moinabad
-
త్వరలో తెలంగాణ పోలీస్ లో చేరనున్న ఈగిల్ స్క్వాడ్
-
బీజేపీ నేతల లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
-
అర్ధరాత్రి ముజ్రా పార్టీ
-
మొయినాబాద్‌లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది అబ్బాయిలతో పాటు నలుగురు అమ్మాయిలను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా అమ్మాయిలు, అబ్బాయిలను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలను, అబ్బాయిలను అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. -
గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్‌లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నోడే వేధించాడు!
మొయినాబాద్: ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే అదనపు కట్నం కోసం వేధించడంతో ఇంట్లోనే ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌కు చెందిన నర్లకంటి మల్లేశ్ కూతురు కల్పన(22) బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది.నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వారి బంధువు బైరంపల్లి శ్రీశైలం కొంత కాలంగా కల్పనను ప్రేమించాడు. గత ఏడాది అక్టోబర్ 29న ఇద్దరూ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఒప్పందంతో ఈ ఏడాది ఫిబ్రవరి 11న హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పెళ్లి చేశారు. అప్పటి నుంచి శ్రీశైలం కుటుంబం మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటోంది.కాగా కల్పన ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన శ్రీశైలం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు అదనపు కట్నంగా స్విఫ్ట్ కారు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. అతనికి తల్లి స్వరూప, బాబాయి రాజు సైతం సహకరించి కల్పనను వేధించారు. వారి వేధింపులు భరించలేక శనివారం రాత్రి ఆమె ఇంట్లోనే చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొయినాబాద్ యువతి కేసులో ట్విస్ట్.. ఎస్సై సస్పెండ్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లో యువతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. బాకరం గ్రామ పరిధిలో సోమవారం మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతి చెందిన యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్గా (22) గుర్తించారు. డిప్రెషన్, స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. జనవరి 8వ తేదీని ఇంటి నుంచి ఆటోలో సంఘటన స్థలానికి వచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తానంత తానుగా పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో గొడవపడి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేదని.. అందుకే ఈసారి కూడా అలాగే వస్తుందని భావించి పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తలిదండ్రులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపే అవకాశం ఉంది. వెలుగులోకి కొత్త విషయాలు పోలీసుల విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన తరువాత సీసీ కెమెరాల పరిశీలించిన పోలీసులకు.. ఒక ఆటో అక్కడి పరిసరాలలో అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దీంతో పోలీసులు ఆటో నడిపిన వ్యక్తిని గుర్తించి విచారించారు. వెయ్యి రూపాయలు ఇచ్చి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ దగ్గర దింపమని యువతి కోరిందని.. తాను అలాగే అక్కడ దించేసి వెళ్లినట్లు ఆటో డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. తరువాత ఎం జరిగిందో తెలియదని అన్నాడు. అయితే యువతి ఆత్మహత్యకు ఒక రోజు ముందే 5 లీటర్ల పెట్రోల్ తీసుకొని ఫ్రెండ్ ఇంట్లో పెట్టినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు ఉదయం తన వెంట తెచ్చుకోని బలవన్మరణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. మొయినాబాద్తోపాటు చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులతో కలిసి లో బృందాలుగా విడిపోయి ఈ కేసును ఛేదించాయి. పోలీసుల నిర్లక్ష్యం.. సీపీ ఆగ్రహం ఈ కేసులో హబీబ్ నగర్లో పోలీసుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న తైసీల్ కనిపించకుండా పోగా.. పదో తేదీనా యువతి సోదరుడు హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో హైదరాబాద్ సీపీ స్వయంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. కేసుపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హబీబ్ నగర్ పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పారు. హబీబ్ నగర్ ఎస్సై సస్పెండ్ మొయినాబాద్ యువతి మృతి ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య సీరియస్ అయ్యారు. ఘటనలో మిస్సింగ్ కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబుకు మోమో జారీ చేసినట్లు తెలిపారు. -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మొయినాబాద్ యువతి హత్య కేసు
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ యువతి హత్య కేసులో సస్పెన్స్ వీడటం లేదు. నాలుగు రోజులుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు జాగ్రత్తపడటంతో కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు .హత్య చేసి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. చనిపోయిన యువతి ఎవరు, ఎందుకు చంపారు, అసలు చంపిదెవరు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసలేం జరిగిందంటే..మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌కు వెళ్ళే మార్గంలో సోమవారం పట్టపగలే యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టారు.మంటల్లో కాలిపోతున్న గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి మృతదేహాం కాలుతూనే ఉండడంతో రైతుల సాయంతో మంటలు ఆర్పారు. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో సగం కాలిపోయిన సెల్ ఫోన్ లభించగా.. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలి వయసు 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఏడు బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నా.. వివరాలు తెలియరావడం లేదు. బాధితురాలి ఫోన్ లభించినా.. అందులో సిమ్‌కార్డు తొలగించడం, మొయినాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ ఫిర్యాదు అందకపోవడంతో కేసును ఛేదించడం కష్టతరంగా మారుతోంది. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆధారాలు లేకపోవడంతోనే దర్యాప్తులో ఆలస్యం అవుతుందని ఇటు పోలీసులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ జల్లెడపడుతోంది. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబుకు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది.ఒక దారిలో వచ్చి మరో దారిలో నిందితుల పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం చెందుతున్నారు. -
Hyd: చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ రోటరీ క్లబ్ గొప్ప కార్యం తలపెట్టింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో గోల్ఫ్‌కోర్స్ ట్రాక్ ఏర్పాటుకు వినియోగించనుంది. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని సత్య సాయి ఆస్పత్రిలో ఈ మేరకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నిర్మాణానికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. కాగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఆటోక్రాష్ చాంపియన్‌షిప్‌లో టాప్ రేసర్లు పాల్గొననున్నారు. జూన్ 2-4 వరకు ఈ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చి రేసింగ్ ఈవెంట్‌ను ఆస్వాదించాలని కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
Police Dogs: బాంబులను పసిగట్టి.. నేరగాళ్ల పనిపట్టి...
సాక్షి, హైదరాబాద్: పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, నేరగాళ్ల జాడలను చిటికెలో పట్టేస్తాయి... కదులుతున్న వాహనాల్లోంచి సైతం దూకి ‘టార్గెట్’ను అడ్డుకుంటాయి... శిక్షకుడి కమాండ్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోవడంతోపాటు తూ.