ఎన్నికల బరిలో భార్యా భర్తలు.. | Families Curious For Contesting Municipal Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో భార్యా భర్తలు..

Published Sun, Jan 19 2020 11:35 AM | Last Updated on Sun, Jan 19 2020 11:42 AM

Families Curious For Contesting Municipal Elections - Sakshi

సాక్షి, కొత్తకోట: మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఇద్దరు భార్యాభర్తలు బరిలో నిలిచారు. ఒక జంటలో భర్త శ్రీనివాసులు ఏడో వార్డు నుంచి పోటీ చేస్తుండగా, భార్య మాజీ సర్పంచ్‌ అయినటువంటి అరుణ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీ ఫారంతో పోటీపడుతున్నారు. ప్రస్తుతం అరుణ పోటీ చేస్తున్న 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి సుఖేశిని పోటీలో ఉన్నారు.

అలాగే మరో జంట అయినటుంటి వారిలో నాగన్న 8వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పద్మజ 12వ వార్డు నుంచి పోటీ చేస్తుంది. వీరిద్దరు సైతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీ ఫారంతో బరిలో నిలిచారు. కాగా నాగన్న గతంలో 13 వార్డుసభ్యుడిగా పనిచేయగా, పద్మజ గతంలో  ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. వీరిరువురికి రాజకీయంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement