
సాక్షి, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అసువులుబాసారు. కర్నూలు జల్లా బనగానపల్లి నుంచి హైదరాబాద్‌కు ఎండి.అఫ్జల్ కుటుంబం కారులో బయలుదేరింది. కొత్తకోట వద్ద బైపాస్‌లో కారు టైరు పగిలి అదుపుతప్పి బోల్తాపడడంతో ఆయన ఇద్దరు కుమార్తెలు నౌసీన్(16), నూరిను(10) అక్కడికక్కడే మృతిచెదారు. అఫ్జల్, ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వీరు హైదరాబాద్‌కు చెందినవారు.