చ. తప్పకుండా పాటిస్తాయి... ఎన్నిసార్లు మొరగమంటే అన్నిసార్లే మొరుగుతాయి... ఇదీ మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైౖ నింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణ పొందిన పోలీసు జాగిలాల సామర్థ్యం. ఎనిమిది నెలల సుదీర్ఘ శిక్షణ అనంతరం ఐదు జాతులకు చెందిన 48 జాగిలాలు, 64 మంది శిక్షకుల 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ తాజాగా ఐఐటీఏలో జరిగింది. వీటిలో 36 జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందినవి కాగా మిగిలిన 12 అరుణాచల్ప్రదేశ్వి. ఈ నేపథ్యంలో పోలీసు జాగిలాలపై ప్రత్యేక కథనం. సగం సమయం మచ్చిక కోసమే... ప్రతి పోలీసు జాగిలానికీ ఇద్దరు వరకు హ్యాండ్లర్స్ ఉంటారు. జాగిలాన్ని ఎంపిక చేసుకున్నప్పుడే వీరినీ ఎంపిక చేస్తారు. జాగిలంతో కలిపే వీరికి సైతం శిక్షణ ఉంటుంది. మొత్తం 8 నెలల శిక్షణా కాలంలో 2 నెలలు హ్యాండ్లర్కు జాగిలానికీ మధ్య సఖ్యత కలి్పంచడానికి, మరో 2 నెలలు జాగిలాన్ని హ్యాండ్లర్ మచి్చక చేసుకోవడానికి కేటాయిస్తారు. మిగిలిన నాలుగు నెలల్లోనే వివిధ రకాల శిక్షణ ఇస్తారు. శిక్షణలో 4 రకాలు.. లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మలినాయిస్, బీగల్, గోల్డెన్ రిట్రీవర్, డాబర్‌మ్యాన్, కోకోర్ స్పానియల్ జాతి శునకాల్లోని సహజ లక్షణాలు, పనితీరు, సమకాలీన అవసరాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు విభాగాల్లో శిక్షణ ఇస్తుంటారు. ఒక రకమైన సేవలకు తర్ఫీదు పొందిన జాగిలం మరో పనికి ఉపకరించదు. పేలుడు పదార్థాలు/అనుమానిత వస్తువుల గుర్తింపు, నేర పరిశోధన, మాదకద్రవ్యాల గుర్తింపు, ముష్కరులపై దాడి చేసే సామర్థ్యంలో 4 నెలలపాటు శిక్షణ 48 జాగిలాలకు సాగింది. జాతీయ భాషలోనే కమాండ్స్... జాగిలాలకు ఇచ్చే కమాండ్స్‌లో 95 శాతం హిందీలోనే ఉంటాయి. కేవలం రెండు మాత్రం ఆంగ్లంలో ఉంటాయి. ఎదుటి వారికి నమస్కరించడానికి ‘సెల్యూట్’, పడుకొని గుండ్రంగా దొర్లడానికి ‘రోల్’పదాలు వినియోగిస్తారు. వీటితోపాటు అరుదుగా మాత్రమే సిట్, కమ్, స్టాండ్ వంటి ఆంగ్ల పదాలు వాడుతున్నారు. మరికొన్ని ప్రత్యేకతలు... ► ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారాన్ని సైతం ఎవరు పడితే వాళ్లు పెడితే ముట్టవు. కేవలం హ్యాండ్లర్ లేదా మాస్టర్ ఇస్తేనే స్వీకరిస్తాయి. విషప్రయోగాలకు ఆస్కారం లేకుండా ఈ శిక్షణ ఇస్తారు. ► చైనా, పాకిస్తాన్ తదితర దేశాల పటాల మధ్య ఉన్న ఇండియా మ్యాప్‌ను స్పష్టంగా గుర్తించడంతోపాటు రెండు కాళ్లు పైకెత్తి నమస్కరిస్తాయి. వాటి జ్ఞాపక, సంగ్రహణ శక్తులకు ఉదాహరణ ఇది. ► పాకిస్తాన్ లోని అబోటాబాద్‌లో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనడంలో అమెరికా నేవీ సీల్స్కు దోహదపడ్డ బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగంలోనూ ఉన్నాయి. 2015 నుంచి అందుబాటులోకి వచి్చన వీటిని మాదకద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ ఇచ్చి, వినియోగిస్తున్నారు. ► మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు బీగల్ జాతి జాగిలాలను అందుబాటులోకి తీసుకువచి్చన తొలి పోలీసు విభాగంగా తెలంగాణ రికార్డులకెక్కింది. ► ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా విభాగమైన ఆక్టోపస్‌లో 2015 నుంచి బెల్జియం మలినాయిస్ జాగిలాలను వాడుతున్నారు. ఈ జాగిలాలకు పెట్టే పేర్లు, హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలు (కమాండ్స్/కాషన్స్) గరిష్టంగా మూడు అక్షరాలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో అత్యధికం రెండు అక్షరాలతో కూడినవే ఉంటాయి. జాగిలం గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు, తక్కువ సమయంలో ఆదేశం పూర్తి చేయడానికి ఈ ప్రమాణాలను నిర్దేశించుకున్నారు. చదవండి: మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్..పట్టాలకు లూబ్రికేషన్! -
ఫామ్‌హౌజ్ కేసు.. బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై కర్ణాటక నేత, బీజేపీ సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నగరంలో జరిగిన బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి, విస్తారక్, పాలక్, కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఆరోపణలు చేసిన వాళ్లు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదు. నేనంటే ఎవరికీ తెలియదు. కానీ, తెలంగాణలో ప్రతీ ఇంటికి నా పేరు తీసుకెళ్లారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు దేశమంతా డబ్బులు పంపుతున్నారంటూ విమర్శించారాయన. -
ఫౌంహౌస్ కేసులో రామచంద్రభారతి, నందు విడుదలకు లైన్ క్లియర్
-
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వస్తున్న అనుమానితులను 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు అనుమతి, సహేతుక కారణం లేకుండా విచారణకు గైర్హాజరైతే అరెస్టు చేసేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ మెయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఫోన్ సంభాషణలు రికార్డయ్యాయి. రామచంద్రభారతి తన ఫోన్లో జగ్గు స్వామికి ‘విటమిన్ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ లకు 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులు ప్రకారం వీరంతా సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... వైద్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నానని మణిలాల్ సిట్ అనుమతి కోరగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు సిట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. దీంతో తీవ్రంగా పరిగణించిన సిట్ బృందం వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుందని భావించిన జగ్గు పీఏలు శరత్, ప్రశాంత్, విమల్ కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు సమాచారాన్ని అక్కడి న్యాయాధికారి సిట్ విచార ణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌కు సమాచారం అందించారు. దీంతో తదుపరి కార్యాచరణపై సిట్ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది. చదవండి: Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? -
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ). పిటిషనర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఇలాంటి అంశాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందు ప్రస్తావించారు ఏఏజీ. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని, బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తామని బెదిరించారని తెలిపారు ఏఏజీ. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న వాదనలను తోసిపుచ్చారు. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం సారికాదన్నారు. మరోవైపు.. బీజేపీ తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో చేసిందని ఆరోపించారు బీజేపీ న్యాయవాది. పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని కోరారు. ఇదీ చదవండి: సెంటిమెంట్లకు చోటు లేదు.. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిర్దోషులుగా ఉరిశిక్ష ఖైదీలు -
ఫామ్ హౌస్ లీక్స్..
-
ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాల కూల్చివేత చిన్న విషయం కాదు : కేసీఆర్
-
గన్ షాట్ : అమ్ముడు ..కొనుడు ..ఇదేనా నయా రాజకీయం..?
-
ఎడిటర్ కామెంట్ : ఫామ్ హౌస్ వ్యవహారం పై ఆశ్చర్యపోని ప్రజలు ..!
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకో ట్విస్ట్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భిన్నమైన తీర్పులు
-
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. 24 గంటల్లోగా నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే.. ఆ వెంటనే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన మరో బెంచ్.. దర్యాప్తుపై స్టే విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. చదవండి: (దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక) -
ఫార్మ్ హౌస్ హైడ్రామాపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
-
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీకి రఘునందన్‌రావు ఫిర్యాదు
-
సైబరాబాద్ పోలీసుల పిటిషన్ పై హైకోర్టు లో విచారణ
-
ఈడీ ఆఫీస్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: అధికార పక్ష టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. కౌంటర్ యాక్షన్‌లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా.. మరోవైపు యాదాద్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేవుడిపై ప్రమాణంతో ఈ వ్యవహారంతో తమకేం(బీజేపీ) సంబంధం లేదని చాటిచెప్పే యత్నం చేశారు. ఇక ఇప్పుడు.. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన ‘ఎమ్మెల్యే కొనుగోలు అంశం’పై ఫిర్యాదు కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ హార్స్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన ఈడీని కోరినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన రూ.100 కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని ఆయన ఈడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: దేవుడి మీద ఒట్టు.. నాకేం తెలియదు!