volvo bus
-
ఫ్లైఓవర్‌పై వోల్వో బస్సు బీభత్సం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఫ్లైఓవర్‌పై మంగళవారం(ఆగస్టు13)వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. వోల్వో బస్సు అదుపుతప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వోల్వో బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
వోల్వో.. వద్దు
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది. సామర్థ్యానికి మించి నడపటంతోనే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు. అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది. పోటీని తట్టుకోగలదా..? ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం. -
గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్
-
బస్సుకు అడ్డుగా వచ్చాడని చితకబాదడు
-
అడ్డుగా వచ్చాడని నడిరోడ్డుమీద చితకబాదాడు..!
బెంగుళూరు : బస్సుకు అడ్డుగా వచ్చాడని ఆరోపిస్తూ బీఎంటీసీ వోల్వో బస్ డ్రైవర్ ఓ ద్విచక్రవాహన దారుడిని డ్రైవర్ చితకబాదిన ఘటన బెంగుళూరులోని మహదేవ్‌పురాలో గురువారం చోటుచేసుకుంది. దీంతో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ డ్రైవర్ సంతోష్ బాడిగర్ పై చర్యలు చేపట్టింది. అతన్ని సస్పెండ్ చేస్టున్నట్టు వెల్లడించింది. బైకిస్ట్పై దాడి దృశ్యాలను కె.హమీద్ అనే ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్ డ్రైవర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ ప్రైవేటు వ్యక్తిని పబ్లిక్‌గా చితకబాదడం సమంజసమా..! అని హమీద్ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. బస్సు నెమ్మదించినప్పుడు బైకిస్ట్ అడ్డుగా వచ్చి పక్కకు వెళ్లిపోయాడని, అతని తప్పు ఏమీ లేదని పేర్కొన్నాడు. కాగా, డ్రైవర్ అనుచిత ప్రవర్తనై బీఎంటీసీ క్షమాపణలు చెప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వమని వెల్లడించింది. ఇక సదరు ప్రయాణికుడిని సైతం బస్ డ్రైవర్ బెదిరించడం గమనార్హం. నువ్వెవరు నన్నడగడానికి..? అంటూ సంతోష్ బాడిగర్ హమీద్‌పై బెదిరింపులకు దిగాడు. ఇక ద్విచక్ర వాహనదారుడితో ఓ యువతి కూడా ఉండటం గమనార్హం. -
అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్
సాక్షి, చిత్తూరు : విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న టాటాఏస్ వాహనంపై పడిపోయింది. ఈ ఘటన రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. బస్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టాటాఏస్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రేణింగట అర్బన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేగం, బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. -
ఆర్టీసీ బస్సు బీభత్సం
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ఆర్టీసీ వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. పారిశుద్ధ్య కార్మికులను తప్పించే క్రమంలో మద్దిలపాలెం ఆటోమోటివ్ నాలుగు రోడ్ల జంక్షన్లో కుడివైపు ఉన్న డివైడర్‌పైకి దూసుకొచ్చింది. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన వ్యాన్‌ను ఢీకొట్టింది. వివరాలిలా ఉన్నాయి. మద్దిలపాలెం డిపోకు చెందిన వోల్వో బస్సు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతోంది. ఈ బస్సు గురువారం ఉదయం 8 గంటల సమయంలో మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి కొందరు పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు దాటుతుండగా.. వారిని తప్పించే క్రమంలో డ్రైవర్ ఎం.బి.ఎం.రాజు బస్సును కుడివైపు మలుపు తిప్పడంతో అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకుపోయింది. ఇదే సమయంలో ఇసుకతోట నుంచి మద్దిలపాలెం వైపు వస్తున్న వ్యాన్‌ను బస్సు బలంగా ఢీకొట్టింది. వ్యాను డ్రైవర్ జయరామ్ క్యాబిన్లో చిక్కుకుపోవడంతో పోలీసులు, స్థానికులు అతన్ని బలవంతంగా బయటకు తీశారు. ఆయన కాలు విరిగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. వ్యాను ముందు భాగం నుజ్జయింది. బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. వ్యాను డ్రైవర్‌ను జగదాంబ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, మద్దిలపాలెం డిపో మేనేజర్ కవిత సంఘట స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. క్రేన్ల సాయంతో బస్సును రోడ్డు పక్కకు తీశాక మద్దిలపాలెం డిపోకు తరలించారు. దాదాపు గంట సేపు ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చాలా మంది వాహనచోదకులు శివాజీపాలెం, పిఠాపురం కాలనీ మీదుగా రాకపోకలు సాగించారు. బస్సు డ్రైవర్‌ను ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంవీపీ స్టేషన్ సీఐ సన్యాసినాయుడు పర్యవేక్షణలో ఎస్ఐ రవికుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అమ్మో.. ఆటోమోటివ్ జంక్షన్ మద్దిలపాలెం ఆటోమోటివ్ నాలుగు రోడ్ల కూడలి నిత్యం ట్రాఫిక్‌జామ్‌తో వాహనచోదకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజూ అధిక సంఖ్యలో అంతర్ జిల్లా బస్సులు, సిటీ బస్సులు, ఇతర వాహనాలు ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లు దాటాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కూడలిలో గతంలో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయినా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కృష్ణా డిగ్రీ, జూనియర్, ఒకేషనల్ కళాశాలలకు చెందిన విద్యార్థులు వేలాది మంది ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు. అధిక సంఖ్యలో వాహనాలు, బస్సులు ఒక్కసారిగా దూసుకురావడంతో పాదచారులు హడలిపోతున్నారు. ఈ కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: వోల్వో బస్సు బోల్తా
సాక్షి, వనపర్తి : జిల్లాలోని పెద్దమందడి మండలం వెల్టూరు సమీపంతో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్తున్న వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ అతివేగంతో నడపడమో దీనికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. -
వోల్వో బస్సులో అగ్నిప్రమాదం
చెన్నై : కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఏసీ బస్సు శనివారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు వెనక భాగంలో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. తమిళనాడులోని పూనమల్లె జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి మంటలను ఆర్పివేశారు. -
వోల్వో బస్సులో అగ్నిప్రమాదం
-
ట్రావెల్స్ బస్సు బోల్తా
- 19 మందికి గాయాలు - నలుగురి పరిస్థితి విషమం - డ్రైవర్ కునుకుపాటే కారణం జూపాడుబంగ్లా: కర్నూలు - గుంటూరు రహదారిపై తరిగోపుల అంచె సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కొండారెడ్డి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ ఓల్వాబస్సు ఆదివారం రాత్రి 10.30 గంటలకు 24 మంది ప్రయాణికులతో కర్నూలుకు బయలుదేరింది. అర్ధరాత్రి 1.30 గంటలకు దోర్నాల చెక్‌పోస్టు దాటిన బస్సు సోమవారం తెల్లవారుజామున 80 బన్నూరు సమీపంలోని తరిగోపుల అంచె మలుపు వద్ద డ్రైవర్ మద్దిలేటి రెప్పపాటు కునుకు తీయటంతో బస్సు అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న రాయిని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సు బోల్తా పడటంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తేరుకొని చూసేలోగా అందరూ చెల్లా చెదురుగా పడి ఉన్నారు. ప్రయాణికుల హహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు బస్సులోని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న జూపాడుబంగ్లా ఏఎస్ఐ సి.శంకర్, కానిస్టేబుళ్లు ఎం.కె.వలి, శోభన్‌లు సమీపంలోని జేసీబీలను రప్పించటంతోపాటు బస్సులో ఇరుక్కపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, గాయపడిన వారి పేర్లు తెలుసుకున్నారు. ఆయనతో పాటు మిడ్తూరు ఎస్ఐ సుబ్రమణ్యం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు డ్రైవర్ మద్దిలేటి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. బా««ధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు విజయవాడ నుంచి భార్య సుహాసినితో వస్తున్న కర్నూలు మాటీవి రిపోర్టర్ మల్లికార్జున కుడిచెయ్యి తెగిపోయింది. రక్తమడుగులో ఉన్న భర్తను చూసి అతని భార్య గుండెపోటుకు గురైంది. కర్నూలు సస్యషోరూం మేనేజర్ క్రిష్ణ వెన్నుకు తీవ్రగాయాలు కావటంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. పెబ్బేరుకు చెందిన చంద్రశేఖర్ కాలు తెగిపోయింది. నందికొట్కూరుకు చెందిన కాటెపోగురాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. మరో 15 మందికి స్వల్పగాయాలు కావటంతో వారిని నందికొట్కూరు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: జిల్లాలోని గుత్తి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు ts 07z 4071 బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 35 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేయబోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వివరించారు. -
వోల్వో బస్సు దగ్ధం మరో బస్సులో మంటలు
-
వోల్వో బస్సు దగ్ధం.. మరో బస్సులో మంటలు
హైదరాబాద్/ విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల పెను ప్రమాదాలు తప్పాయి. ఒకేరోజు కొన్ని గంటల తేడాతో రెండు ప్రైవేట్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సులో మంటలను అదుపు చేశారు. ఈ రెండు ఘటనల్లో ప్రయాణకులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం: విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం పరవాడపాలెం వద్ద శనివారం వేకువజామున కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి అనకాపల్లికి పెళ్లి బృందంతో వెళుతున్న ఈ బస్సులో పొగలు వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు నుంచి పొగలు వస్తున్నాయని పక్కనే కారులో వెళ్తున్నవారు చెప్పడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. ప్రయాణుకులు కిందకు దిగారో లేదో బస్సులోకి మంటలు వ్యాపించాయి. బస్సు చాలావరకు దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెళ్ళి బృందాన్ని మరో బస్సులో తరలించారు. బస్సులో మంటలు: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వినాయక్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సు వనస్థలిపురం దాటగానే ఒక్కసారిగా పొగ వాసన రావడంతో ప్రయాణికులు ఆప్రమత్తమై బస్సును ఆపించి అంతా తమ సామాన్లతో సహా కిందకు దిగిపోయారు. ముందుగా దిగినవారు చూసేసరికి అప్పటికే బస్సు కింద భాగంలో మంటలు మొదలయ్యాయి. దాంతో వాళ్లు లోపల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ కిందకు దించేశారు. అందుబాటులో ఉన్న నీళ్లను మంటలపై చల్లారు. అయినా పొగలు మాత్రం చాలాసేపటి వరకు ఆగలేదు. బస్సు నాన్ ఏసీ కావడం, కిటికీ అద్దాలు తెరుచుకుని ఉన్న ప్రయాణికులు వాసనను గుర్తించి సకాలంలో అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అదే ఏసీ బస్సు అయి ఉంటే అద్దాలు అన్నీ మూసేసి ఉండేవని, పొగ వాసన కూడా తమకు తెలిసేది కాదని ప్రయాణికులలో ఉన్న నవీన్ అనే యువకుడు 'సాక్షి'కి చెప్పారు. బహుశా ఇంధన ట్యాంకు లీకేజి వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడిన ప్రయాణికులు.. కూకట్ పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడినుంచి సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. -
టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
యలమంచిలి(విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు ముందు టైరు పేలడంతో.. పొలాల్లోకి దూసుకెళ్లింది. యలమంచిలి మండలం మర్రిబండ శివారులో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు టైరు పేలడంతో కుదుపునకు లోనై.. పొలాల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
ఓల్వోబస్సు -లారీ ఢీ
గుత్తి రూరల్ (గుంతకల్లు) : మండలంలోని బాచుపల్లి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరు వైపునకు వెళుతోంది. అలాగే బాచుపల్లి గ్రామ శివారులో లారీ గుత్తి క్రాస్ వద్ద తిప్పడంతో వెనుక వేగంగా వస్తున్న ఓల్వో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో మెదక్‌కు చెందిన కాశీరాం, నెల్లూరుకు చెందిన శరత్ చంద్ర, హైదరాబాదు కాచిగూడకు చెందిన స్వప్న, హేమ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సల కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓల్వో బస్సు సీజ్
పెనుకొండ : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆదిత్య ఓల్వో బస్సును పెనుకొండ ఎంవీఐ మల్లికార్జున గురువారం తెల్లవారుజామున సీజ్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు ఆంధ్రా ట్యాక్స్ లేదని సమాచారం మేరకు చెక్‌పోస్ట్ సమీపంలో వాహనాన్ని ఆపి రికార్డులు పరిశీలించారు. ట్యాక్స్ కట్టని విషయం నిర్ధరణ కావడంతో సీజ్ చేశారు. -
పాలెం మృతులకు నేటికీ జరగని న్యాయం
-
వోల్వో బస్సులో చెలరేగిన మంటలు..
శ్రీకాకుళం: యాత్రీజనీ సంస్థకు చెందిన వోల్వో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద మంగళవారం రాత్రి జాతీయరహదారిపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఇంజిన్ నుంచి వెలువడిన మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై రోడ్డుపక్కన బస్సును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు వెంటనే అందులో నుంచి కిందికి దిగారు. ఎవ్వరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. బస్సులోని అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. -
బస్సు ప్రమాదంలో బీజేపీ నేత మృతి
ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్): వోల్వో బస్సును స్టేషనరీ ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఫిరోజాబాద్‌లోని తండ్లా బ్రిడ్జిపై శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే హన్సరాజ్ వర్మ అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుంచి లక్నోకు బయల్దేరిన వోల్వో బస్సును తాండ్ల బ్రిడ్జిపై ఓ ట్రక్కు ఢీకొట్టినట్టు ఎస్ఎస్పీ అశోక్ కుమార్ శర్మ వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మృతిచెందిన బీజేపీ నేత హన్సరాజ్.. గతంలో ఈత్ జిల్లా, నిదౌళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. -
వోల్వో బస్సులో అగ్నిప్రమాదం
తప్పిన పెనుప్రమాదం ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడిన 30 మంది ప్రయాణికులు వేలూరు: ఆంబూరు సమీపంలో వోల్వో బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయడపడ్డారు. చైన్నై, కోయంబేడు నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రైవేటు వోల్వో బస్సు బుధవారం రాత్రి 12 గంటల సమయంలో బయలు దేరింది. బస్సు వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని వడపుదుపేట వద్ద వెళుతుండగా బస్సు మంటలు వచ్చాయి. గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా మంటలు రావడం చూసి కేకలు వేయడంతో బస్సును డ్రైవర్ నిలిపి వేశాడు. వెంటనే ప్రయాణికులు కేకలు వేస్తూ పోటీ పడుతూ కిందకు దిగారు. వెంటనే ఆంబూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు వెనుక వైపు పూర్తిగా కాలి పోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. అనంతరం వారు బెంగళూరుకు మరో బస్సులో వెళ్లారు. వోల్వో బస్సు అగ్నిప్రమాదానికి గురి కావడంతో సుమారు గంట పాటు జాతీయ రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. ఆంబూరు తాలుకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
మంటలులో వోల్వో బస్సు
-
వైజాగ్-గుంటూరు వోల్వో బస్సులో మంటలు
-
వైజాగ్-గుంటూరు వోల్వో బస్సులో మంటలు
గాజువాక: విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లేందుకు వైజాగ్ నుంచి బయల్దేరిన శ్రీకాలేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎగసిన మంటలకు బస్సు మొత్తం దగ్ధమైపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన బస్సులోని 46 మంది ప్రయాణికులు బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నగరంలోని శ్రీకాలేశ్వరి ట్రావెల్స్‌కు సంబంధించిన వోల్వో బస్సు విజయవాడ వెళ్లడం కోసం విశాఖ సిటీలో బయల్దేరింది. పాతగాజువాక జంక్షన్‌లోని ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్‌స్టాప్‌వద్ద బస్సు ఎక్కడం కోసం ఒక యువతి సిద్ధంగా ఉండడంతో ఆమెకోసం డ్రైవర్ బస్సు ఆపాడు. బ్రేక్ వేసేసరికి బస్సులో కాలుతున్న వాసనను వెనక సీట్లో ఉన్న ఒక ప్రయాణికుడు గుర్తించాడు. ఆమె ఎక్కేలోపే మంటలు ఒక్కసారిగా పైకి లేచాయి. దీన్ని గమనించిన ఆ ప్రయాణికుడు కేకలు వేయడంతో అందరూ హుటాహుటిన బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో బస్సు డ్రైవర్ సహా సిబ్బంది మొత్తం పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది శకటంతో సహా సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మంటలను అదుపు చేయడానికి సుమారు గంటపాటు శ్రమించారు. -
రండి..శుభాకాంక్షలు చెప్పండి..!
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లోని ఐఏఎస్‌లు అందరూ విజయవాడ వచ్చి ముఖ్యమంత్రిని అభినందించాలి. ఇందుకు తగిన రవాణా ఏర్పాట్లు జరిగాయి. సచివాలయం నుంచి ఒంటిగంటకు వోల్వో బస్సు విజయవాడకు బయలుదేరుతుంది’... ఇదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీఎంవో ఆఫీసు నుంచి ఐఏఎస్‌లందరికీ వచ్చిన ఎస్ఎంఎస్. శనివారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమికి సమాయత్తమవుతున్న ఐఏఎస్ లు ఈ ఎస్ఎంఎస్లతో విస్తుపోయారు. బహిరంగ సభలకు జనాన్ని వాహనాల్లో తరలించడం చూశాం గాని ముఖ్యమంత్రిని అభినందించేందుకు వోల్వో బస్సులు పెట్టి ఐఏఎస్‌లను తీసుకువెళ్లడం ఏమిటంటూ రుసరుసలాడారు. అయినా పిలిపించుకుని మరీ అభినందనలు చెప్పించుకోవాల్సిన అగత్యం ముఖ్యమంత్రికి వస్తే ఎలా? అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా నయం, బహిరంగ సభలకు తోలే జనానికి ఇచ్చినట్టు ఓ బిర్యానీ ప్యాకెట్టు, క్వార్టర్ మందు ఇస్తామన్నారు కాదంటూ ఓ ఐఏఎస్ జోక్ పేల్చారు. విజయవాడ పోయి వచ్చేందుకు కనీసం 10 గంటలు పడుతుందని, మళ్లీ తెల్లవారుతూనే జన్మభూమి విధులకు హాజరు కావాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నమ్మినబంట్లు ఎవరో తమ పలుకుబడిని చూపించుకునేందుకు ఈ పని చేశారంటూ వాపోయారు. ఇంత హడావుడి చేసినా... ఐఏఎస్ అధికారులు లింగరాజు పాణిగ్రాహి, సిసోడియా, జేసీ శర్మ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముద్దాడ రవిచంద్ర, అశోక్‌లు మాత్రమే బస్సులో వెళ్లగా... మిగతావారు విమానాల్లోనే వెళ్లడం గమనార్హం. సీఎం ఒక్కరు వస్తే... ముఖ్యమంత్రి ఒక్కరు హైదరాబాద్‌కు వస్తే ఇంతమంది అధికారులు విమానాల్లో, కార్లలో, గరుడ బస్సులో విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని, దీనివల్ల సర్కారు ఖజానాపై భారం తగ్గేదని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానించాయి. సీఎం ఒక్కరు హైదరాబాద్ వచ్చి ఉంటే ఈ వృథా వ్యయం తప్పేదని చర్చించుకున్నారు. కేవలం ఆరుగురికోసం 48 సీట్లున్న గరుడ బస్సులు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తపరిచారు. -
వరదనీటిలో వోల్వో బస్సు..
తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు సాయం కోసం 40 మంది ప్రయాణికుల ఎదురుచూపులు గూడూరు(నెల్లూరు జిల్లా): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని చైతన్య ఆర్ట్స్ కాలేజీ సమీపంలో మంగళవారం ఉదయం ఓ వోల్వో బస్సు వరదనీటిలో చిక్కుకుపోయింది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, అందులో ఉన్న ప్రయాణికులు వోల్వో బస్సు నుంచి కిందకు దిగితే వరద నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో చేసేదేమీ లేక ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. బస్సు తిరుపతి నుంచి గుంటూరు వెళ్లాల్సి ఉంది. పోలీసులకు, ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసినా సరైన స్పందన లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెగ్యూలర్ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడం ద్వారా ఈ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఓ వైపు బస్సు దిగలేని పరిస్థితి, మరోవైపు సహాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని వారు సాయం చేయండంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. -
ప్రాణాలు పోతున్నా..అదే నిర్లక్ష్యం..
రోడ్డు ప్రమాదాలను నిరోధించ లేం.. కానీ నియంత్రించగలం. ఇది జగమెరిగిన సత్యం. అయితే మన పాలకులు మాత్రం దీనికి విరుద్ధంగా నడుస్తున్నారు. ప్రమాదాలు దైవాధీనం.. చేష్టలుడిగి చూడటమే మన కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’లాంటి ప్రముఖ విదేశీ వార్తాపత్రికల తొలి పేజీలో ప్రముఖంగా ప్రచురితమైన ‘పాలెం దుర్ఘటన’ తర్వాత అలాంటి తీవ్రత కలిగిన ప్రమాదం ఒక్కటి కూడా చోటుచేసుకోకూడదు. కానీ రహదారులపై నిత్యం ఎక్కడో ఒకచోట మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలుస్తూనే ఉన్నాయి. అయినా సరే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం జరగటం లేదు. ఒకవేళ తెలుసుకున్నా.. వాటి నియంత్రణకు చర్యలు ఉండటం లేదు. ఇటీవల చోటుచేసుకున్న అతి భారీ ప్రమాదాలుగా చెప్పుకునేవి రెండు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద 45 నిండు ప్రాణాలను బుగ్గి చేసిన వోల్వో బస్సు దుర్ఘటన. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్తూ వంతెనపై నుంచి కిందకు పడిపోయి 32 మందిని చిదిమేసిన ఘటన. ఈ రెండింటికీ రోడ్డు నిర్మాణంలో లోపాలే ప్రధాన కారణమని అధికారులు తేల్చారు. ఐదు రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో అతివేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సును ఢీకొనటంతో పది మంది చనిపోవటానికి కూడా రోడ్డు నిర్మాణంలో లోపమే ప్రధాన కారణమని ప్రాథమికంగా అధికారులు తేల్చారు. అంటే.. ప్రమాదాలకు కారణాలేంటో తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదనటానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఓ భారీ దుర్ఘటన జరిగినప్పుడు కనిపించే హడావుడి అంతాఇంతా కాదు. కానీ రోజులు గడిచేకొద్దీ దాన్ని మరచిపోవటం సహజం. ప్రభుత్వాలకు ఇదే వరంగా మారుతోంది. నిలువెల్లా నిర్లక్ష్యాన్ని జీర్ణించుకున్న ప్రభుత్వ విభాగాలను గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వాలు కూడా అంతకంటే మొద్దు నిద్రలో జోగుతున్నాయి. జాతీయ రహదారులు రక్తమోడుతుంటే కారణాలేంటో విశ్లేషించిన చైనా ప్రభుత్వం.. కొన్నేళ్ల క్రితం అన్ని రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలకు చేరువ చేసేందుకు ఉద్యమస్ఫూర్తితో నడుంబిగించి విజయం సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు ప్రధాన రహదారులన్నింటిపైనా లోపాలను సరిదిద్దగలిగింది. ఇప్పుడు వాటిపై మానవ తప్పిదంతో ప్రమాదం జరగాలి తప్ప.. రోడ్డు లోపంతో కాదు. కానీ మనదేశంలో రోడ్డు నిర్మాణంలో లోపభూయిష్ట విధానాలు భారీ ప్రాణనష్టాన్ని మిగులుస్తున్నా మన ప్రభుత్వాలు మేల్కోవటం లేదు. - సాక్షి, హైదరాబాద్ మనదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల చరిత్రలోనే అతి భయంకరమైనదిగా నిలిచిపోయిన దుర్ఘటన అది. అతివేగంగా దూసుకుపోతున్న వోల్వో బస్సు కల్వర్టు గోడను ఢీకొని అగ్నికి ఆహుతైంది.. క్షణాల్లో 45 నిండు ప్రాణాలు బూడిదయ్యాయి. అత్యంత హృదయవిదారకమైన ఈ దుర్ఘటనకు కారణాలెన్నో. ఏకంగా సీఐడీ దీనిపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను అందజేసింది. అప్పటికే లోటుపాట్లు పరిశీలించిన నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఆ తర్వాత కొలువుదీరిన తెలంగాణ సర్కారుగానీ ఆ నివేదికను మాటమాత్రంగానైనా పట్టించుకోలేదు. రోడ్డు వద్ద కాస్త మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవటం మినహా చర్యలు శూన్యం. ఆ తూతూమంత్రపు చర్యలు కూడా.. ప్రమాదం జరిగిన రెండేళ్ల తర్వాత చేయటం గమనార్హం. ఏం జరిగింది.. 2013 అక్టోబర్ 30.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో బస్సు మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామ శివారులో తెల్లవారుజామున మంటల్లో చిక్కుకుంది. జాతీయ రహదారిపై కనీస ప్రమాణాలు పాటించకుండా జరిపిన విస్తరణ పనులే కొంపముంచాయి. కల్వర్టు గోడ ఏకంగా జాతీయ రహదారిపైకే చొచ్చుకొచ్చింది. దానికి తోడు డివైడర్ సైతం వంకరగా ఉంది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న వోల్వో బస్సు కల్వర్టుకు చేరువగా వచ్చాక తొలుత డివైడర్‌ను తగిలి అదుపు తప్పింది. అదే వేగంతో కల్వర్టు గోడను ఢీకొంది. ఆ గోడకు ఉన్న ఇనుప పైపు బస్సు డీజిల్ ట్యాంకును బద్దలు కొటింది. క్షణాల్లో మంటలు అంటుకుని బస్సు పూర్తిగా తగలబడిపోయింది. అందులో 50 మంది ప్రయాణికులుంటే 45 మంది బుగ్గయ్యారు. దేశ చరిత్రలోనే భయంకర ప్రమాదాల్లో ఒకటి కావటంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి దర్యాప్తు బాధ్యత అప్పగించింది. దర్యాప్తు అనంతరం గత ఏడాది జూన్‌లో నివేదిక అందజేసింది. అయితే నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. నివేదిక ఏం చెప్పిందంటే... వోల్వో బస్సు డిజైన్ భారీ ప్రాణనష్టానికి కారణంగా నిలిచింది. 300 లీటర్ల సామర్థ్యం ఉన్న ప్రధాన డీజిల్ ట్యాంకు బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌కు చేరువగా ఉంది. బ్యాటరీ నుంచి నిప్పురవ్వలు రావడంతో అది భగ్గుమంది. ఈ ట్యాంకు ముందు చక్రాల మధ్య ఉంది. 150 లీటర్ల సామర్థ్యం ఉన్న మరో రెండు ఆగ్జిలరీ ట్యాంకులు సరిగ్గా ముందు చక్రాల వె నకే ఉన్నాయి. కల్వర్టు పైపు తగిలి అవి పగిలి డీజిల్ చిమ్మటంతో క్షణాల్లో బస్సు మండిపోయింది. ఆ ట్యాంకులు ప్లాస్టిక్‌లో చేసినవి కావటంతో సులభంగా పగిలిపోయాయి. కల్వర్టు డిజైన్ దారుణంగా ఉంది. దాని గోడలు ఏకంగా రోడ్డుపైకే వచ్చాయి. డివైడర్ కూడా ముందుకొచ్చింది. డివైడర్‌ను రా సుకుంటూ వెళ్లిన బస్సు కల్వర్టు గోడను ఢీకొంది. కల్వర్టు గోడపై న ఉంచిన ఇనుప పైపు బస్సు డీజిల్ ట్యాంకులు బద్దలు కొట్టింది. బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా బస్సు నడిపాడు. బస్సులో పరిమితికి మించి అక్రమంగా సీట్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను ఎక్కించారు. బస్సు డిజైన్‌లో లోపాలు.. పాలెం దుర్ఘటన జరిగిన పక్షం రోజులకు బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న వోల్వో బస్సు ఇదే తరహాలో డివైడర్‌ను ఢీకొని అగ్నికి ఆహుతైంది. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు ప్రమాదాలు వోల్వో బస్సు డిజైన్‌లోని లోపాలను ఎత్తిచూపాయి. సీఐడీ నివేదిక కూడా దాన్ని స్పష్టం చేసింది. సీఐడీ ఈ నివేదికను కేంద్రానికి కూడా పంపింది. అయితే బస్సు డిజైన్‌ను అనుమతించే కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ వోల్వో బస్సు డిజైన్‌ను మార్పించలేకపోయాయి. తమ బస్సు డిజైన్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే ఉందని ఆ కంపెనీ వాదనకు వంతపాడేశాయి. విచిత్రమేమిటంటే.. వోల్వో బస్సు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నా.. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీమియం మోడల్ సిటీ బస్సులుగా రాష్ట్ర ప్రభుత్వం వోల్వో కంపెనీ నుంచి ఏకంగా 80 బస్సులు కొనుగోలు చేసింది. తనిఖీలు చేసినా మార్పు రాలేదు.. పాలెం దుర్ఘటన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపై 650 వోల్వో బస్సులు పరుగులు పెడుతున్నాయి. అప్పట్లో తనిఖీలు జరిపిన రవాణా శాఖ లోటుపాట్లున్నాయని 320 బస్సులను జప్తు చేసింది. కొద్దిరోజుల్లోనే అవన్నీ మళ్లీ రోడ్లపైకి వచ్చేశాయి. అవే లోపాలు ఇప్పుడూ రాజ్యమేలుతున్నాయి. బస్సుల సంఖ్య మాత్రం 700 దాటింది. ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు రాలేదు.. నియంత్రించాల్సిన ప్రభుత్వ విధానంలోనూ ఎలాంటి మార్పు రాలేదు. వోల్వో ఎగ్జాస్ట్ సిస్టంకు చేరువగా ఉండే లగేజీ బాక్సులో నిప్పు పుట్టించే వస్తువులు ఉంచకూడదు. కానీ కాసులకు కక్కుర్తిపడి పెద్ద సంఖ్యలో వస్తువులను తరలించే అలవాటు ఉన్న బస్సు నిర్వాహకులు బాణాసంచాను కూడా తరలించేస్తున్నారు. తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసినా చర్యలు అంతంత మాత్రమే. ఇప్పటికీ మండే స్వభావమున్న వస్తువులు బస్సుల్లో తరలుతూనే ఉన్నాయి. ►ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలుగా ఉండే అత్యవసర ద్వారం వద్ద ఖాళీ ఉండాలి. కానీ అక్కడ సీట్లు బిగించి అదనపు ప్రయాణికులను కూర్చోబెడుతున్నారు. ►కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి పొంది స్టేజి క్యారియర్‌గా తిప్పుతున్నారు. ►దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఆరు గంటల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్ మారాలి. కానీ 90 శాతం బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. పాలెం ఘటనలో బుగ్గయిన బస్సులో కూడా ఒకే డ్రైవర్ ఉన్న విషయం తెలిసిందే. ►బస్సులో ప్రయాణికుల వివరాలతో జాబితా ఉండాలి. కానీ మూడొంతుల బస్సుల్లో అది ఉండటం లేదు. ఉన్నా అందులోని వివరాలకు.. ప్రయాణిస్తున్న వారి వివరాలకు పొంతన ఉండటం లేదు. జాబితాలో 42 పేర్లుంటున్నా.. బస్సులో 50 మంది ఉంటున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు కొందరు మృతుల వివరాలు దొరక్కపోవటానికి ఇదే కారణమవుతోంది. ఏం జరిగింది..2012 జూన్ 15.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నిండు ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన అది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ చోటు చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు వెంటనే మే లుకోవాలి. కానీ ప్రమాదం జరిగిన నాలుగేళ్ల తర్వాతగానీ నివేదిక ప్రభుత్వానికి అందలే దు. ఈలోపు అదే ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఏం జరిగింది.. 2012 జూన్ 15.. శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళుతోంది. బస్సు 250 కి.మీ. దూరం ప్రయాణించిన తర్వాత తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జాకోట్ గ్రామంలో ఇరుకు వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వెళుతూ ఎదురుగా వచ్చిన వ్యాన్‌ను తప్పించే యత్నంలో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ ఆల్కహాల్ తీసుకోవటం, ఇరుకైన వంతెన.. దానికి రక్షణ గోడ లేకపోవటం కారణమని ఏపీ రవాణా శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డితో నాటి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను వేసింది. కొద్దిరోజుల తర్వాత ఆయన స్థానంలో అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందారెడ్డిని నియమించింది. రెండేళ్ల తర్వాత నివేదిక ఇవ్వకుండానే ఆయన పదవీవిరమణ చేశారు. ఈ లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ చందాకు ఆ బాధ్యతలు అప్పగించారు. చివరికి ఆయన గత నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక సారాంశం... వంతెన ఉన్న ప్రాంతానికి ఎగువ, దిగువ పల్లం ఉంది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు వేగంగా దూసుకొస్తున్నాయి. వంతెన మరీ ఇరుకుగా ఉంది. కనీసం దానికి పారాపిట్ వాల్ కూడా లేదు. వంతెనపైన రెయిలింగ్ నామమాత్రంగానే ఉంది. ఇరుకైన, ప్రమాదకరమైన వంతెన ముందు ఉంది అని సూచించే సూచిక బోర్డులు లేవు. రోడ్డును విస్తరించకపోవటంతో భారీమూల్యం చెల్లించాల్సి వచ్చింది. తెల్లవారుజామున డ్రైవర్‌కు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.. అలాంటిది అతను మద్యం సేవించి ఉన్నాడు. హైవేలపై మద్యం దుకాణాలు ఉండొద్దనే నిబంధన అమలు కావటం లేదు. ఇవే డేంజర్ జంక్షన్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలివే అని పేర్కొంటూ రహదారి భద్రతా విభాగం ఓ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై దాదాపు 11 చోట్ల అతి భారీ లోపాలు(బ్లాక్‌స్పాట్స్), మరో 14 చోట్ల సాధారణ లోపాలు ఉన్నట్లు పేర్కొంది. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు మూడొంతుల వరకు ఇవే కారణమని తేల్చింది. కానీ వాటిపై చర్యలు శూన్యం. హైదరాబాద్: జంతు ప్రదర్శనశాల ఎదురుగా, బేగంబజార్ అజంతా గేట్ నల్లగొండ: భువనగిరి, రాయగిరి, నకిరేకల్ పెట్రోల్ బంకు, చిట్యాల కోరమండల్ ఫ్యాక్టరీ, నార్కెట్‌పల్లి వై జంక్షన్, కోదాడ రూరల్ దొరకుంట, భువనగిరి టీచర్స్ కాలనీ, కేతేపల్లి ఇనుపాముల జంక్షన్, బీబీనగర్ బస్టాప్, గుండ్రాలపల్లి గ్రామం ఆదిలాబాద్: గుడిహత్నూర్, జైపూర్ ప్రభుత్వ కళాశాల, బైంసాలోని కల్లూరు వంతెన కరీంనగర్: ధర్మపురిలోని నేరెళ్ళ గ్రామం, జగిత్యాల పెట్రోల్ బంకు మెదక్: పటాన్చెరు గణేశ్ గుడి, కంది మహబూబ్‌నగర్: రాజాపూర్, షాద్‌నగర్ వద్ద రాయకల్ గేట్, కొత్తకోట కనిమెట్టస్టేజ్, కొత్తకోట మదర్‌థెరిసా జంక్షన్ ఖమ్మం: సారపాక ఐటీసీ గేట్, మణుగూరు వై జంక్షన్, బూర్గంపాడు ఎంబీ బంజర పాటించాల్సినవి ఇవీ.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రహదారి భద్రతా విభాగం పలు సూచనలు చేసింది. హెచ్చరికను సూచిస్తూ బోర్డులు, స్పీడ్‌బ్రేకర్, రంబ్లర్ స్ట్రిప్స్, హజార్ట్ మార్కర్స్, కలర్స్ క్యాట్‌ఐస్, జిగ్‌జాగ్ మార్కింగ్, ఫాగ్‌లైట్స్ వంటి ఆరు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘జాతీయ రహదారులపై ఫలానా ప్రాంతం ప్రమాదకరమైందని వివరించేందుకు స్పాట్ సమీపంలో ముందస్తు హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటిని ఆయా స్పాట్లకు కనీసం 200 మీటర్ల దూరంలో ఒక బోర్డు, 100 మీటర్ల దగ్గర మరో బోర్డు ఉండాలి. వేగ నియంత్రణ కోసం రహదారి స్థితిని బట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అందుకోసం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్స్, మలుపుల వద్ద రంబ్లర్ స్ట్రిప్స్‌ను అతికించాలి. డెత్స్పాట్స్ దగ్గర డివైడర్లను ఎత్తు పెంచి హజార్డ్ మార్కర్స్(ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటిని గుర్తించేలా రిప్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. ప్రమాదభరితమైన ప్రాంతాల్లో డివైడర్లు రాత్రివేళ కూడా కనిపించేలా క్యాట్‌ఐస్ ఏర్పాటు చేయాలి. వీటి ఏర్పాటు వల్ల వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతం కేంద్రంగా దాదాపు 100 మీటర్ల మేర జిగ్‌జాగ్ మార్కింగ్ ఏర్పాటు చేయాలి. శీతాకాలంలో పొగమంచు బారినుంచి తప్పించుకోవడానికి వాహనాలకు ఫాగ్‌లైట్స్ ఉండాలి’’ అని స్పష్టం చేసింది. -
మంటల్లో బస్సు : తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
ప్రతి కిటికీ.. ఓ ఎమర్జెన్సీ ఎగ్జిట్!
పాలెం వోల్వో బస్సు ఘటన గుర్తుందా? రెండేళ్ల క్రితం తెల్లవారుజామున బస్సు అకస్మాత్తుగా భస్మమైపోయి దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటే ఉండటంతో మంటలబారి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరక్కూడదన్న ఏకైక లక్ష్యంతో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కె.జగదీశ్, ఆర్.భరత్, ఎస్.జీవన్, ఎంఎస్.కార్తీక్‌లు ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు. బెంగళూరులోని గోపాలన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన వీరు ప్రమాద పరిస్థితుల్లో బస్సులోని అన్ని కిటికీలూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లుగా మారిపోయేలా దీన్ని రూపొందించారు. డ్రైవర్ దగ్గర ఉండే ఓ బటన్‌ను నొక్కిన వెంటనే బస్సులోని అన్ని కిటికీలూ తెరుచుకునేలా ఏర్పాటు చేశారు. ఇందు కోసం కిటికీ అద్దాలను కొంత మార్చడంతోపాటు వాటిల్లో సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు ఒక్కో బస్సుకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా! -
చేపల ఆటోను ఢీకొట్టిన వోల్వో బస్సు
కర్నూలు : వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు ముందు వైపు వెళ్తోన్న ఆటోను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోన్న వోల్వో బస్సు.. గుంతకల్ మండలం వైటీచెరువు నుంచి కర్నూలుకు చేపల లోడుతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న గుంతకల్, గుత్తి, డోన్ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది చేపల వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 108 సాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వోల్వో బస్సు బోల్తా... నలుగురికి గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో 18 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి అనంతపురం పట్టణానికి వెళుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సులో పంపించే ఏర్పాటు చేశారు. -
వోల్వో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి
ప్రకాశం: వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కల్కివాయి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి చైన్నై వెళ్తున్న వోల్వో బస్సు సింగరాయకొండ సమీపంలోకి చేరుకోగానే డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఇద్దరు మృతిచెందారు.. ఇందులో నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు, ప్రయాణికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
నెల్లూరు: వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అసువులు బాశాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. దగదర్తి మండలం దామవరం గ్రామానికి చెందిన వెంకట్రామయ్య (20) నెల్లూరులోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం తండ్రితో కలసి గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. వేకువ జామున కోడవలూరు మండలం రాచర్లపాడు వద్ద గొర్రెలు మేపుతుండగా ఓ వోల్వో బస్సు గొర్రెలతో పాటు, వెంకట్రామయ్యను ఢీకొంది. దీంతో బీటెక్ విద్యార్థి వెంకట్రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆరు గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు
విశాఖపట్నం: ట్రాక్టర్‌ను తప్పించబోయిన వోల్వో బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటన విశాఖ జిల్లా కాశీంకోట సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. బస్సులోని దాదాపు 33 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో స్వస్థలాలకు పంపారు. గాయపడిన డ్రైవర్‌ను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూటర్‌ను ఢీకొన్న వోల్వో బస్సు ఇద్దరి దుర్మరణం
పలమనేరు: వేగం వస్తున్న వోల్వో బస్సు రోడ్డు దాడుతున్న స్కూటర్‌ను సైకిల్‌ను ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులు దర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన పలమనేరు సమీపంలోని సిల్క్ ఫామ్ వద్ద చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పలమనేరు పట్టణంలోని దండపల్లె ప్రాంతంలో నివసిస్తున్న మస్తాన్(45) లారీ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. పట్టణంలో జెండామఠానికి చెందిన అన్వర్(36) డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. వీరిద్దరూ లారీ బాడిబిల్డింగ్ విషయమై పట్టణ సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు వెళ్లారు. అక్కడినుంచి స్కూటర్‌పై మెయిన్‌రోడ్డులోకి రాగానే బెంగుళూరు నుంచి తిరుపతివైపు వెళుతున్న ప్రైవేటు వోల్వో బస్సు వీరి స్కూటర్‌ను వేగంగా ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కన పల్లంలోకి దూసుకెళ్లి ఆగిపోయింది. వోల్వో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. అప్పటికే 108 సిబ్బంది బస్సులోని స్వల్ప గాయాలు తగిలినవారికి చికిత్సలు చేశారు. రోడ్డు ప్రమాదం కారణంగా సిల్క్‌ఫామ్ వద్ద స్తంభించిన ట్రాఫిక్‌ను ఎస్ఐ శ్రీరాముడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పలమనేరు ఆసపత్రికి తరలించారు. ఇలావుండగా బస్సు డ్రైవర్ ప్రమాద స్థలంలో కనిపించలేదు. మృతుడు మస్తాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్వర్ సైతం గతంలో లారీ యజమానిగా ఉంటూ నష్టాలపాలై ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ సంఘటనతో ఆ రెండు కుటుంబాల సభ్యులు అనాథలయ్యారు. -
లారీ, ఓల్వో బస్సు ఢీ
-
లారీ, ఓల్వో బస్సు ఢీ: ఒకరికి గాయాలు
నల్లగొండ :కట్టంగూర్ లో శుక్రవారం ఉదయం ఓల్వో బస్సు, లారీ ఢీకొన్నాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. -
మంటల్లో ఓల్వో
-
వోల్వో బస్సు బోల్తా, ఒకరు మృతి, 10మందికి గాయాలు
అనంతరం : అనంతపురం జిల్లా సీకే పల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
వోల్వో బస్సు బోల్తా!
మెదక్: సంగారెడ్డి మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. బైకును తప్పించబోయి వోల్వో బస్సు బోల్తాపడింది. కర్ణాటకకు చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళుతోంది. గాయపడినవారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ** -
పాలెం బస్సు ప్రమాదం : స్పెషల్ డ్రైవ్
-
ఆ మంటలు ఆరలేదూ.. ఆ కన్నీళ్ళూ ఆగలేదు!
-
పాలెం దుర్ఘటనకు నేటితో ఏడాది
-
పాలెం దుర్ఘటన కు నేటితో ఏడాది
* కొంతమంది బాధితులకు నేటికీ అందని పరిహారం * జబ్బర్ ట్రావెల్స్‌లో సజీవదహనమైన 44 మందికి నేడు శ్రద్ధాంజలి బెంగళూరు : మహబూబ్‌నగర జిల్లా, కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 44 మంది సజీవదహనమైన సంఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. నేటికీ కొంతమంది బాధితులు పరిహారం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 29వ రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడి కలాసిపాళ్యలోని జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (ఏపీ 02- టిఏ,0963) హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ఫిరోజ్ బాష బస్సును అతి వేగంతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రయాణికులు గాఢనిద్రలోకి జారుకున్నారు. అక్టోబర్ 30వ తేదీ వేకువజామున 5.10 గంటల సమయంలో మహబూబ్‌నగర జిల్లా, కోత్తకోట మండలంలోని పాలెం-కనుమెట్ట గ్రామం మధ్యలోని జాతీయ రహదారిలో కారును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ వోల్వో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. 15 సెంకెడ్లలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది సజీవదహమయ్యారు. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి పల్లే మోహన్‌కుమార్ కుమార్తె ప్రియాంక (గర్బిణి), చిరంజీవి అభిమానుల సంఘం కర్ణాటక అధ్యక్షుడు కోటే వెంకటేష్, ఆయన సోదరి అనితతో పాటు, దంపతులు, చిన్నారి, వ్యాపారులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాదంలో సజీవదహనమైన వారికి బెంగళూరు కలాసిపాళ్యలో గురువారం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిర ణ్ కుమార్‌రెడ్డి కేసు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బస్సుకు ఉన్న ఇన్సూరెన్స్‌ను క్లయిమ్ చేసి మృతుల కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. అయితే నేటికీ మృతుల కుటుంబ సభ్యులు కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల చుట్లూ తిరుగుతూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో వారు మహబూబ్నగరలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో ఉంది. -
వోల్వో బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు.
-
వోల్వో బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు
-
ఆర్టీసీ బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ స్లీపర్ బస్సు హైవేపై లారీని తప్పించబోయి అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. కాగా కుమారి అనే మహిళ తలకు తీవ్ర గాయామైంది. ఆమెకు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో ప్రథమి చికిత్స చేసి.. కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అలాగే నిర్మల, దుర్గ అనే తల్లీకూతుళ్లకూ తీవ్ర గాయాలయ్యియి. వీరిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రమం హాస్పిటల్‌కు తరలించారు. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. -
వోల్వో బస్సు-లారీ డీ, క్లీనర్ మృతి
-
ఆగి ఉన్న వోల్వోబస్సుని ఢీ కొన్న లారీ
నల్లగొండ: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న వోల్వోబస్సును వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు తీవ్రగాయాలయాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న వోల్వో బస్సు
గుంటూరు : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండం అన్నవరప్పాడు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఒక ప్రైవేటు వోల్వో బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కొండేపీకి చెందిన సిహెచ్ రమణయ్య, టంగుటూరుకు చెందిన బాలబ్రహ్మచారిల పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన మరో 16 మంది ప్రయాణీకులను చికిత్సల కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఘోరం..
లారీని ఢీకొన్న వోల్వో బస్సు ఒక్క సారిగా ధడేల్మన్న శబ్దం.. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు సీట్లలోంచి ఎగిరి పడ్డారు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. గుండెలదురుతుండగా డ్రైవర్ వద్ద ఉన్న డోర్ నుంచి ఒకరిద్దరు కిందకు దూకారు.. మిగతా వారు వారిని అనుకరించారు.. కిందకు దిగి చూసిన ప్రయాణికుల్లో వణుకు మొదలైంది.. బస్సు ముందు భాగం తుక్కుతుక్కుగా మారింది.. ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. చిలమత్తూరు : చిలమత్తూరు మం డల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... శుక్రవారం రాత్రి కేఏ-01 ఏఏ9877 నంబరు గల ఒమర్ (ప్రైవేట్ ట్రావెల్స్) వోల్వో బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున కోడూరు తోపు- కొడికొండ చెక్‌పోస్టు మధ్యలో ఉన్న జువారి సీడ్స ఫ్యాక్టరీ సమీపంలో నిదానంగా వెళుతున్న సిమెంటు లారీని 15 మీటర్ల దూరంలో ఉండగా గమనించిన వోల్వో బస్సు డ్రైవర్ జలీల్‌ఖాన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ముందు సీట్లల్లో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు బస్సు అద్దాలను పగులగొట్టుకుంటూ రోడ్డుపై పడిపోయారు. వెంటనే బస్సు వారిపై నుంచి దూసుకెళుతూ లారీని ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ప్రయాణికుడు లారీ-బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు. మృతుల్లో బెంగళూరుకు చెందిన రాహుల్ అగర్వాల్ (30), హైదరాబాద్ నాంపల్లికి చెందిన బాబుపిళ్లై (34)తోపాటు మరొక ప్రయాణికుడు (హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన మద్దిశెట్టి వీరశేఖర్‌గా అనుమానం) ఉన్నారు. సడన్ బ్రేక్ వేసినపుడు కిందపడిపోయి ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారు తమ లగేజీలను చేతపట్టుకుని డ్రైవర్ పక్కనుండే తలుపు ద్వారా కిందకు దిగారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎన్‌హెచ్ విభాగం వారు అంబులెన్సల ద్వారా క్షతగాత్రులను బాగేపల్లి, చిక్కబళ్లాపురం, బెంగళూరు ప్రాంతాలకు తరలించారు. ఎస్ఐ గౌస్‌మహమ్మద్ బాషా తన సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటికి తీయించి పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ సుబ్బారావు పరిశీలించి.. టికెట్ల బుకింగ్ పుస్తకం ద్వారా ప్రయాణికుల వివరాలు తెలుసుకున్నారు. క్రేన్ల సహాయంతో వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. హిందూపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి దారి తీసిన కారణాలను ఆరా తీశారు. ఒమర్ సంస్థ లీజుపై నడుపుతున్న ఈ వోల్వో బస్సు ధనుంజయ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో బెంగళూరుకు చెందిన విటుల్కుమార్, శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఫరీద్, రుత్విక్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. క్లీనర్ ప్రాణాలు కాపాడిన నిద్ర ‘ప్రమాదం జరిగే 10 నిమిషాల ముందు వరకు బస్సు డ్రైవర్ జలీల్ ఖాన్ దగ్గరే కూర్చున్నా. నిద్ర వస్తుండటంతో వెనుక ఖాళీగా ఉన్న సీటులో కూర్చుని నిద్రపోయాను. అదే నన్ను కాపాడింది. ఉన్నట్లుండి సడన్ బ్రేక్ వేయడంతో పెద్ద శబ్దంతో బస్సు ఆగిపోయింది. దాంతో బస్సులో ఉన్న వారందరూ సీట్లల్లోంచి కిందపడ్డారు. ఆ వెంటనే వారంతా డ్రైవర్ సీటు పక్క డోర్లోంచి కిందకు దిగేశారు’ అని క్లీనర్ జాకీర్ తెలిపాడు. ముమ్మాటికీ డ్రైవర్ల నిర్లక్ష్యమే : డీఎస్పీ సుబ్బారావు కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం ముమ్మాటికీ రెండు వాహనాల డ్రైవర్ల నిర్లక్షమే. సిమెంటు లోడుతో వెళుతున్న లారీకి వెనుకవైపు ఇండికేటర్లు లేవు. ఒక వేళ ఇండికేటర్ ఉంటే వోల్వో బస్సు డ్రైవర్ గుర్తించే అవకాశం ఉండేది. -
‘హైటెక్’ రోడ్లపైకి వోల్వో బస్సులు
త్వరలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వోల్వో బస్సులు నగరంలో పరుగులు తీయనున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా, ప్రజా రవాణాను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం నగరంలో 80 వోల్వో బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదట దిల్సుఖ్నగర్-పటాన్చెరు (218డీ), ఉప్పల్-కొండాపూర్ (113 కే/ఎల్) రూట్లలో నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా ఒక్కో బస్సుకు రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మొదటి విడత 20 బస్సులు ప్రస్తుతం ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌కు చేరుకున్నాయి. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అగ్ని ప్రమాదాలను పసిగట్టే పరిజ్ఞానం ఈ బస్సుల్లో ఇంజన్ వద్ద ప్రత్యేకంగా ‘ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్’ అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేశారు. ఇవి ఇంజన్లో తలెత్తే లోపాలను పసిగట్టడంతో పాటు పొగ, మంటలు వెలువడితే.. వెంటనే గుర్తించి ఆర్పేస్తాయి. ఇప్పటి వరకు మంటలను గుర్తించి హెచ్చరించే అలార్మింగ్ వ్యవస్థ మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే భారత్ స్టేజ్-4 టెక్నాలజీకి చెందిన ఈ బస్సుల్లో ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలను హానిరహిత వాయువులు (నైట్రోజన్, ఆక్సిజన్)గా మార్చే లిక్విడ్ అమ్మోనియా స్ప్రే ఉంటుంది. సెలైన్సర్లో యాడ్ బ్లూ ద్వారా ఈ అమ్మోనియాను స్ప్రే చేస్తారు. ఒక్క అడుగు ఎత్తులో.. వోల్వో బస్సులో 32 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు నిల్చునేందుకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు మహిళలు, వృద్ధులు, పిల్లలు తేలికగా ఎక్కి దిగేందుకు వీలుగా ఒక్క అడుగు ఎత్తులోనే ఫుట్‌బోర్డు ఉంటుంది వీల్‌చైర్‌తో సహా బస్సులోకి ఎక్కేందుకు ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు ఫ్యాబ్రిక్ కుషన్ సీట్లు.. ప్రయాణాన్ని కుదుపులు లేకుండా చేస్తాయి 290 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన ఇంజన్ ఈ బస్సు ప్రత్యేకత. దీనివల్ల ఏసీ సరఫరాలో అంతరాయం ఉండదు బస్సు లోపల, వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వెహికిల్ ట్రాకింగ్ పరిజ్ఞానం ఈ బస్సు సొంతం. -
బాబు బస్సుకు రూ.10 కోట్లు!
బుల్లెట్‌ప్రూఫ్ వోల్వో కొనుగోలుకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటన కోసం సకల సౌకర్యాలతో కూడిన బుల్లెట్‌ప్రూఫ్ వోల్వో బస్సును కొనుగోలు చేయనున్నారు. సాధారణ వోల్వో బస్సు ఖరీదే సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుంది. ఇక సీఎం సేద తీరేందుకు, అదనపు సౌకర్యాలను కల్పించేందుకు, బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 10 కోట్లు పైగా వ్యయం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోనుంది. -
వోల్వో బస్సు - లారీ ఢీ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బుధవారం వోల్వో బస్సు - లారీ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు లారీని ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు ఎమర్జెన్సీ డోర్లతో లగ్జరీ బస్సు!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: వోల్వో బస్సుల్లో వరుస దుర్ఘటనలు మన మది నుంచి ఇంకా చెరిగిపోలేదు. ఆ బస్సుల్లో భద్రతా చర్యలు సరిగ్గా లేవని, అత్యవసర ద్వారం ఒకటే ఉందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లారీలు, బస్సులు, కోచ్‌ల ఉత్పత్తి రంగంలోని స్కానియా కమర్షియల్ వెహికల్స్ సంస్థ.. కొత్త హంగులు, సరికొత్త భద్రతా ఏర్పాట్లతో అత్యాధునిక బస్సు ‘స్కానియా మెట్రో లింక్’ను గురువారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో ఆవిష్కరించింది. ఈ బస్సు వేగం 85 కిలోమీటర్లకు మించదు. విమానాల్లో మాదిరిగానే ఈ బస్సులోనూ బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఓవర్ లోడింగ్, మండే స్వభావం కలిగిన వస్తువులను అనుమతించదు. అలాగే ఆరు అత్యవసర ద్వారాలు ఉండటం ఈ బస్సు ప్రత్యేకత. ఇందులో 12 హ్యామర్లు అందుబాటులో ఉంటాయి. చిన్న పిల్లలు కూడా వీటిని ఉపయోగించవచ్చు. ప్రయాణికుడు బస్సు ఎక్కి కూర్చోగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో ప్రదర్శన ఉంటుంది. డ్రైవర్ కంటి కదలికలను తెలుసుకోవడానికి వీలుగా అతని క్యాబిన్లో కెమెరా ఏర్పాటు ఉంది. -
వోల్వో బస్సు బోల్తా, పలువురికి గాయాలు
కర్నూలు : మరో వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా పెదటేకూరు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కేశినేని వోల్వో బస్సులో సాంకేతిక లోపం
హైదరాబాద్ నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న వోల్వో బస్సులో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మధ్యలోనే ఆగిపోయింది. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు కర్నూలు - పాణ్యం మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినా ట్రావెల్స్ సిబ్బంది మాత్రం అస్సలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో బయల్దేరిన తర్వాత కర్నూలు వరకు బాగానే వెళ్లినా, కర్నూలు - పాణ్యం మధ్యలో ఉన్నట్టుండి ఈ బస్సులో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. కనీసం ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం, అక్కడినుంచి గమ్యానికి ఎలా వెళ్లాలో తెలియకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. -
వామ్మో... వోల్వో!
కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్ : వోల్వో. ఈ పేరు వినగానే రాష్ట్ర ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది పాలెం దుర్ఘటన. ఈ సంఘటనలో 45 మంది సజీవ దహనమైన సంఘటన తెలిసిందే. జాతీయ రహదారిపై నుంచి సుదూర ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు కొత్తకోట మీదుగా వెళ్తున్నప్పుడు ఆసంఘటన ఎ క్కడ జరిగిందా.. అని చూస్తుంటారు. అంతటి భయానకరమైన సంఘటన జరిగినా ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకుల తీరులో మార్పులు రావడంలేదు. కండీషన్ లేని వాహనాలనురోడ్డుపై వదులుతూ ప్రయాణికుల ప్రా ణాలతో చెలగాట మాడుతున్నారు. తరచూ వోల్వో, ఇతర బస్సులు హైవేపై మొరాయిస్తూనే ఉన్నాయి. పొగలు కమ్ముకోవడం, ప్రయాణికులు ఆందోళనకు గురికావడం, మళ్లీ ఏదో కారణం చెప్పి సర్దిచెప్పడం చేస్తూనే ఉన్నారు. కానీ కండీషన్ ఉన్న వాహనాలను మాత్రం నడపడంలేదు. పైన పటారం లోన లొటారం అన్న చందంగా కొత్త వాహనాల వలే రంగులు వేసి బస్సు యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి. తాజాగా అమడబాకుల వద్ద.. శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో 49 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బయల్దేరిన నీతా ట్రావెల్స్ వోల్వో బస్సు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కొత్తకోట మండలం అమడబాకుల సమీపానికి రాగానే పొగలతో కమ్ముకుంది. ఓ వృద్ధ ప్రయాణికుడు గురక పెట్టడంతో పక్కనున్న ప్రయాణికులు మేల్కొని మందలించడానికి ప్రయత్నించగా బస్సులోని పొగలను చూసి కేకలు వేశారు. డ్రైవర్ రెహమాన్ వాహనాన్ని రోడ్డుపక్కకు నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించాడు. కంప్రెషర్ వద్ద ఉన్న పైపు బోల్టు ఊడిపోయి లీకు కావడం వల్ల పొగలు కమ్ముకున్నాయని డ్రైవర్ తెలిపారు. గమనించకుండా ఉంటే పొగవేడిమికి మంటలు వ్యాపించే అవకాశం ఉండేదని, బస్సు మేయింటనెన్స్ ఇలాగేనా ఉండేదని ప్రయాణికులు డ్రైవర్‌తో వాగ్వాదం చేశారు. కాగా అర ్ధరాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణికులు బస్సు వద్దే ఉండిపోయారు. బస్సు యాజమాన్యం తమను సురక్షితంగా మరో బస్సులో పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి బస్సును పరిశీలించి మరో ప్రైవేటు బస్సులో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా గత మూడనెలలుగా అడ్డాకుల మండలం టోల్‌ప్లాజా వద్ద కూడా రెండుమూడు పర్యాయాలు వోల్వో బస్సుల్లో పొగలు కమ్ముకున్నాయి. అక్కడి సిబ ్బంది అప్రమత్తంతో అప్పట్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు టోల్‌ప్లాజావద్ద సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కండీషన్‌ను పరిశీలించడానికి ఏర్పాట్లు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రయాణికులు కోరుతున్నారు. -
గురక మంచిదే ..!
వోల్వో బస్సులో పొగలు.. వృద్ధుడి గురకతో మేల్కొన్న తోటి ప్రయాణికులు కొత్తకోట, న్యూస్‌లైన్: గురక భరించడం ఇబ్బందే అయినా.. ఇక్కడ మాత్రం చాలామంది ప్రాణాలు కాపాడింది. ఓ ప్రయాణికుడు పెట్టిన గురక భరించలేక నిద్ర మేల్కొన్న తోటి ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచే బయట పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట సమీపంలోని అమడబాకుల స్టేజీ వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. నీతా ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 49 ప్రయాణికులతో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరింది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 1.30 గంటలకు కొత్తకోట మీదుగా వెళ్తుండగా ఓ వృద్దుడు పెట్టిన గురకను భరించలేక.. నిద్ర మేల్కొన్న తోటి ప్రయాణికులు బస్సులో కమ్ముకున్న పొగలను చూసి ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి అందులోని వారందరినీ కిందికి దింపివేశాడు. ఇంజిన్‌లోని కంప్రెషర్ పైపునకున్న బోల్టు ఊడిపోవడంతో పొగలు కమ్ముకున్నాయని, ఒకవేళ.. ప్రయాణికులు గమనించకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని డ్రైవర్ రహమాన్ చెప్పాడు. -
వోల్వో బస్సులో పొగలు... ప్రయాణికుల అవస్థలు
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ఆమరబాకుల వద్ద గత అర్థరాత్రి ప్రైవేట్ వోల్వో బస్సు ఇంజిన్‌లో ఆకస్మాత్తుగా పోగలు వచ్చాయి. ఇంజిన్‌లో పొగలను గుర్తించిన వోల్వో బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి... ఇంజిన్‌లో పొగలను ఆర్పివేశాడు. బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై బస్సు నుంచి దూకేశారు. అయితే అర్థరాత్రి నుంచి రహదారిపైనే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వోల్వో ట్రావెల్స్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. -
వోల్వో బస్సు బోల్తా: ప్రయాణికులకు గాయాలు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవలో వోల్వో బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు రాజాపులోవలో బోల్తా పడింది. ఆ ఘటనలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. -
వోల్వోలో పొగలు.. ఉలిక్కిపడిన ప్రయాణికులు
అడ్డాకుల, న్యూస్‌లైన్: వోల్వో బస్సులో అకస్మాత్తు గా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ గమనించి అప్రమత్తం చేయడంతో తృటి లో ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కల్లడ ట్రావెల్స్ వోల్వో బస్సు కేరళలోని కొచ్చి నుంచి 32 మంది ప్రయాణికులతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరా బాద్ బయలుదేరింది. మంగళవారం ఉదయం 10.30గంటలకు మార్గమధ్యంలోని మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే ఇంజన్లో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ గమనించి బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో డ్రైవర్ సుభాష్ వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికులను దించాడు. స్థానిక ఎల్అండ్టీ సిబ్బంది అగ్ని నిరోధక యంత్రంతో పొగలను నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజన్ వద్ద ఉన్న డైనమో కాలిపోవడంతోనే పొగలు వెలువడినట్లు గుర్తించారు. -
వోల్వో బస్సులో చెలరేగిన మంటలు
మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో వోల్వో బస్సులో మంటల చెలరేగాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సులో మంటలు వచ్చాయి. అడ్డాకుల మండలం టోల్గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు రావటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రయాణం మరింత భారం
సాక్షి, ముంబై: ముంబై నుంచి పుణే వరకు శివ నేరి వోల్వో బస్సుల్లో రాకపోకలు సాగించేవారికి ఇకనుంచి ప్రయాణం మరింత భారం కానుంది. శీతల బస్సుల చార్జీలను ఎంఎస్ఆర్టీసీ 2.54 శాతం మేర పెంచింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే పెరిగిన చార్జీల భారం మోయలేక సతమతమవుతున్న నగరవాసుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. పెంచిన చార్జీలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ముంబై నుంచి పుణే వరకు ప్రయాణ చార్జీని రూ.15 మేర పెంచారు. దీంతో దాదర్-పుణే ఏసీ బస్సు టికెట్ చార్జీ రూ.390 నుంచి 405కు చేరుకుంది. అదేవిధంగా బోరివలి-పుణే ఏసీ బస్సు చార్జీని రూ.465 నుంచి 480కి పెంచారు. ఇంధన ధరలు తరచూ మారుతున్న కారణంగా శివనేరి ఏసీ బస్సులతోపాటు సాధారణ, సెమీ లగ్జరీ బస్సుల చార్జీలను పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎమ్మెస్సార్టీసీ ప్రజాసంబంధాల అధికారి ముకుంద్ వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ప్రయాణం కోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా ప్రయాణ సమయంలోనే ఈ పెరిగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. -
‘షిర్డీ’ వోల్వో ప్రమాదం విచారణకు తెర!
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర క్రితం 32 మంది ప్రాణాలను బలిగొన్న శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదంపై విచారణకు తెరపడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక ఈ కేసు తెరమరుగైనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ బాధ్యతను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారి అరవిందరెడ్డికి రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి కీలకమైన నీటిపారుదల అంశాన్ని అప్పగించారు. దీంతో ఆయన సదరు విధుల్లో తలమునకలయ్యారు. గడువు లేదు: 2012 జూన్‌లో 45 మంది ప్రయాణికులతో శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్తూ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జాకోట్ గ్రామంలోని ఇరుకు వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన వ్యాన్‌ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ బస్సును అదుపుచేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం, వంతెన ఇరుగ్గా రక్షణ లేకుండా ఉండటం కారణమంటూ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డితో ఏక సభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కొద్దిరోజుల తర్వాత ఆయన స్థానంలో అరవిందరెడ్డిని నియమించింది. కానీ నివేదిక ఎప్పటిలోగా ఇవ్వాలో గడువు మాత్రం విధించలేదు. మరోవైపు ప్రమాదానికి గురైన బస్సు కర్ణాటక రవాణాశాఖ పరిధిలో రిజిస్టరై ఉండటం, ప్రమా దం అక్కడే జరగటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోలేదు. ఈ ప్రమాదం తమ రాష్ట్రంలో జరగన ప్ప టికీ కర్ణాటక ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరుపుతోంది. కానీ 32 మంది రాష్ట్రవాసులను బలితీసుకున్న ప్రమాదం విషయాన్ని మన ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదు. -
బస్సు డిజైనింగ్‌లో లోపం లేదు: వోల్వో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్సు డిజైనింగ్ లోపమే పాలెం దుర్ఘటనకు కారణమంటూ సీఐడీ ఇచ్చిన నివేదికను వోల్వో ఖండించింది. 12 ఏళ్లుగా దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని, భారతీయ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘‘ప్రమాదం జరిగినపుడు బస్సు గంటకు 100 కి.మీకు పైగా వేగంతో సిమెంట్ దిమ్మెకు గుద్దుకుంది. ఈ తీవ్రత 5 మెగాజౌళ్ల శక్తికి సమానం. కాబట్టే తీవ్ర నష్టం సంభవించింది’’ అని వివరించింది. జరిగిన ప్రమాదాల్లో అత్యధిక శాతం బాహ్య అంశాలే కారణమని, వాటికి డిజైనింగ్‌తో సంబంధం లేదని పేర్కొంది. -
మరో వోల్వో బస్సులో మంటలు
-
ఆ బస్సు వోల్వో కాదు
హైదరాబాద్: మహారాష్ట్రలో థానే జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగిఉన్న డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని దగ్ధమైన బస్సు వోల్వో కాదని ఆ సంస్థ ప్రతినిధి గురువారం పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు వోల్వో అంటూ మీడియాలో వచ్చిన వార్తను తోసిపుచ్చారు. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు సజీవదహనమైన సంగతి తెలిసిందే. -
8మంది సజీవ దహనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సాక్షి, ముంబై/వరంగల్, న్యూస్‌లైన్: మరో వోల్వో బస్సు అగ్నికి ఆహుతైంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతుల్లో వరంగల్ జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన సానికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ తాలూకా మనోరా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణే నుంచి 36 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ వోల్వో లగ్జరీ బస్సు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పాల్ఘర్-మనోరా గ్రామాల మధ్య నిలిచి ఉన్న భారత్ పెట్రోలియం డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ట్యాంకర్‌కు ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అదే సమయంలో వోల్వో వెనకాల వేగంగా వస్తున్న ఓ కారు.. వోల్వోను ఢీకొని, దాని కిందికి దూరి చిక్కుకుపోయింది. వెంటనే బస్సుకు, కారుకు మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు నిద్రలో ఉండడంతో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయారు. ట్యాంకర్‌ను ఢీకొన్నాక భారీ శబ్దం రావడంతో లేచినవారు బయటపడేందుకు ప్రయత్నించేలోపే బస్సును కారు ఢీకొట్టడంతో కిందపడ్డారు. ఇదే సమయంలో బస్సులో మంటలు, పొగ దట్టంగా వ్యాపించాయి. అగ్నికీలలకు ఎనిమిది మంది అసువులు బాశారు. మరో 11 మంది గాయపడ్డారు. మిగతా 17 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మంటల ధాటికి బస్సు మొత్తం కాలిపోయింది. కారులోని ప్రయాణికులు బయటకు దూకేసినప్పటికీ అందులోని ముగ్గురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టనంతగా కాలిపోయాయి. క్షతగాత్రుల్లో కొందరిని ముంబై, స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ పనిపై వెళ్తూ: మృతుల్లో వరంగల్ జిల్లావాసి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు భావిస్తున్నారు. క్షతగాత్రుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే మృతదేహం ఏది అన్నది డీఎన్ఏ పరీక్షల్లో తేలనుంది. శ్రీనివాస్ ముంబైలోని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు. కంపెనీ పనిపై పుణే నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. -
కస్సుబస్సు..
ఆర్టీఏ వర్సెస్ ప్రైవేటు ఆపరేటర్లు పట్టుబిగిస్తున్న రవాణా శాఖ అధికారులు సడలించకుంటే పర్మిట్లకు ససేమిరా అంటున్న ఆపరేటర్లు జిల్లాలో ఇప్పటికే 228 బస్సులపై కేసులు 65 బస్సులు తిప్పలేమంటూ ఆపరేటర్ల స్టాపేజీ నోటీసులు ప్రభుత్వ ఆదాయంపై నీలినీడలు నిబంధనలను గాలికొదిలి రోడ్లపై పరుగులు తీస్తున్న ప్రైవేటు బస్సులకు రవాణా శాఖ అధికారుల తనిఖీలు బ్రేకులు వేస్తున్నాయి. ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు పట్టు బిగిస్తుండటంతో ప్రైవేటు ఆపరేటర్లు కస్సుబుస్సులాడుతున్నారు. ఇలాగైతే ఆర్టీఏ అధికారులు దారికొచ్చేలా లేరని భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యూహరచన చేశారు. సాక్షి, మచిలీపట్నం : పాలెం వద్ద అక్టోబర్ 30న జరిగిన దుర్ఘటనలో ప్రైవేటు ఓల్వో బస్సు ప్రయాణికులు 45 మంది సజీవదహనమవడంతో చలనం వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ అప్పటినుంచి ప్రైవేటు బస్సులపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసం వసూలు చేస్తోంది. ఇదంతా ఆరంభశూరత్వమే అనుకున్నా రానురానూ అధికారులు పట్టు బిగించడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇబ్బందుల్లో పడ్డారు. రాష్ట్ర, జాతీయ పర్మిట్ ఉన్న బస్సులు జిల్లాలో 222 ఉండగా, వాటినే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీమళ్లీ తిప్పుతుండటంతో తనిఖీల్లో భాగంగా 228 కేసులు నమోదు చేశారు. నిబంధనలివీ... స్టేజి క్యారేజ్ (ఏ ప్రాంతంలోనైనా బస్సు ఎక్కించుకునే) అనుమతి ఆర్టీసీ బస్సులకు మాత్రమే ఉంది. ప్రైవేటు బస్సులకు కాంట్రాక్ట్ క్యారేజ్ (ఒక చోట నుంచి మరొకచోటకి) మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేటు బస్సులో వెళ్లేవారంతా ఒకేచోట ఎక్కి మరోచోట మాత్రమే దిగాలి. ప్రయాణికుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్ల వివరాలతో పాటు, బస్సు పర్మిట్, ఇన్సూరెన్స్, డ్రైవర్ డ్రైవింగ్ లెసైన్స్ తదితరాలన్నీ కచ్చితంగా ఉండాలి. ఈ నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై కేసులు నమోదవుతున్నాయి. విజయవాడ అడ్డరోడ్డు, గరికిపాడు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సుల తనిఖీలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. క్వార్టర్ పర్మిట్‌కు ఎసరు.. జిల్లాలో స్టేట్ పర్మిట్ ఉన్నవి 177, ఆలిండియా పర్మిట్ తీసుకున్నవి 45 బస్సులు ఉన్నాయి. ఆర్టీఏ అధికారుల దాడుల నేపథ్యంలో 65 బస్సులు తిప్పలేమని ప్రైవేటు ఆపరేటర్లు స్టాపేజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో క్వార్టర్ పర్మిట్ రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. జిల్లాలో పర్మిట్లు ఎందుకు చెల్లించలేదని మరో 25 బస్సులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 222 బస్సులకు ఈ నెలలో రావాల్సిన పర్మిట్ ఆదాయం మొత్తం సుమారు 2 కోట్ల 54 లక్షల రూపాయల్లో చాలావరకు గండిపడే అవకాశముంది. స్టేట్ పర్మిట్ బస్సులో ఒక్కో సీటుకు రూ.2,625, నేషనల్ బస్సులో ఒక్కో సీటుకు రూ.3,625 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో బస్సుకు స్టేట్ పర్మిట్‌కు రూ.1.05 లక్షలు, నేషనల్ పర్మిట్‌కు రూ.1.45 లక్షలు మూడు నెలలకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ వరకు మూడు నెలల కాలపరిమితి ముగియగా, జనవరి నెలాఖరులోగా తిరిగి పర్మిట్ మొత్తాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆదాయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రైవేటు బస్సులకు పర్మిట్ల చెల్లింపులో జాప్యం జరగడంతో వాటి వసూళ్లకు వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించాల్సిందే... ప్రైవేటు ఆపరేటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కేసులు నమోదు చేస్తాం. వాస్తవానికి ఆర్టీసీ బస్సులకు మాత్రమే స్టేజ్ క్యారేజ్‌గా అనుమతి ఉంది. ప్రైవేటు బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్‌లు మాత్రమే వెళ్లాలి. వ్యక్తులుగా టిక్కెట్టు తీసుకుని ప్రయాణించేవారు ఆర్టీసీలోనే రాకపోకలు సాగించాలి. కాంట్రాక్టుకు మాట్లాడుకుంటే ప్రైవేటు బస్సులు ఉపయోగించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజ్‌లుగా నడిపే ప్రైవేటు బస్సులపై కేసులు కడతాం. క్వార్టర్ పర్మిట్ తీసుకోని బస్సులకు నోటీసులు ఇస్తున్నాం. - శివలింగయ్య, డీటీసీ -
ఓల్వో బస్సులో మంటలు
హుగ్లీ: కోల్ కతా, అసాన్సోల్ ల మధ్య నడిచే ఓల్వో బస్సు లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హ్లగ్లీకి సమీపంలోని డాకుని సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. పోలీసుల సహకారంతో అసాన్సోల్ వద్ద ప్రయాణికులు సురక్షితం బయటపడ్డారు. సమాచారం అందించడంతో అగ్నిమాపక యంత్రాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే బస్సు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం షాట్ సర్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన వేర్వేరు ఓల్వో ప్రమాద ఘటనల్లో కర్నాటకలో 52 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 తేదిన బెంగళూరు,హైదరాబాద్ ల మధ్య నడిచే ఓల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో 30 మరణించగా, నవంబర్ 14 తేదిన హవేరి వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. -
ప్రమాదాలలో భార త్ మొదటి స్థానం
స్కూల్ బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం వోల్వో బస్సు యజమానులకు కట్టుదిట్టమైన సూచనలు చేశాం : మంత్రి రామలింగారెడ్డి బెంగళూరు, న్యూస్‌లైన్ : ప్రమాదాలు సృష్టించడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలవడం చాలా బాధాకరంగా ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... గత ఏడాది దేశంలో 34,93,803 ప్రమాదలు జరిగాయని, అందులో 1,38,250 మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. అదే విధంగా అదే ఏడాది కర్ణాటకలో 36,395 ప్రమాదాలు జరిగాయని 8,051 మంది మరణించాని అన్నారు. బెంగళూరు నగరంలో 5,217 ప్రమాదాలు జరిగితే అందులో 767 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి ఎక్కువ వాహనాలు ఉన్న దేశాలలో భారత్ 12వ స్థానంలో ఉందని అన్నారు. అయితే ప్రమాదాలు సృష్టించడంలో కూడా ప్రపంచ దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రమాదాలు తగ్గించడానికి అనేక జాగృతి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రామలింగారెడ్డి చెప్పారు. స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లే వాహనాలలో నియమాలు ఉల్లంఘించే వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని రావాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. ఇటీవల నాలుగు వోల్వో బస్సు ప్రమాదాలు జరిగాయని అన్నారు. వోల్వో బస్సుల లోపాల వలన ప్రమాదాలు జరిగాయా, డ్రైవర్ల నిర్లక్షం కారణంగా ప్రమాదాలు జరిగాయా అని దర్యాప్తు జరుగుతోందన్నారు. వోల్వో బస్సులలో డీజిల్ ట్యాంక్‌లు, ఏసీ మిషన్లు నాసిరకంగా ఉన్నాయని విచారణలో వెలుగు చూశాయని చెప్పారు. వోల్వో బస్సులలో ఎమర్జెన్సీ డోర్లు, వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చెయ్యాలని వోల్వో బస్సు కంపెనీ ప్రతినిధులకు సూచించామని అన్నారు. నియమాలు ఉల్లంఘించి బస్సులు తయారు చేస్తే వాటిని రోడ్డు మీద తిరగడానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి ఇప్పటికే వాహన యజమానులకు 13 షరతులు విధించామని చెప్పారు. షరతులు ఉల్లంఘంచిన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ డోర్లలో ప్రకటనల బోర్డులు ఏర్పాటు చెయ్యడం పూర్తిగా నిషేధించామని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రోడ్డు రావాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అంతా క్షణాల్లోనే....
వచ్చేశాం... అనుకుంటుండగానే ఘోరం హొసకోటె వద్ద ప్రైవేట్ వోల్వో బస్సు బోల్తా ఐదుగురి దుర్మరణం.. మృతులందరూ నెల్లూరు జిల్లా వాసులే 28 మందికి గాయాలు.. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అధికం బాధితులను పరామర్శించిన మంత్రి రామలింగారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా కారణం డ్రైవర్ నిద్రమత్తా..? లేక కుక్కల గుంపా? కాసేపట్లో బస్సు దిగాలి.. బెంగళూరు వచ్చేస్తోందని ప్రయాణికులు అప్పుడప్పుడే నిద్రలోంచి మేల్కొంటున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఒక్క సారిగా.. ధడేల్ మంటూ పెద్ద శబ్ధం.. బస్సు డివైడర్‌ను ఢీకొందంటూ ప్రయాణికుల కేకలు.. అయ్యో.. బస్సు.. ఆపండి అంటూ ఆర్తనాదాలు.. అంతలోనే బస్సు డివైడర్‌పై నుంచి ఎడమ వైపు తిరిగి బోల్తా.. దేవుడా.. కాపాడు అంటూ గావు కేకలు.. అరుపులు, ఆర్తనాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు... సోమవారం తెల్లవారు జామున నెల్లూరు నుంచి బెంగళూరుకు వస్తూ హొసకోటె వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సు వద్ద దృశ్యమిది.. మహబూబ్ నగర్ జిల్లా పాలెం, కర్ణాటకలోని హావేరిలో రెండు వోల్వో బస్సులు దగ్ధమైన ఘటనలు ప్రజల స్మృతి పథం నుంచి చెరిగిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై కలుగుతున్న అనుమానాలకు బలం చేకూర్చింది. కోలారు, న్యూస్‌లైన్ : హొసకోట వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురైందని తెలియగానే అటు నెల్లూరు, ఇటు బెంగళూరు వాసుల్లో కలకలం రేగింది. ప్రమాదానికి కారణం అధిక వేగం అని ప్రయాణికులు ఆరోపిస్తుండగా, కుక్కల గుంపు అడ్డం రావడం వల్లే అదుపు తప్పిందని డ్రైవర్ చెబుతున్నాడు. బెంగళూరుకు చెందిన రాజేశ్ ట్రావెల్స్ బస్సు నెల్లూరులో ఆదివారం రాత్రి పదిన్నర గంటలకు బయలుదేరింది. ఆరు గంటల కల్లా బెంగళూరు చేరుకోవాల్సి ఉంది. బెంగళూరు మరో 25 కిలోమీటర్లు ఉందనగా హొసకోటె వద్ద అదుపు తప్పి మెయిన్, సర్వీసు రోడ్లను వేరు చేసే డివైడర్ పైకి ఎక్కి కొంత దూరం వెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నెల్లూరుకు చెందిన అనూష (24), ప్రదీప్ (28), విజయ్‌కుమార్ (30), ప్రసాద్ (30), మానస్ కుమార్(6)లు మరణించారు. గాయపడిన 28 మందిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మృతుల్లో కూడా ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. సాధారణంగా ఇక్కడి నెల్లూరు జిల్లా వాసులు వారాంతాల్లో శుక్రవారం రాత్రి సొంత ఊర్లకు వెళ్లి.. ఆదివారం రాత్రి తిరిగి బయలుదేరి రావడం పరిపాటి. కేఏ 01 ఏఏ 7709 నంబరు గల ఆ బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న హొసకోటె పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో సమీపంలోని ఎంవిజీ వైద్య కళాశాలకు తరలించారు. పది పదిహేను కుక్కలు హఠాత్తుగా రోడ్డుకు అడ్డం రావడంతో వాటిని తప్పించబోగా బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైందని డ్రైవర్ వెంకటప్ప తెలిపాడు. అప్పుడు బస్సు మామూలు వేగంతోనే నడిపానని చెప్పాడు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. నెల్లూరులో బస్సు బయలు దేరిన సమయంలో తిరుపతికి చెందిన డ్రైవర్ కోదండం డ్రైవింగ్ చేశాడు. చిత్తూరు జిల్లా నేండ్రగుంట వద్ద వెంకటప్ప డ్రైవింగ్ చేపట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను నిద్రిస్తున్నందున, సంఘటన ఎలా జరిగిందో తెలియదని కోదండం తెలిపాడు. డ్రైవర్ నిద్రమత్తుతోనే : పలువురు ప్రయాణికుల ఆరోపణ మితి మీరిన వేగంతో పాటు డ్రైవర్ నిద్రలో జోగినందు వల్లే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. తనను పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి వద్ద నెల్లూరు ప్రయాణికురాలు మస్తానమ్మ ఇదే విషయాన్ని చెప్పింది.ఎంవిజీ వైద్య కళాశాల మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్ను ముట్టాయి. ప్రమాద విషయం తెలియగానే మృతులు, క్షతగాత్రుల బంధువులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నెల్లూరు నుంచి సైతం మధ్యాహ్నం 12 గంటలకు పలువురు వచ్చారు. రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు. క్షత గాత్రులను ఒక్కొక్కరినే పలకరిస్తూఘటనపై ఆరా తీశారు. డ్రైవర్ వెంకటప్ప దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తాను కేవలం 80 కిలోమీటర్ల వేగంతోనే వెళుతున్నానని డ్రెవర్ మంత్రికి తెలుపగా, 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి కదా...అని మంత్రి ప్రశ్నించగా, అతని నోటి వెంట మాట రాలేదు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామని తెలిపారు. బస్సు బీమా నుంచి కూడా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందుతుందన్నారు. కాగా హొసకోటె ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్, బెంగుళూరు రూరల్ ఎస్పీ రమేష్, ఐజీ ఉల్హక్ హుసేన్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎవరూ పట్టించుకోలేదు తమ బస్సు ప్రమాదానికి గురైందని, చనిపోతున్నా తమను ఎవరూ పట్టించుకోలేదంటూ తన కుమారుడు ఫోన్ చేసి చెప్పాడని బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ తండ్రి, నెల్లూరుకు చెందిన నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యాడు. సాధారణంగా తన కుమారుడు బెంగుళూరుకు చేరుకున్న తరువాత ఏడు గంటలకు ఫోన్ చేసే వాడని, ఉదయం అయిదున్నరకే ఫోన్ రావడంతో భయపడుతూ తీశామని, తాము శంకించినట్లే జరిగిందని వాపోయాడు. తన కుమారుడు ప్రమాద విషయం చెప్పిన వెంటనే ఫోన్ ఆగిపోయిందని, తర్వాత తామెంతగా ప్రయత్నించినా అటు వైపు నుంచి సమాధానం రాలేదని తెలిపాడు. భార్యతో కలసి మధ్యాహ్నం ఆయన ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అయిదు నెలల గర్భిణీ అయిన తమ కోడలు అనూష చనిపోయిందని తెలుసుకుని గుండెలవిసేలా విలపించారు. -
వోల్వో బస్సులో పొగలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయనగరానికి బయల్దేరిన నవీన్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ బస్సును శివారులో నిలిపివేయడంతో ప్రయాణికులు బస్సు నుంచి దిగిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వివరాలు.. బుధవారం రాత్రి స్థానిక గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు నుంచి విజయనగరం జిల్లాకు బయల్దేరిన బస్సులో జాతీయ రహదారిపై హయత్‌నగర్ దాటాక వైర్లు కాలుతున్న వాసనలు వ్యాపించాయి. దీనిని గుర్తించిన ప్రయాణికులు కేకలు పెట్టడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపివేశాడు. అనంతరం, బస్సులో షార్ట్‌సర్క్యూట్ జరిగిన ప్రాంతాన్ని గుర్తించి ప్రమాదాన్ని నివారించాడు. ఈ ఘటన నేపథ్యంలో బస్సును నిలిపివేయడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ప్రయాణికురాలు జనప్రియ ‘సాక్షి’కి తెలిపారు. రాత్రి 11గంటలకు కూడా బస్సుకు మరమ్మతులు పూర్తికాలేదన్నారు. -
ఎట్టకేలకు దిగొచ్చిన సర్కారు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: పాలెం బాధితుల ఆందోళనకు రాష్ట్రసర్కారు ఎట్టకేలకు దిగొచ్చింది. వోల్వో బస్సు దహనమైన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ మేరకు నిధులను జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర చెక్‌ను గురువారం జిల్లాకు పంపించింది. కొత్తకోట మండ లం పాలెం వద్ద గత అక్టోబర్‌లో వోల్వో బస్సు దగ్ధమైన 44 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. మరో ఐదుగు రు తీవ్రగాయాలతో బతికిబయటపడ్డా రు. ఇక ఈ ప్రమాదంలో మృతిచెందిన వా రి ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. ఈ దుర్ఘటన దేశ, అంతర్జాతీయ స్థాయి లో తీవ్రంగా కలిచివేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో కనీస బాధ్యతను విస్మరించింది. దీంతో అసహనానికి గురైన బాధిత కుటుంబాలు మూణ్నెళ్లుగా రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడంతోపాటు, సచివాలయాన్ని ముట్టడించే కార్యక్రమా లు చేపట్టాయి. పలు ప్రజాసంఘాలు వీ రికి మద్దతుగా నిలిచాయి. ఉద్యమసెగను ప్రభుత్వానికి చూపించినా ఏమాత్రం కనికరిం చలేదు. కాగా, ఇటీవల నెలరోజుల క్రితం బెంగళూర్‌లో ఇదే తరహా ఘటనలో ఏడుగురు సజీవదహనం కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. దీంతో బాధిత కు టుంబసభ్యులు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పరిహారం ఇవ్వాలని ఆం దోళను మరింత ఉధృతం చేశారు. ఎట్టకేలకు మూణ్నెళ్ల తరువాత మృతుల కు టుంబసభ్యులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష పరిహారం మంజూరుచేసింది. మృతి చెం దిన 44మందికి సంబంధించి రూ.44లక్షలను బాధితులకు చెల్లించేం దుకు ఈమొత్తాన్ని జిల్లా కలెక్టర్ పేర జారీచేసింది. నేడోరేపో పరిహారం అందజేత మంజూరైన ఎక్స్‌గ్రేషియాను మృతుల కుటుంబాలకు అందజేసేందుకు వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సరైన ఆధారాలతో వెంటనే చెక్కులను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నా రు. ఈ ప్రక్రియను పదిరోజుల్లో పూర్తిచేయనున్నట్లు వారు పేర్కొంటున్నారు. క్షతగాత్రులకు మొండిచేయి కాగా, ఈఘటనలో తీవ్రగాయాలతో ఐదుగురు ప్రయాణికులు బతికి బయటపడ్డారు. వీరికి హైదారాబాద్‌లో చికిత్సచేయించిన ప్రభుత్వం ఎలాంటి ఎక్స్‌గ్రేషియాను ఇవ్వకుండా మొండిచేయి చూపిం ది. వీరి పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడినా పనిచేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. వీరికి చికిత్స చేయించాం, ఇంకెలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వబోమనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
డ్రైవర్ డబుల్ డ్యూటీ.. బాణసంచా
వోల్వో బస్సు ప్రమాదానికి కారణాలివేనని తేల్చిన దర్యాప్తు నివేదిక న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదానికి డ్రైవర్ డబుల్ డ్యూటీ చేస్తుండడమే ప్రధాన కారణమా? బస్సులోపల బాణసంచా ఉందా? పాలెం బస్సు దుర్ఘటన, కర్ణాటకలో చోటు చేసుకున్న మరో వోల్వో బస్సు దగ్ధం ఘటనలపై జరిపిన దర్యాప్తు ఈ విషయాలను నిర్ధారిస్తోంది. ఈ రెండు ఘటనల్లో 52 మంది ప్రయాణికులు సజీవ దహనమవడం తెలిసిందే. పాలెం వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సు డ్రైవర్ డబుల్ డ్యూటీలో ఉన్నాడని, ఫలితంగా తీవ్ర అలసటకు గురైనట్టు దర్యాప్తు నివేదిక వెల్లడించింది. అలాగే బస్సులో బాణసంచా కూడా ఉందని తెలిపింది. డబుల్ డ్యూటీ కారణంగా తీవ్ర అలసటకు లోనైన డ్రైవర్ ప్రమాదాన్ని నివారించలేకపోయాడని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఈ బస్సులోపల బాణసంచా సైతం ఉన్నట్టు ఆయన తెలిపారు. అక్టోబర్ 30న పాలెం వద్ద జరిగిన ఈ వోల్వో ప్రమాదంలో 45 మంది సజీవ దహనమవడం విదితమే. జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు పేలిపోయి ఒక్కసారిగా నిప్పంటుకుంది. ఈ సందర్భంగా రాపిడికి నిప్పురవ్వలు ఎగిసిపడి బస్సుకు మంటలంటుకుని ఉండవచ్చని, బస్సులోని బాణసంచా పేలిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు. నవంబర్ 14న జరిగిన మరో ఘటనలో బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న మరో వోల్వో బస్సు హావేరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కునిమల్లహళ్లి వద్ద ఓ బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించడం విదితమే. అయితే ఈ ప్రమాదం వెనుక గల కారణాలను నిర్ధారించుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా వోల్వో బస్సులు చెక్క ఫ్లోరింగ్‌తో కూడి ఉన్నాయని, తేలిగ్గా మంటలంటుకునే రకం సీట్లు ఉన్నాయని, వేగ పరిమితి కూడా చాలా ఎక్కువగా ఉందని నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్, ఆర్ అండ్ డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు చెందిన యాక్సిడెంట్ డేటా అనాలసిస్ సెంటర్ తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. -
అనంతపురంలో16 వోల్వో బస్సులు సీజ్
అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పలు జిల్లాల్లో సుమారు 50కి పైగా బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 16 బస్సులను అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న 16 వోల్వో బస్సులను ఆర్టీఏ అధికారులు సోమవారం అనంతపురం వద్ద సీజ్ చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ అయిదు ప్రయివేటు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద డీటీసీ శ్రీదేవి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ప్రయివేట్ బస్సులతో పాటు, ఓవర్ లోడ్‌తో వెళుతున్న ఆరు లారీలను సీజ్ చేశారు. -
వోల్వో బస్సులో మంటలు, అద్దాలు పగులగొట్టి బయటపడ్డ ప్రయాణికులు
-
అనంతపురం జిల్లాలో వోల్వో బస్సులో మంటలు
అనంతపురం : మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో కొండికొండ చెక్‌పోస్ట్ వద్ద శనివారం ఓ వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం అయిన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.