ఆర్టీసీ బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ స్లీపర్ బస్సు హైవేపై లారీని తప్పించబోయి అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ప్రయాణికులు గాయపడ్డారు.
కాగా కుమారి అనే మహిళ తలకు తీవ్ర గాయామైంది. ఆమెకు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో ప్రథమి చికిత్స చేసి.. కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అలాగే నిర్మల, దుర్గ అనే తల్లీకూతుళ్లకూ తీవ్ర గాయాలయ్యియి. వీరిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రమం హాస్పిటల్‌కు తరలించారు. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.