kothakota
-
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చదవండి: TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
‘వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైనది’
సాక్షి, వనపర్తి: మహానేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్ విజయమ్మ. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్ వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్. వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్ షర్మిల. వనపర్తి జిల్లాలో షర్మిల పాదయాత్ర మైలురాయి దాటగా.. కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఇదీ చదవండి: తెలంగాణలో వెస్ట్ బెంగాల్ వ్యూహమా? -
అనకాపల్లి: కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐ రాసలీలలు
-
ఆఫర్లో రూ.1,700 లకే ఫోన్!.. ప్రముఖ మొబైల్ కంపెనీ పేరు చెప్పడంతో..
బి.కొత్తకోట : ఓ ప్రముఖ కంపెనీ 500 మందికి ఆఫర్లో మొబైల్ ఫోన్‌ను ఇస్తోందని నమ్మించి పార్శిల్లో సోంపాపిడి పంపిన ఉదంతం బుధవారం జరిగింది. డబ్బు చెల్లించి పార్శిల్ విప్పిచూసిన రైతు మోసపోయి లబోదిబోమంటున్నాడు. బాధిత రైతు కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన రైతు రమణారెడ్డికి ఎనిమిదిరోజుల క్రితం బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. ప్రముఖ మొబైల్ కంపెనీ నుంచి 500 మందికి ఆఫర్లో మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని, అందులో మీ పేరుందని చెప్పగా రమణారెడ్డి తిరస్కరించారు. ప్రముఖ మొబైల్ కంపెనీ పేరు చెప్పడంతో ధర ఎంతని అడగ్గా అసలు ధర రూ.7,500 అని ఆఫర్లో రూ.1,700కు ఇస్తున్నట్టు చెప్పి పార్శిల్ పంపారు. కర్ణాటకలోని బెంగళూరు నగరం అలసంద్ర నుంచి బుధవారం గట్టు తపాలా కార్యాలయానికి పార్శిల్ వచ్చింది. ఈ పార్శిల్ తీసుకోవడానికి రమణారెడ్డి వెళ్లగా పోస్ట్‌మాస్టర్ గణేష్‌కు అనుమానం కలిగి పార్శిల్‌ను వెనక్కు పంపుదామని చెప్పాడు. అయితే మొబైల్ వచ్చిందని నమ్మి రమణారెడ్డి పోస్ట్‌మాస్టర్‌కు రూ.1,700 చెల్లించి అక్కడే అందరి సమక్షంలో పార్శిల్ తెరవగా అందులో సోంపాపిడి ప్యాకెట్ ఒకటి మాత్రమే ఉండటంతో మోసపోయినట్టు గుర్తించిన రమణారెడ్డి సంబంధిత ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పినా... మాట్లాడిన మహిళ ఇవేమి వినిపించుకోకుండా పార్శిల్ తీసుకొండంటూ చెప్పింది. ఇలాంటి మోసాలు నిత్యం జరుగుతున్నా అమాయక ప్రజలు మోసపోతున్నారు. (చదవండి: భర్తతో విడాకులు.. 40 ఏళ్ల వ్యక్తితో స్నేహం.. అసలు విషయం తెలిసి..) -
అమెరికాలో నిశ్చితార్థం.. మదనాపురంలో వియ్యం
మదనాపురం (కొత్తకోట): పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పెళ్లి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో.. ఉద్యోగం చేసేందుకు అమెరికాకు వెళ్లిన ఓ అమ్మాయి, అబ్బాయి నిశ్చితార్థం వేడుకలను అక్కడ స్నేహితుల సమక్షంలో రింగులు మార్చుకున్నారు. అదే సమయంలో ఇక్కడ వారి తల్లిదండ్రులు తాంబూలాలు పుచ్చుకున్నారు. వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అనురాధ, జక్కుల నాగన్న యాదవ్ దంపతుల కుమార్తె సావ్వీశృతి 2013 నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ కాలనీకి చెందిన శ్రీవాణి, ఐలయ్యయాదవ్ దంపతుల కుమారుడు వంశీకృష్ణ కూడా అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. (ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి) తాంబూలాలు మార్చుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరూ తెలుగువారు కావడంతో ఇటీవల ఇరు కుటుంబాల తల్లిదండ్రులు అక్కడికి వెళ్లినప్పుడు పెళ్లి సంబంధం కుదిర్చారు. సంప్రదాయాల ప్రకారం నిశ్చితార్థం చేయాలనుకున్నారు. అయితే అక్కడ ఇద్దరికీ ఉద్యోగరీత్యా సెలవులు దొరకలేదు. దీంతో అనుకున్న సమయానికి భారత కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గురుస్వామి గోపాలకృష్ణ వేద మంత్రాలను సెల్ఫోన్లో చదువుతుండగా.. అమెరికాలో ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. ఆ దృశ్యాలను ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తిలకించారు. అదే సమయంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, బంధువులు తాంబూలాలను మార్చుకుని, లగ్నపత్రిక రాసుకున్నారు. -
వృత్తి పొగాకు వ్యాపారం.. ప్రవృత్తి కరాటే మాస్టర్
సాక్షి, కొత్తకోట రూరల్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. చిన్నపాటి డబ్బాలో పొగాకు అమ్ముకుంటూ కరాటేలో ప్రతిభకనబర్చి ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి మన్ననలు పొందుతున్న ఓ నిరుపేద యువకుడు అబ్దుల్నబీ. కొత్తకోట పట్టణ కేంద్రానికి చెందిన సుల్తాన్‌బీ, ఖాజామియ్యా దంపతుల కుమారుడు అబ్దుల్ నబీ చిన్నప్పుడు సరదాగా పంచ్‌లు విసిరిన చేతులే నేడు పట్టెడన్నం పెడుతున్నాయి. ఓ పేదింటి యువకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు పొందుతున్నాడు. నబీ తల్లి బీడీ కారి్మకులు కాగా తండ్రి పొగాకు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుండేవారు. తాను నేర్చుకున్న విద్య నలుగురికి నేర్పుదామని 2015లో ‘గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అకాడమీలో 500 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది విద్యార్థులు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్టు నబీ తెలిపాడు. ఇక్కడ శిక్షణ తీసుకున్న విద్యార్థులు తక్కువ కాలంలోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పలుమార్లు బంగారు, వెండి పతకాలు సాధించారు. తన దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు పోలీస్, ఆర్మీ, సీఆర్పీఎఫ్ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేట్ పాఠశాలల్లో పీఈటీలుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక పోటీల్లో పతకాలు అందుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడించడమే లక్ష్యం నేను నేర్చుకున్న కరాటేలో అన్నిస్థాయిల్లో మంచి ప్రతిభకనబర్చుతూ మేధావుల నుంచి ప్రశంసలు పొందిన అబ్దుల్నబీ రాబోయే రోజుల్లో తన అకాడమీ విద్యార్థులను ఒలింపిక్ క్రీడల్లో ఆడించడమే నా లక్ష్యం. ప్రభుత్వం కరాటేను ఆదరించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కరాటే నేరి్పంచేందుకు మాలాంటి వారికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలి. – అబ్దుల్నబీ, కరాటే మాస్టర్, కొత్తకోట -
ఎన్నికల బరిలో భార్యా భర్తలు..
సాక్షి, కొత్తకోట: మున్సిపల్ ఎన్నికల బరిలో ఇద్దరు భార్యాభర్తలు బరిలో నిలిచారు. ఒక జంటలో భర్త శ్రీనివాసులు ఏడో వార్డు నుంచి పోటీ చేస్తుండగా, భార్య మాజీ సర్పంచ్ అయినటువంటి అరుణ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫారంతో పోటీపడుతున్నారు. ప్రస్తుతం అరుణ పోటీ చేస్తున్న 9వ వార్డులో టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి సుఖేశిని పోటీలో ఉన్నారు. అలాగే మరో జంట అయినటుంటి వారిలో నాగన్న 8వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పద్మజ 12వ వార్డు నుంచి పోటీ చేస్తుంది. వీరిద్దరు సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫారంతో బరిలో నిలిచారు. కాగా నాగన్న గతంలో 13 వార్డుసభ్యుడిగా పనిచేయగా, పద్మజ గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. వీరిరువురికి రాజకీయంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. -
ఇరుకు గదులతో ‘వంట’కు తంటా!
సాక్షి, మదనాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆరుబయటే వండుతున్నారు. ఆరుబయట కట్టెలపొయ్యిపై వండుతుండంతో విద్యార్థుల కళ్లు మండుతున్నాయి. చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేక వంటగదులు కట్టించాలని, సిలిండర్లు సరఫరా చేయాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. మండలంలో ఇదీ పరిస్థితి.. మండలంలో 19 ప్రాథమిక పాఠశాలు 4జిల్లా పరిషత్ పాఠశాలలు, 1 యూపీఎస్ పాఠశాల, 1 కస్తూర్బాగాందీ బాలికాల పాఠశాల, 1 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు ఉన్నాయి. మొత్తం 2110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకు రావాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆచరణలో సమగ్రంగా అమలు చేయడం లేదు. ఆరు బయటే వంట.. ప్రధానంగా మదనాపురం మండల కేంద్రంతో పాటు దుప్పల్లి ద్వాకరనగరం ,నర్సింగపురం కరివెన, తదితర గ్రామాల్లో వంట గదులు చిన్న గా ఉండటం తో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వంట చేసే సమయం లో వంట చెరుకు వలన వచ్చె పొగ బయటకు పోక పోవడంతో ఆగది పోగతో కమ్ముకుంటుందని చెబుతున్నారు.దీంతో తాము గదుల్లో వంట చేయడం లేదని నిర్మాణ సమయంలో సరిౖయెన పారదర్శకాలు పాటించ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక బయట వంట చేసి కొన్ని సమయాల్లో ఆరు బయటనే అన్నము వడ్డిస్తున్నామని పలువరు అంటున్నారు. కుక్కల స్వైరవిహారం పాఠశాల లో ప్రహరీ లేని చోట మదనాపురం పీఎస్ సంతబజార్, గోపన్‌పేట పీఎస్, కరివెన పీఎస్, గోవిందహళ్లీ పీఎస్, బౌసింగ్తండాపీఎస్, పెద్దతండా పీఎస్ తదితర పాఠశాలల్లో మధ్యాహన భోజన సమయంలో పందులు, కుక్కలు సైర విహారం చేస్తాయి. ఈ విషయమై విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబందిత అధికారులు స్పందించి ఆరు బయట వంట చేయకుండా నిర్వాహకులకు అవగాహన కల్పించా లని విద్యావంతులు కోరుతున్నారు. -
మెకానిక్ అరుణ
సాక్షి, కొత్తకోట: మెకానిక్‌లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది. రుణం ఇచ్చి ఆదుకోవాలి స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. – అరుణ, మెకానిక్, కొత్తకోట -
దేవుళ్లకే శఠగోపం!
సాక్షి, కొత్తకోట రూరల్: జల్సాలకు ఆలవాటు పడిన కొందరు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల కురుమూర్తిస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే కొత్తకోటలోని మూడు ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పట్టణ శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లి గ్రామ శివారులోని పొలాల్లో పడేశారు. ఈ క్రమంలో కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3 వేల నగదు, సాయిబాబ ఆలయంలో రూ.500, వెంకటగిరి ఆలయంలో అరకిలో వెండి (శఠగోపం)తోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారని ఎస్ఐ తెలిపారు. కాగా ఉదయమే ఆయా ఆలయాల్లో తాళాలు పగులగొట్టి ఉండగా వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందిం చారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకేంద్రాలను నుంచి క్లూస్ టీంలు వచ్చి పొలాల్లో పడేసిన హుండీలను పరిశీలించారు. దొంగతనానికి గురైన హుండీలపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీం సభ్యులు సేకరించారు. మూడు ఆలయాలను వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్రావు పరిశీలించి ఎస్ఐతో వివరాలు తెలుసుకున్నారు. -
దేవుళ్లకే శఠగోపం!
సాక్షి, కొత్తకోట రూరల్: జల్సాలకు ఆలవాటు పడిన కొందరు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల కురుమూర్తిస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే కొత్తకోటలోని మూడు ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పట్టణ శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లి గ్రామ శివారులోని పొలాల్లో పడేశారు. ఈ క్రమంలో కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3 వేల నగదు, సాయిబాబ ఆలయంలో రూ.500, వెంకటగిరి ఆలయంలో అరకిలో వెండి (శఠగోపం)తోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారని ఎస్ఐ తెలిపారు. ఉదయమే ఆయా ఆలయాల్లో తాళాలు పగులగొట్టి ఉండగా వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందిం చారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకేంద్రాలను నుంచి క్లూస్ టీంలు వచ్చి పొలాల్లో పడేసిన హుండీలను పరిశీలించారు. దొంగతనానికి గురైన హుండీలపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీం సభ్యులు సేకరించారు. మూడు ఆలయాలను వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్రావు పరిశీలించి ఎస్ఐతో వివరాలు తెలుసుకున్నారు. -
నిన్న తల్లి.. నేడు తండ్రి
సాక్షి, అమరచింత (కొత్తకోట): తల్లిదండ్రుల ప్రేమను వారానికో పర్యాయం చూస్తూ.. సంబురపడి చదువుల్లో ముందుకెళ్తున్న చిన్నారులకు ఇక ఆ తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలను వెళ్లారన్న సమాచారం తెలియగానే వారి రోదనలు మిన్నంటాయి. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఒకరి తర్వాత మరొకరిని పోగొట్టుకుని అనాథలైన ఆ చిన్నారుల ఆర్థనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ హృదయవిదారక సంఘటన అమరచింతలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా.. అమరచింతకు చెందిన కె.గోపి(42), భార్య కమలమ్మ ఇద్దరు గత ఆదివారం వనపర్తిలోని రేడియంట్ పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను పలకరించి స్వగ్రామమైన అమరచింతకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఖానాపురం గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ఇరువులు వ్యక్తులు గోపి బైకును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోపి, కమలమ్మకు తీవ్రగాయాలు కావడంతో ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కమలమ్మ మృతిచెందగా.. గోపి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న గోపి పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని అమరచింతకు తీసుకురావడానికి బయల్దేరారు. గోపి మృతి పట్ల ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ రాజేందర్‌సింగ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గోపి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఒకరిదొకరికి తెలియకుండానే.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కమలమ్మ అదే రోజు మృతిచెందిన సంఘటన భర్త గోపికి తెలియకుండానే కోమాలోకి వెళ్లాడు. భార్య కడసారి చూపునకు నోచుకోలేని పరిస్థితిలో చికిత్స పొందుతుండగానే కుటుంబ సభ్యులు కమలమ్మ అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ క్రమంలోనే భర్త సైతం మృతిచెందడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అమ్మనాన్నలకు ఏమైందో కూడా తెలియని పరిస్థితిలో ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ కన్నీరు కార్చుతున్న సంఘటనలు పలువురి హృదయాలను కలచివేశాయి. చురుకైన కార్యకర్త అమరచింతకు చెందిన గోపి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. గత రెండేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ అమరచింత పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భార్య కమలమ్మ ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్‌లోని కస్తూర్బాలో అటెండర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తమ పిల్లలు సిద్ధార్థ, సింధూజలను వనపర్తిలోని రేడియంట్ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. వారానికోసారి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల వద్దకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వారు అనాథలుగా మారారు. వీరికి దిక్కెవరు..? రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కమలమ్మ, గోపిలకు కుమారుడు సిద్ధార్థతోపాటు కుమార్తె సింధూజ ఉన్నారు. సిద్ధార్థ వనపర్తిలోని రేడియంట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో సింధూజ కూడా 5వ తరగతి చదువుకుంటుంది. మృతిచెందిన గోపికి సైతం అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కమలమ్మ తల్లితండ్రులు సవారన్న, రుక్కమ్మల ఆదరణలోనే సిద్ధార్థ, సింధూజ ఉన్నారు. చిన్నారులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
మద్యం డంపు.. ఢమాల్!
సాక్షి, పెద్దమందడి (కొత్తకోట): పై ఫొటోలో కనిపిస్తున్న కాటన్లు చూశారా?! అందులో ఏం ఉన్నాయని అనుకుంటున్నారు? ఇవన్నీ రూ.22 లక్షల విలువైన మద్యం సీసాలు కలిగి ఉన్న కాటన్లు! ఎన్నికల వేళ ఎవరు తెప్పించి డంప్ చేశారో ఇంకా తేలాల్సి ఉంది. పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజీ సమీపంలోని గోదాంల్లో వీటిని నిల్వ చేయగా పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి సీజ్ చేశారు. జాతీయ రహదారి వెల్టూరు స్టేజికి సమీపంలో గల జేఎం ఫాంహౌస్‌లో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున డీఎ స్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాసర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అను కున్నట్టుగాగానే భారీ మధ్యం డంపును గుర్తిం చారు. అనంతరం మొత్తం మధ్యం స్టాక్‌ను పెద్దమందడి పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకే.. అనంతరం డీఎస్పీ సృజన ఈ విషయంపై విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎన్నికల్లో మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వెంకటస్వామి అనే వ్యక్తికి చెందిన ఫాంహౌస్‌లో భారీగా మధ్యం నిల్వలు చేశాడని, ఈ విషయం గురించి తమకు పక్కా సమాచారం అందిందని తెలిపారు. వ్యాపారులు పసిగట్టేలోపే అప్రమత్తమై తెల్లవారు జామున 5 గంటల సమయంలో అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా షెడ్డులో కర్ణాటకకు చెందిన 699 లిక్కర్ కాటన్లలో 33,552 (రాయల్ బ్లూ విస్కి) మద్యం సీసాలను గుర్తించి స్వాధీన పరుచుకున్నామని చెప్పారు. అనంతరం ఎక్సైజ్ శాఖ సీఐ ఓంకార్ వచ్చి విచారణ చేపట్టారని, పట్టుబడిన మద్యం దాదాపుగా రూ.22లక్షలు ఉంటుందని తెలిపారు. అక్కడే ఉన్న ఫాంహౌస్ వాచ్మెన్ కాశన్నను అదుపులోనికి తీసుకొని విచారించగా తనకేమి తెలియదని, పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యారెడ్డి, వెల్టూర్‌కు చెందిన సాక వెంకటయ్య వచ్చి కాటన్లను ఇక్కడ ఉంచారని చెప్పినట్లు డీఎస్పీ వెల్లడించారు. పకడ్బందీగా విచారణ చేసిన అనంతరం దీని వెనకాల ఎవరున్నారనే విషయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. కర్ణాటక మద్యం రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్‌శాఖ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు కొందరు గోవా, కర్ణాటక రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు చీఫ్ లిక్కర్ తెప్పిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాలకు కర్ణాటక సరిహద్దుగా ఉంది. ఇక గోవా కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో అక్కడ మద్యంపై పన్నులు తక్కువగా ఉండడంతో ధర కూడా తక్కువే ఉంటోంది. తక్కువ ధరలో మద్యం లభిస్తుండడంతో పెద్దమొత్తంలో మద్యం తెప్పించి నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లాలోని వెల్టూరులో స్వాధీనం చేసుకున్న మద్యం కూడా ఆ ప్రాంతానికి చెందినదేనని తెలుస్తోంది. -
కొత్తకోటలో విషాదం
వనపర్తి ఙిల్లా : కొత్తకోట మండలం కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న కృష్ణవేణి(20) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ నెల 10వ తేదీన కృష్ణవేణి వివాహం జరుగనుంది. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. చావుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇరుగుపొరుగు వారు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మృత్యుశకటం
పెబ్బేరు (కొత్తకోట): ఓ మహిళా సర్పంచ్ తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్ శివారులో జరుగుతున్న సర్పంచ్ల ప్రాంతీయ సమ్మేళనానికి బయలుదేరింది. మార్గమధ్యలో మృత్యురూపంలో దూసుకువచ్చిన లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మహిళా సర్పంచ్ తీవ్రంగా గాయపడింది. అలాగే లారీ స్థానిక బస్టాండ్‌లోకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధురాలు సైతం మృత్యువాతపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళా సర్పంచ్‌ను వనపర్తి కలెక్టర్ తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మండలంలోని గుమ్మడం క్రాస్‌రోడ్డు దగ్గర శనివారం చోటుచేసుకుంది. కొత్తకోట సీఐ సోంనారాయణసింగ్ కథనం ప్రకారం.. వీపనగండ్ల మండలం సంపట్రావ్‌పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ పద్మమ్మ తన భర్త డీలర్ ఆంజనేయులు(50)తో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్ సమీపంలోని అప్పన్నపల్లిలో జరుగుతున్న సర్పంచ్ల ప్రాంతీయ సమ్మేళనానికి బయలుదేరారు. పౌరసరఫరాల శాఖ ప్రజాపంపిణీ రేషన్ బియ్యం లోడుతో ఓ లారీ యాపర్ల గ్రామానికి వెళ్తుంది. మార్గమధ్యలో పెబ్బేరు మండలం గుమ్మడం కాస్ర్రోడ్డు వద్ద లారీ, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఆంజనేయులు ఎగిరి లారీ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సర్పంచ్ పద్మమ్మ తీవ్రంగా గాయపడింది. అలాగే లారీ అక్కడే ఉన్న బస్టాండ్‌లో దూసుకెళ్లడంతో అందులో ఉన్న సుశీలమ్మ(68) అనే వృద్ధురాలు మృత్యువాత పడింది. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా సకాలంలో రాలేకపోయింది. దీంతో గుమ్మడంలో అంగన్వాడీ కేంద్రాల తనిఖీకి వచ్చిన వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతి తన వాహనంలో పద్మమ్మను పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యసిబ్బంది మెరుగైన వైద్యం కోసం వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి కొత్తకోట సీఐ సోంనారాయణసింగ్, శ్రీరంగాపూర్ ఎస్ఐ సురేష్, కొత్తకోట ఎస్ఐ రవికాంత్, వీపనగండ్ల ఎస్ఐ సాయిచంద్రప్రసాద్యాదవ్, సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించారు. పెబ్బేరు నుంచి క్రేన్ రప్పించి లారీని బస్టాండ్‌లో నుంచి బయటకు తీసి మృతదేహాలను వెలికితీశారు. ఆంజనేయులుకు భార్య పద్మమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే సుశీలమ్మకు ఒక కుమారుడు ఉన్నారు. పింఛన్ కోసం వెళ్లి.. చిన్నగుమ్మడానికి చెందిన సుశీలమ్మ తన కూతురును గోవర్ధనగిరిలో పింఛన్ తీసుకురావడానికి విడిచిపెట్టి తిరిగి క్రాస్ రోడ్డులోని బస్టాండ్ వద్ద వేచి ఉండగా లారీ దూసుకెళ్లడంతో మృత్యువాతపడింది. అనంతరం లారీకి సంబంధించిన అధికారులు రావాలని డీలర్ ఆంజనేయులు మృతదేహంతో కొల్లాపూర్ జెడ్పీటీసీ లోకారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణప్రసాద్, సంపట్రావ్‌పల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గంటపాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఐ సోంనారాయణసింగ్ నచ్చచెప్పినా వినిపించుకోలేదు. సమాచారం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోన్లో పౌరసరఫరాల సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహాం అందించేలా కృషిచేస్తానని, అలాగే సొంతంగా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోలీసులు సంఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించి తన వాహనంలో క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించిన కలెక్టర్‌కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. -
కారు బోల్తా: ఇద్దరు పిల్లలు మృతి
సాక్షి, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అసువులుబాసారు. కర్నూలు జల్లా బనగానపల్లి నుంచి హైదరాబాద్‌కు ఎండి.అఫ్జల్ కుటుంబం కారులో బయలుదేరింది. కొత్తకోట వద్ద బైపాస్‌లో కారు టైరు పగిలి అదుపుతప్పి బోల్తాపడడంతో ఆయన ఇద్దరు కుమార్తెలు నౌసీన్(16), నూరిను(10) అక్కడికక్కడే మృతిచెదారు. అఫ్జల్, ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వీరు హైదరాబాద్‌కు చెందినవారు. -
రక్తమోడిన రహదారులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రహదారులు రక్తమోడాయి.. శుక్రవారం వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలవగా.. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తిమృతి చెందాడు.. ఆయా ప్రమాదాల్లో తీవ్ర గాయా లపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొం దుతున్నారు. ఆయా సంఘ టనలకు సంబంధించి వివరాలిలా.. అమరచింత (కొత్తకోట) : ఎదురుగా వచ్చిన ఎద్దులబండిని తప్పించబోయి కిందపడటంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని కొత్తతండా శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తుక్యానాయక్తండాకు చెందిన నేనావత్ రాములునాయక్(46) మస్తీపురం గ్రామ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య జయమ్మ, కోడలు చిట్టెమ్మలతో కలిసి ద్విచక్రవాహనంపై మస్తీపురంలోని వ్యవసాయ పొలం నుంచి తండాకు బయల్దేరారు. కొత్తతండా దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించబోయి అదుపుతప్పి బైక్‌పై నుంచి ముగ్గురు కిందపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాములునాయక్ మార్గమధ్యలోనే మృతిచెందాడు. భార్య జయమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. అన్నాసాగర్ సమీపంలో.. భూత్పూర్ (దేవరకద్ర): మండలంలోని అన్నాసాగర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి బోల్తా పడగా ఒకరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కేరళలోని కోయికోడ్ జిల్లా వటగారా నియోజకవర్గం కొత్తపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ లతీఫ్(40), భార్య ఆసియా, ఇద్దరు చిన్న కుమారులు మహమ్మద్, ఆఖీం, బంధువులు ఇస్మాయిల్, నాబీలాలతో పాటు డ్రైవర్ రియాజ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని కల్యాణదుర్గం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో అన్నాసాగర్ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అబ్దుల్ లతీఫ్ అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య ఆసియా, కుమారులు మహమ్మద్, ఆఖీం, ఇస్మాయిల్, నబీలాలకు గాయాలవగా.. డ్రైవర్ రియాజ్‌కు కాలు విరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉదయం పెళ్లి.. సాయంత్రం విషాదం
కొత్తకోట (మహబూబ్‌నగర్) : కుమారుడి పెళ్లి వేడుకలు ముగించుకుని తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడి తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రితోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నాటెళ్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గద్వాల పట్టణం రెవెన్యూ కాలనీకి చెందిన చంద్రశేఖర్, పుష్పవతమ్మ (60) దంపతుల కుమారుడి వివాహం శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత చంద్రశేఖర్ దంపతులు, మరికొందరు స్విఫ్ట్ డిజైర్ కారులో గద్వాలకు బయల్దేరారు. నాటెళ్లి వద్దకు వచ్చేసరికి కారు టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన పుష్పవతమ్మ ప్రమాద స్థలంలోనే కన్నుమూసింది. చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, వీరభద్రమ్మ, జ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం బాధితులను కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. -
103 ఏళ్ల బామ్మకు నాణేలతో తులాభారం
కొత్తకోట: నూరేళ్లు నిండిన వయసులోనూ నిక్షేపంలాంటి ఆరోగ్యంతో కనిపించేవారు చాలా అరుదు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన పొగాకు బసమ్మ 103 సంవత్సరాల వయస్సులోనూ ఉత్సాహంగా తన వారసులతో గడుపుతోంది. ఇప్పటికి కంటి అద్దాలు లేకుండా బసమ్మ పుస్తకాలు చదువుతూ పూజలు చేస్తూ పిల్లలకు స్లోకాలు నేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో కుమారుల, కుమార్తెలు సోమవారం రాత్రి కొత్తకోటలో అంగరంగ వైభవంగా బసమ్మకు రూపాయి నాణేలతో తులాభారం నిర్వహించారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత పి.అయ్యప్ప తల్లి అయిన బసమ్మకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మొత్తం ఈమె కుటుంబంలో వందకు పైగా వారసులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీరంతా వివిధ హోదాల్లో స్థిర పడగా, ఈమె మనమలు, మనమరాళ్లు విదేశాలలో ఉంటున్నారు. కుమార్తె రాజమ్మ, అల్లుడు డాక్టర్ రవీందర్రావులు వారి ముచ్చట తీర్చుకునేందుకు బసమ్మను రూపాయి బిల్లలతో తులాభారం చేశారు. -
కాలువలో గుర్తుతెలియని మృతదేహం
కొత్తకోట (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం మదనాపురం గ్రామ సమీపంలోని సరళా సాగర్ కుడికాలువలో శక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
9 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో పేకాటస్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 9 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5 వేల నగదుతోపాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాముకాటుతో చిన్నారి మృతి
కొత్తకోట (మహబూబ్‌నగర్) : పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లెలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కానాయపల్లె గ్రామానికి చెందిన చిన్నారి(3) శనివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
400 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట సమీపంలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకీలతోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులకు చెందిన రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. -
జబ్బార్ ట్రావెల్స్ ఘటనలో దోషుల పై చర్యలేవి?
-
నేడు మరో 8 మంది మృతదేహాలనివేదికలు అందే అవకాశం
-
బస్సులో ప్రతీ సీటులోనూ ఒ బంగారు కల భస్మం
-
గాల్లో దీపాలుగా ప్రజల ప్రయాణాలు
-
యమపురి ట్రావెల్స్:పండక్కి వస్తూ తలలు వాల్చేసిన అభాగ్యులు
-
బస్సు ప్రయాణికుల సంఖ్యపై గందగగోళం
-
44 మృతదేహాలు వెలికితీత
-
క్యాబిన్లో నుంచి దూకేసిన డ్రైవర్,క్లీనర్
-
నివ్వెరపరిచే వివరాలను చేప్పిన ప్రత్యక్ష సాక్షి
-
వోల్వో బస్పు ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు ప్రయాణికులు
-
బాధితుల సమాచారం కోసం బంధువుల ఆందోళన
-
వోల్వో బస్సు దగ్ధం - 42మంది దుర్మరణం?
-
జాతీయ రహదారి పై అగ్నికి ఆహుతైన వోల్వో బస్సు
-
ప్రయాణికుల వివరాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం
-
మహబూబ్ నగర్ జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం
-
'రక్షక భటుడే భక్షక భటుడయ్యాడు'
మహబూబ్ నగర్ : రక్షక భటుడే భక్షక భటుడైన దారుణ సంఘటన మహబూబ్నగర్జిల్లాలో చోటుచేసుకుంది. అడ్డాకుల మండలం కందూరుకు చెందిన ఓ మహిళ 22 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటోంది. ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించి అర్థరాత్రి కొత్తకోట బస్టాండ్‌లో దిగిన ఆమెను అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ అటకాయించాడు. హోంగార్డు, మరో ఇద్దరు స్థానికులను కాపలాగా పెట్టి, మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. మహిళపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ వెల్లడించారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులైన హోంగార్డ్, కానిస్టేబుల్లను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అన్ని రాజకీయ పార్టీలు రాస్తారోకో నిర్వహించాయి. -
'కొత్తకోట' అత్యాచార నిందితులపై నిర్భయ కేసు నమోదు
కొత్తకోట బస్టాండ్‌లో ఈ రోజు తెల్లవారుజామున మహిళపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ వెల్లడించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులైన హోంగార్డ్, కానిస్టేబుల్లను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన మహిళ... కర్నూలులో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించి .... అర్థరాత్రి కొత్తకోట బస్టాండ్ లో దిగింది. బస్టాండ్ లో సైకిల్ స్టాండ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులు.... ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కొత్తకోట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరు యువకులు కూడా ఆ మహిళను బెదిరించి లైంగిక చర్యకు పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ ఈ రోజు ఉదయం పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
కొత్తకోట బస్టాండ్ లో మహిళపై అత్యాచారం
-
కొత్తకోట బస్టాండ్ లో మహిళపై అత్యాచారం
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట బస్టాండ్ లో ఓ మహిళ (40)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన మహిళ... కర్నూలులో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించి .... అర్థరాత్రి కొత్తకోట బస్టాండ్ లో దిగింది. బస్టాండ్ లో సైకిల్ స్టాండ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులు.... ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కొత్తకోట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఇద్దరు యువకులను, మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహిళ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది. కాగా మహిళపై అత్యాచారాన్ని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు రాస్తారోకో నిర్వహిస్తున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తుఎన్నారు. రిపోర్టర్: శాంతిరెడ్డి -
కొత్తకోటలో వైఎస్ షర్మిళ ప్రసంగం