మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట బస్టాండ్ లో ఓ మహిళ (40)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన మహిళ... కర్నూలులో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించి .... అర్థరాత్రి కొత్తకోట బస్టాండ్ లో దిగింది. బస్టాండ్ లో సైకిల్ స్టాండ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులు.... ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కొత్తకోట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఇద్దరు యువకులను, మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మహిళ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది. కాగా మహిళపై అత్యాచారాన్ని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు రాస్తారోకో నిర్వహిస్తున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తుఎన్నారు.
రిపోర్టర్: శాంతిరెడ్డి
కొత్తకోట బస్టాండ్ లో మహిళపై అత్యాచారం
Published Thu, Sep 19 2013 9:10 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement