మొయినాబాద్‌ పీఎస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ.. | BRS MLA pochampally srinivas reddy Attends Police Investigation | Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌస్‌లో కోడి పందెం కేసు.. విచారణకు హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ..

Published Fri, Mar 14 2025 12:26 PM | Last Updated on Fri, Mar 14 2025 1:35 PM

BRS MLA pochampally srinivas reddy Attends Police Investigation

సాక్షి, రంగారెడ్డి: ఫామ్‌హౌస్‌లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోచంపల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఫామ్‌ హౌస్‌ లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. 

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్‌ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్‌-3 అండ్‌ గేమింగ్‌ యాక్ట్‌, సెక్షన్‌-11 యానిమల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్‌ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్‌ తనదేనని.. రమేష్‌ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి..  తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement