వోల్వో బస్సు దగ్ధం - 42మంది దుర్మరణం? | 42 people feared dead as Bus catches fire near Hyderabad | Sakshi
Sakshi News home page

Oct 30 2013 8:52 AM | Updated on Mar 21 2024 7:54 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 42 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం నలుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రయాణీకుల ఆర్తనాదాలు విన్న సాక్షి ప్రతినిధి 108కి సమాచారం అందించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 40 మందికి పైగా సజీవ దహనమైనట్టు సమాచారం. నలుగురైదుగురు బస్సు అద్దాలు పగలకొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. ఏసీ బస్సు కావడంతో లోపల ఉన్న ఫాబ్రికేషన్ మెటీరియల్, ఏసీలో ఉండే గ్యాస్, కర్టెన్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులంతా మరణించారనే భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలోనే ఇంత ఘోర ప్రమాదం ఎప్పుడూ జరగలేదని అంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement