కొత్తకోట (మహబూబ్‌నగర్) : పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లెలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కానాయపల్లె గ్రామానికి చెందిన చిన్నారి(3) శనివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.