
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని తొగుట మండలం మల్లన్న సాగర్ భూబాధితులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణంకు ఎన్జీటి అనుమతులు లేకుండా అక్రమంగా కాలువ నిర్మించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు కేవలం లక్షా యాభై వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధర్యంలో ధర్నా చేపట్టారు. దీనిని పోలీసులు భగ్నం చేయడంతో ధర్నా ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు తుక్కాపూర్ గ్రామస్తులను కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని బేగంపేట పోలీస్ స్టేషస్‌కు తరలించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment