మందిర నిర్మాణానికి మహమ్మద్‌ విరాళం  | Muslim Man Donates Rs 5000 For Ram Mandir Construction Moinabad | Sakshi
Sakshi News home page

మందిర నిర్మాణానికి మహమ్మద్‌ విరాళం 

Published Tue, Jan 26 2021 8:34 AM | Last Updated on Tue, Jan 26 2021 3:45 PM

Muslim Man Donates Rs 5000 For Ram Mandir Construction Moinabad - Sakshi

మొయినాబాద్‌ (చేవెళ్ల): అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఓ ముస్లిం యువకుడు విరాళం అందజేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని ముర్తుజగూడలో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్‌ ఖలీమ్‌ అనే యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.5 వేలు విరాళం అందజేశాడు. దీనిపై బీజేపీ మండలాధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ విరాళాల సేకరణలో కులమతాలకు అతీతంగా స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.(చదవండి: రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్‌)

ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ విరాళాలను సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్యుల మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు సహా ఇతర రంగాల సెలబ్రిటీలు మందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement