మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో పేకాటస్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 9 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో పేకాటస్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 9 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5 వేల నగదుతోపాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.