కల్లూరు: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు సోమవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలోని పెద్దటేకూరు గ్రామ శివారులో బోల్తా పడింది. ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం ఎస్‌వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (కేఏ01 ఏఏ 9549) 48 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది.
తెల్లవారుజామున 3.30 గంటలకు పెద్దటేకూరు గ్రామం వద్ద లారీలో ఓవర్‌టేక్ చేయబోయి అదుపు తప్పింది. రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని పక్కనున్న పొలంలోకి పల్టీ కొట్టింది. బస్సు ముందు భాగంలోని పెద్ద అద్దాన్ని పగులగొట్టి డ్రైవర్ ప్రతాప్‌తో పాటు ప్రయాణికులంతా బయటకు వచ్చేశారు. గాయపడిన వారిని పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించి ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించారు.
వోల్వో బస్సు బోల్తా, 10 మందికి గాయాలు
Published Mon, May 26 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement
Advertisement