![CP Kothakota Srinivasreddy Meeting On Drugs In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/17/srinivasreddy.jpg.webp?itok=Q-n5fac0)
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment