Srinivas reddy
-
ఫాంహౌస్ కోళ్లపందాల కేసులో విచారణకు హాజరైన పోచంపల్లి
-
మొయినాబాద్ పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..
సాక్షి, రంగారెడ్డి: ఫామ్‌హౌస్‌లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోచంపల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఫామ్ హౌస్ లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
విచారణకు రావాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బిగ్ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
కోడి పందేల నిర్వహణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండమొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. -
ఖమ్మం జిల్లా కుసుమంచిలో ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభం
-
రెవెన్యూను సరిచేస్తా
సాక్షి, హైదరాబాద్: ‘ఆసామి సరిగా లేకపోతే ఏం జరుగుతుందో గత ప్రభుత్వ హయాంలో అదే జరిగింది. దొరికినోడికి దొరికినంత తరహాలో ఆగమాగం చేశారు. ఈ పరిస్థితిని మార్చకపోతే ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమైపోతాయి. అలాకాకుండా వాటిని కాపాడడం మా బాధ్యత. నేను మంత్రిగా ఉన్నప్పుడే రెవెన్యూ వ్యవస్థను సరిచేస్తా. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా..’అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పారదర్శకత కోసమే ప్రక్షాళన: ‘కర్ణాటకలో పారదర్శక రిజిస్ట్రేషన్ల ప్రయత్నం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతోంది. అక్కడ ఇప్పటికీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. తెలంగాణలోనూ దీనికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ వ్యవస్థను అన్ని రకాలుగా ప్రక్షాళన చేస్తున్నాం. రాష్ట్రంలో డిసెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 1.2 శాతం పెరిగినా మా అంచనాలకు తగినట్టు మాత్రం రాలేదు. ఈ మూడు నెలలు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మొత్తం 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో 4.5 లక్షల వరకు పరిష్కరించాం. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. జాగ్రత్తగా ముందుకెళ్తుండటంతో ఈ విషయంలో కొంత జాప్యం జరుగుతోంది.జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి) దరఖాస్తుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. భూముల విలువల సవరణ ప్రక్రియ అమలు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రామ రెవెన్యూ అధికారుల నియామక ప్రక్రియ త్వరలో చేపడతాం. వీఆర్వో, వీఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన 1,365 మందిని నేరుగా రెవెన్యూలోకి తీసుకుంటాం. మిగిలిన వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెడతాం. ఈ పరీక్ష అనంతరం ఇంకా పోస్టులు మిగిలిపోతే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సర్వేయర్ల నియామక ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 81 లక్షల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ 85 శాతం పూర్తయింది..’అని పొంగులేటి తెలిపారు. కొత్త పాస్ పుస్తకాలుండవు ‘కొత్త రెవెన్యూ చట్టం వస్తున్నందున రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయనడం సరికాదు. కొత్తగా అవసరమైన వారికి మాత్రమే కొత్త పుస్తకాలు వస్తాయి. సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు లోతుగా విచారణ చేయాలని చెప్పానే తప్ప 2వేల ఎకరాల వరకు అక్రమాలు జరిగాయని నేను కూడా ఊహించలేదు. ధరణి పోర్టల్ నిర్వహణను ఈనెల ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎన్ఐసీ చూస్తోంది..’అని మంత్రి వెల్లడించారు. సియోల్ బాంబులు స్టార్టయ్యాయి: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో తాను చెప్పిన పొలిటికల్ బాంబులు ఇప్పుడు పేలడం మొదలయ్యాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని, అయితే తప్పొప్పులు తేల్చేది కోర్టులని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో తప్పు చేయకుంటే కేటీఆర్‌కు భయమెందుకని, కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్కో ఇచ్చిన ఎన్నికల బాండ్లు మాత్రమే కాదని, ఈ కేసులో బయటపడాల్సినవి చాలానే ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకి వెళ్లాయో తేలాలని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా బీఆర్ఎస్ ఎలా అయిందని, జాతీయ పార్టీలకు కూడా లేని నిధులు ఆ పార్టీకి ఎక్కడివని ప్రశ్నించారు. -
రెవెన్యూ డివిజన్లు, మండలాల గందరగోళాన్ని సరిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గత ప్రభుత్వ హయాంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటాం’అని రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల స మయంలో పెద్దసంఖ్యలో సభ్యులు, రెవెన్యూ డి విజన్లు, మండలాల గందరగోళంపై అడిగిన ప్ర శ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు.ఐదు మండలాలున్న చేర్యాల ప్రాంతంలో ప్రజలకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసు సంబంధిత పనులకు హుస్నాబాద్‌కు, వ్యవసాయశాఖ పనులకు గజ్వేల్ కార్యాలయానికి, కలెక్టరేట్ కోసం సిద్దిపేటకు తిరగాల్సి వస్తోందని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. ముధోల్, తాండూరు, జడ్చర్ల, వేములవాడ, నారాయణఖేడ్, వర్ధన్నపేట, మహబూబాబాద్.. ఇలా పలు నియోజకవర్గాల పరిధిలో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సభ్యులు లేవనెత్తారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం కలెక్టర్ పరిశీలనలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సమస్యలపై సీఎం, సహచర మంత్రులతో చర్చించి వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
బద్వేల్ బాధిత తల్లిదండ్రుల ప్రశ్నలకు టీడీపీ నేత పరారు..
-
ఆ పెద్దన్న ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అంట కాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంపై ఈడీ జరిపిన దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ దాడిలో రూ.వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని, 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూ కు ఒక్క విషయం బయటకి రాలేదని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ.40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడం, దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపైనా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో ‘డేట్ డ్రగ్’
సాక్షి, హైదరాబాద్ : డేట్ డ్రగ్ ఎంఫెటమైన్ (8.5 కేజీలు) భారీస్థాయిలో పట్టుబడింది. దీనిని రేప్ డ్రగ్ అని కూడా అంటారు. డేటింగ్ పేరుతో యువతులను తీసుకెళ్లి వారికి తెలియకుండా వారు తాగే నీరు, కూల్‌డ్రింక్స్‌లో కలిపి ఇచ్చేసి అప స్మారక స్థితిలోకి చేరాక అఘాయిత్యాలకు పాల్పడటానికి కొందరు ఈ డ్రగ్‌ను వినియోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. డీసీపీలు సాధన రష్మి పెరుమాళ్, వైవీఎస్.సుధీంద్రలతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో హైదరాబాద్ సీపీ ఆ వివరాలు వెల్లడించారు. బౌరంపేటకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చంద్రారెడ్డి గార్డెన్స్ పేరుతో ఫంక్షన్‌హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్వహించేవాడు. సాయికుమార్‌గౌడ్, రాకే‹శ్ కొన్నాళ్ల క్రితం ఫార్మా కంపెనీల్లో పనిచేశారు. వీరికి కెమికల్ ప్రాసెసింగ్‌పై పట్టు ఉంది. వీరితో కలిసి అల్ప్రాజోలం తయారు చేయాలని అంజిరెడ్డి పథకం వేశాడు. కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్ సహకారంతో అదే గ్రామంలో ఓ కోళ్ల ఫారం అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ గదిలో డ్రగ్స్ ప్రాసెసింగ్‌కు అవసరమైన రియాక్టర్ ఏర్పాటు చేశారు. అంజిరెడ్డి బాలానగర్ నుంచి ముడి సరుకులు ఖరీదు చేసి ఇచ్చేవాడు. వీటిని వినియోగించి సాయి, రాకేశ్‌లు అల్ప్రాజోలం, ఎంఫిటమైన్ తయారు చేసేవారు. డిప్రెషన్ వంటి రుగ్మతలకు వైద్యుల చీటీ ఆధారంగా విక్రయించే ఔషధాలను తయారు చేయడానికి ఈ రెండింటినీ వాడతారు. వీటిని దుర్వినియోగం చేస్తూ మాదకద్రవ్యాలుగా వీరు విక్రయించడం మొదలు పెట్టారు. టీజీ ఏఎన్‌బీకి ఫిర్యాదుతో....ల్యాబ్‌లో మిగిలిన రసాయన వ్యర్థాలను కొత్తపల్లి శివార్లలో పడేసేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ వస్తున్న వాసనలతో స్థానికులు దీనిపై టీజీ ఏఎన్‌బీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు జూన్ 18న దాడి చేసి అంజిరెడ్డి తదితరులను అరెస్టు చేసి 2.6 కేజీల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇదే ల్యాబ్‌లో అంజిరెడ్డి ఎంఫిటమైన్ తయారు చేయించాడు. అరెస్టు కావడానికి పదిరోజుల ముందు తన అనుచరుడైన కుంచల నాగరాజును పిలిచాడు.తన వద్ద ఉన్న 8.5 కేజీల ఎంఫిటమైన్‌ను అప్పగించి భద్రపర చాలన్నాడు. అంజిరెడ్డి అరెస్టు కావడం.. జైలుకు వెళ్లి రెండు నెలలు దాటినా అతడు బయటకు రాకపోవడంతో నాగరాజు ఆ సరుకును ముందు గ్రామం నుంచి నగరానికి చేరుద్దామని, ఆపై ఖరీదు చేయ డానికి ఆసక్తి చూపిన వారికి విక్రయిద్దామని భావించాడు. దీనికోసం వినోద్‌కుమార్‌గౌడ్, శ్రీశైలంలను సంప్రదించాడు. ఈ ముగ్గురూ కలిసి వాహనంలో ఎంఫిటమైన్ పెట్టుకొని బయలుదేరారు. దీనిపై హెచ్–న్యూకు సమాచారం అందింది. బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాసి...ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, డానియేల్, బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాశారు. అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎంఫిటమైన్ దొరికింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డ్రగ్‌తో పాటు వాహనం స్వాధీనం చేసుకున్నారు. ‘అత్యంత తీవ్ర ప్రభావం చూపే ఈ డ్రగ్‌ను ముక్కు ద్వారా పీల్చడం, నీరు/కూల్‌డ్రింక్స్‌లో కలిపి తాగడం, నీళ్లల్లో కలిపి ఇంజెక్షన్లా చేసుకోవడం ద్వారా సేవిస్తుంటారు.అనేక మందికి తెలియకుండానే దీనిని కూల్‌డ్రింక్‌లో కలిపి ఇచ్చి వారినీ బానిసలుగా మారు స్తారు. ఈ నేపథ్యంలోనే అపరిచితులు, డ్రగ్స్ అలవాటు ఉన్నవారు ఇచ్చే పార్టీలకు యువత వెళ్లకూడదు. ఈ కేసులో అంజిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేస్తాం’ అని కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
-
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత.. యువతకు సీపీ వార్నింగ్..
-
ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
-
నంద్యాల జిల్లాలో నరమేధం సృష్టించిన శ్రీనివాస్‌రెడ్డి ఎక్కడ?
-
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
హిమాయత్‌నగర్(హైదరాబాద్): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మీడియాలో వస్తున్న మార్పులతో జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోనున్నదన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్‌గా ఉద్యోగ విరమణ చేసిన కె.రవికాంత్‌రెడ్డి, జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ రాష్ట్ర కార్యదర్శి వరకల యాదగిరి, కోశాధికారి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, రాజే‹Ù, సయ్యద్ గౌస్ మొయినుద్దీన్లను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కేఎన్, హరి, సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు, ఇతర సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన అసోసియేషన్లే కాకుండా కుల సంఘాల పేరిట కూడా అసోసియేషన్లు ఏర్పడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీనివల్ల జర్నలిస్టుల మధ్య ఐక్యత కొరవడుతుందని చెప్పారు. అర్హులకు మాత్రమే అక్రిడేషన్లు అందాలన్నారు. రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్‌లైన్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులలో స్థలాలను గుర్తించి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, వై.నరేందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లోకి మాజీ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పోచా రం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు.. చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహా్వనించారు. పోచారంతో పా టు ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడే సీఎం మీడియాతో మాట్లాడారు. అండగా నిలవాలని కోరా తెలంగాణ పునరి్నర్మాణంలో భాగంగా పోచారంను కలిశామని, పెద్ద నాయకుడిగా తమకు అండగా నిలబడాలని కోరామని రేవంత్ చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. రైతుల విషయంలో పోచారం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళతామని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. తమది రైతు రాజ్యమని, రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని వెళతామని రేవంత్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి: పోచారం సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని పోచారం చెప్పారు. రైతు సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యమైనవని పేర్కొన్నారు. తాను స్వయంగా రైతునని, రైతుల కష్టసుఖాలు తనకు తెలుసునని అన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలని కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లలో పనిచేసినా చివరకు కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని చెప్పారు. రేవంత్‌రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని, అందుకే రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాలని, ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలో మరిన్ని చేరికలు?పోచారం చేరిక నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వచ్చారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. దానం నాగేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలంటూ ఏకంగా ఓ జాబితానే ప్రకటించారు. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లను ఆయన వెల్లడించారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌లు తప్ప మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని ఆయన చెప్పడం గమనార్హం. కాగా దానం, తాజాగా పోచారంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పారీ్టలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 నుంచి 69కి, మిత్రపక్షమైన సీపీఐతో కలిసి 70కి చే రడం గమనార్హం. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బాల్క సుమన్ యత్నంబంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నేతలు బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు అక్కడకు వచ్చారు. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తూ బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వావాదం, తోపులాట జరిగింది.ఈ క్రమంలో బాల్క సుమన్‌ను బలవంతంగా బయటకు తీసుకువచి్చన పోలీసులు జీపులో కూర్చోబెట్టి తరలించేందుకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి అందరినీ చెల్లాచెదురు చేసి. బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. సీఎంఉ ండగానే పోచారం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బాల్క సుమన్‌తో పాటు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, అందరికీ బెయిల్ మంజూరైంది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో సోషల్ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్‌కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు. ఏ అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయ్యిందో ట్విట్టర్ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీడియో మార్ఫింగ్ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు.మార్ఫింగ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపించాము. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము. మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం. ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల కోసం ఫుల్ బందోబస్తు..ఇదే సమయంలో ఎన్నికల బందోబస్తు గురించి కూడా వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతాం. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన దాని కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్‌కి వచ్చాయి. మరిన్ని బలగాలను పంపాలని కోరాం.పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నడుస్తున్నాయి. హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నాయి. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. పోలింగ్ రోజు ఈ టీమ్స్ పనిచేస్తాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుంచి 18 కోట్ల అక్రమ నగదుని ఇప్పటివరకు పట్టుకున్నాం. అలాగే, 12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చిందినటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణకథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్దర్శకత్వం: శివ తుర్లపాటిసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థఎడిటర్: ఛోటా కె ప్రసాద్విడుదల తేది: ఏప్రిల్ 11, 2024తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్‌తో గీతాంజలికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్‌లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్‌లో ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్‌పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్‌తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్‌కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్‌లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్‌ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్‌తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్‌ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్‌గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్‌ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్‌లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్‌గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్‌గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్‌గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని, 71రోజుల్లో ఇప్పటికే 31వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో సుమారు రూ.47కోట్లతో నిర్మించిన కె–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు ధనసరి అనుసూయ(సీతక్క), కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కె–హబ్‌లో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే నాలుగు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు యూనివర్సిటీల్లోని యువతను రెచ్చగొట్టి దాదాపు పదేళ్లు అ«ధికారంలో ఉన్న గత ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించకుండా విస్మరించిందని విమర్శించారు. -
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మరో లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పటివరకు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు. దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నుంచి లోక్‌సభకు కొత్త వారే.. -
ఖర్చులు వెల్లడిస్తాం
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరకు చేసిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్న అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. జాతరకు డబ్బు లేదనకుండా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వం జాతరకు మూడు వేల బస్సులను నడిపితే.. ఈ ప్రభుత్వం ఆరువేల బస్సులు నడుపుతోందన్నారు. ఇప్పటివరకు వనదేవతలను 17 లక్షల మంది మహిళలు దర్శించుకున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ రానంతమంది ఈసారి జాతరకు వచ్చిపోతున్నారని, వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. క్రమశిక్షణ, స్వీయ రక్షణతో జాతరకు వచ్చివెళ్లాలని, వాహనాలను ఓవర్టేక్ చేసి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. -
మీలా ఆత్రుత పడం.. తప్పులు చేయం
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరాన్ని తొందరగా కట్టేయాలనే ఆత్రుత తప్ప అసలు ఆ ప్రాజెక్టు మనుగడ గురించి ఆలోచించలేదు. కటాఫ్‌వాల్ డిజైన్ మార్చకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఆర్సీసీతో కట్టి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఇసుకను సరైన విధంగా గట్టిపర్చలేకపోవడం వల్ల నష్టం జరిగింది. ఆర్సీసీతో వాల్ కట్టి ఉంటే రాఫ్ట్ కుంగేది కాదు.. డ్యామ్ కుచించుకుపోయి పగుళ్లకు ఆస్కారం ఏర్పడేది కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలోని ఈ మూడు పిల్లర్లే కాదని, అన్నారంలో కూడా బుడగలు వస్తున్నాయని, సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ మొదలైందని చెప్పారు. ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆత్రుత పడేది లేదని, తప్పులు చేసేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిందే తానని, తన మెదడులోనే ప్రాజెక్టు డిజైన్ ఉందని చెప్పే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి ఉంటే తనకున్న సమస్యకు పరిష్కారం చెప్పేవారు కదా అని ఎద్దేవా చేశారు. నాడు ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కలిసి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పవిత్ర దేవాలయం అని చెప్పిన కేసీఆర్‌కు అదే ప్రాజెక్టు బొందలగడ్డ ఎలా అయిందని ప్రశ్నించారు. పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే.. కనీస పరిశోధనలు లేకుండానే కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించి ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేశా రని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మట్టి పరీక్షలు, ఇతరాత్ర పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే ప్రాజెక్టులను కట్టడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వ్యవసాయానికి నీటిని అందించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న వాదన అర్థరహితమన్నా రు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేరా అని కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని, అక్టోబర్ 21, 2023 రోజునే పిల్లర్లు కుంగిపోయాయని, అప్పటి నుంచి దాదాపు 45 రోజుల పాటు కేసీఆరే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నా రని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘బెస్ట్ ఠాణా’లో 85 మంది బదిలీ.. సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్డ్ రిజర్వు) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మసకబారిన ఠాణా ప్రతిష్ట .. నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్‌కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్‌స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస వివాదాలు కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్లో ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు. ► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది. సీరియస్‌గా తీసుకున్న సీపీ పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్‌కుమార్‌కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు. వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్లో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. -
HYD: పంజాగుట్ట పీఎస్ మొత్తం సిబ్బందిపై వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మొదలు.. హోంగార్డ్ వరకు సిబ్బందిని బదిలీ చేశారు. వివాదాల పోలీస్‌స్టేషన్‌గా పేరు పడ్డ పంజాగుట్టను రిపేర్ చేయలేమని భావించిన పోలీస్ శాఖ మొత్తానికి మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట స్టేషన్లో హోంగార్డు నుంచి ఇన్స్పెక్టర్ దాకా ఎన్నో వివాదాలు ఉన్నాయి. పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ప్రజా భవన్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు వేసింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం జరిగింది. -
ప్రజలపై భారం మోపం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ 2024–25 ప్రతిపాదనల రూపకల్పనలో భాగంగా గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోకలిసి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యాన వన, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార /ప్రజాసంబంధాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చే ఆదాయా న్ని ప్రజలకు పంచడానికి కృషి చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, గడువు ముగిసిన భూముల లీజుపై దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ భూములపై నివేదిక ఇవ్వాలి.. గత ప్రభుత్వం ధరణిలో ‘కాస్తు’ కాలమ్ తొలగించడంతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, కొన్ని పట్టా భూములను పార్ట్–బీలో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేసేవారని, 2014 తర్వాత ఈ విధానానికి స్వస్తి పలకడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ధరణితో ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. 2014 వరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూములను ఏ అవసరాల కోసం వాడారు.. వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని అధికారులు వివరించారు. కేంద్రం ఈ పదేళ్లలో రాష్ట్రంలో 1.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చిందని, 2023–24లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని మంత్రులకు తెలిపారు. 2024–25లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల గాను 67 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని మంత్రులు ఆదేశించారు. బతుకమ్మ చీరలు, విద్యా ర్థుల యూనిఫామ్‌ల తయారీపై ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్థిక, రెవెన్యూ(విపత్తు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అర్వింద్ కుమా ర్, నవీన్‌మిత్తల్ పాల్గొన్నారు. -
భావోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
-
తెలంగాణలో ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
-
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్‌కార్డును ప్రామాణికం(థంబ్‌రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్‌సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్‌సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్‌లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'రాఘవ రెడ్డి'!
శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రాఘవ రెడ్డి ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసరైన హీరో డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల అతనేం కోల్పోయాడు? అన్న కథాంశంతో తెరకెక్కించారు. ఈ ట్రైలర్లో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చదవండి: TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
హైదరాబాద్ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
-
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డితో టుడేస్ లీడర్
-
జనగామపై వీడని పీటముడి!
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్‌లో స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్‌కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం. అలాగే పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్‌గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. -
జనగామకు ‘పల్లా’ వద్దే వద్దు
జనగామ: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్‌కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి.. లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్‌రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు. ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
కెరీర్ కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు: బాధితురాలు
-
జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ? ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రసవత్తరంగా జనగామ రాజకీయం ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్‌గా మారింది. పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం 'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్‌కు ఇవ్వాలి. అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్‌తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ముత్తిరెడ్డికి ఇంటిపోరు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది. చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా? ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. పుల్లల రాయుడి ఫిట్టింగ్ గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
‘సాక్షి’ విలేకరులపై టీడీపీ గూండాల దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళిత సామాజికవర్గానికి చెందిన సాక్షి విలేకరులు ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర కవరేజికి వెళ్లిన ఓ విలేకరిపై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి, హింసించారు. పాదయాత్రంలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిత్రీకరించారన్న నెపంతో మరో మరో విలేకరిపై దాడికి పాల్పడ్డారు. లోకేశ్ పాదయాత్రపై వాస్తవాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కసుతో లోకేశ్ ప్రైవేటు సైన్యం ఈ దాడులకు పాల్పడింది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ వద్ద సెల్ఫీ కార్యక్రమం జరిగింది. కొందరు టీడీపీ కార్యకర్తలను సెల్ఫీకి అనుమతించకపోవడంతో అక్కడ గొడవ జరిగింది. ఈ సమయంలో పాదయాత్ర కవరేజికి వెళ్లిన సాక్షి విలేకరి, దళిత సామాజిక వర్గానికి చెందన కరుణాకర్ ఆ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన లోకేశ్ ప్రైవేటు సెక్యూరిటీ కరుణాకర్‌ను టెంట్‌లోకి లాక్కొని వెళ్లి డెయిరీ, సెల్‌ఫోన్, లాక్కొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ పిడుగుద్దులు గుద్దారు. ‘సాక్షి’ విలేకరులకు బాగా బలిసింది.. మీ సంగతి తేలుస్తామని దూషిస్తూ గంటసేపు టెంట్లో నిర్బంధించారు. సెల్‌ఫోన్ మొత్తం పరిశీలించి ఫొటోలు డిలీట్ చేశారు. మరోసారి పాదయాత్రలో ఫొటోలు తీసినా, వ్యతిరేక వార్తలు రాసినా సహించేది లేదని, పాదయాత్రలో కనిపిస్తే చంపుతామంటూ లొకేశ్ పర్సనల్ సిబ్బంది బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ సంగతి తేలుస్తామని బెదిరించి పంపేశారు. వెల్లంపల్లి దగ్గర జరిగిన లోకేశ్ పాదయాత్రలో సాక్షి విలేకరి మరొకరిపైనా టీడీపీ మూక దాడికి పాల్పడంది. పాదయాత్రలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దళిత యువకులపై లోకేశ్ ప్రైవేటు సైన్యం దాడి చేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నాగులుప్పలపాడు మండల ‘సాక్షి’ విలేకరి, దళిత సామాజికవర్గానికి చెందిన అత్తంటి మధుబాబుపై కూడా టీడీపీ మూక దాడికి పాల్పడింది. పది మంది చుట్టుముట్టి చేతిలో నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. మరోమారు ఇటువంటివి పునరావృతమైతే ప్రాణాలు ఉండవంటూ తీవ్రస్థాయిలో బెదిరించి పంపేశారు. విలేకరి మధును వదిలేసినా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన దళిత యువకులను శుక్రవారం రాత్రికి కూడా వారి నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దాడి హేయమైన చర్య: దళిత సంఘాలు ఏ తప్పూ చేయని దళిత విలేకరులపై లోకేశ్ గుండాలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. లోకేశ్ సిబ్బందిని అదుపులో పెట్టుకోకపోతే పాదయాత్ర సాగకుండా అడ్డుకుంటామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. దళిత విలేకరులు కరుణాకర్, మధుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘సాక్షి’ రిపోర్టర్లపై దాడి దారుణం ‘సాక్షి’ విలేకరులు కరుణాకర్, మధుబాబుపై టీడీపీ గుండాల దాడి హేయమైన చర్య. ఒంగోలులో లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన లేదు. సాక్షి పత్రిక ఈ నిజాలను నిర్భయంగా రాస్తోంది. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సెల్ఫోన్లు లాక్కోవడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ సాక్షి దళిత విలేకరి కరుణాకర్, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -
అనుమతులు లేకుండా ఐస్‌క్రీములు తయారుచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆతడితో పాటు నటిస్తున్న నాగవర్ధినితో సూర్యనారాయణ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి నాగవర్ధిని తనతో పాటు టీవీ సీరియళ్లలో నటిస్తున్న దాసరి శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో మాజీ ప్రియుడు సూర్యనారాయణ ఓ గదిలో ఉంటుండగా నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి మరో గదిలో అద్దెకుండేవారు. తరచూ సూర్యనారాయణతో వీరికి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం నేరుగా నాగవర్ధిని ఇంట్లోకి వచ్చిన సూర్యనారాయణ ఆమెతో గొడవపడి శ్రీనివాస్‌రెడ్డిని వదిలేయాలని తనతో ఉండాలని వాగ్వాదానికి దిగాడు. తమ ప్రేమకు అడ్డు పడుతున్నాడని భావించిన నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ పథకం ప్రకారం సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. అతడికి తీవ్ర గాయాలు కాగా పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్కూల్ డేస్‌ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ
టైటిల్: టెన్త్ క్లాస్ డైరీస్ నటీనటులు: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, నాజర్ తదితరులు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి నిర్మాతలు: అచ్యుత రామారావు, రవితేజ మన్యం, రవి కొల్లిపార సంగీతం: సురేష్ బొబ్బిలి విడుదల తేది: జులై 1, 2022 అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి అజయ్ మైసూర్ సమర్పకులు. ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. 'టెన్త్ క్లాస్ డైరీస్' చిత్రం శుక్రవారం (జులై 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ: మిడిల్ క్లాస్ అబ్బాయి సోమయాజ్ (శ్రీరామ్) బాగా చదువుకుని అమెరికాలో బిజినెస్ మ్యాన్‌గా స్థిరపడతాడు. డబ్బు, అమ్మాయిలు, లగ్జరీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ తన జీవితంలో ఏదో చిన్న అంసతృప్తి. ఈ వెలితీతో జీవిస్తున్న అతనికి ఆనందం లేదు. అతని భార్య కూడా వదిలేస్తుంది. తను ఏది మిస్ అవుతున్నాడో తెలుసుకునేందుకు ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తాడు. ఈ క్రమంలోనే అతని ఆనందం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ప్రేమించిన తన ఫస్ట్ లవ్ చాందినీ (అవికా గోర్) దగ్గర ఉందని. దీంతో టెన్త్ క్లాస్ రీ యూనియన్‌కు ప్లాన్ చేస్తాడు. మరీ ఆ రీ యూనియన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయింది ? చాందినీని కలుసుకున్నాడా ? అసలు చాందినీకి ఏమైంది ? అనే తదితర విషయాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'కు వెళ్లాల్సిందే. విశ్లేషణ: యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు మనసులు హత్తుకునేలా ఉంటాయి. కానీ అలాంటి కథలతో వచ్చే సినిమాలు కాస్తా అటు ఇటు అయిన తేడా కొడుతుంటాయి. అలాంటిదే ఈ కథ. నిర్మాత అచ్యుతరామారావు జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా మారిందనే అంశంతో ఈ కథను రూపొందించారు. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశాయో ఈ సినిమా ద్వారా చూపించారు. నిజానికి ఇలాంటి ఒక మంచి కథను ఎంచుకున్నందుకు దర్శకనిర్మాతలను మెచ్చుకోవాల్సిందే. కానీ వారు ఎంచుకున్న కథను పక్కాగా వెండితెరపై ఆవిష్కరించలేకపోయారు. ప్రేమించిన అమ్మాయి కోసం వెతికేందుకు చేసిన రీ యూనియన్, దానిలో భాగంగా వచ్చే సీన్లు ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి. హాఫ్ బాయిల్ (శ్రీనివాస్ రెడ్డి), గౌరవ్ నిర్మాత (అచ్యుత రామారావు) మధ్య వచ్చే సీన్లు మాత్రం చాలా ఆకట్టుకుంటాయి. వీరిద్దరి నటనతో ప్రేక్షకులను తెగ నవ్వించారు. కానీ సోమయాజ్, చాందినీ ప్రేమ సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ఈ లవ్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. అయితే సెకండాఫ్‌లో హీరోయిన్ కోసం వెతికే ట్రాక్ బాగుంటుంది. ఓవైపు నవ్విస్తూనే అమ్మాయిల జీవితంలో కోరుకునే విషయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను బాగా చూపించారు. ఊహించని విధంగా ఉండే క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తుంది. మూవీ మొత్తం ఎలా ఉన్న క్లైమాక్స్‌కు వచ్చేసరికి మాత్రం ఆడియెన్స్‌కు ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది. ఎవరెలా చేశారంటే? తన ఫస్ట్ లవ్‌ను దక్కించుకోవాలనే ప్రేమికుడిగా, ఆనందం మిస్ అయిన బిజినెస్ మ్యాన్‌గా శ్రీరామ్ పర్వాలేదనిపించాడు. అయితే ఇంతకుముందు 'రోజాపూలు' సినిమాలో చూసిన శ్రీరామ్ నటన, ఆ ఈజ్ ఎక్కడో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక అవికా గోర్ నటన కూడా పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంది. హీరో ఫ్రెండ్స్‌గా చేసిన శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత అచ్యుత రామారావు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తాయి. కమెడియన్‌గా అచ్యుత రామారావుకు మంచి భవిష్యత్తు ఉందనే చెప్పవచ్చు. వీరితోపాటు హిమజ, అర్చన, శివ బాలాజీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాజర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలోని బీజీఎం '96' మూవీని తలపిస్తుంది. ఇక 'గరుడవేగ' అంజికి ఇది మొదటి సినిమా కావడంతో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కానీ సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. రీ యూనియన్ సీన్లు ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. సినిమాలోని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్' మీ స్కూల్ డేస్ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. చాలవరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
100 ఏళ్లు మన్నికయ్యే రంగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ లైమ్ ఆధారిత ఇటాలియన్ ఫినిషెస్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. వారసత్వ కట్టడాలకు లైమ్ ఆధారిత పెయింట్స్‌ను వాడతారని, 100 ఏళ్లకుపైగా మన్నికగా ఉండడం వీటి ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రసాయనాలు లేకుండా సహజ ఖనిజాలు, వర్ణ ద్రవ్యాలతో వీటిని తయారు చేస్తారు. ఖరీదైన భవంతులు, విల్లాలకూ ఈ రంగుల వినియోగం పెరుగుతోందని కంపెనీ వివరించింది. లైమ్ ఆధారిత రంగుల తయారీ భారత్‌లో లేదని, కొన్ని కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాయని తెలిపింది. చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.150–400 మధ్య ఉంటుంది. లైమ్ ప్లాస్టర్స్, డెకోరేటివ్ ఫినిషెస్, వెనీషియన్ ప్లాస్టర్స్, మెటాలిక్ స్టకోస్ సైతం కంపెనీ విక్రయించనుంది. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లు..: ఇటలీ కంపెనీ రియాల్టోతో టెక్నో పెయింట్స్ సాంకేతిక సహకారం కుదుర్చుకుంది. లైమ్ ఆధారిత ఫినిషెస్‌ను తొలుత దిగుమతి చేసుకుంటామని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘అమ్మకాలు పెరిగిన తర్వాత వీటిని ఉత్పత్తి చేస్తాం. రియాల్టో సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన డిజైనింగ్ ఫినిషెస్‌ను తయారు చేస్తున్నాం. హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు వద్ద ఉన్న కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం ఒక లక్ష మెట్రిక్ టన్నులు. తొలి దశలో రూ.75 కోట్లు వెచ్చించాం. ప్లాంటు వినియోగం 2023 మార్చికల్లా 100 శాతానికి చేరుతుంది. 2023–24లో మరో రూ.75 కోట్లు ఖర్చు చేస్తాం. తద్వారా సామర్థ్యం రెండింతలు అవుతుంది. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లు ఉంది’ అని వివరించారు. -
అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్!
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ...జయశంకర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని ఏప్రిల్‌లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్‌లో ఆ సీన్స్ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు. జయశంకర్ వర్కింగ్ స్టెల్ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రొత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. -
టెన్త్ క్లాస్ డైరీస్ నుంచి సిలకా సిలకా సాంగ్ వచ్చేసింది..
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులుగా కెమెరామేన్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ నెల 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘సిలకా.. సిలకా.. రామా సిలకా.. ఏదో ఉందే మెలికా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సందర్భంగా ‘గరుడ వేగ’ అంజి మాట్లాడుతూ – ‘‘ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డ్యాన్సర్స్‌పై ఈ పాటను తెరకెక్కించాం. ఈ పాటలో ఇద్దరు ముంబై డ్యాన్సర్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘రోజ్ విల్లా, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత మేం చేస్తోన్న మూడో చిత్రం ఇది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు అచ్యుత రామారావు. -
బియ్యం ఎక్కడ నిల్వ చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ గోదాములన్నీ నిండిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యమని ఆయన ధ్వజమెత్తారు. పౌరసరఫరాల భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌సీఐకి రాష్ట్రంలో 20.37 లక్షల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ప్రస్తుతం సామర్థ్యానికి మించి మరో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కువగా నిల్వచేసినట్లు తెలిపారు. గోదాముల నుంచి ఎప్పటికప్పుడు బియ్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయకుండా కేంద్రం తన వైఫల్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై రుద్దడానికి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
కిషన్‌రెడ్డి వాదన అర్థరహితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల యాసంగిలో రా రైస్ (పచ్చిబియ్యం) ఉత్పత్తికి అనుకూలంగా ఉండదనే ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ అప్పగిస్తున్నామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని రా రైస్‌గా మారిస్తే బియ్యానికి బదులు నూకలు 30 నుంచి 40 శాతం వస్తాయని, బ్రోకెన్ రైస్‌ను ఎఫ్‌సీఐ 25 శాతమే అనుమతిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అర్థరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే ధాన్యం సేకరణ కేంద్ర జాబితాలోని అంశంగా వస్తోందని ఆయన పేర్కొన్నారు. -
ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్ పలువురు కమెడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్‌తో పాటు ఇప్పుటి కమెడియన్స్ అంతా ఒక్కచోట చేరారు. వేణు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! View this post on Instagram A post shared by Dhanraj (@yoursdhanraj) ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు(టిల్లు) వారందరి గ్రూప్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు. చదవండి: రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ View this post on Instagram A post shared by Venu Tillu (@venu_tilloo) -
30 రోజుల్లో మాదకద్రవ్య రహిత తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రానున్న 30 రోజుల్లో రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత తెలంగాణగా మార్చాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. డ్రగ్స్, గంజాయి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘాతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను మరింత పటిష్టం చేయనున్నారు. మత్తు పదార్థాలను తయారు చేస్తున్న వారితో పాటు రవాణా, అమ్మకం, వినియోగం చేస్తున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు ఎక్సైజ్ అధికారులు. రాష్ట్ర పోలీసు శాఖ సహకారంతో గంజాయి సాగు, రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు గుడుంబా వినియోగం పెరగకుండా తయారీదారులకు పునరావాస ప్రక్రియ అమలు చేయనున్నారు. ఎక్సైజ్ అధికారులకు మంత్రి సన్మానం కాగా, అంతర్జాతీయ మార్కెట్లో రూ.2కోట్లకు పైగా విలువ ఉండే సుమారు 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్‌ను పట్టుకున్న ఎక్సైజ్ అధికారులను ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, మేడ్చల్ ఈఎస్ విజయ్‌భాస్కర్, సీఐ సహదేవ్‌లతో పాటు వారి సిబ్బందిని శాలువాలతో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచాలని, దాడి చేసి పట్టుకునేంతవరకు నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. -
బయటికి వస్తే అరెస్ట్ చేస్తాం
-
‘ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: యాసంగికి సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫ్‌సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారం పౌరసరఫరాలభవన్‌లో కమిషనర్ అనిల్ కుమార్‌తో కలసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించా రు. యాసంగి సీజన్లో మొత్తంగా 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, సీఎంఆర్ కింద బియ్యంగా మార్చి 64 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుందని తెలిపారు. -
పేదరికంపై అలుపెరగని పోరాటం చేస్తున్న దివ్యాంగుడు
-
Plan B Review And Rating: ‘ప్లాన్ బి’ ఎలా ఉందంటే..?
టైటిల్ : ప్లాన్ బి జానర్ :సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ తదితరులు నిర్మాణ సంస్థ : ఏవీఆర్ మూవీ వండర్స్ నిర్మాత : ఏవీఆర్ కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కెవి రాజమహి సంగీతం : స్వర నేపథ్య సంగీతం : శక్తికాంత్ కార్తీక్ డీవోపీ : వెంకట్ గంగాధరి ఎడిటింగ్: ఆవుల వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021 గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కథలో కొత్తదనం ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే టాలీవుడ్లో ఇటీవల చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘ప్లాన్ బి’థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన‘ప్లాన్ బి’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలకు సంతానం కలగదు. ఆ గ్రామంలోని పురుషులకు వీర్యకణాలు తగ్గిపోవడం వల్లే పిల్లలకు పుట్టరు. ఈ క్రమంలో ఆ ఊరికి వచ్చిన ఓ డాక్టర్ మంచి వైద్యాన్ని అందించి అందరికి సంతానం కలిగేలా చేస్తాడు. అయితే గ్రామంలోని ఓ జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. దీంతో ఆ వైద్యుడు తన వీర్యాన్ని అందించి ‘ఐవీఎఫ్’పద్ధతిలో వారికి బిడ్డను అందిస్తారు. కట్ చేస్తే.. ఓ రిటైర్డ్ పోలీసు అధికారి చనిపోయే ముందు తన కూతుకు రూ. 10 కోట్లు ఇస్తాడు. అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించబడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్(శ్రీనివాస్ రెడ్డి), ప్రైవేట్ టీచర్ రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. ఈ హత్యలకు, రూ. 10 కోట్ల దొంగతనానికి సంబంధం ఏంటి? ఆ డబ్బును ఎవరు దొంగిలించారు? ఈ కేసును పోలీసు అధికారి( మురళీ శర్మ) ఎలా చేధించాడు? అసలు ఈ కథకి డాక్టర్‌కి సంబంధం ఏంటి? ప్లాన్ బి అంటే ఏంటి? అది ఎవరు వేశారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఎప్పటి మాదిరే శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాకు కీలకమైన లాయర్ విశ్వనాథ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ప్రేమికుడు గౌతమ్ పాత్రలో సూర్య వశిష్ట తనదైన నటనతో మెప్పించాడు. ఫైట్ సీన్స్‌లో కూడా అవలీలగా నటించాడు. ప్రతినాయకుడిగా కునాల్ శర్మ అధ్బుత నటనను కనబరిచాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర మురళి శర్మది. పోలీసు అధికారి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంటుంది. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు కెవి రాజమహి. ఆయన ఎంచుకున్న పాయింట్స్, రాసుకున్న స్క్రీన్‌ప్లే, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. ప్లాన్ బి కథ చాలా క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. అయినప్పటికీ.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా ప్రతి క్యారెక్టర్ని, సీన్‌ని చాలా క్లియర్‌గా, ప్రేక్షకుడికి కన్ప్యూజన్ లేకుండా తెరపై చూపించాడు. అయితే కాస్త పేరున్న నటులను తీసుకొని ఉంటే ఆయన తపనకు సరైన ఫలితం ఉండేది. కథలో చాలా వరకు ఫేమస్ కానీ నటులు ఉండడం కాస్త మైనస్. పోలీసుల విచారణ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తాయి. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఏం జరిగిందో ముందో ఊహించడం కాస్త సిల్లీగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంతగా ఉంటుంది. స్వర సంగీతం, శక్తికాంత్ కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొనేలా ఉంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సెప్టెంబర్ 17న శ్రీనివాస్ రెడ్డి ' ప్లాన్ బి'
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో డింపుల్ హీరోయిన్గా నటిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ , ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వర పాటలు అందించగా, శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. -
పచ్చి బియ్యం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్ సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అడిగిన విధంగా రా రైస్ (పచ్చి బియ్యం) ఇవ్వలేమని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. యాసంగిలో వరిసాగు కాలంలో అధిక ఉష్ణో గ్రత వల్ల రా రైస్ దిగుబడికి అనుకూలంగా ఉండదని, 25 శాతం కంటే అధికంగా నూకలు వస్తాయని, దీన్ని ఎఫ్‌సీఐ తిరస్కరిస్తోందన్నా రు. అందువల్ల ఎఫ్‌సీఐ అడిగినట్లుగా 40 శాతం బాయిల్డ్ రైస్, 60 శాతం రా రైస్ ఇవ్వ లేమని, 80–90 శాతం వరకు బాయిల్డ్ రైస్, మిగిలినవి రా రైస్ ఇవ్వగలమని తెలిపారు. ఈ విషయంలో ఎఫ్‌సీఐ తన నిర్ణ యాన్ని పునఃసమీక్షించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్, ఎఫ్ సీఐ నుంచి రావాల్సిన బకా యిలపై సోమవారం పౌర సరఫరాల భవ న్లో అధికారులతో శ్రీనివాస్‌రెడ్డి సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 63 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 24.75 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ పేర్కొనడం రైతాం గానికి గొడ్డలిపెట్టుగా మారుతోందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక ఇప్పుడు తీసుకోబోమనడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ఈ సమస్యను సీఎం కేసీ ఆర్, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలా కర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా సీఎంఆర్ గడువును పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. -
మంత్రి శ్రీనివాస్ రెడ్డి సభలో మహిళల ఆందోళన
-
లాక్డౌన్లో అందరూ అలా ఫీలయ్యారు: దర్శకుడు ఎన్. శంకర్
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా విధించబడిన లాక్‌డౌన్స్‌తో ప్రజలందరూ చెప్పలేని హౌస్ అరెస్ట్‌ను ఫీలయ్యారు. కరోనా టైమ్‌లో స్క్రిప్ట్‌ను ఓకే చేయించుకుని శేఖర్ సినిమాను పూర్తి చేయడం విశేషం’’ అన్నారు. (చదవండి: మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్) ‘‘పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి హిట్ చేయాలి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంటర్టైనరే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘పిల్లలంటే దేవుళ్లతో సమానం. వారికోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ జనరేషన్లో పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారనే విషయాన్నే ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శేఖర్. ఈ కార్యక్రమంలో కౌశిక్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ తాజాగా ఇటలీ సంస్థతో చేతులు కలిపింది. ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే సూపర్ ప్రీమియం పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయి. తాము మాత్రమే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నూతన తయారీ కేంద్రంలో.. కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని చేర్యాల్ వద్ద స్థాపిస్తోంది. దీని వార్షిక సామర్థ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు. 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూపర్ ప్రీమియం కోటింగ్స్, హై ఎండ్ లగ్జరీ ఎమల్షన్స్, డెకోరేటివ్ పెయింట్స్, స్పెషల్ టెక్స్చర్ ఫినిషెస్, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్స్, డిజైనర్ ఫినిషెస్ తయారు చేస్తారు. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో.. టెక్నో పెయింట్స్ ఆగస్ట్ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 650 ప్రాజెక్టులను పూర్తి చేసింది. చేతిలో 120 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లుంది. హైదరాబాద్‌లో పెయింటింగ్ సేవల్లో అగ్ర స్థాయిలో ఉన్న టెక్నో పెయింట్స్ 2021–22లో టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి ఆశిస్తోంది. ఇక నుంచి చిన్న ప్రాజెక్టులను సైతం చేపట్టనుంది. కస్టమర్ల నమ్మకంతోనే విజయవంతంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
కష్టపడండి... ఇంటికొచ్చి బీఫారం ఇస్తా
సాక్షి, హైదరాబాద్: ‘నేను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు డిని, నాకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమి వ్వండి.. యూత్ కాంగ్రెస్ వాళ్లకు టికెట్లు ఇవ్వరా? ఆ కోటాలో మాకు టికెట్లివ్వండి అంటే ఇచ్చేది లేదు’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాడి మోకాలిచిప్పలు పగులగొట్టుకుంటే రాహుల్‌పక్కన కూర్చునే అవకాశం దక్కిందని, అలా కష్టపడి పనిచేసే నాయకులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కష్టపడి పనిచేస్తే ఇంటికే వచ్చి బీఫారం ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం శంషాబాద్‌లోని మేఫెయిర్ కన్వెన్షన్ హాల్లో శివసేనారెడ్డి అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, ఈ దేశానికి, రాష్ట్రానికి ఎంతో మంది నాయకులను అందించిన చరిత్ర యూత్ కాంగ్రెస్‌కు ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులు కూడా యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. అయితే, వారంతా ఎంతో కష్టపడి నాయకులుగా ఎదిగారని, ప్రస్తుత యూత్ కాంగ్రెస్ నాయకత్వం కూడా క్రియాశీలకంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఏ పార్టీలో అయినా సంక్షోభ సమయంలోనే నాయకులు తయారవుతారని, ఆ స్థితి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉందని, అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఓనర్లు ఎవరూ లేరని, ఎవరు కష్టపడి పనిచేస్తే వారే నాయకులని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సవాల్‌గా తీసుకుని పోరాడాలి: మాణిక్యం రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో 72 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడమే మన లక్ష్యం. ఇంకా 20 నెలల సమయమే ఉంది. దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. మనం గెలిచి తీరాలి అనే కసితో పనిచేయాలి’ అని వ్యాఖ్యానించా రు. సమావేశానికి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్, రాష్ట్ర ఇన్చార్జి కృష్ణ అల్లవారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, మల్లురవితో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల, పార్లమెం టు, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
Cheruvaina Dooramaina: సుజిత్‌కి మంచి భవిష్యత్ ఉంది : అనిల్ రావిపూడి
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా నటించిన చిత్రం ‘చేరువైన... దూరమైన’.చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నివినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని తెలిపారు. సుజిత్ కి మంచి భవిష్యత్ ఉంటుదన్నారు. దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘హీరో సుజిత్ తో నాకు చాలా అనుబంధం వుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ఓ మూడు నిమిషాల నిడివిగల ఓ డెమో సన్నివేషాన్ని తీసి సుజిత్ వాళ్ల అమ్మకు చూపించాం. ఆమె ఎంతో ఆనందించారు. నన్ను నమ్మి వాళ్ల అబ్బాయిని నా చేతిలో పెట్టారు. సుజిత్ లో ఆనందం కంటే... వాళ్ల అమ్మ కళ్లలో ఆనందమే చూడాలనుకున్నా. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను చిత్రీకరించాం. ఆ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’అన్నారు. నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..‘శ్రీనివాసరెడ్డి అన్న మా వెన్నంటి వుండి ఈసినిమాను ఎంతో ప్రోత్సహించారు. ఆయన కొన్ని సందేహాలు వెలిబుచ్చినా...ఈ సినిమాను దర్శకుడు ఎంతో పట్టుదలతో కంప్లీజ్ చేశారు చంద్రశేఖర్ తాను చెప్పిన కథ ఏదైతో వుందో దానినే తీశారు. ఈ రోజు టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడతారు’అని అన్నారు. ‘నా మేనల్లుడిని ఆశీర్వదించండి’అని ప్రేక్షకులను కోరారు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో విలన్ గా నటించిన శశి, రచయిత సురేష్, బట్టు అంజిరెడ్డి, జిట్టా సురేందర్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు వెంకీ తదితరులు పాల్గొన్నారు. -
హీరోగా కమెడియన్.. థియేటర్స్‌లో సినిమా రిలీజ్
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మరోసారి హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించిన ఆయన ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి హీరోగా సందడి చేయనున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు నిర్మించారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు. ముగ్గురు దివ్యాంగుల జీవితంలో చోటుచేసుకునే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అనుకోని విధంగా ఓ హత్యకేసు నుంచి చిక్కుకున్న ఆ ముగ్గురు ఎలా అక్కడినుంచి బయటపడ్డారు అన్న అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ అభిలాష్ తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. -
అండగా నేనుంటా: పొంగులేటి
ములకలపల్లి: కాలికి స్టీల్ రాడ్లతో ఏడాదిగా ఇబ్బందిపడుతున్న మౌనికకు అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మౌనిక ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆమె ఎడమ కాలికి స్టీల్ రాడ్లు వేశారు. వీటిని 15 రోజుల్లో రాడ్లు తొలగించాల్సి ఉన్నా భర్త, కుటుంబం పట్టించుకోకపోవడంతో నడవలేక పాకుతూ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ ఘటనపై ‘ఏడాదిగా.. కాళ్లకు స్టీల్ రాడ్లతోనే’శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. మౌనిక చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు తాను భరించి, ఖమ్మంలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, ఎస్సై బాల్దె సురేశ్ గ్రామానికి వెళ్లి మౌనిక భర్త మహేశ్‌ను శ్రీనివాసరెడ్డితో మాట్లాడించారు. వాహనం ఏర్పాటు చేసి, ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి మౌనికను తరలించారు. ఎస్సై సురేశ్ రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. -
నవ్వులు పూయిస్తున్న ‘ముగ్గురు మొనగాళ్లు’
Mugguru Monagallu: టాలీవుడ్ స్టార్ కెమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గరు మొనగాళ్లు’. ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల కథ ఇది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 15 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్లో శ్రీనివాస్ రెడ్డి చెవిటి వాడిగా, దీక్షిత్ శెట్టి మూగ వాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. సరదాగా సాగుతూనే ఓ మిస్టరీ కేసు అంశంతో ఉత్కంఠ పెంచుతోంది ఈ ట్రైలర్. మరి ఆ హత్య కేసు ఏంటి? వీళ్లకి దానికి సంబంధం ఏంటి? పోలీసులు ఈ అమయాకుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర ఆసక్తికర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దివంగత నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కీలక పాత్రలు పోషించారు. రిత్విష్ శర్మ, శ్వేతా వర్మ హీరోయిన్స్‌గా నటించారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్) కుంభకోణం కేసులో దరాప్తు, సోదాలు చేసిన కొద్దీ అనేక అక్రమాలు, అక్రమార్జనలు వెలుగు చూస్తున్నాయి. అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సోదాలు చేయడం, వారి నుంచి దాదాపు రూ.3 కోట్ల నగదు, రూ.కోటి విలువైన నగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో వీరికి కూడా సంబంధాలు ఉన్నప్పుడు మరి రెండేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ వీరిని ఎందుకు అరెస్టు చేయలేదు? కనీసం విచారించ లేదా? విచారించినా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదా? ఒకవేళ ఏసీబీ వీరిని ప్రశ్నించేందుకు యత్నించినా.. ఏవైనా రాజకీయశక్తులు అడ్డు పడ్డాయా? అప్పటి మంత్రి పేషీ నుంచి కథంతా నడిచిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019లో ఏసీబీ విచారణ ప్రారం భమవుతున్న దశలో కార్మిక శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి ఏసీబీకి ఓ లేఖ రాశారు. అందులో అక్రమాలు కిందిస్థాయిలోనే జరిగాయని, ఉన్నతాధికారులకు సంబంధం లేవన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడదే ఉన్నతాధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా మారి అరెస్టు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏసీబీ నివేదిక ఆధారంగా రంగంలోకి ఈడీ మనీలాండరింగ్ జరిగిందన్న ఏసీబీ నివేదిక (8ఎఫ్ఐఆర్లు) ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని డిసెంబర్ నుంచి ప్రశ్నిస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కొత్తగా శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డిల పేర్లు తెరపైకి రావడం గమనార్హం. కాగా ఇదే పనిని గతంలో ఏసీబీ ఎందుకు చేయలేకపోయింది? అన్న చర్చ సాగుతోంది. ఏపీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇదే తరహా కేసులో అరెస్టయ్యారు. ఇక్కడా, అక్కడా కుంభకోణం జరిగిన తీరు (మోడస్ ఆపరెండి) ఒకటే కావడం గమనార్హం. ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై కన్ను ముకుందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవికారాణి, శ్రీహరిబాబు తదితరుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. 2014 నుంచి 2019లో ఈ కేసు వెలుగు చూసే వరకు వీరు, వీరి బంధువుల బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆన్లైన్ లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కూడబెట్టిన నగలు, చెల్లించిన ఆదాయపు పన్ను తదితరాలను విశ్లేషిస్తోంది. ముఖ్యంగా బ్యాంకు లాకర్లు తెరిచేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంతకాలం అధికారులు మాత్రమే ఈ కుంభకోణంలో ఉన్నారనుకున్నప్పటికీ తాజాగా ఈడీ రంగప్రవేశంతో వాతావరణం వేడెక్కింది. ఈ కుంభకోణానికి మంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరిగిందా? అన్న అనుమానాలు వాస్తవానికి ముందు నుంచీ ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ కలకుంట్ల పద్మలు ఇష్టానుసారంగా, నిబంధనలకు విరుద్ధంగా మందుల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు మంత్రి కార్యాలయం అభ్యంతరం తెలపలేదు. ‘‘కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లు కాంట్రాక్టులు ఇచ్చినా ఏనాడూ వివరణ కోరలేదు. విజిలెన్స్ రంగప్రవేశం చేసేవరకూ ఆడిటింగ్‌లో ఎలాంటి లోపాలు వెలుగుచూడలేదు’’ అంటూ ఈఎస్ఐ సిబ్బంది అనేక సందేహాలు లేవనెత్తినప్పటికీ వీటిపై ఏసీబీ అంతగా దృష్టి సారించలేదు. కానీ, ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. పేద కార్మికుల సొమ్మును తినేశారు! ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.700 కోట్లకుపైగా మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈఎస్ఐ ఆసుపత్రి పేద కార్మికులకు ఒక వరం లాంటిది. రూ.25 వేలలోపు వేతనం ఉన్న కార్మికుల నుంచి నెలానెలా రూ.500 వరకు చందా కింద వసూలు చేస్తారు. అలా సేకరించిన నిధులతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి అనారోగ్యం బారిన పడిన కార్మికులకు వైద్యసేవలు అందిస్తారు. అలాంటి బీద కార్మికులకు దక్కాల్సిన మందులను, వైద్య పరీక్షలకు కావాల్సిన మెడికల్ కిట్లను తదితరాల ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోవడం, కమీషన్ల రూపంలో అందినకాడికి దండుకోవడం నాలుగేళ్లపాటు యధేచ్ఛగా సాగింది. ‘‘ఆరుగాలం శ్రమించిన పంటను పందికొక్కులు తిన్నట్లు, తాము చందాగా చెల్లించిన డబ్బులను కొందరు అవినీతిపరులు అదేవిధంగా పంచుకుతిన్నారంటూ’’ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీలో కూడా ఇదే తరహాలో రూ.988 కోట్ల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇక్కడా, అక్కడా.. పాత్రధారులు వేరైనా.. సూత్రధారులు ఒకరేనా? అన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏపీలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదల అయిన బుర్రా ప్రమోదరెడ్డి పేరిట తెలంగాణ, ఏపీల్లో 7 డొల్ల కంపెనీలు ఉన్నాయి. కాగా శనివారం హైదరాబాద్‌లో శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డి ఇంటితో పాటు ప్రమోదరెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం, రూ.1.15 కోట్లను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. -
'సినిమా చూస్తున్నంతసేపు..కనీసం మొభైల్ కూడా చూడరు'
హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లాన్ బి’. ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎవిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠంగా ఉంటుంది. మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని, కథ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. 'ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఈ సినిమా విడుదల కి ముందే మా దర్శకుడికి మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. -
గజదొంగల నవ్వులు
‘‘హౌస్ అరెస్ట్’ సినిమా స్టార్ట్ కావడానికి కారణం అనూప్ రూబెన్స్. చిన్నపిల్లల సినిమా ఫుల్ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. పిల్లల దృష్టి కోణంలో సాగే ఈ చిత్రంలో ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు ఉంటాయి. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది’’ అని డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో ‘90ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ‘హౌస్ అరెస్ట్’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘హౌస్ అరెస్ట్’ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ‘‘లాక్డౌన్ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అన్నారు సప్తగిరి. -
‘పూర్ణ కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్ ఇది’
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. యువ నటుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్రలో నటించాడు. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది. పూర్ణ కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూర్ణ పెర్ఫార్మెన్స్, గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి’’ అన్నారు కర్రి బాలాజీ. పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్‌తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి, నటిగా నాకు, నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డిగారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
మరో మహ ప్రస్థానం..
-
టీజర్ ఆసక్తికరంగా ఉంది
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా, డింఫుల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏవీఆర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను త్రివిక్రమ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా క్యూరియాసిటీ నింపింది. సినిమా పెద్ద సక్సెస్ అయి అందరికీ పేరు రావాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సస్పెన్స్, క్రైమ్ థిల్లర్‌గా రూపొందించాం. కునాల్ శర్మ విలన్‌గా చేశారు’’ అన్నారు రాజమహి. ‘‘షూటింగ్ పూర్తయింది. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. మా టీజర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివర్లో ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ఏవీఆర్. -
ఇంట్లో అరెస్ట్ అయ్యారు
హాస్యనటులు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి హీరోలుగా ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా ప్రారంభమైంది. ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులకు విభిన్నమైన, చక్కని వినోదాన్ని అందించే సినిమాలు అందిస్తూ భవిష్యత్తులో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో మా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కంపెనీ అడుగులు వేస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె. యువరాజ్. -
‘సాక్షి’ చదివి అరకిలో బంగారం గెలిచాడు
-
‘సాక్షి’ చదివి అరకిలో బంగారం గెలిచాడు
సాక్షి, హైదరాబాద్ : సాక్షి సెలబ్రేషన్స్ ఆఫర్ అరకిలో బంగారం విజేతగా ప్రకాశం జిల్లాకు చెందిన కాశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నిలిచారు. గోల్డ్‌ప్రైజ్ రావడం చాలా ఆనందంగా ఉందని, అందుకు సాక్షికి కృత జ్ఞతలు తెలియచేశారు. ఇటీవలె తనకు ఆడపిల్ల పుట్టిందని ఈ బంగారాన్ని ఆమెతోపాటు ,తన భార్యకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాక్షి ఇచ్చే కథనాలంటే తనకు బాగా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షి డైరెక్టర్లు, సీఈవో చేతుల మీదుగా అరకిలో బంగారాన్ని అందుకున్నారు. పాఠకులను ప్రోత్సహించే క్రమంలో సాక్షి యాజమాన్యం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. చదవండి.. గెలవండి అనే నినాదంతో సాక్షి నిర్వహించిన ఈ సెలబ్రేషన్ ఆఫర్‌కు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాక్షి పాఠకులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. వారిలో 20,083 మంది విజేతలుగా నిలిచారు. -
ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ధర్నా
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని తొగుట మండలం మల్లన్న సాగర్ భూబాధితులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణంకు ఎన్జీటి అనుమతులు లేకుండా అక్రమంగా కాలువ నిర్మించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు కేవలం లక్షా యాభై వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధర్యంలో ధర్నా చేపట్టారు. దీనిని పోలీసులు భగ్నం చేయడంతో ధర్నా ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు తుక్కాపూర్ గ్రామస్తులను కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని బేగంపేట పోలీస్ స్టేషస్‌కు తరలించినట్లు తెలిసింది. -
కాంగ్రెస్ గూటికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ నేత, దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. మంగళ వారం తన అనుచరులతో కలసి గాంధీ భవన్‌కు చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి వెంట తరలివచ్చిన అనుచరులను ఉద్దేశించి ఉత్తమ్, పలువురు ముఖ్య నేతలు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయ కులు సంపాదించిన అవినీతి డబ్బుతో దుబ్బాక ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచేందుకు వస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌రావు దుబ్బాకలో తానే అభ్యర్థినని చెప్తున్నారని, ఎమ్మెల్యేలకు వ్యక్తిత్వం లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేశారని, ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై బుధవారం ప్రకటన చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని, దుబ్బాకలో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పేరును బుధవారం పార్టీ ప్రకటన చేస్తుందన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవానికి సంబంధించినదని, దుబ్బాకకు కనీసం బస్సు, నీళ్లు లేని పరిస్థితుల్లో తన తండ్రి అభివృద్ధి చేశారని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పల్లెలు నగరాలకు తరలకుండా పట్టణాలు పల్లెలకు రావాలని కలగనేవారన్నారు. 30 ఏళ్లు మచ్చలేని ప్రజాజీవితం గడిపిన ముత్యంరెడ్డికి టీఆర్ఎస్ అవమానాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట కలెక్టర్‌ను బదిలీ చేయాలి: జగ్గారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి... దుబ్బాక అభివృద్ధిలో చెరుకు ముత్యంరెడ్డి తనదైన ముద్ర వేశారన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని బదిలీ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత జీవితాంతం జైల్లో గడపాల్సి ఉంటుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, గూడూరు నారాయణరెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముత్యం రెడ్డి 30 ఏళ్లు ప్రజల కోసం బతికితే.. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్‌గా అవమానాన్ని ఇచ్చింది అంటూ ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక. దుబ్బాకకు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారు. జనాలు పల్లెలు నుంచి పట్నాలకు వెళ్లకుండా.. పట్నాల నుంచి పల్లెలకు రావాలని కలగన్న నేత ముత్యం రెడ్డి. ఐదు మార్కెట్ యార్డ్లు తెచ్చిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది అన్నారు. (చదవండి: కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం) నేతలందరూ రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే.. ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేయ్యాలి. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థినే. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకుంటాను’ అని తెలిపారు. -
కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం
సాక్షి, హైదరాబాద్ : చెరుకు ముత్యం రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గొప్ప నాయకుడని టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీమంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి అహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకకే కాకుండా తెలంగాణ మొత్తానికి ఆదర్శ నాయకులని కొనియాడారు. దుబ్బాక-దొమ్మట అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి నిరంతరం కృషిచేసిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. చదవండి: (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) అదే విధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్‌లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట-గజ్వేల్‌కు మధ్యలో ఉందని, టీఆర్ఎస్ దుబ్బాకకు ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో టీఆరెస్ తరపున తనే అభ్యర్థిని అని హరీష్ అంటున్నారని, మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పలుకుబడి ఉండదా అని ప్రశ్నించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని అధికారికంగా రేపు ఏఐసీసీ ప్రకటన చేస్తుందని వెల్లడించారు. తనతో సహా కాంగ్రెస్ నాయకత్వం అంతా నవంబర్ 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటుందని, ఈ ఎన్నికల తరువాత సైతం దుబ్బాక అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటూ కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దుబ్బాకలో ఎవరు పైసలు ఇచ్చిన మద్యం పంచినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని కోరారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్) టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది నిజాయితీకి మారుపేరు రైతు, ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో, సెక్రటేరియట్లో, తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేశారు. రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తుంది. నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు. శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఎం చేస్తుండో తెలంగాణ సమాజం గమనిస్తోంది. 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాము. దుబ్బాకలో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది. టీఆర్ఎస్ రెండేళ్లలో ఒక్క రూపాయి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు.ఎన్నికలు ఉన్నాయని 9వేల కొత్త పెన్షన్స్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటనలు చూస్తుంటే నవ్వు వస్తోంది. సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావుకు రెండు కళ్ళు అంటుండు..మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.’ అని అధికార టీఆర్ఎస్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భయపడదు దుబ్బాకలో టీఆర్ఎస్ సెంటిమెంట్ డ్రామా ఆడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుయ్యబట్టారు. రాంలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే.. కానీ ఆయన సెంటిమెంట్ ఆలోచిస్తే ముత్యం రెడ్డి గారు చనిపోయిన సెంటిమెంట్ ఏం కావాలని ప్రశ్నించారు. దుబ్బాకకు ఎనలేని సేవలు అందించిన ముత్యం రెడ్డి కుమారుడే బరిలోకి దిగుతున్నారున్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్డినా కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డికి అవకావం దక్కలేదు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి నేడు హస్తం గూటికి చేరారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలవడం పూర్తిగా ఖరారు అయినట్లే. -
దుబ్బాక ఎన్నిక : టీఆర్ఎస్కు ఝలక్
సాక్షి, సిద్దిపేట : కీలకమైన దుబ్బాక ఉప ఎన్నిక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు. అంతేకాకుండా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డి భంగపడ్డారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దల టికెట్ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక నేతల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుండగా ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన మాజీమంత్రి ముత్యంరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయం ముందు టీఆర్ఎస్లో చేరారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. 10న ఫలితాలు విడుదల చేయనున్నారు. -
దుబ్బాకలో టీఆర్ఎస్కు ఝలక్
-
తేమ, తాలు అంటూ.. తరుగు తీస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరుతో ఇష్టానుసారం కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెడితే గ్రామంలో ఉండే రైతు బంధు కోఆర్డినేటర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పంట తేమ శాతం నిర్ధారించి టోకెన్లు అందజేస్తారన్నారు. గన్నీ సంచుల సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బిహార్ నుంచి హమాలీలు హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్ కు సమస్యలు ఎదురవుతున్నాయని మారెడ్డి తెలిపారు. ఎక్కువగా బిహార్ నుంచి హమాలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారని, వారు ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాశారని, వాళ్లు ఇక్కడికి రావడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు. -
కానిస్టేబుల్‌పై దాడి; కఠిన చర్యలు తప్పవు
-
కానిస్టేబుల్‌పై దాడి; కఠిన చర్యలు తప్పవు
సాక్షి, గుంటూరు: ధర్నాలు, రాస్తారోకోలు జరిగే సమయంలో సాధారణంగా డ్రోన్లతో విజువల్స్ తీస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు. రెండు రోజుల క్రితం మందడంలో కూడా అలానే విజువల్స్ తీయించామని పేర్కొన్నారు. కానీ, డ్రోన్ ఆపరేట్ చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని చెప్పారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : మాపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాస్తున్నారు: డీఎస్పీ) డ్రోన్ ఆపరేటర్ పై దాడి, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న ఘటన, తుళ్లూరు డీఎస్పీపై దురుసుగా వ్యవహరించిన ఘటనల్లో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు చాలా సహనం పాటిస్తున్నారని ఎస్పీ విజయారావు చెప్పారు. కొంతమంది అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజలను రెచ్చగొట్టే వారిని గుర్తించామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మీడియా కూడా తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు. -
మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: డీఎస్పీ
సాక్షి, గుంటూరు: రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారికి జోలికి వెళ్లం.. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతుల ముసుగులో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వారి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. నిన్న(గురువారం) రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తే డ్రోన్ ఆపరేట్ చేశామని పేర్కొన్నారు. అయితే డ్రోన్‌ను కిందకు దించే సమయంలో ఆపరేటర్‌పై దాడి చేసి డ్రోన్‌ను ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు. అయితే డ్రోన్ల ద్వారా మహిళలు స్నానం చేసే విజువల్స్‌ను పోలీసులు తీసుక్నునారంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాశారన్నారు. అంతేగాక గతంలో కూడా ఓ మహిళను కాలితో తన్నినట్లు తప్పుడు వార్తలు రాశాని తెలిపారు. ఇక రైతులను రెచ్చగొడుతున్న జేఎసీ నాయకుడు పువ్వాడ సుధాకర్‌ను అరెస్టు చేసే పయత్నం చేశామని, కానీ మహిళా రైతులు అడ్డుపడటంతో అరెస్ట్ చేయలేకపోయామన్నారు. హోంమంత్రి, డీజీపీలు సచివాలయానికి వస్తుంటే ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టిన వారిపై కేసు పెట్టామన్నారు. ఎమ్మెల్యే రోజాను కూడా అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా రైతులు తమకు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. -
‘సాక్షి’ సెలబ్రేషన్ ఆఫర్.. అరకిలో గోల్డ్ విజేత శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సాక్షి సెలబ్రేషన్స్ ఆఫర్ అరకిలో బంగారం విజేతగా కాశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం జిల్లా) నిలిచారు. సాక్షి పాఠకులను ప్రోత్సహించే క్రమంలో యాజమాన్యం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ‘చదవండి.. గెలవండి’ అనే నినాదంతో ‘సాక్షి’ నిర్వహించిన ఈ సెలబ్రేషన్ ఆఫర్‌కు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాక్షి పాఠకులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. వారిలో 20,083 మంది విజేతలుగా నిలిచారు. వారందరికి బహుమతులను అందజేసేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేపట్టింది. విజేతల పేరులను https:// www. sakshi. com/ వెబ్సైట్లో పొందుపరిచారు. విజేతలుగా నిలిచిన పాఠకులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని అందిస్తారు. మంగళవారం సాక్షి ప్రధాన కార్యాలయంలో ఈ ఆఫర్ లక్కీడీప్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతి«థిగా విచ్చేసిన విశ్రాంత న్యాయమూర్తి కె.రవీందరెడ్డి విజేతలను ప్రకటించారు. గోల్డ్ విన్నర్ శ్రీనివాస్‌రెడ్డికి ఆయన ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు సాక్షి దినపత్రిక ఏజెంట్లు వినోద్ (సరూర్‌నగర్), సురేష్ (రామంతాపూర్), నాగిరెడ్డి (ఈసీఐఎల్), శ్రీనివాసరెడ్డి (నేరేడ్‌మెంట్), కిషోర్‌కుమార్ (అబిడ్స్), రషీద్ (తార్నాక) కూడా వివిధ కేటగిరీల్లోని విజేతలను ప్రకటించారు. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ విభాగానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. తొలి 3 కేటగిరీల్లో విజేతలు వీరే.. మొదటి కేటగిరి : అర కిలో బంగారాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన కాశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న ఈయన.. ‘నాకు గోల్డ్‌ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. దీనిని నేను ఊహించలేదు. కారు వస్తే బాగుంటుందని ఆశించా. ఏకంగా అర కిలో బంగారం దక్కింది’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండవ కేటగిరి : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోటి వరప్రసాద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన కె.రాజేందర్ మారుతి స్విఫ్ట్ కార్లను సొంతం చేసుకున్నారు. మూడవ కేటగిరి : ఎస్.రవీంద్రనాథ్ (కొవ్వూరు), మహమ్మద్ పాషా (హైదరాబాద్), పి.జాకరయ్య (కడప), స్వర్ణలత (గన్నవరం), ఎస్.ఎ. రహమాన్ (గుంతకల్), ఎం.అంకిత, ఎం.జగన్నాథన్ (కర్నూలు), ఆర్.సంయుక్త (హైదరాబాద్), ఉద్దారగుడి చిరంజీవి), కుప్పలి శశిభూషణరావు (పార్వతిపురం).. యాక్టివా స్కూటర్లను గెలుచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సాక్షి కృషి విభిన్న కోణాల్లో ప్రజా సమస్యలపై కథనాలు రాస్తూ వాటి పరిష్కారానికి ‘సాక్షి’ కృషి చేయడం ఆనందంగా ఉంది. మారుమూల గ్రామాలకు సైతం ‘సాక్షి’ చేరుకోవడం స్ఫూర్తిదాయకం. ఈ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకర్లను అభినందించాలి. అక్కడి సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్దఎత్తున పాఠకుల ఆదరణను సంపాదించుకున్న ‘సాక్షి’ యాజమాన్యం అభినందనీయులు. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి. పాఠకులను ప్రోత్సహించే క్రమంలో సెలబ్రేషన్ ఆఫర్‌ను ‘సాక్షి’ పారదర్శకంగా నిర్వహించినందుకు కృతజ్ఙతలు. విజేతలకు అభినందనలు. – కె.రవీందర్‌రెడ్డి, విశ్రాంతి న్యాయమూర్తి విజేతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టెక్నో పెయింట్స్ మరింత కలర్‌ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టివ్ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్లు సీవీఎల్ఎన్ మూర్తి, సత్యనారాయణ రెడ్డి, సీఈవో కె.అనిల్‌తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డీలర్ నెట్వర్క్ ద్వారా రిటైల్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇప్పటికే 30 కోట్ల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ప్రాజెక్టులకు రంగులు అందించామని పేర్కొన్నారు. రూ.250 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని వెల్లడించారు. రెండింతలకు సామర్థ్యం..: ప్రస్తుతం టెక్నో పెయింట్స్‌కు అయిదు ప్లాంట్లున్నాయి. వీటన్నిటి వార్షిక సామర్థ్యం 42,000 మెట్రిక్ టన్నులు. ఆరవ ప్లాంటును హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నెలకొల్పుతున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంటు కోసం రూ.25 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏడాదిలో సిద్ధం కానున్న కొత్త ప్లాంటుతో సామర్థ్యం రెండింతలకు చేరుతుంది. నూతనంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2018–19లో రూ.62 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90 కోట్లు ఆశిస్తున్నాం. రెండేళ్లలో రూ.250 కోట్ల టర్నోవర్ లక్ష్యం. ఆఫ్రికాలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాదితోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సేవలు అందిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని వివరించారు. -
కడపలోని మరో కాంట్రాక్టర్ నివాసంలోనూ సోదాలు
-
మర్రి, తెట్టె బావుల పూడ్చివేత
బొమ్మలరామారం: హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను దారుణంగా హత్య చేసి పూడ్చి వేసిన మర్రి, తెట్టె బావులు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలకు సజీవ సాక్షం. అసాంఘిక చర్యలు జరిగిన నేపథ్యంలో కలెక్టర్ అనితా రామచంద్రన్‌ఆదేశాల మేరకు రెండు బావులను పూడ్చివేశారు. ప్రస్తుతం ఆ బావులు ఉన్న ప్రదేశం రూపురేఖలు మారిపోయాయి. -
హాజీపూర్: ఈ కారణం వల్లే వారు బలయ్యారు!
సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించాయి ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మరో బాలికపై హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు గ్రామాల మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ క్లాసులకు వెళ్లి.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్ గ్రామానికే చెందిన మరో బాలిక(18) మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని కేఎల్ఆర్ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో 2019 మార్చిలో శివరాత్రి పర్వదినం అనంతరం 6వ తేదీన కాలేజీకి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఇద్దరు బాలికలనూ హాజీపూర్‌కే చెందిన శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యాచారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. సాక్షి కథనంతో తెరపైకి మరో మిస్సింగ్ కేసు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్‌పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసు లు కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా, ఆ బా లికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు. ఉద్యోగానికి పంపుదామంటే ఊపిరి తీసిండు: పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే సైకో శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్‌రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి -
ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి..
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందోనని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే త గిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి:పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సం తృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. -
హాజీపూర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష
-
శాస్త్రీయ ఆధారాలతో రుజువు...
సాక్షి, యాదాద్రి: హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్ష ఖరారు చేయడం వెనుక తీవ్ర కసరత్తే జరిగింది. అత్యాచారాలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకున్నా.. శాస్త్ర, సాంకేతికత, వైద్యరంగాన్ని ఉపయోగించుకుని కేసును ఛేదించి నిందితుడికి ఉరి శిక్షపడటంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. పాఠశాలకు వెళ్తున్న బాలికలను టార్గెట్ చేసి లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన వివరాలను పోలీసులు సమర్థంగా నిరూపించారు. నిందితుడి మొబైల్ కాల్‌డేటా, సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక సాయంతో ఈ మూడు కేసుల్లో చార్జీషీటు దాఖలు చేశారు. హాజీపూర్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, హత్యకు గురైన బాలికకు సంబంధించిన పుస్తకాల బ్యాగ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. సవాలుగా తీసుకున్న పోలీసులు హజీపూర్ బాలికల కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని వెం టనే పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసి వ్యవసాయ బావుల్లో పూడ్చిపెట్టిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు విషయంలో ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక ఎస్సై వెంకటేశ్‌ను సస్పెండ్ చేశారు. కేసు విచారణ అధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నియమించారు. ఏప్రిల్ 29న శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి వరంగల్ జైలుకు తరలించారు. వివిధ శాఖల సహకారం రాచకొండ పోలీసులు.. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖలు, ఫింగర్ ప్రింట్స్, క్లూస్‌టీం, ఐటీ సెల్, వివిధ పాఠశాలల బాలికలు, సెల్‌ఫోన్ నెట్వర్క్ విభాగాలు, డీఎన్ఏ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీలు, ఇంకా వివిధ విభాగాల ఆధారాల ఆధారంగా చార్జిషీట్లు దాఖలు చేసి నేరాన్ని రుజువు చేశారు. రాచకొండ సిబ్బందికి డీజీపీ ప్రశంసలు సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హాజీపూర్ వరుస హత్యలు, అత్యాచార ఘటనల కేసులో బాధితులకు న్యాయం జరిగిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హంతకుడికి రెండు కేసుల్లో ఉరిశిక్ష, మరోకేసులో జీవిత ఖైదు పడిందన్నారు. ప్రాసిక్యూషన్‌తో పాటు కోర్టులో సాక్ష్యాలు సమర్పించడంలో సహకరించిన సాక్షులు, బాధిత కుటుంబీకులు, పౌర సమాజం, వేగంగా విచారణ పూర్తి చేసిన కోర్టుకు కృతజ్ఞతలు చెప్పారు. రికార్డు సమయంలో విచారణను పూర్తి చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో శ్రమించిన రాచకొం డ కమిషనర్ మహేశ్ భగవత్, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఏసీబీ భుజంగరావుతోపాటు విచారణ బృందాన్ని అభినందించారు. కోర్టుకు సాక్ష్యాలను సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీనియర్ పబ్లిక్‌ప్రాసిక్యూటర్ సి.చంద్రశేఖర్‌ను ఆయన మెచ్చుకున్నారు. త్వరితగతిన కేసును ఛేదించాం: భగవత్ నల్లగొండ క్రైం: హాజీపూర్ నేర సంఘటనలో కేసును త్వరితగతిన ఛేదించామని, బాధితులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నేరస్తుడు శ్రీనివాస్‌రెడ్డి మైనర్లను తన బైక్‌పై తీసుకెళ్తానని నమ్మబలికి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి బావిలో పడే శాడని తెలిపారు. జిల్లా కోర్టు చరిత్రలో 55 ఏళ్లలో డబుల్ కేసులో ఉరిశిక్ష పడటం ఈ కేసులోనే కావొ చ్చన్నారు. బాధిత కుటుంబాల కడుపుకోత, ఆవేదన ఎవరూ తీర్చలేనిదని.. చట్ట ప్రకారం నేరస్తుడి ని శిక్షించేందుకు అన్ని విధాలుగా తగిన సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించామని తెలిపారు. గ్రా మంలో నేటికీ పోలీసు పహారా ఉంచామన్నారు. -
ఊపిరిపీల్చుకున్న హాజీపూర్
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందో నని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే తగిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. – పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి -
చదువుకునేందుకు వెళ్లి బలయ్యారు..
సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించారు ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్‌కి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లికి చెందిన మరో బాలికపై హాజీపూర్‌కి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్ మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ క్లాసులకు వెళ్లి.. హాజీపూర్‌కి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్ లో టెన్త్ చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్‌కే చెందిన మరో బాలిక(18) మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని కేఎల్ఆర్ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ ఇద్దరు బాలికలనూ శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యా చారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. సాక్షి కథనంతో తెరపైకి మరో కేసు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్‌పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసులు కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా, ఆ బాలికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు. పానం నిమ్మలమైంది.. పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్‌రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి -
ఏ కేసులో ఎంత శిక్షంటే?
బాలిక–1 (కేసు నం.109) బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం, హత్య చేసిన కేసులో నేరం నిరూపణ కావడంతో.. ఉరి శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. కిడ్నాప్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా. అత్యాచారం కేసులో.. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ నేరాలకు పోక్సో చట్టం కింద మరో 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. బాలిక –2 (కేసు నం.110) బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులోనూ ఉరి శిక్ష ఖరారైంది. మరో రూ.2 వేల జరిమానా విధించారు. కిడ్నాప్ చేసినందుకు 10 సంవత్సరాల జైలు, రూ.500 జరిమానా విధించారు. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పోక్సో చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాలిక–3 (కేసు నం.111) ఈ బాలిక కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష (14 ఏళ్లు) పడింది. కిడ్నాప్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. పోక్సో చట్టం కింద 7 ఏళ్ల జైలు, ఇదే చట్టంలోని సెక్షన్–12 కింద మరో 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలన్నీ ఏక కాలంలో అమలవుతా యని జడ్జి తీర్పునిచ్చారు. హాజీపూర్ కేసు డైరీ 2019 ఏప్రిల్ 25: హాజీపూర్‌కు చెందిన బాలిక మిస్సింగ్ ఏప్రిల్ 26: హాజీపూర్ మర్రిబావి పక్కన బాలిక స్కూల్ బ్యాగ్ గుర్తింపు. అదే రోజు పక్కనే గల తెట్టేబావిలో మృతదేహం వెలికితీత. ఏప్రిల్ 27: బాలిక మృతదేహానికి భువనగిరిలో పోస్టుమార్టం.. గ్రామానికి తరలింపు. అదేరోజు బొమ్మలరామారంలో రాస్తారోకో. ఘటనా స్థలాన్ని సందర్శించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. సీపీ సమక్షంలో అంత్యక్రియలు. ఏప్రిల్ 29: నెల కింద తప్పిపోయిన మరో బాలి క మృతదేహం తెట్టెబావి నుంచి వెలికితీత ఏప్రిల్ 30: మర్రిబావినుంచి ఇంకో బాలిక మృతదేహం అస్తికలు వెలికితీత. ఏప్రిల్ 30: నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు. జైలుకు తరలింపు మే 16, 17: మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష అమలు చేయాలని బొమ్మలరామారంలో బాధిత కుటుంబాల ఆమరణ దీక్ష జూలై 31: నల్లగొండలో పోక్సో కోర్టు ఏర్పాటు అక్టోబర్ 14: 111వ కేసులో సాక్షుల విచారణ ప్రారంభం. అక్టోబర్ 28: 109వ కేసులో సాక్షుల విచారణ.. నవంబర్ 4: 110వ కేసులో సాక్షుల విచారణ 2020 జనవరి 17: సాక్షుల విచారణ పూర్తి జనవరి 27: తీర్పు వాయిదా ఫిబ్రవరి 06: ఉరి, యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తుదితీర్పు . మృతురాలి సోదరి మీనా ఆనందభాష్పాలు అమ్మానాన్నలను చూసుకోవాలి శిక్ష తగ్గించాలని జడ్జిని కోరిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సాక్షిప్రతినిధి, నల్లగొండ: హాజీపూర్ బాలికల హత్య కేసుల్లో పోక్సో కోర్టు జడ్జి వి.విద్యానాథ్ రెడ్డి తీర్పు వెలువరించే ముందు ఒక్కో కేసు వివరాలను ప్రత్యేకంగా వివరించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఆ వివరాలు తెలియజేస్తూ.. అతడి అభిప్రాయాన్ని కోరారు. ఇదంతా మధ్యాహ్నం 2.04 గంటల నుంచి 2.17 గంటల వరకు కొనసాగింది. ►‘కేసు నంబర్ 109లో నువ్వు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా నేరం రుజువైంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలన్నీ నువ్వే తప్పు చేసినట్లుగా రుజువు చేస్తున్నాయి. నువ్వు ఏమైనా చెప్పుకుంటావా’అని న్యాయమూర్తి.. శ్రీనివాస్‌రెడ్డిని అడిగారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. అంతా అబద్ధం. పోలీసులే నన్ను కొట్టి ఒప్పించారు’అని శ్రీనివాస్‌రెడ్డి న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. ►‘కేసు నంబర్ 110 విషయంలో.. లిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్లి అమ్మాయిని అత్యాచారం చేసి, హత్య చేసి బావిలో పాతి పెట్టావు. ఈ నేరం కూడా నువ్వే చేసినట్లుగా రుజువైంది. నువ్వేమైనా చెప్పుకుంటావా..’అని న్యాయమూర్తి మరో బాలిక హత్య విషయంపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని అడిగారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి.. ‘నాకు ఏ సంబంధం లేదు, నేను చేయలేదు. మా భూములు లాక్కున్నారు. మా ఇల్లు కూలగొట్టారు. మా అమ్మ, నాన్నలను నేనే చూసుకోవాలి. శిక్ష తగ్గించండి’అంటూ విలపించాడు. ►‘కేసు నంబర్ 111లో.. మరో బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశావు. ఈ నేరం కూడా నువ్వే చేసినట్లుగా రుజువైంది. దీనికి నువ్వు ఏమైనా చెప్పుకుంటావా’అని న్యాయమూర్తి అడిగారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ‘నాకేం తెలియదు. పోలీసులు కొట్టి ఒప్పించారు. మా అమ్మా నాన్నలను నేనే చూసుకోవాలి. మా భూములు లాక్కున్నారు. ఇల్లు కూలగొట్టారు’అంటూ మళ్లీ అదే సమాధానం చెప్పాడు. ►దీంతో ‘మీ అమ్మానాన్నలు ఎక్కడున్నారో తెలుసా?’అని న్యాయమూర్తి అడిగారు. దీనికి తెలియదు అంటూ నిందితుడు సమాధానం చెప్పాడు. అసలు మీ అమ్మానాన్నలు బతికే ఉన్నారా అని న్యాయమూర్తి అడగగా.. దానికి కూడా తెలియదు అంటూ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. శ్రీనివాస్‌రెడ్డిని గురువారం రాత్రి చర్లపల్లి జైలుకు తరలిస్తున్న పోలీసులు -
హాజీపూర్ కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ కేసుల్లో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడింది. నల్లగొండ లోని పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎట్ట కేలకు పోలీ సులు నేర నిరూపణ చేశారు. ఇద్దరు బాలికల కేసుల్లో ఉరిశిక్ష, మరో బాలిక కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం జడ్జి సిద్ధ వేద విద్యానాథరెడ్డి గురువారం సాయంత్రం 6.24 గంటలకు తుదితీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిం చారు. ఈ కేసులో ప్రభుత్వం ప్రత్యే కంగా స్పెషల్ ప్రాసి క్యూటర్‌గా చంద్రశేఖర్‌ను నియమించగా, ఆయన రాచ కొండ కమిషనరేట్ పోలీసుల తరఫున వాదించారు. శ్రీనివాస్ రెడ్డి తరఫున వాదిం చడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సహాయం అందిం చేందుకు లీగల్ సెల్ అథారిటీ ఠాగూర్‌ను న్యాయవాదిగా నియమించారు. శ్రీనివాస్‌రెడ్డికి ఎగువ కోర్టులోనూ ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 27నే తుది తీర్పు వెలువడాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల తీర్పు వాయిదా పడింది. గురువారం తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలోనే ఉన్న బాలిక తండ్రి నర్సింహ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.. ‘మా కడుపు కోత తీరదు. ముద్దాయికి ఉరి శిక్ష పడటంతో న్యాయం జరిగింది. శిక్ష వేయించడంలో పోలీ సులు అన్న మాట నిలబెట్టుకున్నారు’అని వ్యాఖ్యానించారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డిని గురు వారం రాత్రి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
ఆ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందిన సీపీ భగవత్ చెప్పారు. అభంశుభం తెలియని బాలికలను శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకున్నాడని, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికలకు తన బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లేవాడని, తన వ్యవసాయ బావి వద్దకు వారిని తీసుకెళ్లి.. అత్యాచారం చేసి, హత్య చేసేవాడని వివరించారు. అతని వ్యవసాయ బావి వద్ద దొరికిన బాధిత బాలిక స్కూల్ బ్యాగ్ ఆధారంగా ఈ వరుస హత్యల కేసు మిస్టరీని ఛేదించామని, ఈ కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదిక కీలక పాత్ర పోషించాయని, ఈ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా నిరూపించామని తెలిపారు. కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులోనూ శ్రీనివాస్‌రెడ్డి దోషి అని సీపీ భగవత్ చెప్పారు. -
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
-
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
సాక్షి, నల్లగొండ: హాజీపూర్ హత్యల కేసులో పోక్సో స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్‌రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ మూడు హత్యలకు సంబంధించి పోక్సో స్పెషల్ కోర్టు వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. శ్రావణి, కల్పన కేసులలో హంతకుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు.. మనీషా కేసులో జీవితఖైదు విధించింది. ఎఫ్ఐఆర్ నంబర్లు 110, 109 కేసుల్లో దోషికి ఉరిశిక్ష పడింది. ముగ్గురు బాలికలను కామాంధుడైన శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో గత నెల 17వ తేదీన వాదనలు ముగిశాయి. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలికలపై అత్యాచారం, హత్యలకు సంబంధించి కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలు కేసులో కీలకంగా నిలిచాయి. హాజీపూర్ కేసులో మొత్తం 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయింది. గత ఏడాది జూలై 31న నల్లగొండలోని పోక్సో స్పెషల్ కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 14 నుంచి ఈ కేసులలో కోర్టు విచారణ ప్రారంభించింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన పాములు శ్రావణి కేసు మొదట వెలుగులోకి వచ్చింది. హాజీపూర్‌కు వెళ్లేదారిలోని తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించగా.. మనీషా, కల్పనలను శ్రీనివాస్‌రెడ్డే దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ మూడు కేసులలో వేగంగా దర్యాప్తు చేపట్టిన యాదాద్రి పోలీసులు 90 రోజుల్లో కోర్టుకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. బాధిత కుటుంబసభ్యుల హర్షం శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించడంపై బాధిత బాలికల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగిందని, శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరితీయాలని, శిక్ష అమలులో ఏమాత్రం తాత్సారం చేయవద్దని కోరుతున్నారు. -
హాజీపూర్ కేసు: వాయిదా పడ్డ తుదితీర్పు
సాక్షి, నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు మరోసారి వాయిదా పడింది. జడ్జిమెంట్ కాపీ ఇంకా సిద్ధం కానందున ఫిబ్రవరి 6వ తేదీకి తీర్పు వాయిదా వేస్తున్నట్లు నల్గొండ కోర్టు సోమవారం ప్రకటించింది. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు నల్గొండ జైలుకు తరలించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 300మంది సాక్షులను విచారించి.. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. అటు గ్రామస్థులు ఇటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న నల్గొండ ఫాస్ట్ కోర్టు తుది తీర్పును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: సమత కేసులో తుదితీర్పు ఈ నెల 30కి వాయిదా హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే అంతా అబద్ధం సార్.. -
హాజీపూర్ కేసు: ఈ నెల 27న తుది తీర్పు
సాక్షి, నల్గొండ: హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 27న పోక్సోకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ మేరకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై ముగ్గురు బాలికలపై హత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ నెల 8 నాటికి ఒక కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. అయితే, మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే అంతా అబద్ధం సార్.. -
‘అందుకే చంద్రబాబు జోలె పట్టుకున్నాడు’
సాక్షి, తాడేపల్లి: వెంటిలేటర్ మీద ఉన్న తమ పార్టీని బతికించుకోవడం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోలె పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టడానికే చంద్రబాబు చందాలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు చంద్రబాబు జోలె పట్టలేదని ధ్వజమెత్తారు. లక్ష కోట్ల రాజధానికి రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఉత్తరాది ప్రాంతానికి చెందిన వాడంటూ ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు తన హయాంలో ఉత్తరాదికి చెందిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంత రైతులు బాబు ఉచ్చులో పడొద్దని, వారి సమస్యలను హైపవర్ కమిటీకి వినిపించండని ఆయన విఙ్ఞప్తి చేశారు. రాజధానికి దూరం అనేది సమస్య కాదు అభివృద్ధి ముఖ్యం.. రోడ్డు, సీ, ఎయిర్ కనెక్టివిటీ అన్ని విశాఖపట్నంలో ఉన్నాయన్నారు. దక్షిణాదిలో ఉన్న నాలుగు రాష్ట్రాల ప్రజలకు రాజధానులు దూరంగానే ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు యాత్రలకు ప్రజల నుంచి స్పందన లేదని, రాజధాని జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే ప్రజల నుంచి ఆయనకు మద్దతు కరువైందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు రాజధానిపైనా మాటలను వక్రీకరించారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం అని మాట్లాడుతున్న చంద్రబాబు.. మోదీ శంకుస్థాపన ప్రాంతంలో శాశ్వత కట్టడమైననా నిర్మించారా అని ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ ఎందుకు వెళ్లాడో తెలియదని, కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వేరువేరు కాదని.. ఇద్దరిదీ ఒకే మాట అన్నారు. బీజేపీ నాయకులు కూడా రాజధానిపై తలో మాట మాట్లాడుతున్నారు.. రాజధాని అమరావతిగా పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం పెట్టారా అని ప్రశ్నించారు. అమరావతి పెట్టేటప్పుడు కనీసం రాజకీయ పార్టీల అభిప్రాయం అయినా చంద్రబాబు నాయుడు తీసుకున్నారా.. ఇప్పుడు రాజధానిపై అన్నిపార్టీలు కలిసి రావాలని చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతారని ఆయన మండిపడ్డారు. -
‘ఆ కేసులతో సంబంధం లేదు’
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్యలకు సంబంధించిన కేసులో నింది తుడు శ్రీనివాస్‌రెడ్డి తరఫున వాదనలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టులో మూడు హత్యల్లో బుధవారం నిందితుడి తరఫున ఒక హత్యకు సంబంధించి వాదన పూర్తయింది. న్యాయమూర్తి ఎదుట నిందితుడి తరఫు న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపిస్తూ... శ్రీనివాస్‌రెడ్డికి, ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఫోన్‌నంబర్లు నిందితుడివే అయినా వాటిని ఉపయోగించింది శ్రీనివాస్‌రెడ్డే అని అనడానికి సరైన ఆధారాలు లేవని వెల్లడించారు. కేవలం హాజీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది అనుమానం వ్యక్తం చేయడంతో శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేశారంటూ పేర్కొన్నారు. అనుమానం వ్యక్తం చేసిన వారికి, శ్రీనివాస్‌రెడ్డికి మధ్య భూ తగాదాలు ఉన్నాయని తెలిపారు. ఇది కావాలనే పెట్టిన కేసు తప్ప సరైన ఆధారాలు లేవంటూ కోర్టుకు నివేదించారు. మిగిలిన రెండు కేసులకు సంబంధించి వాదనను ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. కాగా, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ పిటిషన్ దాఖలు చేశారు. -
హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే
సాక్షి, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన వరుస హత్యలపై సోమవారం నల్లగొండ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు న్యాయమూర్తి సాక్షుల వాంగ్మూలాలను నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించి అతని ద్వారా సమాధానాలు రాబట్టిన విషయం తెలిసిందే. శ్రావణి కేసుకు సంబంధించి జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి ఎదుట స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ తన వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిది మొదటినుంచీ నేర చరిత్రేనని సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలతోపాటు డీఎన్ఏ రిపోర్టులు, వేలిముద్రలు, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ బట్టి స్పష్టమవుతోందన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, మృతురాలి తల్లిదండ్రులు, ఇతరుల సాక్ష్యాలన్నీ పరిశీలిస్తే శ్రీనివాస్‌రెడ్డే హత్యలకు బాధ్యుడనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. డీఎన్ఏ టెస్టు ఆధారంగా మృతురాలి దుస్తులపై ఉన్న వీర్యం, నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వీర్యంతో సరిపోలిందని, అదే విధంగా వేలిముద్రలు కూడా అతనివేనని తేలిందని అన్నారు. శ్రావణిని నమ్మించి తీసుకెళ్లి స్పృహ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు రిపోర్టుల ఆధారంగా తెలుస్తోందన్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మూడు సెల్ నంబర్లు ఉన్నాయని, అవన్నీ ఇప్పటికీ అతని పేరు మీద, అతని ఫొటోతో ఆయా సెల్ కంపెనీల వద్ద ఉన్నాయని చెబుతూ.. వివరాలను కోర్టు ముందు ఉంచారు. అత్యాచారాలు, హత్యలు జరిగిన సందర్భంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్ నంబర్ల సిగ్నల్స్ హాజీపూర్ సెల్‌టవర్ పరిధిలో ఉన్నాయని, ఆ కంపెనీల నుంచి సేకరించిన ఆధారాలను బట్టి స్పష్టమవుతోందన్నారు. శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్ర అని, ఇలాంటి వారు సమాజంలో ఉండడం మంచిది కాదని తన వాదనను వినిపించారు. చదవండి: అంతా అబద్ధం సార్.. -
అంతా అబద్ధం.. అసలు నాకు మగతనం లేదు
నల్లగొండ: ‘అంతా అబద్ధం సార్.. హాజీపూర్‌లో జరిగిన హత్యలకు, నాకు ఎలాంటి సం బంధమూ లేదు. పోలీసులే నన్ను ఇరి కించా రు. ఆ హత్యలకు సంబంధించి సాక్ష్యాలన్నీ అబద్ధమే. మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు నాకు సంబంధం లేదు. పోలీసులు సిరంజి ద్వారా నాదగ్గర నుంచి వీర్యం తీసుకెళ్లారు. నాకు ఆండ్రాయిడ్ ఫోనే లేదు. బూతు బొమ్మలు చూశాననడం అబద్ధం’అంటూ హాజీపూర్ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. జడ్జి ఎదుట చెప్పాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో జరిగిన శ్రావణి, కల్పన, మనీషాల అత్యాచారం, హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్ కోర్టులో న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి విచారణ నిర్వహించారు. 6 గంటల పాటు విచారణ సాగింది. ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్, నిందితుడి తరఫున న్యాయవాది ఎస్.ఆర్. ఠాగూర్‌లు హాజరయ్యారు. కాగా ఇదివరకే మనీషా హత్యకు సంబంధించి సాక్ష్యాలపై విచారణ జరిగింది. శుక్రవారం శ్రావణి, కల్పనలకు సంబంధించి 72 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను న్యాయమూర్తి ఒక్కొక్కటి చదివి నిందితుడికి విని పించారు. అతనినుంచి ఒక్కో దానిపై సమాధానం తీసుకొని రికార్డు చేశారు. ‘సాక్షులు అందరూ శ్రీనివాస్‌రెడ్డే నిందితుడని సాక్ష్యం చెప్పారు. దీనిపై ఏమి చెబుతావు’అని న్యాయమూర్తి అడగగా ‘నాకూ ఆ హత్యలకు సంబంధంలేదు. కావాలనే నన్ను ఇరికించారు’అంటూ సమాధానం చెప్పాడు. నీ తరఫున సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా, ‘మా అమ్మానాన్నలను పిలిపించండి’అంటూ సమాధానం చెప్పాడు. వారు ఎక్కడున్నారని అడగ్గా, వారి అడ్రెస్ కూడా తెలియదని తెలిపాడు. ‘నువ్వు ఇంతకుముందు పనిచేసిన వారి అడ్రస్ ఇవ్వు.. పిలిపిస్తాము’అని న్యాయమూర్తి అడగ్గా వారి అడ్రస్ కూడా లేదని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి.. నువ్వు పని చేశానని చెప్పావు, పనిచేసే చోట అడ్రస్ తెలియకుండానే పనిచేశావా అని అడగ్గా, ‘తెలియదు, మా అమ్మానాన్ననే పిలిపించాలి ’అంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు . వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. అసలు నాకు మగతనం లేదు.. ‘నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే అమ్మాయిని కూడా అత్యాచారం, హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు, అది కూడా అందరి ముందు నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నావు’కదా అని న్యాయమూర్తి అడగ్గా ‘అంతా అబద్ధం.. నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. బావి వద్దకు తీసుకెళ్లలేదు’అని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. ‘మృతుల బట్టలపై ఉన్న వీర్యం నీదేనని పరీక్షలో తేలింది. నువ్వే అత్యాచారం చేశావు’అన్నప్పుడు ‘నాకు మగతనం లేదు’అంటూ సమాధానం చెప్పాడు. వైద్యులు నువ్వు ఫిట్‌గానే ఉన్నావని ‘నువ్వు పని చేసే చోట ఒక వేశ్యని తీసుకొచ్చి చంపి నీటి ట్యాంక్‌లో వేశావని, అప్పట్లో నిన్ను కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు కదా’అని అడగ్గా అది కూడా అబద్ధమేనని నిందితుడు సమాధానం చెప్పాడు. మర్రిబావి సమీపంలో ఓ చెట్టు దగ్గర ఉన్న బీరు సీసాలను ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు పరీక్షలు చేస్తే ల్యాబ్‌లో నీ వేలిముద్రలేనని తేలిందని, దానికి నీ సమాధానం.. అంటూ జడ్జి అడగ్గా పోలీసులు బలవంతంగా బీరు సీసాను పట్టించారని చెప్పాడు. ‘నీకు నాలుగైదు ఫోన్ నంబర్లు ఉన్నాయి, నీ ఫోన్ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫొటోలు ఉన్నాయి. నీఫోన్ సీజ్ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలింది, దానికి నీ సమాధానం ఏమిటి’అని అడగ్గా నిందితుడు ‘నాకు చిన్న ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లేదు.’అని చెప్పాడు. భూమి అమ్మలేదని కేసు పెట్టారు.. పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన 101 మంది సాక్ష్యాల విషయంలోనూ నిందితుడు.. అంతా అబద్ధం, పోలీసులు కావాలని చేశారని సమాధానం చెప్పాడు. , నీ మీద కేసు ఎందుకు పెట్టినట్లు’.. అని అడగ్గా ‘మా భూమి అమ్మలేదని కొందరు చేశారు. కావాలనే ఇరికించారు’అని చెప్పడం గమనార్హం. -
హాజీపూర్ కేసు: ‘పోలీసులే అలా సృష్టించారు’
సాక్షి, నల్లగొండ :ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో హాజీపూర్ కేసు విచారణ శుక్రవారం చేపట్టారు. ఈ కేసులోని నిందితుడు మర్రి శ్రీనివాస రెడ్డిని పోలీసులు మరోసారి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 26న మనీషా కేసులో నిందితుడి వాదన నమోదు చేయగా. ఈ రోజు ఉదయం శ్రావణి, మధ్యాహ్నం కల్పన కేసులో నిందితుడి వాదన న్యాయస్థానం వినగా.. శ్రావణి కేసులో 44 మంది, కల్పన కేసులో 30 మంది సాక్షుల వాదనను నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. అనంతరం అనంతరం న్యాయమూర్తి నిందితుడిని పలు ప్రశ్నలు అడగ్గా.. సెక్షన్ 313 కింద నిందితుడు తన వాదనను వినిపించాడు. తనకేం తెలియదని.. అంత అబద్ధమంటూ నిందితుడు పదే పదే చెప్పాడు. బైక్ పైన శ్రావణిని ఎక్కించుకుని వెళ్లినట్లు చెబుతున్నారని ప్రశ్నించగా తనకు అసలు బైక్ డ్రైవింగ్ రాదని చెప్పాడు. శ్రావణి దుస్తులపై తన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారని అడగ్గా.. పోలీసులే అలా సృష్టించారని నిందితుడు సమాధానమిచ్చాడు. అసలు కల్పన ఏవరో కూడా తెలియదని, పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని వాదించాడు. ఇంతక ముందు ఏ పని చేశావు.. ఎక్కడ పనిచేశావు.. యజమాని ఎవరు అని న్యాయమూర్తి అడగ్గా నిందితుడు వివరాలు చెప్పలేకపోయాడు. (హాజీపూర్ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’) అలాగే ఘటనా స్థలంలో దొరికిన బీరు బాటిళ్లపై తన వేలి ముద్రలు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. పోలీసులే బలవంతంగా పట్టించారని పేర్కొన్నాడు. తనను కొట్టి ఒప్పించారని, తన అమ్మ, నాన్నలను తీసుకు రావాలనిన్యాయమూర్తిని కోరాడు. తల్లిదండ్రులు ఎక్కడున్నారని ప్రశ్నించగా తనకు తెలియదని నిందితుడు తెలిపాడు. మరి కోర్టుకు ఎలా తెలుస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. చివరికి తదుపరి విచారణ 6వ తేదికి వాయిదా వేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిననట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా కల్పన కేసులో ఇంకా వాదన కొనసాగుతుంది. చదవండి : లేదు.. తెలియదు.. కాదు! -
లేదు.. తెలియదు.. కాదు!
నల్లగొండ: ‘మనీషాను తీసుకెళ్లావా.. అత్యాచారం జరిపి హత్య చేసి బావిలో పూడ్చిపెట్టావా?’అన్న జడ్జి ప్రశ్నలకు ‘లేదు.. తెలియదు.. కాదు..’అని నిర్భయంగా సమాధానమిచ్చాడు సైకో శ్రీనివాస్‌రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామా రం మండలం హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని గురువారం నల్ల గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారించారు. ముగ్గురు బాలికల హత్యలకు సంబంధించి 101మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఇప్పటికే నమోదు చేసింది. ఈ క్రమంలో గురువారం మనీషా కేసుకు సంబంధించి నిందితుడి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఒక్కో సాక్షి వాంగ్మూలాన్ని శ్రీనివాస్‌రెడ్డికి జడ్జి చదివి వినిపిం చారు. కాగా, వీటిపై జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు తాపీగా ‘తెలియదు.. కాదు’అని జవాబు ఇచ్చాడు. హత్యకు గురైన బాలికల దుస్తులపై స్మెర్మ్ ఆనవాళ్లు నీకు సంబంధించినవేనని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది కదా? అని అడగగా, ఎస్ఓటీ పోలీసులు సిరంజీలతో చల్లారని చెప్పుకొచ్చాడు. ఫోర్న్ చూస్తావా అన్న ప్రశ్నకు తన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదని చెప్పాడు. మనీషా హత్య జరిగిన రోజు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని, అందుకే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపించిందని తెలిపాడు. కర్నూల్లో జరిగిన సువర్ణ హత్యపై అడగ్గా, ఆమె ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జడ్జి జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు. ఆగస్టులో చార్జ్‌షీట్ దాఖలు గత ఏప్రిల్‌లో హాజీపూర్‌కు చెందిన శ్రావణి మిస్సింగ్ కేసుపై విచారణ చేస్తున్న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా శ్రావణితోపాటు కల్పన, మనీషాను కూడా అత్యాచారం చేసి చంపి పాతి పెట్టినట్టుగా ఒప్పుకున్నాడు. పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలన్నింటినీ పకడ్బందీగా సేకరించారు. ఆగస్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నల్లగొండలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో విచారణ సాగుతోంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వందమంది సాక్షులను విచారించారు. కేసు విచారణ వారంరోజుల్లోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. కనిపించని ఆందోళన కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి నిర్భయంగా సమాధానాలు చెప్పాడు. అతని ముఖంలో ఎటువంటి ఆందోళన కనిపించకపోవడం గమనార్హం. -
హాజీపూర్ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’
సాక్షి, నల్గొండ : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిపై జరుగుతున్న విచారణ ఫోక్సో స్పెషల్ కోర్టులో గురువారం ముగిసింది. తదుపరి విచారణను జనవరి 3కు న్యాయమూర్తి వాయిదా వేశారు. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను జడ్జి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించారు. కానీ జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు అతని నుంచి ఎక్కువగా కాదు, లేదు, తెలియదు అనే సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. జడ్జి ప్రశ్నలను అడిగే సమయంలో శ్రీనివాస్ రెడ్డి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. ఫోర్న్ వీడియోలు చూస్తావా అని జడ్జి ప్రశ్నించగా.. తన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదని సమాధానమిచ్చాడు. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు ఏమైనా సంబంధం ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అసలు సువర్ణ ఎవరో తనకు తెలీదని నిందితుడు పేర్కొనడం జరిగింది. కాగా బాలికల దుస్తులపై ఉన్న స్పెర్మ్, రక్తపు మరకల ఆనవాళ్లు ఫోరెన్సిక్ రిపోర్టులో నీదే అని తేలింది.. దీనిపై నువ్వేమంటావు అని జడ్జి ప్రశ్నించగా.. ఎస్ఓటీ పోలీసులే వాటిని దుస్తులపై సిరంజిలతో చల్లారని నిందితుడు చెప్పినట్టు సమాచారం. హత్య జరిగిన రోజు తన ఫోన్ స్విచ్చాఫ్ చేశానని, అందుకే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపిందని నిందితుడు వెల్లడించాడు. అయితే ఈ కేసులో సాక్ష్యాలుగా తన అమ్మ, నాన్న, అన్నని తీసుకురావాలని నిందితుడు జడ్జిని కోరినట్లు తెలుస్తోంది. -
హాజీపూర్ కేసు.. మరో వారం రోజుల్లో తీర్పు!
సాక్షి, నల్గొండ : హాజీపూర్ వరుస హత్యల ఘటనలో మరో వారం రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గత కొన్ని రోజులుగా నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డి విచారణ ముగిసింది. అయితే నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని మరోసారి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వచ్చే గురువారం శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చివరిసారిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు శ్రీనివాస్‌రెడ్డిని అభిప్రాయం తీసుకోనుంది. అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనుంది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. -
ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు
‘‘నటుడిగా సక్సెస్ సాధించిన తర్వాత కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నిర్మించాలనుకుని ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాను నిర్మించాను. ఈ సినిమా కోసం తీసుకున్న నటీనటులందరి బలాలు నాకు తెలుసు. అందుకే వేరే దర్శకుడు ఎందుకు? అని నేనే డైరెక్షన్ చేశాను’’ అన్నారు నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై వై. శ్రీనివాస్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథ ఇది. భాగ్యనగరంలో మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారిని ఓ పోలీసాఫీసర్ పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇందులో ఓ షార్ట్‌ఫిల్మ్ గ్యాంగ్ ఎలా ఇరుక్కుకుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వినోదం మాత్రమే కాదు.. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలనే చిన్న సందేశం కూడా ఉంది. ఈ సినిమాతో మా మేనల్లుడుని ఆర్టిస్టుగా పరిచయం చేస్తున్నాను. సెంటిమెంట్ కోసం ఈ సినిమా తొలి షాట్‌ను మా నాన్నగారిపై డైరెక్షన్ చేశాను. ల్యాప్‌టాప్‌లో సినిమా చూసుకున్నారాయన. ఇటీవలే నాన్నగారు చనిపోయారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్‌పై ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నా. దర్శకత్వం, నిర్మాణం, హీరో, నటుడు.. ఈ నాలుగింట్లో నటుడిగా ఉండటమే నాకు ఇష్టం. ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు’’ అన్నారు. -
రిస్క్ ఎందుకన్నా అన్నాను
‘‘నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అందుకనే నా సినిమాల్లో తనుంటాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మాత్రం మిస్సయ్యాడు. మా సినిమాల షూటింగ్స్‌లో తను ఆర్టిస్ట్‌గాకంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కష్టపడుతుంటాడు’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి దర్శక నిర్మాతగా ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బ్యానర్ లోగోను అనిల్ రావిపూడి, టైటిల్ యానిమేషన్‌ను సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పగానే ‘ఎందుకన్నా.. రిస్క్ ఏమో!’ అన్నాను. తను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు.. సినిమా చాలా బాగుంది’’ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు వేరే డైరెక్టర్‌ను పెట్టినా ఆయన వెనక నేను నిలబడాల్సి వచ్చేది. అందుకే నేనే డైరెక్ట్ చేశాను. దర్శకుడు కావాలనే కోరిక అలా తీరింది. సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు.. ఇంకొంతమంది చిన్న కరెక్షన్స్ చెప్పారు. అవెంతో ఉపయోగపడ్డాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు తమన్. నిర్మాత పద్మనాభ రెడ్డి, నటులు ‘సత్యం’ రాజేష్, ‘షకలక’ శంకర్, సంగీత దర్శకుడు సాకేత్ తదితరులు మాట్లాడారు. -
నా నమ్మకం నిజమైంది
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈషా, సత్యదేవ్ బాగా నటించారు. శ్రీనివాస్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్ సినిమాని బాగా గ్రిప్పింగ్‌గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్ అంజి మాట్లాడారు. -
‘రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ
మూవీ: రాగల 24 గంటల్లో జానర్: సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: ఈషా రెబ్బ, సత్య దేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, టెంపర్ వంశీ, ముస్కాన్ సేథీ, రవివర్మ, కృష్ణభగవాన్, అదిరే అభి తదితరులు దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి సంగీతం: రఘు కుంచె మాటలు: కృష్ణభగవాన్ నిర్మాత: శ్రీనివాస్ కానూరు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే క్రేజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సారి క్రైమ్ బాట పట్టాడు. అదేనండి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రాగల 24 గంటల్లో’చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథా బలం ఉండి కాస్త సస్పెన్స్, ఎంటర్టైన్ తోడైతే క్రైమ్ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మరి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని దోచిందా? తన పంథా మార్చుకుని తొలిసారి క్రైమ్ బేస్డ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయవంతం అయ్యాడా? చూద్దాం. కథ: ఇండియాలోనే నంబర్ వన్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఎవరూ లేని అనాథ అయిన విద్య(ఈషా రెబ్బ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వివాహ బంధంతో ఒక్కటైన మూన్నాళ్లకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడం.. రాహుల్ ప్రవర్తనతో విద్య విసిగిపోతుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్) చేధించాడా? విద్య, గణేశ్, అభిల మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఈ మిస్టరీ కేసుకు దాస్(రవివర్మ), పుణీత్, వినీత్, అద్వైత్, మేఘన(ముస్కాన్ సేథీ)లకు ఏంటి సంబంధం? అనేదే మిగతా కథ. నటీనటులు: ప్రస్తుత కుర్ర హీరోలు కెరీర్ ఆరంభంలోనే నెగటీవ్ రోల్స్‌కూ సై అంటున్నారు. మొన్న కార్తికేయ.. నేడు సత్యదేవ్. ఇప్పటివరకు సత్యదేవ్‌ను పాజిటివ్ యాంగిల్లోనే చూసిన అభిమానులు తొలిసారి విలన్‌గా చూస్తారు. సత్యదేవ్ నటన చూశాక సైకోయిజం, కన్నింగ్, అనుమానం ఇలా ఏదనుకున్న యాప్ట్ అవుతుంది. తొలిసారి నెగటీవ్ షేడ్‌లో కనిపించిన సత్యదేవ్ విలనిజంలో పూర్తిగా లీనమవుతాడు. సినిమాలో లీనమైన వారు అతడు బయట కనిపిస్తే అసహ్యించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో నటించాడు. సారీ జీవించాడు. ఇక ఈషా రెబ్బ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్లో కనిపించిన ‘ఒకరికి ఒకరు’హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నెగటీవ్ షేడ్‌లో కనిపించాడు. తొలుత సిన్సియర్ ఏసీపీగా కనిపించినా చివరకు అసలు రంగు బయటపడుతుంది. ఇక గణేశ్ వెంకట్రామన్ కనిపించేది రెండు మూడు సీన్లలోనైనా మెప్పించాడు. ఇక సెకండాఫ్‌లో కాసేపు కనిపించి కథకు ప్రధానమైన ముస్కాన్ సేథీ అలరించింది. అంతేకాకుండా తన అందచందాలతో యూత్ కలల రాణిగా మారేలా చేసుకుంది. రవివర్మ, టెంపర్ వంశీ, అదిరే అభి, తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు. విశ్లేషణ: ‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో’ఈ డైలాగ్ కాస్త అటూ ఇటూగా ఈ సినిమాకు సెట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు అనుకునే వారు మంచి వారు కాదు.. విలన్లు అనుకునే వారు చెడ్డ వారు కాదు. ఇలా విలక్షణమైన స్టోరీ లైన్ పట్టుకుని పూర్తి కథను అల్లాడు రచయిత. దీనికి క్రైమ్, సస్పెన్స్‌కు తోడు ఫుల్ గ్లామర్ వడ్డించిన సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడు దర్శకుడు. ఊహకందని ట్విస్టులతో డైరెక్టర్ తన మ్యాజిక్ చూపించాడు. తొలి అర్థభాగంలో ముగ్గురు నేరస్తులు పారిపోవడం, విద్య ఇంట్లోకి చొరబడటం, అప్పటికే అతను హత్యకు గురవడం లాంటి అంశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో తన పూర్తి అనుభవాన్ని రంగరించిన దర్శకుడు ఎవరూ ఊహించని విధంగా కథను మలుపుతిప్పుతాడు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లకు లాజిక్ మిస్ అయితే ప్రేక్షకుడికి రుచించదు. కానీ ఈ విషయంలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కామెడీ సినిమాల డైరెక్టర్‌గా ముద్ర పడిపోయినా.. మధ్యలో ఢమరుకం, శివమ్ వంటి డిఫరెంట్ మూవీలను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ తాజాగా క్రైమ్ థ్రిల్లర్‌తోనూ ప్రేక్షకులను మెప్పించడంలోనూ విజయం సాధించాడు. ఇక తన నటన, అందంతో సినిమాకు ప్రాణం పోసింది ఈషా రెబ్బ. సరైన అవకాశం దక్కాలే కాని తన నట విశ్వరూపం ప్రదర్శిస్తానని ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకనిర్మాతలకు సవాల్ విసిరింది ఇషా రెబ్బ. ఆనందం, భయం, కోపం, జాలి, బాధ, శృంగారం ఇలా నవరసాలను ఇషా రెబ్బ అవలీలగా పండించింది. కెమెరామెన్ గరుడవేగ అంజి సినిమాను రిచ్ లుక్‌లో చూపించాడు. ముఖ్యంగా ఈషా రెబ్బ అందచందాలను చూపించడంలో కెమెరామన్ పనితనం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మాటలు అందించి, నటించిన కృష్ణ భగవాన్ రెండింటిలోనూ తన మార్క్ చూపించుకున్నాడు. ‘నాపై ఉన్న ప్రేమను చెప్పడానికి నీకు పదాలు చాలవు.. నాకు గిప్ట్ ఇద్దామనుకున్నా నన్ను మించిన గొప్పది నీకు దొరకదు, మనసులో టెన్షన్.. ఇంట్లో శవం రెండూ భయంకరమే’ వంటి డైలాగ్‌లు అలరిస్తాయి. సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చిన పాటలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. భాస్కరబట్ల, శ్రీమణిల కలం పనితనం పాటల్లో కనిపిస్తుంది. కాదు వినిపిస్తుంది. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువుల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మదిని థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్: ఈషా రెబ్బ నటన సత్య దేవ్ విలనిజం సస్పెన్స్ దర్శకత్వం కెమెరా పనితనం మైనస్ పాయింట్స్ ఊహకందే పలు ట్విస్టులు సాగదీత సీన్లు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది
ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కానూరి శ్రీనివాస్ నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ దర్శకుడిగా వెలుగొందుతాననే నమ్మకం ఉంది. నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. నా పక్కనే నిలబడి నన్ను నడిపించారు నిర్మాత కానూరి శ్రీనివాస్. బతికున్నంత కాలం అతన్ని వదలను. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనుష్క, కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్ కథ విన్నా డేట్స్ కుదరక చేయలేదు. తెలుగందం ఈషారెబ్బాతో పని చేశామని గర్వంగా చెబుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు అద్భుతమైన సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్ కానూరి. ‘‘కథ విన్న తర్వాత ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. అద్భుతమైన కథ. మంచి పాత్రలను డిజైన్ చేశారు శ్రీనివాస్‌రెడ్డిగారు’’ అన్నారు సత్యదేవ్. ‘‘తెలుగు అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావాలంటే అదృష్టం కావాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. శ్రీనివాస్ రెడ్డిలాంటి దర్శకులు ఉండబట్టే మేం ఇండస్ట్రీలో ఉన్నాం. శ్రీనివాసరెడ్డిగారు చాలా కూల్. సత్యదేవ్ మన తెలుగు విక్కీకౌశల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేను హాట్ గాళ్‌నే!
‘‘తెలుగు అమ్మాయిని కాబట్టి మన సంప్రదాయాలకు తగ్గ పాత్రలు చేసే అవకాశాలే దక్కాయి. నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. గ్లామరస్ పాత్రలకూ సిద్ధమే. నేను హాట్గాళే (నవ్వుతూ)’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో...’. ఈషా రెబ్బా ప్రధాన పాత్రధారి. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా చెప్పిన సంగతులు. ►ఇందులో నా పాత్ర పేరు విద్య. భావోద్వేగంతో కూడిన పాత్ర ఇది. నేను నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కూడా కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యాను. ఈ సినిమా సమయంలోనే మరో తమిళ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది. ►ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. 24 గంటల్లో జరిగే కథ ఇది. నా పాత్ర చుట్టూ అన్ని పాత్రలు తిరుగుతుంటాయి. అలా అని మిగతా పాత్రలకు ప్రాధాన్యం లేదని కాదు. అందరి పాత్రలు కీలకమే. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా ►‘‘ఢమరుకం’ మినహాయించి అన్నీ కామెడీ సినిమాలు చేసిన శ్రీనివాస్‌రెడ్డి తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఎలా డైరెక్ట్ చేస్తున్నారు’’ అని నన్ను కొందరు అడిగారు. ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఈ జానర్లో అనుభవం ఉన్న దర్శకుడిలాగానే చేశారు. ►దర్శకుడు నన్ను నయనతారతో పోల్చారు అంటే అందుకు ఆయనకు థ్యాంక్స్. కానూరి శ్రీనివాస్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ►నా కెరీర్ సంతృప్తికరంగానే సాగుతోంది. నాకు వచ్చిన అవకాశాల్లో ఫలానా పాత్ర సూట్ అవుతుందనుకుంటేనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తాను. కానీ డైరెక్టర్, హీరో, క్యారెక్టర్.. ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని కథకు ఓకే చెప్తాను. స్టార్ హీరో, పెద్ద డైరెక్టర్, సినిమా అంటే కథ ఓ మోస్తరుగా ఉన్నా ఓకే చెబుతాను. ఎందుకంటే అది నా కెరీర్‌కు హెల్ప్ అవుతుందని నమ్మకం. ►నెట్‌ఫ్లిక్స్ కోసం తెలుగు ‘లస్ట్ స్టోరీస్’లో నటించాను. హిందీ ‘లస్ట్ స్టోరీస్’కి ఇది డిఫరెంట్. సంకల్ప్ దర్శకత్వం వహించారు. తమిళంలో జీవీ ప్రకాశ్‌తో కలిసి చేసిన సినిమా విడుదలకు సిద్ధమైంది. కన్న డలో శివరాజ్‌కుమార్ సినిమాలో నటించబోతున్నాను. ఓ తెలుగు సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. -
‘పొరుగు ధాన్యాన్ని అడ్డుకోండి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో సీలింగ్ విధించడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో దళారులు, వ్యాపారస్తులు రైతుల పేరుతో తెలంగాణలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో గట్టి నిఘాతో దీన్ని అరికట్టాలని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడి శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోడింగ్ చేసి ఆ వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు (ట్రక్ షీట్) చేస్తున్నారని, నమోదు చేసిన వివరాలకు రైస్ మిల్లర్లు ఆన్లైన్లోనే ఆమోదం తెలపాలని సూచించారు. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో త్వరితగతిన రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు వీలవుతుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో కేంద్రం నిబంధనల మేరకు తేమ 17 శాతంలోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట పొలాల నుంచి ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురాకుండా దశలవారీగా తీసుకువచ్చేలా కేంద్రాల నిర్వాహకులు రైతులకు సూచించాలన్నారు. -
ట్రైలర్ బాగుంది
హీరోయిన్ ఈషా రెబ్బా నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత శ్రీనివాస్ కానూరు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, కెమెరామన్ ‘గరుడవేగ’ అంజి, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి
ఢిల్లీ: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఆధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు తెలిపారు. -
దేవికా రాణి ఆఫీసులోనే పార్టీలు
-
జల్సా రాణి..!
-
దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణికి సంబంధించి ప్రతిరోజూ కొత్త లీలలు వెలుగుచూస్తున్నాయి. అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. ఆమె అక్రమాస్తులు, చేసిన విలాసాలు, వాటికి వెచ్చించిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న విషయాలపై ఏసీబీ ఇప్పటికే కూపీ లాగడం ప్రారంభించింది. మందుల డబ్బును దోచుకునేందుకు అందుబాటులో ఉన్న అన్నిరకాల అడ్డదారులను ఆమె ఉపయోగించారు. ఇటీవల ఈ కేసులో తేజా ఫార్మా ఎండీ సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో దాడులు చేసిన ఏసీబీ శుక్రవారం అతన్ని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తన వద్ద పనిచేసే కొడాలి నాగలక్ష్మి సాధారణ ఫార్మాసిస్ట్ అయినప్పటికీ ఆమె కూడా కోట్ల రూపాయల అక్రమార్జన గడించడం విశేషం. వీరిద్దరి అరాచకాలను గతంలోనే ‘సాక్షి’బయటపెట్టిన విషయం తెలిసిందే. చదవండి: రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికారాణి డొల్ల కంపెనీల దందా.. డైరెక్టర్‌గా ఉన్న కాలంలో దేవికారాణి అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెకు.. నాన్ రేటెడ్ కంపెనీ (ఎన్ఆర్సీ)ల నుంచి వచ్చే కమీషన్లు సరిపోలేదు. అందుకే తన అనుచరురాలు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలసి 2 డొల్ల కంపెనీలు సృష్టించారు. ఇందులో మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్‌ను నాగలక్ష్మి బంధువైన ఎం.మురళీకృష్ణ పేరుపై ఉంచగా, మురళీకృష్ణ భార్య ఎం.విజయలక్ష్మీ పేరిట జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్ను స్థాపించారు. వీటిని తేజా ఫార్మాస్యూటికల్స్ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి 2016లో రిజిస్టర్ చేయించారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది ఆమెకు సహకరించినట్లుగా ఏసీబీ గుర్తించింది. విందులు.. విలాసాలు.. అక్రమమార్గంలో కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బును దేవికారాణి, నాగలక్ష్మి, రాజేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగీ కలలో కూడా ఊహించనంత డబ్బు రావడంతో జల్సా జీవితాలకు అలవాటు పడ్డారు. ఖరీదైన హోటళ్లలో బర్త్‌డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లు అంటూ అందుబాటులో ఉన్న ప్రతీ విలాసాన్నీ అనుభవించారు. తేలిగ్గా వస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక వీరు చాలా కొత్త పనులు ముందేసుకునేవారు. ఆఫీసులో సందర్భాలను సృష్టించుకుని అందులో డ్యాన్సులు చేయడం, పార్టీలు జరుపుకునేవారు. ఆ పార్టీల్లో దేవికారాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు తహతహలాడేవారు. ప్రత్యేకంగా బ్యూటీషియన్లు, డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. స్వయంగా అన్ని వేడుకల్లో ఆమెనే నర్తించేవారు. అంతేకాదు ఆత్మరక్షణ కోసం నాన్చాక్ తిప్పడం కూడా నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోసం చేసిందిలా..? ►1. 2016–18లో మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్ కంపెనీకి రూ.3,69,58,500 విలువైన పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ మందులు రేట్ కాంట్రాక్ట్ కంపెనీ (ఆర్సీ)ల ద్వారా కొనుగోలు చేస్తే వాస్తవానికి కేవలం రూ.61,99,972 మాత్రమే ఖర్చయ్యేది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.3,07,58,528 నష్టం వాటిల్లింది. ►2. జై సాయిరాం కంపెనీకి రూ.4 కోట్ల పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇదే రేటెడ్ కంపెనీలో వీటి విలువ రూ.1.12 కోట్లు మాత్రమే. ఫలితంగా 2.88 కోట్లు నష్టం వాటిల్లింది. ►3. రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వైష్ణవి ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.5.50 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇవి రేట్ కాంట్రాక్ట్ ప్రకారం రూ.1.41 కోట్లు మాత్రమే. ఫలితంగా ప్రభుత్వానికి రూ.4.09 కోట్లు నష్టం వాటిల్లింది. ►4. తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, అతడి సోదరుడు శ్రీనివాసరెడ్డిలకు మొత్తం 8 డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చిన కాంట్రాక్టులన్నీ నిబంధనలకు విరుద్ధంగా దేవికారాణి కట్టబెట్టినవే కావడం గమనార్హం. ►5. ఇలా వచ్చిన ఆదాయాన్ని పీఎంజే జ్యువెలరీస్‌కు మళ్లించారు. అయితే అక్కడ నుంచి కేవలం నగల కొనుగోలుకే పరిమితమయ్యారా? ఇంకేదైనా లావాదేవీలు జరిపారా? అన్న విషయంలో ఏసీబీ లెక్కలు తవ్వుతోంది. ►6. మహీధర మెడికల్ అండ్ సర్జికల్, జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్, ఎస్ఎస్ అసోసియేట్స్, సాయి శ్రీనివాస తదితర కంపెనీలకు ప్రాసెసింగ్, ఇన్వాయిస్, కొటేషన్స్ చేసి దాని ద్వారా వచ్చిన సొమ్మును నేరుగా అప్పటి డైరెక్టర్ దేవికారాణికి లేదా ఆమె సూచించిన వ్యక్తులకు అందజేసేవారు. ►7. మొత్తంగా ఇలా అక్రమమార్గాల్లో దాదాపు రూ.10.85 కోట్ల మేరకు దేవికారాణి ముఠా కాజేసినట్లు ఏసీబీ పరిశీలనలో వెల్లడైంది. ►8. ప్రభుత్వ జీవో నం.51 ప్రకారం రేటెడ్ కంపెనీల ద్వారా మందులు కొనాలి. కానీ, నిబంధనలను తుంగలో తొక్కిన దేవికారాణి.. రేటెడ్ కంపెనీలను పక్కనబెట్టి, తన బినామీలు సమర్పించిన నాన్‌రేటెడ్ కంపెనీలకు ముందుగా బిల్లులు చెల్లించేది. అందుకు రేటెడ్ కంపెనీల పనితీరు బాగా లేదని నిందలు వేసి నాన్‌రేటెడ్ కంపెనీలకు వాస్తవ ధర కంటే 10 రెట్లు అధికంగా కట్టబెట్టేది. ►9. ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించేందుకు అంతకుముందున్న నిబంధనలకు తిలోదకాలిచ్చి ఎస్డీడీయూ (స్పెషల్ డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి సనత్‌నగర్‌లో ఓ గోదాము ఏర్పాటు చేసింది. ఇక్కడ మందులు వచ్చినట్లు బిల్లులు సృష్టించి వాటిని తన అనుచరులతో డ్రా చేసుకునేది. -
తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు..
-
‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’
సాక్షి, ఖమ్మం: ‘ఆయనను కళ్లలో పెట్టుకుని చూసుకున్నాను. మార్నింగ్ టిఫిన్ చేసి బయటికి వెళ్లారు. అంతే ఆ తర్వాత అసలేం జరిగిందో తెలియదు. ఆయన నాకు మళ్లీ కావాలి. మాలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు’ అంటూ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి భార్య విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఏనాడు ఇంట్లో నుంచి బయటికి రానిదాన్ని ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబంతో పాటు 48 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీళ్లతో విఙ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసి కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఖమ్మంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తొంబై శాతం గాయాలతో ఆస్పత్రి పాలైన ఆయన మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక 28 ఏళ్లుగా ఆర్టీసీలో సేవలు అందించిన శ్రీనివాసరెడ్డి రిటైర్మెంట్కు దగ్గరవుతున్న క్రమంలో ప్రభుత్వ తీరుతో ఆత్మహత్యకు పాల్పడటంతో కేసీఆర్ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత) తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు.. ‘నేను అందరికీ ముఖ్యంగా ఆర్టీసీ వాళ్లకు చెబుతున్నది ఒకటే. ప్లీజ్.. దయచేసి ఇంకెవరూ ఇలాంటి పనిచేయొద్దు. మాలాగా పిచ్చోళ్లు, అనాథలు అయిపోతారు. ఒక్కసారి మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీరు లేకుంటే కుటుంబాలు నాశనమైపోతాయి. జరిగేదేదో జరుగుతుంది. న్యాయం చేకూరుతుంది. మా తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు. వాడింకా షాక్‌లోనే ఉన్నాడు. తన మఖం కూడా కాలిపోయింది’ అంటూ శ్రీనివాసరెడ్డి పెద్ద కొడుకు ఆర్టీసీ కార్మికులకు విఙ్ఞప్తి చేశాడు. -
శ్రీనివాస్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు కారణమని నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సంస్థకున్న 50 వేల కోట్ల ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్కడికి చేరుకున్నారు. లక్ష్మణ్, రేవంత్, మంద కృష్ణ మాదిగ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత నారాయణ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అపోలో ఆస్పత్రికి వచ్చారు. కాగా, ఆర్టీసీ సమ్మెలో భాగంగా నగరంలోని బస్‌భవన్‌తోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్ సహా 29 డిపోల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలు, ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు గోబ్యాక్ అని నినదించారు. శ్రీనివాస్‌రెడ్డి మరణంతో ఆదివారం నిర్వహించ తలపెట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని వాయి దా వేశారు. నగరంలో ఆదివారం సుమారు 800 బస్సులను వివిధ రూట్లలో నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. కార్మికుల జీవితంతో చెలగాటం.. సీఎం కేసీఆర్, మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మనస్తాపం చెంది శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివా రం ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఖమ్మం చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం
-
ఖమ్మం చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం
సాక్షి, ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం కొద్దిసేపటి క్రితం ఖమ్మంకు చేరుకుంది. శనివారం రోజున ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని డీఆర్డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహానికి అదే ఆస్పత్రిలో వైద్యులు పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం భారీ భద్రత నడుమ శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించడానికి పలువురు రాజకీయ నాయకులు ఖమ్మం చేరుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుటు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఖమ్మం డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి నివాళుర్పించడానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన నివాసానికి చేరుకున్నారు. తోటి కార్మికుడి ఆత్మహత్యతో ఆందోళన మరింత ఉధృతం చేయడానికి కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. అడ్డుకున్న కార్మికులు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని భారీ భద్రత మధ్య ఖమ్మం తరలిస్తుండగా సూర్యాపేట వద్ద ఆర్టీసీ కార్మికులు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు నల్గొండ హైవే పై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించండి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అన్ని అర్హతలున్నందున రామప్ప దేవాలయాన్ని ఆ జాబితాలోకి చేర్చేలా చొరవ చూపాలని యునెస్కో ప్రతినిధి వాసు పొష్యానందనను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఆ జాబితాలో చేర్చేందుకు రామప్ప దేవాలయానికి ఏమేర అర్హతలున్నాయో పరిశీలించేందుకు వచ్చిన ఆయనను శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టతను, చరిత్రను, శిల్ప కళా వైభవాన్ని తెలియచేసే ఆలయ దృశ్యమాలికను ఆయనకు అందజేశారు. -
టీజర్ చూసి థ్రిల్ అయ్యాను
‘‘టీజర్ చాలా బావుంది. థ్రిల్ అయ్యాను. ఖచ్చితంగా ఆడియన్స్ కూడా థ్రిల్ ఫీలవుతారు. టైటిల్ కూడా చాలా బావుంది. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్ అంజి వర్క్ బావుంది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్ కానూరుకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ చివరి వారంలో దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం. ‘‘మా చిత్రం టీజర్‌ను విడుదల చేసిన గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్’’ అన్నారు దర్శక, నిర్మాతలు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత శ్రీనివాస్ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామేన్ ‘గరుడవేగ’ ఫేమ్ అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబా అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీజర్ చూసి థ్రిల్ ఫీలయ్యాను : త్రివిక్రమ్ శ్రీనివాస్
‘సినిమా టీజర్ చాలా బావుంది. ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు’ అంటున్నారు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘సినిమా టైటిల్ బావుంది. టీజర్ చూశాను. నిజంగా చాలా థ్రిల్ ఫీలయ్యాను. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్ అంజి వర్క్ బావుంది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్ కానూరుకు ఆల్ ది బెస్ట్’ అన్నారు. టీజర్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్‌కు దర్శక, నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత శ్రీనివాస్ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామేన్ ‘గరుడవేగ’ ఫేమ్ అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబా అలీ పాల్గొన్నారు. -
ఆ అధికారి బదిలీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్) : మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా రెవెన్యూ శాఖకు బదిలీ కావడం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగిన శ్రీనివాస్‌రెడ్డి జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. మేడ్చల్ జాయింట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదిన్నర కాలంలో రెవెన్యూశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం బొమ్మరాసిపేటలో రైతులను ఒప్పించి భూములను సేకరించగలిగారు. ప్రభుత్వ పథకాలు నేరుగా పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సందర్శకులు, బాధితులు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదపూర్వకంగా మెలిగేవారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి ఆదేశాలను పాటిస్తూనే ఉద్యోగులందరితో ఐక్యంగా మెలుగుతూ మంచి అధికారిగా గుర్తింపు సాధించారు. జిల్లా ప్రజల హృదయాన్ని గెలుచుకున్న శ్రీనివాస రెడ్డి బదిలీ ఆగిపోతే బాగుంటుందని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. -
గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటం చేయాలి
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ నాయకులు గల్లీలో కాదు ఢిల్లీలో పోరాటం చేసి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకరావాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌లోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం కేసీఆర్ తగిన చర్యలు చేపట్టారని అన్నారు. రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తికావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాలమూరు ఎత్తిపోతల పథకంపై లేని పోని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు కాంగ్రెస్, బీజెపీ నాయకులు పోరాటం చేయాలని అన్నారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించకుంటే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజల నుండి ఓట్లు అడగమని అన్నారు. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో భూ సేకరణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించాలని మొదట సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం వారికి సాధ్యం కాలేదని, సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఏమితోచక లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు అందెబాబయ్య, కొందూటి నరేందర్, అగ్గునూరు విశ్వం, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జెడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంఎస్ నట్రాజ్, ఎమ్మె సత్యనారాయణ, యుగెంధర్, చింటు, మన్నె నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కాన్వాయ్ ఢీకొందని తప్పుడు పోస్టు
సాక్షి, షాద్‌నగర్/ రంగారెడ్డి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వారిపై షాద్‌నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై విజయభాస్కర్ కథనం ప్రకారం.. సర్దార్‌సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి వచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి కిషన్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లారు. అయితే, మంత్రి కాన్వాయిలోని వాహనం ఓ చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉందని షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఖాజాపాషా అనే విలేకరి ఉద్దేశపూర్వకంగా మంత్రి పటిష్టకు భంగం కల్పించే విధంగా వివిధ సామాజిక మాద్యమాల్లో తప్పుడు వార్తను పోస్టు చేశాడు. ఈమేరకు టీఆర్ఎస్ కార్య కర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని, ఘర్షణ వాతావరణం నెలకొల్పే విధం గా చేసిన ఖాజాపాషాపై చర్యలు తీసుకోవాలని కిషన్‌నగర్ గ్రామానికి చెందిన అంజయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌భాస్కర్ తెలిపారు. -
సోషల్ మీడియాలో హాజీపూర్ కిల్లర్ వార్త హల్చల్
సాక్షి, బొమ్మలరామారం (ఆలేరు) : రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్య కేసు మరోసారి శనివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై ఇటీవల భువనగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కానీ శనివారం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్యల కేసులో సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారని, కల్పన, శ్రావణి, మనీషాలపై హత్యకు ముందు అత్యాచారానికి పాల్పడినట్లుగా టెక్నికల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అందినదని, 300 మంది సాక్షలను విచారించి కోర్టుకు అవసరమైన బలమైన సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి కోర్టుకు అందజేయడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు మార్గం సుగమం అయినట్టుగా ఓ సమాచారం హల్చల్ చేసింది. వరంగల్ ఘటనలో నిందితుడు ప్రవీణ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించడంతో శ్రీనివాస్‌రెడ్డి ఎలాంటి శిక్షలు పడుతాయోనని ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అధికారులు ఈ విషయమై సంప్రదించగా హాజీపూర్ హత్యల కేసులో జరుగుతున్న పరిణామాలను ఎవరో అత్యుత్సహంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారని, పోలీసుల విచారణను సైతం ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదని ఓ సీఐ కేడర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. -
కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం
నరసరావుపేట రూరల్: ‘కోడెల ట్యాక్స్’ (కే టాక్స్)పై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అవినీతి, అక్రమాలపై శాసనసభలో చర్చిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడెల కుటుంబం అవినీతిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన కుటుంబంపై కక్ష సాధింపులో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే, కే టాక్స్ బాధితులందరూ తెలుగు దేశం పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. కళ్ల ముందు కనిపిస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకుంటూ వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడాన్ని మానుకోవాలని కోడెలకు హితవు పలికారు. కోడెల అక్రమాలన్నింటిపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని ట్రాఫిక్ ఆంక్షలపై టీడీపీ నేతలు విమర్శించడం తగదని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే మార్పులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రంగాలకు కేటాయింపులు జరిపారన్నారు. -
శ్రీనివాస్‌రెడ్డితో మరో సినిమా తీస్తా
కథానాయిక ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్ హీరోగా నటించారు. శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీనివాస్ కానూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘స్వతహాగా వ్యాపారవేత్తను అయిన నేను సినిమా నిర్మాణం ఎంత కష్టమో, ఎంత కష్టపడతారో కళ్లారా చూశాను. నిర్మాతగా నా తొలి సినిమాని శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించడం సంతోషంగా ఉంది. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాం. సెప్టెంబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నాం. నా నెక్ట్స్ సినిమా కూడా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని అన్నారు. ‘‘కొంత గ్యాప్ తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. స్క్రీన్‌ప్లే బేస్డ్గా సాగే అద్భుతమైన థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత ఈషా రెబ్బా పెద్ద హీరోయిన్ల జాబితాలోకి వెళుతుంది. సత్యదేవ్ హీరోగా బిజీ అవుతారు. హాస్యనటుడు కృష్ణభగవాన్ ఈ సినిమాకు మాటలు రాయడం అదనపు ఆకర్షణ’’ అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముస్కాన్ సే«థీ, గణేష్ వెంకట్రామన్, కృష్ణభగవాన్, అనురాగ్, ‘టెంపర్’ వంశీ, రవి ప్రకాష్, రవి వర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆలీబాబా. -
ఆ కామాంధుడిని ఉరి తీయాలనుంది
సాక్షి ప్రతినిధి, వరంగల్: చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ‘‘అసలు ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు.. ఆ కామాంధుడిని ఉరి తీయాలని ఉంది. కానీ అది సాధ్యమయ్యేది కాదు. చట్టాలున్నాయి.. వాటి ద్వారా ముందుకు పోదాం’’అని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో జరిగింది. 6 నెలల పసిపాప శ్రీహితను పాశవికంగా హత్య చేసిన నిందితుడికి త్వరగా శిక్ష పడేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని కోరుతూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ చిన్నారి శ్రీహిత ఘటనను ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. పీఆర్ చట్టాన్ని పటిష్టం చేస్తున్నాం.. పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టం చేస్తున్నామని, అధికారాలు, విధులు అప్పగించడంతో పాటు దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తీసుకునేలా రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోకి ఉపాధి హామీ పనులు తీసుకొచ్చేలా చట్టంలో మార్పు తీసుకువస్తున్నామని చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఇక నుంచి పాఠశాలలు పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఇక నుంచి వ్యవసాయం, అంగన్వాడీతో పాటు ఇతర అంశాలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురానున్నట్లు వివ రించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని తెలిపారు. -
నల్లగొండ కోర్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వరుస హత్యల కేసులో నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డికి పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నల్లగొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు భువనగిరి ఏసీపీ భుజంగరావు వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు పోలీసులు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనను హత్య చేసిన ప్రదేశంలో గాలించగా బాలిక స్కూల్ ఐడీ కార్డు లభించింది. అలాగే తిప్రబోయిన మనీషా ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ పడవేసిన ప్రాంతంలో వెతకగా, అధార్ కార్డు లభ్యమైంది. సెల్‌ఫోన్ జాడ దొరకలేదు. ముగ్గురు బాలికల హత్యలలో నిందితుడు ఒంటరిగానే దురాగతాలకు పాల్పడ్డాడా.. ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో మూడు రోజుల పోలీస్ కస్టడీలో విచారించినట్లు తెలిసింది. -
ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీలు విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఏకపక్ష విజయం ఇచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు. -
‘హాజీపూర్’ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
హాజీపూర్: ఆ ఇద్దరు ఎటు పోయారు?
బొమ్మలరామారం: హాజీపూర్ ఘటనలో నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డి కేసు లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు శనివారం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో నిందితుడిని తిప్పినట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆదివారం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో వెతకగా కల్పన, మనీషాలకు సంబంధించిన ఆధార్, స్కూల్ ఐడీ కార్డు లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం తుంగని కల్పన హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహాన్ని గన్నీ బ్యాగులో కుక్కి మర్రి బావిలో పడేశాడు. కల్పన స్కూల్ యూనిఫాం, టిఫిన్ బాక్స్‌నూ బావిలో పడేశాడు. తర్వాత అటువైపు వెళ్లిన శ్రీనివాస్‌కి కల్పన స్కూల్ ఐడీ కార్డు కనిపించడంతో పక్కనున్న చెట్ల పొదల్లోకి విసిరేశాడు. మనీషానూ మర్రి బావి వద్దకు తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహన్ని బావిలో పూడ్చివేశాడు. మనీషా ఆధార్, సెల్‌ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్కలమ్మ కుంటలో పడేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల కర్కలమ్మ కుంటలో ఆదివారం పోలీసులు జల్లెడ పట్టారు. 4 గంటలపాటు వెతకగా మనీషా ఆధార్ కార్డు దొరికింది. కానీ సెల్‌ఫోన్ లభించలేదు. ఆ ఇద్దరు ఎటు పోయారు: శ్రీనివాస్‌రెడ్డి నేర చరితపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తమ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఉన్నాయని.. తెలిసిన వారి తోటల్లో మిమ్మల్ని పనికి కుదర్చుతానని వరంగల్ నుంచి ఓ జంటను శ్రీనివాస్ తీసుకొచ్చినట్లు సమాచారం. వారిని కొంతకాలంగా తన వద్ద లిఫ్ట్ మెకానిక్ పనిలో సహాయం చేయించుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆ దంపతుల జాడ తెలియరాలేదని గ్రామస్తులు అంటున్నారు. శ్రీనివాస్ ఫోన్లో అశ్లీల వెబ్సైట్ల సెర్చింగ్‌లే ఉన్నట్లు పరిశీలనలో తెలిసింది. సెల్ఫోన్లో అశ్లీల వెబ్‌సైట్‌తో కాలయాపన చేయడంతోనే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హాజీపూర్ సైకో కిల్లర్‌కు మూడు రోజుల కస్టడీ
-
శ్రీనివాస్‌రెడ్డికి మూడు రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్ : హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడి శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విచారించనున్నారు. అతన్ని విచారించేందుకు నల్గొండ జిల్లా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించిందని రాచకొండ కమిషనరేట్ అధికారులు తెలిపారు. గతంలోనూ శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు వారంరోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. నిందితుని నేర చరిత్రపై అధికారులు మరోసారి ఆరా తీయనున్నారు. ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారించారు. నిందితుడు పనిచేసిన ప్రదేశాల్లో ఏమైనా నేరాలకు పాల్పడి ఉంటాడనే కోణంలోనూ విచారణ కొనసాగనుంది. శ్రావణిని హత్య చేసి బావిలో పాతిపెట్టే సమయంలో శ్రీనివాస్‌రెడ్డికి ఎవరైనా సహకరించారా అనే అనుమానాలపై కూడా వివరాలను సేకరించనున్నట్టు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : హాజీపూర్ సైకో కిల్లర్‌కు మూడు రోజుల కస్టడీ -
మర్రిబావిలో మరో రెండు మృతదేహాలు?
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్‌రెడ్డి.. తన మర్రి బావిలో మరో రెండు మృతదేహాలను పూడ్చిపెట్టాడనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి తనతో పాటు లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే దంపతులను హతమార్చి మర్రిబావిలోనే పూడ్చిపెట్టాడని గ్రామంలో చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పోలీస్ కస్టడీ నల్లగొండ లీగల్: ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌రెడ్డిని 3 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నల్లగొండ అదనపు జిల్లా జడ్జి ఎస్‌వీవీఎన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని గతనెలలో వారంపాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు.. మరో రెండు కేసుల విచారణ నిమిత్తం మూడు రోజులు కస్టడీకి అనుమతించింది. -
పోలీసుల నిర్లక్ష్యమే బాలికల హత్యలకు కారణం
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌లో చోటు చేసుకున్న బాలికల హత్యలకు కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని హైదరాబాద్ నగరశాఖ పౌర హక్కుల సంఘం నేతలు అన్నారు. మండలంలోని హాజీపూర్, మైసిరెడిపల్లి గ్రామాల్లో ఆదివారం వారు పర్యటించారు. బాధిత కుటుంబాలను కలసి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇంటికొకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రఘునా«థ్, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
డజన్ కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల ఫలితాల్లో పన్నెండు మంది అభ్యర్థులకు అదృష్టం కలిసొచ్చింది. పోటీచేసిన తొలిసారే పార్లమెంటులో అడుగిడే అవకాశం ల భించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా కొత్త వారే విజయం సాధించారు. ఇందులో ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచినవారిలో మన్నెం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్), బి.వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పోతుగంటి రాములు (నాగర్‌కర్నూలు), డాక్టర్ రంజిత్‌రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. ఊహించ ని విధంగా పార్లమెంట్ పోరులో నిలబడ్డ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) జయకేతనం ఎగురవేయగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి) చివరి రౌండ్ వరకు ఉత్కంఠను రేకెత్తించినప్పటికీ విజయం సాధించారు. సుదీర్ఘకాలం తర్వాత ఒంటరిగా పోటీచేసిన బీజేపీ అనూహ్య ఫలితాలను నమోదు చేసింది. ఆ పార్టీ నలుగురు విజేతలూ మొదటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసినవారే కావడం విశేషం. గంగాపురం కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), సోయం బాపురావు (ఆదిలాబాద్), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), బండి సంజయ్ (కరీంనగర్) ఉన్నారు. వీరిలో ఉత్తమ్, కోమటిరెడ్డి, రాములు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించారు. కాగా, రేవంత్, కవిత, బాపురావు, కిషన్‌రెడ్డిలు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఐదుగురు పాతకాపులే! ఐదుగురు పాతకాపులకు ఓటర్లు మళ్లీ పట్టం కట్టారు. గతంలో ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించిన వారికి మరోసారి అవకాశం కల్పించారు. అసదుద్దీన్ ఓవైసీ (హైదరాబాద్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం), పసునూరి దయాకర్ (వరంగల్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్)లు తాజా ఎన్నికల్లోను విజయఢంకా మోగించారు. -
హాజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్యల ఘటనపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్యలు, బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనికి ట్విటర్లో స్పందించిన కేటీఆర్.. శనివారం బిట్టు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడా రు. ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నామన్నా రు. సీఎం కేసీఆర్ సైతం హాజీపూర్ ఘటనపై సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. చట్ట పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠినమైన శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తామని, ప్రజలందరూ దయచేసి సంయమనం పాటించాలని కోరారు. హాజీపూర్ సంఘటనపై ప్రతి ఒక్కరికీ బాధగా ఉందని, రాజకీయాలు వద్దని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతతో మాట్లాడి బాధితులను కలవాల్సిందిగా సూచిస్తామన్నారు. స్థానిక ఎస్ఐ, సీఐల నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలంగా మారిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా, రాచకొండ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడుతామన్నారు. తాను ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని బాధితులకు, గ్రామస్తులకు తెలియజేయాలని సర్పంచ్ బిట్టు శ్రీనివాస్‌కు కేటీఆర్ సూచించారు. -
హాజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్
సాక్షి, యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అత్యంత దారుణంగా హత్యలకు గురైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ ఘటనలు బాధాకరమన్న ఆయన హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. కాగా హత్యకు గురైన చిన్నారుల కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతూ... బొమ్మల రామారం మండలం మాల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటన పట్ల సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. నెలాఖరులో హాజిపూర్ గ్రామాన్ని సీఎం,కేటీఆర్ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
హాజీపూర్ బాధితుల దీక్ష భగ్నం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురైన ముగ్గురు బాలికల కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు బొమ్మలరామారంలో గురువారం నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా దీక్ష శిబిరంలో నిద్రిస్తున్న బాధితులను శనివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మందిని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న దీక్ష శిబిరాన్ని తొలగించి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీక్షలో కూర్చుని అనారోగ్యం బారిన పడిన పక్కీరు రాజేందర్‌రెడ్డి, పాముల ప్రవీణ్‌లను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వారి ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడ్డాక తిరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం ఉదయం మొదటి విడతలో 15 మందిని వదిలివేశారు. మిగతా వారిని తర్వాత వదిలేశారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్ ఆందోళనలతో అట్టుడుకుతున్న హాజీపూర్ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. వరుస హత్యలు వెలుగు చూసిన నాటినుంచి గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కాగా, శాంతియుతంగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారనే సమాచారంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుం ది. గ్రామంలోని మహిళలందరూ కలసి బొమ్మలరామారం మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేసేం దుకు సిద్ధమయ్యారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వ్యక్తులను విడిచి పెట్టారని తెలిసి ధర్నా ప్రయత్నా న్ని విరమించారు. పోలీసులు వదలిపెట్టాక బాలికల ను హత్య చేసిన బావిలోకి దిగి నిరసన చేట్టారనే సమాచారంతో తెట్టెబావి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. తెట్టె బావిలోకి దిగిన బాధితులు ప్రభుత్వం తాము శాంతియుతంగా చేపట్టిన దీక్షను భగ్నం చేసిందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాధిత కుటుంబాల సభ్యులు శ్రావణి, మనీషాలపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన తెట్టెబావిలోకి దిగి అరగంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించి బావి నుంచి బయటకు వచ్చారు. తర్వాత కలెక్టర్‌ను కలసి తమ డిమాండ్లను వివరించారు. బాధితుల డిమాండ్లను సావధానంగా విన్న కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా కొడుకును ఉరి తీయాలి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి బాల్‌రెడ్డి బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో తన కొడుకు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలని నిందితుడి తండ్రి బాల్‌రెడ్డి శనివారం మీడి యా ముందు కోరారు. శ్రీనివాస్‌రెడ్డి దురాగతాలు తమకు తెలియవన్నారు. గతంలో కర్నూల్లో ఓ కేసు విషయమై బెయిలుపై విడిపించామని తెలిపారు. శ్రావణి హత్యకు పాల్పడినప్పుడు మృతదేహాన్ని వెలికి తీస్తున్న సమయంలో తమతోపాటే తన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి బావి వద్దనే ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వెలికి తీసే సమయంలో, మరుసటి రోజు అతని ముఖంలో ఎలాంటి భ యం, ఆందోళన కనిపించలేదన్నారు. ఏదైనా పనిచేయాలని చెబితే తనవైపు ఉరిమి చూసేవాడని బాల్‌రెడ్డి వెల్లడించారు. అనుమానంతో పోలీసులు ఇంటికి వస్తే ఈ హత్యలలో నీ హస్తం ఏమైనా ఉందా? అని అడిగితే.. ‘నీకేం భయం వద్దు. ఆ హత్యలతో నాకేం సంబంధం లేదు’అని బుకాయించాడన్నారు. ఆధారాలు లభించవు అన్నాడు శ్రావణి పోస్ట్‌మార్టంలో అన్ని విషయాలు బయటæపడతాయని తాను కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు శ్రీనివాస్‌రెడ్డి తనకేమీ పట్టనట్లుగా ఉన్నాడని అతని సోదరుడు మర్రి సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని.. పోస్టుమార్టంలో కూడా ఆధారాలు లభించవని శ్రీనివాస్‌రెడ్డి బుకాయించాడని పేర్కొన్నారు. తన సోదరుడు ఇలాంటి క్రూరుడనే విషయం తెలిసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన సోదరుడు చేసిన పనికి తమను ఎవరూ రానివ్వడం లేదని, హైదరాబాద్ బస్టాండ్లలో తల దాచుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న బాధిత కుటుంబాలు బాధితుల డిమాండ్లు ఇవీ.. - నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉరిశిక్ష పడేట్టు చేయాలి. దీనిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించాలి. - ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. - బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. - హజీపూర్–మాచన్‌పల్లి మధ్యన శామీర్‌పేట వాగుపై బ్రిడ్జిని నిర్మించాలి. హజీపూర్, మైసిరెడ్డిపల్లి, తిరుమలగిరి, నాగినేనిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి. - నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన భూమిని బాధిత కుటుంబాలకు పంచాలి. -
మేడిచెట్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి పూజలు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి అమానుషంగా చంపిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి దినచర్యలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎవరితోనూ పెద్దగా స్నేహంగా ఉండని శ్రీనివాస్‌రెడ్డి గ్రామ సమీపంలోని శమాసుల బావి వద్ద గల మేడిచెట్టుకు నిత్యం పూజలు నిర్వహించేవాడు. శ్రీనివాస్‌రెడ్డి అరాచ కాలు వెలుగులోకి రాక ముందు నుంచే ఈ మేడిచెట్టుకు అతను పూజలు నిర్వహించేవాడని తెలుస్తోంది. మేడిచెట్టు ఉన్న ప్రాంతంలోనే వేప, రాగి చెట్లు కూడా ఉన్నాయి. ఏమైనా దోషాలు ఉంటే నివారణ కోసం చెట్లకు పూజలు చేయడం సాధారణం. మరి కొందరు తమకు అంతా శుభం జరగాలనే ఇలాంటి చెట్లకు పూజలు నిర్వహిస్తారు. అదే కోణంలో శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టుతో పాటు రాగి, వేప చెట్లకు పూజలు చేయడాన్ని గ్రామస్తులు పట్టించుకోలేదు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూజలపై ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. మేడిచెట్టుపై మూడు పేర్లు శ్రీనివాస్‌రెడ్డి నిత్యం పూజచేసే మేడిచెట్టుపై మూడు పేర్లు చెక్కి ఉన్నాయి. అందులో ఒక పేరు మనీషాది కనిపిస్తోంది. మరో రెండు శ్రావణి, కల్పన పేర్లుగా భావిస్తున్నారు. రోజూ ఈ చెట్ల వద్దకు వచ్చే శ్రీనివాస్‌రెడ్డి నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను చెట్టు మొదట్లో పెట్టి పూజలు చేసేవాడని సమాచారం. హత్యలు వెలుగులోకి వచ్చినా పూజలు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టు, రాగి, వేప చెట్లకు చేస్తున్న పూజల వెనక బలమైన కారణం ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలలో మొదటగా వెలుగులోకి వచ్చిన శ్రావణి హత్య అనంతరం కూడా ఈ చెట్లకు పూజలు కొనసాగించాడని తెలిసింది. హాజీపూర్ గ్రామంతోపాటు మండల ప్రజలందరూ భువనగిరి జిల్లా ఆస్పత్రికి శ్రావణి మృతదేహంతో ధర్నాకు వెళ్తుంటే ఇతను మాత్రం ఈ మేడి, రాగి, వేప చెట్లకు పూజలు చేస్తూ గ్రామస్తుల కంట్లో పడ్డాడు. బాలికలపై దారుణాలకు ఒడికట్టింది శ్రీనివాస్‌రెడ్డేనని తెలియక ఈ అంశాన్ని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. మూడు హత్యలకు పాల్పడి.. ఎలాంటి బెరుకు లేకుండా చెట్లకు పూజలు చేయడమేంటని హాజీపూర్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం
-
చెట్లపై చిన్నారుల పేర్లు.. హాజీపూర్‌లో కలకలం
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రావణి, మనీషా, కల్పన అనే చిన్నారులను అత్యంత పాశవికంగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి హతమార్చాడు. ఈ సీరియల్ మర్డర్స్‌పై ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతుండగా.. మరోవైపు హాజీపూర్ గ్రామస్తులు ఆ కామాన్మాదిని ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తన పొలానికి తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం జరిపి.. హతమార్చిన శ్రీనివాస్‌రెడ్డి.. తన పొలంలోని పాడుబడ్డ బావిలో బాలికల మృతదేహాలను విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాజీపూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మేడిచెట్టుపై మనీషా అనే పేరును రాసి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. మేడిచెట్టుపై మృతురాలైన బాలిక పేరు ఉండటం హాజీపూర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ రావి, మేడి, వేపచెట్లు పక్కపక్కనే ఉండడంతో.. వాటికి శ్రీనివాస్‌రెడ్డి గతంలో పూజలు చేస్తూ ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల వరుస హత్యలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇక్కడ మేడిచెట్టుపై మనీషా అనే పేరు చెక్కి ఉన్న విషయాన్ని తాజాగా గుర్తించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డే.. మేడిచెట్టుపై ఇలా చెక్కి ఉండాటని, బాలికలను హతమార్చిన తర్వాత వారి పేర్లను అతను చెట్ల మీద చెక్కుతున్నట్టు కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం -
హాజీపూర్ సైకో కిల్లర్ మరో వారం కస్టడీ కొరుతూ పిటిషన్
-
హాజీపూర్ గ్రామస్తుల దీక్ష భగ్నం