోల్వో బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని సీఐడీ ఛీఫ్ కృష్ణ ప్రసాద్ చెప్పారు. 40 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామన్నారు. 15 నిమిషాల్లోనే 45 మంది దుర్మరణం చెందారని తెలిపారు. పాలెం దుర్ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టం అని కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఇద్దరి అరెస్టులతోనే సరిపెట్టుకోం అన్నారు. చట్టపరంగా ఉన్న అంశాల్ని పరిశీలిస్తున్నామన్నారు. వోల్వో బస్సు బాడిబిల్డింగ్ లోపాలు, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు,అధికారుల నిర్లక్ష్యం , వీటన్నింటిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీసీ, ఎంవీ యాక్ట్ కింది నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
పాలెం సంఘటనపై చర్యలేవీ: బాధితులు
పాలెం బస్సు ప్రమాదం జరిగి ఇంతకాలమైనా ఇప్పటివరకు ఎవ్వరి మీదా చర్యలు తీసుకోలేదని ప్రమాద బాధితులు మండిపడ్డారు. ఇలాంటి సంఘటన మరోటి మన రాష్ట్రంలో జరగకూడదని వారు కోరుకున్నారు. తామంతా జీవచ్ఛవాల్లా మిగిలిపోయామని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోందని అన్నారు. వాళ్లిచ్చే లక్షతో తమ ఆవేదన తీరిపోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని మండిపడ్డారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి, రవాణామంత్రికి చీమకుట్టినట్లయినా లేదని, బస్సు దగ్ధం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బస్సు మాఫియా నడుస్తోందని, దాన్ని అడ్డుకునేందుకు అందరూ తమతో కలిసి రావాలని వారు అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాలెం బస్సు ప్రమాద బాధితులకు సంఘీభావంగా ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. -
వోల్వో 'బాధితుల ఆరని మంటల దీక్ష'
-
వోల్వో 'బాధితుల ఆరని మంటల దీక్ష'
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ వోల్వో బస్సు ప్రమాద బాధితులు ఇందిరా పార్కు వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిరసన తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలన్నారు. బాధితుల ధర్నాకు సీపీఐ ఎమ్మెల్యే చంద్రవతి సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు, ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రమాదానికి గురైన బస్సు యాజమానులు ఎవరో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా చేయగలదని చంద్రావతి అన్నారు. దేశం మొత్తం దిగ్ర్భాంతి వ్యక్తం చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలు చెబుతుందే కానీ, చేతల్లో శూన్యమని ఆమె విమర్శించారు. -
లీజు పత్రాలపై జేసీ సంతకం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమైన కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మహబూబ్‌నగర్ పోలీసుల నుంచి దాదాపు వెయ్యి పత్రాలను తీసుకున్న అధికారులు, తాము కూడా మరో ఐదు వందల వరకు పత్రాలను సేకరించారు. వీటన్నింటినీ న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. ఈ లీజు పత్రంపై దివాకర్ ట్రావెల్స్ తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి సంతకం ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో బస్సు పాలెం వద్ద ఘోర అగ్నిప్రమాదానికి గురై.. 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఐడీ అధికారులు ప్రమాదానికి అన్ని కోణాల నుంచీ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు... జేసీ దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సును జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చినట్లుగా చెబుతుండటంతో.. ఆ రెండు ట్రావెల్స్ మధ్య ఒప్పందాలేమిటి? వాటిలో ఏమైనా లొసుగులు ఉన్నాయా? తదితర అంశాలను గుర్తించడానికి ఆ పత్రాలను న్యాయ నిపుణుల పరిశీలనకు పంపారు. దుర్ఘటనకు గురైన వోల్వో బస్సు ఇంజన్లో లోపాలున్నాయని.. కర్ణాటక అధికారులు అక్కడి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వచ్చిన సమాచారంపైనా సీఐడీ దృష్టి సారించింది. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేయాలి: 'వోల్వో' బాధిత కుటుంబాలు
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో వోల్వో బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర రెడ్డిని అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాల వారు ఈరోజు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఒక్కో బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సులకు స్పీడ్ కంట్రోల్ మీటర్స్ పెట్టాలని కోరారు. తక్షణ చర్య తీసుకోకుంటే దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు. ప్రమాదానికి గురైన బస్సుపై జబ్బార్ ట్రావెల్స్ పేరు రాసి ఉన్నా, దాని అసలు యాజమానులు జెసి సోదరులేనని వారు ఆరోపిస్తున్నారు. బస్సుకు సంబంధించిన పర్మిట్లు, పన్ను చెల్లింపులు ఇప్పటికీ జేసీ సోదరులకు చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరుతోనే జరుగుతోంది. ప్రభాకర్‌రెడ్డి నడుపుతున్న దివాకర్ రోడ్ లైన్స్ ఈ బస్సును (ఏపీ02 టీఏ 0963) 2010లో ఆయన భార్య జేసీ ఉమారెడ్డి పేరుతో కొనుగోలు చేసింది. కర్ణాటక రవాణా శాఖ వెబ్సైట్లో కూడా బస్సు యజమానిగా ఇప్పటికీ ఆమె పేరే ఉంది. అయితే ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సును 2010లోనే జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించినట్లు చెబుతున్నారు. -
వోల్వో బస్సు ప్రమాద బాధితుల కమిటీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన జరిగి 18 రోజులైనప్పటికీ యజమానులను అరెస్టు చేయకపోవటాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బస్సు ప్రమాద బాధితుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. రాష్ర్టంలో చేతకాని ప్రభుత్వం ఉందని దుయ్యబ ట్టారు. 45 మందిని పొట్టనపెట్టుకున్న వోల్వో బస్సు యజమానులను అరెస్టు చేయలేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అక్రమ ప్రైవేటు బస్సులను ప్రభుత్వం నిషేధించకపోతే ప్రజలే వాటిని తగలబెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బస్సును ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినందున ఆ మరణాలు సర్కారు హత్యలేనని చెప్పారు. మహబూబ్‌నగర్ ఘటనను నిరసిస్తూ ఈనెల 18న హైదరాబాద్‌లోని వోల్వో షోరూమ్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ధర్నాకు సంఘీభావం ప్రకటించిన అనంతరం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిల రాజకీయ ప్రాబల్యం కారణంగానే కేసులు పెట్టడంలేదని ఆరోపించారు. వారిద్దరినీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వోల్వో బస్సులకు అనుమతిచ్చే విషయంలో సమగ్రంగా పరిశీలన జరగాలని కాం గ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సూచించారు. బాధితుల కమిటీ సభ్యుడైన అబ్దుల్ మాట్లాడుతూ దుర్ఘటన జరిగి 18రోజులైనా దోషులను ప్రకటించపోవడం బాధాకరమన్నారు. ఇదే వేరే దేశంలోనైతే బహిరంగంగా కాల్చేసేవారని పేర్కొన్నారు. -
‘వోల్వో’ మృతుల్లో నలుగురి గుర్తింపు
డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల అప్పగింత సాక్షి ప్రతినిధి, బెంగళూరు: కర్ణాటకలోని హావేరి వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో సజీవదహనమైన ఏడుగురు ప్రయాణికుల్లో నలుగురిని శుక్రవారం గుర్తించారు. హావేరి వద్ద వరదా నదిపై బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు దగ్ధమై ఏడుగురు సజీవదహనం కాగా 44 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మృతుల్లో సలీం భాను, అమీనా ఖాన్, నామన్ ఖాన్, కైఫ్ ఖాన్‌లను వారి బంధువులు గుర్తుపట్టారు. బస్సు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు పిల్లలు, ఓ మహిళ ఉండగా.. వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే ఐదుగురు. డ్రైవర్ నవాజ్ పాషా మృతదేహాన్ని అతడి చేతి గడియారం ఆధారంగా గుర్తించినట్లు తెలిసింది. అయితే పూర్తిగా ధ్రువీకరించలేదు. బంధువులు తమ వారి మృతదేహాలను గుర్తించగలిగినా, డీఎన్ఏ పరీక్షల అనంతరమే అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రుల్లో నలుగురు బెంగళూరులోని వివిధ ఆస్పత్రుల్లో చేరారని, వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. -
'వోల్వో బస్సు తయారీలో లోపం ఉండొచ్చు'
కర్ణాటకలో గురువారం ఉదయం సంభవించిన ఘోర బస్సు ప్రమాదంపై ఆ బస్సు యాజమాన్యం స్పందించింది. ప్రమాదానికి అతివేగం కారణం కాదని, బస్సు తయారీలో లోపం ఉండొచ్చని యజమాని వెల్లడించారు. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్‌కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేరీ జిల్లాలోని కునిమల్లళ్లిలో ప్రమాదానికి గురైంది. బస్సు డివైడర్‌ను డీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. వీరిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తం చేయడంలో కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగివుండేది. అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో వెల్లడించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సు 140 -150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు. హవేరి ప్రమాదం, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం వద్ద వోల్వో బస్సు అగ్ని ప్రమాదం ఘటనలు ఒకేలా ఉన్నాయని ఆయన చెప్పారు. మృతుల్లో ఒకరు ముంబైకి చెందిన శ్రీరాంగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరమే ప్రమాదం జరిగిన బస్సును కొనుగోలు చేశారని మంత్రి రామలింగారెడ్డి వివరించారు. కర్నాటక హవేరిలో ఘోర బస్సు ప్రమాదం దృశ్యాలు.. -
వోల్వోలో ప్రయాణం అంటేనే హడల్!
వోల్వో బస్సులో ప్రయాణమంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ఓల్వో బస్సు దుర్ఘటన మరువక ముందే కర్నాటకలోని హవేరి జిల్లా కునిమళ్లహళ్లి వద్ద ఈ తెల్లవారుజామున మరో వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో మంటలు లేచాయంటే క్షణాల్లో పూర్తిగా దగ్ధమైపోతుంది. వోల్వో బస్సు ప్రమాదానికి గురైందంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్‌కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున ప్రమాదానికి గురై కాలి బూడిదైపోయింది. ఏడుగురు సజీవ దహనం అయ్యారు. 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మృతులలో ఒకరిని ముంబైకి చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన భార్య,భర్త, ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో తన పాస్‌పోర్టు, డాక్యుమెంట్లు కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ అనే ప్రయాణికుడు వాపోతున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సును గత సంవత్సరమే కొనుగోలు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే హవేరీ జిల్లా ఎస్పి శశికుమార్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయినట్లు కర్నాటక మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. వరుసగా వోల్వో బస్సులే ప్రమాదానికి గురవుతుండటంతో బస్సు నిర్మాణంలో లోపాలు ఏమైనా ఉన్నాయోమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వోల్వో బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. అయితే వోల్వో బస్సు సురక్షితమైనదని రిటైర్డ్ జాయింగ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గాంధీ చెప్పారు. డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. -
పాలెం బస్సు దుర్ఘటనపై పూర్తి వివరాలివ్వండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం.. బొత్సకు నోటీసులు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ఇటీవల జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దుర్ఘటనపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్, కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, జబ్బార్ ట్రావెల్స్, శ్రీకాళేశ్వరి ట్రావెల్స్, ఓల్వో ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సుల నిర్వాహకులపై, అలాగే దర్యాప్తు నివేదిక ఆధారంగా బస్సు దుర్ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎస్.రాజు, రిటైర్డ్ ఇంజనీర్ రామ్మోహనరావు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న తర్వాత పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
కోటే కుటుంబానికి ‘చిరు’ సాయం
బెంగళూరు: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాద సంఘటనలో సజీవ దహనమైన కోటే వెంకటేశ్ యాదవ్ కుటుంబానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేసింది. బెంగళూరులో సోమవారం నిర్వహించిన కోటే పెద్దకర్మలో నటుడు నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కోటే అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తమపై చూపిన అభిమానాన్ని మరువలేమన్నారు. వెంకటేశ్ కుమార్తెలు ఇద్దరికి రూ. 3 లక్షలు, వెంకటేశ్ భార్య శాంత, కోటే తండ్రి సుందర్‌రాజ్‌లకు రాంచరణ్, అల్లు అర్జున్ అందించిన రూ. లక్ష డీడీలను అందజేశారు. -
వోల్వో బస్సు ప్రమాదంపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించి వోల్వో కంపెనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అలాగే రవాణా శాఖ, ఆర్టీసీలకు నోటీసులు ఇచ్చింది. వారంలోగా జవాబు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద సంఘటనపై విచారణ పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు వెల్లడి అయ్యింది. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
దివాకర్ రోడ్ లైన్స్‌పై క్రిమినల్ కేసు: బొత్స
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివారులో 45 మంది మృతికి కారణ మైన ఘోర దుర్ఘటనలో వోల్వో బస్సు యజమాని దివాకర్ రోడ్డు లైన్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సును ఆపరేట్ చేస్తున్నవారితో తమకు సంబంధం లేదని, నిబంధనల ప్రకారం బస్సు యజమాని హోదాలో ఉన్న జేసీ ఉమారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో రెండో డ్రైవర్ లేడని తేలిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా బస్సులను తనిఖీ చేస్తోందని, లోపాలున్న వాటిని వెంటనే సీజ్ చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 601 బస్సులపై కేసులు నమోదు చేయగా, 346 బస్సులను సీజ్ చేశామని, నల్లగొండ జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులను కూడా సీజ్ చేసినట్టు వివరించారు. మరో 4 మృతదేహాల గుర్తింపు బస్సు దగ్ధం దుర్ఘటనలో సజీవదహనమైనవారి మృతదేహాలకు సంబంధించిన మూడో జాబితాను బుధవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించారు. డీఎన్ ఏ నివేదికల ఆధారంగా బుధవారం మరో 4 మృత దేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఉస్మానియా మార్చురీ వద్ద బుధవారం 11 మృతదేహాలను అధికారులు మృతుల కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇప్పటివరకూ డీఎన్ఏ నివేదికల ఆధారంగా 38 మృతదేహాలను గుర్తించగా.. గత మూడురోజులుగా 35 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. -
తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుంది: బొత్స
హైదరాబాద్: తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. తీర్మానాన్ని కూడా పంపించాలని కోరినట్టు వెల్లడించారు. రెండు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తెలంగాణపై తమ పార్టీ మొదటి నుంచి క్లారిటీతో ఉందన్నారు. పీసీసీ చీఫ్‌గా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని గౌరవిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వాల్వో బస్సు జేసీ రోడ్ లైన్స్ పేరు మీద ఉందని బొత్స వెల్లడించారు. ఆర్టీఐ చట్టం ప్రకారం బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో 38 మృతదేహాలను గుర్తించామని తెలిపారు. 31 మృతదేహాలు బంధువులకు అప్పగించామన్నారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న బస్సులపై 601 కేసులు పెట్టామని, 340 బస్సులు సీజ్ చేశామని చెప్పారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. -
ఓల్వో బస్సు ప్రమాదంలో 20 మృతదేహాల గుర్తింపు
హైదరాబాద్: ఓల్వో బస్సు ప్రమాదంలో మృతి చెందినవారిలో 20 మందిని అధికారులు గుర్తించారు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహాలు ఉన్నాయి. కొద్దిసేపట్లో మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారులో గత నెల 31నఓల్వో బస్సు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయ్యారు. -
అగ్నికీలలకు నిండు గర్భిణి బలి
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు జడ్జి పల్లె మోహన్ కుమార్ ఇంట విషాదం అలముకుంది. మోహన్‌కుమార్ కుమార్తె పల్లె ప్రియాంక (25) బస్సు ప్రమాద ఘటనలో అగ్నికి ఆహుతయ్యారు. ఆమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి అని తెలిసింది. దీపావళి పర్వదినానికి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ సమీపంలోని హెచ్ఎస్ఆర్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న పెద్దమ్మ ఇంటికి బయలుదేరింది. బయలుదేరే ముందు కూడా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పింది. ప్రియాంక బాచుపల్లిలోని వీజేఐఎం కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసి మొదట ఐడియాలో, ఆ తర్వాత బెంగళూరులోని టెస్కో కంపెనీలో ఉద్యోగం చేశారు. భర్త కూడా టెస్కో కంపెనీలో టీం లీడర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి ఐబీపీఎస్ పరీక్షలకు ప్రిపేరవుతోంది. జడ్జి మోహన్‌కుమార్ కు ఆమె ఒక్కగానొక్క కుమార్తె అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక భర్త విమానంలో హుటా హుటిన నగరానికి చేరుకున్నారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బుధవారం సాయంత్రం చిక్కడపల్లిలోని హెచ్ఆర్ఎస్ అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తరలివచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. తల్లిని చూసేందుకు వస్తూ.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని పరామర్శించేందుకు భర్త, కుమార్తెతో కలిసి నగరానికి బయల్దేరిన జబీన్ ఫాతిమా బుధవారం నాటి దుర్ఘటనలో సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో భర్త అజ్మతుల్లాతో పాటు కుమార్తె ఉజ్మా ఫాతిమాను కూడా అగ్నికీలలు పొట్టనపెట్టుకున్నాయి. పాతబస్తీ డబీర్‌పురా పత్తర్‌కా మకాన్ ప్రాంతానికి చెందిన బట్టల వ్యాపారి సయ్యద్ అస్లాముద్దీన్, ఖమర్ బేగం దంపతులు. వీరికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు సంతానం. మూడో కుమార్తె జబీన్ ఫాతిమా (28). ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం బెంగళూర్ గుర్ధల్లి ప్రాంతానికి చెందిన కారు పార్కింగ్ నిర్వాహకుడు అజ్మతుల్లా(36)తో వివాహం జరిగింది. అజ్మతుల్లాకు నాంపల్లి రైల్వేస్టేషన్లో కారు పార్కింగ్ వ్యాపారం ఉంది. ఇక్కడి వ్యవహారాల్ని బంధువులకు అప్పగించాడు. అప్పుడప్పుడు నగరానికి వచ్చిపోతుంటాడు. ఈ దంపతుల కుమార్తె ఉజ్మాఫాతిమా(7). మానసిక వికలాంగురాలు. ఈమెకు బెంగళూరులోనే వైద్యం చేయిస్తున్నారు. జబీన్ ఫాతిమా తల్లి ఖమర్ బేగం గత కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతోంది. తల్లిని పరామర్శించేందుకు ఫాతిమా భర్త, కుమార్తెతో సహా మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి నగరానికి బయల్దేరింది. బుధవారం ఉదయం ఈ కుటుంబం అగ్నికీలలకు బలైంది. మమ్మీ.. ఐయామ్ ది విన్నర్... మచిలీపట్నం, న్యూస్‌లైన్: ‘‘మమ్మీ ఐయామ్ ది విన్నర్.. ఇంటర్వ్యూలో సెలెక్టయ్యాను.. అనుకున్న ఉద్యోగం సాధించాను.. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదికి రూ. 7,50 లక్షల ప్యాకేజీ.. బయలుదేరుతున్నా, రేపు ఉదయానికి వచ్చేస్తా ’’ అంటూ అమ్మతో ఆనందంగా చెప్పిన మాటలే ఆఖరు మాటలయ్యాయి. మంచి ఉద్యోగం దొరికిందన్న ఆనందంలో ఉండగానే.. ఆ యువకుడిని మృత్యువు కబళించింది. కృష్ణా జిల్లా బందరు వర్రెగూడెం వాసి తక్కెళ్ల సురేష్‌బాబు (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. బెంగళూరులోని హెచ్‌పీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్లి, ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పద్మ, తులసీరావులకు చెప్పి ఆనందాన్ని పంచుకున్నాడు. మరో నాలుగురోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది కూడా. హైదరాబాద్‌లో పనులు పూర్తిచేసుకునేందుకు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు. బస్సు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వెంటాడిన మృత్యువు.. సాక్షి, నరసరావుపేట/ నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: నాడు మృత్యువుతో పోరాడి గెలిచిన ఆ దంపతులు.. నేడు అదే మృత్యువుకు తలవంచారు. గతంలో రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిద్దరూ ఈసారి మాత్రం విధిరాతను తప్పించుకోలేకపోయారు. పాలమూరు బస్సు ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన గాలి బాలసుందరరాజు(55), అతని భార్య మేరి విజయకుమారి(52) సజీవదహనమయ్యారు. వీరి కుమార్తె గాలి సౌమ్య బెంగళూరు ఎంఎస్ రామయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్కిటెక్ ఇంజనీరింగ్ చదువుతోంది. కుమార్తె చదువు కోసం వీరు మూడేళ్లుగా బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. బాలసుందరరాజు, విజయకుమారి ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్‌లో వైద్య పరీక్షల నిమిత్తం వారిద్దరు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి బస్సులో బయలుదేరారు. మరో గంటలో బస్సు హైదరాబాద్ చేరుకుంటుందనగా దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ మరణించడంతో కుమార్తె సౌమ్య అనాథగా మారింది. ఈ ఘటనతో స్వగ్రామమైన రావిపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. 1989లో బాలసుందరరాజు దంపతులు బంధువులతో కలసి తమిళనాడులోని వేళాంగిణి మాతను దర్శించుకొని తిరిగి వస్తుండగా నెల్లూరు వద్ద వీరి కారు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో బాలసుందరరాజు దంపతులతో పాటు మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇది జరిగిన రెండు దశాబ్దాల తర్వాత బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. అమ్మా.. మంచి ఉద్యోగం వచ్చింది.. నర్సీపట్నం రూరల్ (విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: ‘‘అమ్మా.. మంచి ఉద్యోగం వచ్చింది.. జాయిన్ అయ్యేందుకు వెళ్తున్నా’’ అని కుమారుడు చెప్పిన మాటలే ఆ తల్లికి చివరి పలుకులయ్యాయి. దసరా పండుగకు ఇంటికి వచ్చి సందడి చేసిన కొడుకు.. పది రోజుల తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహ బూబ్‌నగర్ బస్సు ప్రమాదంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని కొత్తవీధికి చెందిన ఆడారి రవి(27) అగ్నికి ఆహుతయ్యాడు. రవి మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది. బెంగళూరులోని సీజీడీఎం సంస్థలో రవి రెండేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని వేరే కంపెనీలో ఉద్యోగం రావడంతో చేరేందుకు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు. మరో గంటలో హైదరాబాద్ చేరుకుంటాడనగా ఈ దుర్ఘటన జరిగింది. రవి చనిపోయాడన్న విషయం టీవీలో చూసిన అతని కుటుంబసభ్యులు దిగ్భ్రాంత్రికి గురయ్యారు. రవి తండ్రి కృష్ణ చింతపల్లిలోని జీసీసీలో అకౌంటెంట్. తల్లి చెల్లయ్యమ్మ గృహిణి. దసరాకు ఇంటికి వచ్చి పదిరోజుల క్రితమే బెంగళూరు వెళ్లాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని రవి సోదరుడు గణేష్ చెప్పాడు. కడసారి చూపు కరువైంది... పెగడపల్లి, న్యూస్‌లైన్: తమ కుమారుడు పండుగకు రెండు రోజుల ముందే ఇంటికి వస్తున్నాడని సంబరపడిన ఆ కుటుంబానికి తీరని విషాదమే మిగిలింది. మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థితిలో ఉంటాడనుకున్న కుమారుడు మరణించడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీట మునిగిపోయారు. బస్సు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమరేందర్ (31) సజీవ దహనమయ్యాడు. విట్టు రాజేశం-కళావతిల కుమారుడు అమరేందర్. చిన్న కిరాణ దుకాణం నడుపుతూ రాజేశం కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. అమరేందర్ ఎంసీఏ పూర్తి చేసి మూడేళ్ల కింద బెంగళూరులోని క్యాప్ జెమినీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. పండుగకని బెంగళూర్ నుంచి మంగళవారం రాత్రి బస్సులో బయలుదేరాడు. కానీ, తనవారిని చూసుకోకుండానే మృత్యువాత పడ్డాడు. అమరేందర్‌కు పెళ్లయి ఏడాది కూడా కాలేదు. ఆయన భార్య నర్మద ప్రస్తుతం గర్భంతో ఉంది. అమరేందర్ మరణాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీళ్లే మిగిలాయి... కామారెడ్డి, న్యూస్‌లైన్: తన భర్త మరికొద్ది గంటల్లో వచ్చేస్తాడని ఎదురుచూసిన ఆ భార్యకు కన్నీళ్లే మిగిలాయి. కన్నకొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. మహబూబ్‌నగర్ బస్సు దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కుసుమ వేదపతి (27) దుర్మరణం పాలయ్యారు. రిటైర్డ్ ఉద్యోగి విఠల్-సుశీల దంపతుల కుమారుడు వేదపతి. బెంగళూరులోని డచ్ బ్యాం కులో ఉద్యోగం చేస్తున్న వేదపతి దీపావళి కోసం మంగళవారం రాత్రి బస్సులో బయలుదేరి, ప్రమాదంలో మరణించారు. చానళ్లలో వస్తున్న ప్రమాద వార్తలు చూస్తూ.. మృతుల జాబితాలో కుమారుడి పేరు రావడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తల్లి సుశీల స్పృహ తప్పి పడిపోగా ఆస్పత్రికి తరలించారు. వేదపతికి వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. భార్య స్వర్ణలత కామారెడ్డిలో అత్తవారింట్లోనే ఉండి, ఎంబీఏ చదువుతోంది. కాలేజీ నుంచి వచ్చే సరికి తన భర్త వచ్చేస్తారనే ఆనందంలో ఉన్న ఆమె.. మరణవార్త తెలియడంతో హతాశురాలైపోయారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కబళించిన మృత్యుకౌగిలి.. రామచంద్రపురం, న్యూస్‌లైన్: బంధువుల ఇంట్లో వివాహం కోసం వస్తూ.. ఓ కుటుంబం మృత్యుకౌగిలిలోకి వెళ్లిపోయింది. మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన పలుకూరి నాగవెంకటరాజేష్(31), ఆయన భార్య రమ్య (26), వారి కుమార్తె రితిమ(3) ఈ ప్రమాదంలో మృతి చెందారు. బెంగళూరులో సీసీఎస్ కంపెనీలో రాజేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, రమ్య మరో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఇటీవలే ఉద్యోగంలో చేరారు. బెంగళూరులోనే నివసిస్తున్న వీరు.. రమ్య మేనమామ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వస్తూ ప్రమాదానికి గురయ్యారు. రామచంద్రపురానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బచ్చు వీరభద్రరావు, రత్నావతి దంపతుల కుమారుడైన రాజేష్‌ను.. అమ్మమ్మ పలుకూరి మంగరాజు దత్తత తీసుకున్నారు. ఎంసీఏ చదివిన రాజేష్‌కు కాకినాడకు చెందిన రమ్యతో 2009లో వివాహమైంది. చిన్నారితో సహా రాజేష్ దంపతులు దుర్మరణం చెందారన్న వార్తతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి పత్రికలు పంచేందుకు వస్తూ... రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బంధువును పరామర్శించేందుకు బెంగళూరు నుంచి నగరానికి బయలుదేరిన అక్కా తమ్ముడు బస్సుప్రమాదంలో అగ్నికి బలయ్యారు. బెంగళూరుకు చెందిన అనిత(50), వెంకటేష్ (45) అక్కాతమ్ముళ్లు. అనిత కుమార్తె వివాహం వచ్చే నెలలో చేసేందుకు నిర్ణయించారు. వివాహ శుభలేఖలు అందించే కార్యక్రమంలో వీరు బిజీగా ఉన్నారు. నగరంలోని కోఠి ఇసామియాబజార్‌కు చెందిన హేమలతకు వీరు బంధువులు. హేమలత గుండె జబ్బుతో బాధపడుతూ ఇటీవలే సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరామర్శించడంతో పాటు వారికి శుభలేఖను కూడా అందించాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి నగరానికి మంగళవారం రాత్రి జబ్బార్ ట్రావెల్స్ బస్సులో బయల్దేరారు. మంగళవారం రాత్రి 11.30కు హేమలత కుమారుడు లలిత్‌కుమార్‌కు ఫోన్ చేశారు. తాము నేరుగా ఆస్పత్రికి వస్తామని తరువాత మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఘోరప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వెంకటేష్ కర్నాటకలో చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు. అమ్మను చూడడానికి వెళ్లి.. సాక్షి, బెంగళూరు: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసి రావడానికి బయలుదేరిన మహిళ.. తన భర్తతో సహా మృత్యువుకు బలైంది. వారితో పాటు మరో చిన్నారి మైథిలి (8)ని మృత్యువు కబళించింది. బెంగళూరులోని జయనగర్‌కు చెందిన గిరిధర్(55) రామ్‌కో సంస్థలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే వాసంతి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. చూసిరావడానికి గిరిధర్, వాసంతి, మరో చిన్నారి మైథిలితో కలసి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గ మధ్యలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. స్నేహితుడితో కలసి.. సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని గురప్పన పాళ్యలో మెకానిక్‌గా పనిచేసే షోయబ్.. బైకులు, కార్ల మరమ్మతులకు అవసరమైన విడిభాగాలను హైదరాబాద్‌కు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇదే విధంగా మంగళవారం రాత్రి స్నేహితుడు అకీబ్తో కలసి ప్రమాదానికి గురైన బస్సులో (సీట్ నం.. ఏ11, బీ11)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రమాదంలో కన్నుమూశారు. -
వామ్మో.. వోల్వో..
అత్యవసర ద్వారాలు ఉండవు.. ఎమర్జెన్సీ విండో గ్లాసులుంటాయి ప్రమాదం జరిగిన బస్సులో వాటిని పగలగొట్టే హ్యామర్లు లేవు విదేశాల్లోని రోడ్లకే కానీ మన రహదారులకు సరిపోవు సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక హంగులతో, సకల సదుపాయాలతో, అపరిమిత వేగంతో దూసుకుపోయే వోల్వో బస్సుల్లో ప్రయాణం ఎంత విలాసవంతమో అంత ప్రమాదకరమని బుధవారం నాటి ఘటనతో తేలిపోయింది. సాధారణంగా అన్ని బస్సుల్లో అత్యవసర ద్వారాలు(ఎమర్జెన్సీ డోర్స్) ఉంటాయి. కానీ బుధవారం దగ్ధమైన వోల్వో బస్సులో ఈ అత్యవసర ద్వారాలు లేవు. కానీ, ప్రమాద సమయంలో బయటపడేందుకు వీలుగా నాలుగు ఎమర్జెన్సీ విండో గ్లాస్లు మాత్రం ఉన్నాయి. మంటలను అదుపు చేసేందుకు వాహనంలో సహాయకుడి సీట్ వద్ద ఒకటి, వెనకభాగంలో ఒకటి.. రెండు ఫైర్‌సేప్టీ కిట్లు కూడా ఉంటాయి. ఎమర్జెన్సీ విండోలు సీట్ల వరుసలో 5,6,7,8 సీట్ల వద్ద , 33,34,35,36 సీట్ల వద్ద రెండు వైపులా ఉంటాయి. వీటిని తేలిగ్గా పగులగొట్టవచ్చు. ఇవి సింగిల్ గ్లాస్‌తో గ్యాస్ నింపి తయారు చేస్తారు. అయితే, ఈ విషయం సామాన్యంగా ప్రయాణికులకు ఎవరికీ తెలియదు. బస్సు బయలుదేరే ముందు డ్రైవర్ ఆ విషయం ప్రయాణికులకు వివరించాలి. అయితే, వాటిని పగులగొట్టేందుకు అవసరమైన హ్యామర్లు మాత్రం ఆ బస్సులో లేవు. అంతేకాదు ప్రమాద సమయాల్లో ఎలా వ్యవహరించాలి, సేఫ్టీ కిట్లను ఎలా ఉపయోగించాలన్న విషయాలను డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసేముందు ప్రయాణీకులకు వివరించాలి. డ్రైవర్ అదీ చేయలేదు. దాంతో ప్రయాణీకులకు కనీసం గాయాలతో అయినా బయటపడే అవకాశం లభించలేదు. ప్రమాదానికి ఇలా అవకాశం... వోల్వో బస్సులకు డ్రైవర్సీట్ కిందిభాగంలో రెండు బ్యాటరీలు ఉంటాయి. వీటి నుంచే ఎ/సి, టీవి, స్పీకర్స్, లైట్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. రోడ్డుపైన స్పీడ్‌బ్రేకర్లు, గుంతలు, ఎత్తై కల్వర్టులు వంటివి వచ్చినప్పుడు బస్సు ముందుభాగం భూమిని తాకుతుంది. ఆ సమయంలో బ్యాటరీలు రెండూ రాపిడికి గురై మంటలు వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీల్లో వచ్చిన మంటలు విద్యుత్ వైర్ల ద్వారా బస్సు మొత్తం త్వరగా వ్యాపించేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పైగా బ్యాటరీలకు పక్కనే కొద్దిగా పైన డిజీల్ ట్యాంక్ ఉంటుంది. బుధవారం నాటి ప్రమాదంలో మొదట బ్యాటరీల్లో మంటలు అంటుకొని అవి ఆయిల్ట్యాంకర్కు వ్యాపించి ఉండవచ్చునని, దాంతో బస్సు మొత్తం క్షణాల్లో బూడిదైందని వారు భావిస్తున్నారు. అంతేకాకుండా, విదేశీ రహదారులు, అక్కడి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వోల్వో బస్సులు మన రహదారులకు అనుకూలం కాదనే అభిప్రాయం కూడా ఉంది. రాష్ట్రంలో దాదాపు 500 వోల్వో బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న వోల్వో బస్సుల సంఖ్య దాదాపు 500 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో 109 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. వాటిలో డబుల్ యాక్సిల్(గరుడ ప్లస్) బస్సులు 21 ఉండగా, 80 బస్సులు సింగిల్ యాక్సిల్(గరుడ) బస్సులు ఉన్నాయి. మరో 8 బస్సులను సిటీ శీతల్ పేరిట హైదరాబాద్‌లో తిప్పుతోంది. అవి కాకుండా మరో 400 వోల్వో బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు తిప్పుతున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగుళూరు, చెన్నై, షిర్దీ, ముంబై తదితర ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు. -
బస్ దుర్ఘటనపై లెఫ్ట్, బీజేపీ దిగ్భ్రాంతి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం కావడం పట్ల వామపక్షాలు, బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశాయి. రహదారుల భద్రతను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టాయి. ఆర్టీఏ అధికారుల అవినీతి, ప్రైవేటు ఆపరేటర్ల దుర్నీతి, అతివేగం ప్రయాణీకుల పాలిట శాపంగా మారాయని వేర్వేరు ప్రకటనల్లో దునుమాడాయి. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని సీపీఐ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు కె.నారాయణ, బీవీ రాఘవులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆపరేటర్ల ఆగడాలను అరికట్టి ఇప్పటికయినా ప్రభుత్వ రంగ రవాణాను పెంపొందించేలా చూడాలని రాఘవులు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రమాదానికి బాధ్యులయిన బస్సు యాజమాన్యంపైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఓబులేసు సంఘటనా స్థలాన్ని సందర్శించి వచ్చారు. మానవ తప్పిదంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు కొందరు సొంత సంస్థలను నడుపుతూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని నివారించాలని, వారి ఆగడాలకు కళ్లెం వేయాలని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి దత్తాత్రేయ లేఖ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లకు సంబంధించి జాతీయ రహదారుల క్రమబద్ధీకరణ విధానం ఏమిటో చెప్పాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ రాష్ట్రముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ విధానం లేకపోవడమే ఘోరప్రమాదాలకు కారణమవుతోందని బుధవారం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన 74వ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటు ఆపరేటర్ల విధివిధానాలకు ఖరారు చేసేందుకు ఇప్పటికయినా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియోను చెల్లించాలని కోరారు. -
కడుపులో బిడ్డతోసహా కాలిపోయిన ప్రియాంక
హైదరాబాద్: ఓ వైపు తల్లిని కాబోతున్నానన్న ఆనందం - మరోవైపు దీపావళి పండుగకి పుట్టింటికి వెళుతున్నానన్న సంబరం .... ఇవన్నీ ప్రియాంకకు ఎంతోసేపు నిలువలేదు. అన్ని కాలిబూడిదైపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై ఈ ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటన ప్రియాంకతోపాటు ఆమె కడుపులోని బిడ్డ కాలి, మాడి, మసైపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి మోహన్‌కుమార్ చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె ప్రియాంకకు బెంగళూరుకు చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్యా భర్తలిద్దరూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. దీపావళి పండుగకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని పుట్టింటికి వస్తుండగా ప్రియాంకను ఓల్వో బస్సు పొట్టనబెట్టుకుంది. తమ బిడ్డ పండక్కి వస్తోందన్న ఆనందంలో ఉన్న ప్రియాంక తల్లి తండ్రులు మరణవార్తని తట్టుకోలేకపోతున్నారు. -
ఓల్వో బస్ డ్రైవర్, క్లీనర్ అరెస్ట్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై ఈ ఉదయం ప్రమాదానికి గురైన జబ్బార్ ట్రావెల్స్ ఓల్వో బస్ డ్రైవర్ ఫిరోజ్, క్లీనర్ ఫయాజ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపిసి 337, 338, 304 ఏతోపాటు, మోటర్ వెహికల్ యాక్ట్ 109 , 177 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లక్డికపూల్లో జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న నయీమ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని కొత్తకోట వద్ద ప్రమాద స్థలికి తీసుకు వెళ్లి విచారణ జరిపారు. ఈ బస్సు ప్రమాదంలో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమయిన విషయం తెలిసిందే. ప్రయాణికులలో కేవలం అయిదుగురు మాత్రమే బతికారు. -
పండుగ రూపంలో మృత్యువు కబళించింది
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న అనిల్ సింగ్ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. అనిల్ సింగ్ కుమారుడు అక్షయ్ సింగ్ ఈ ప్రమాదంలో అశువులు బాశాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అక్షయ్ సింగ్ ఈ నెల 26న తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. అప్పుడు వాయిదా వేసుకుని దీపావళి పండుగకు హైదరాబాద్ కు ప్రయాణమయ్యాడు. ఇంతలోనే బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు అతడిని కబళించింది. అక్షయ్ సింగ్ తండ్రి చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఇక్కడ పనిచేస్తున్నారు. అక్షయ్ సింగ్ మృతితో చిక్కడపల్లిలోని అతని నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగకు సొంతవూరు వస్తూ మృత్యువాత నిజామాబాద్ : దీపావళి పండుగ వేళ సొంత వూరికి వస్తున్న వారు గమ్యం చేరుకోకుండానే బస్సు రూపంలో మృతువాత పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవుని పల్లి గ్రామానికి చెందిన కుసుమ వేదపతి ఉన్నారు. సాప్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న వేదపతికి 11 నెలల క్రితమే స్వర్ణ లత అనే యువతితో వివాహం అయింది. పండగకు వస్తానని ఫోన్ ఇంట్లో వారికి చెప్పారు. ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, భార్యకు ప్రమాద సమాచారం తెలిసి కుప్పకూలిపోయారు. వేదపతి మరణించాడని తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటికి వస్తే మృత్యుఒడికి చేరిన సాఫ్ట్వేర్ ఇంజనీరు కరీంనగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదం కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచర్లలో విషాదాన్ని నింపింది. నంచర్లకు చెందిన విట్టు అమరేందర్ బెంగళూరు క్యాప్‌జెమిని సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి గతేడాది జగిత్యాలకు చెందిన నర్మదతో వివాహమైంది. దీపావళి సందర్భంగా అమరేందర్ స్వస్థలానికి బయలుదేరాడు. అనుకోకుండా బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం నర్మద గర్భవతి కావడంతో ఆమెకు భర్త మరణించిన విషయం తెలియజేయలేదు. ప్రస్తుతం అమరేందర్ మృతితో బంధువుల్లో తీవ్ర విషాదం నింపింది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటాడనుకుంటే... ఊహించని విధంగా మృత్యుఒడికి చేరాడని, తమకింక ఎవరు దిక్కంటూ మృతుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైద్య పరీక్షలకు వస్తూ తిరిగిరాని లోకానికి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. బెంగళూరులో ఉంటున్న సుందర రాజు, అతని భార్య ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరచూ వస్తుంటారు. ఆ క్రమంలోనే మంగళవారం రాత్రి బెంగళూరులో జబ్బార్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు బయలు దేరారు. అయితే మార్గ మధ్యంలోనే ప్రమాదం జరిగి భార్యభర్తలిద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే మృతులు సుందరరాజు స్వగ్రామం తాళ్లూరులోనూ, అతని భార్య సొంతూరు రావి పాడులోనూ విషాద చాయలు అలముకున్నాయి. -
బస్సు యాక్సిడెంట్‌పై స్పందించిన బొత్స
-
బెంగళూరులో జబ్బర్ ట్రావెల్స్ యజమాని పరారీ
బెంగళూరు : మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన జబ్బర్ ట్రావెల్స్ బెంగుళూరు కార్యాలయం యజమాని షకీల్ పరారీలో ఉన్నాడు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న షకీల్ ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకపోవటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, మిగతా కార్యాలయాల వద్ద బెంగళూరు సివిల్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బస్సు ప్రయాణికుల వివరాలను బెంగళూరు పోలీసులు సేకరిస్తున్నారు. రెండు బస్సుల ప్రయాణికులను ఒకే బస్సులో తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు రిజిస్ట్రేషన్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. రాత్రి పది గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరిన బస్సులో చాలామంది బెంగళూరుకు చెందినవారు ప్రయాణికులే ఉన్నారు. బస్సు నుంచి ఇప్పటివరకూ 44 మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. -
బాధితుల సమాచారం కోసం బంధువుల ఆందోళన
-
బాధితుల సమాచారం కోసం బంధువుల ఆందోళన
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమవారి వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నాయి. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమవారి వివరాలు చెప్పాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రయాణికుల వివరాల కోసం వారి బంధువులను మీడియా ప్రతినిధులు కోరగా... ప్రస్తుతం తాము మాట్లాడే స్థితిలో లేమని తెలిపారు. మరోవైపు పోలీసులు జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. -
వోల్వో బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
వోల్వో బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద ఈ రోజు తెల్లవారుజామున వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోర్టు ఆంక్షల కారణంగా ప్రమాద ఘటన స్థలానికి వెళ్లలేకపోతున్నాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లాల్సిందిగా వైఎస్ జగన్ పార్టీనేతలను ఆదేశించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో బస్సు రొడ్డుపక్కనే ఉన్న కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఆ కల్వర్ట్‌కు డీజిల్ ట్యాంక్ తగలడంతో ట్యాంక్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. దాంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికుల్లో నలుగురు మాత్రం ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగిలినవారంత అగ్నికి ఆహుతి అయ్యారు.