సాక్షి, హైదరాబాద్: అధికార పక్ష టీఆర్‌ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. కౌంటర్ యాక్షన్‌లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా.. మరోవైపు యాదాద్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేవుడిపై ప్రమాణంతో ఈ వ్యవహారంతో తమకేం(బీజేపీ) సంబంధం లేదని చాటిచెప్పే యత్నం చేశారు. ఇక ఇప్పుడు..
బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన ‘ఎమ్మెల్యే కొనుగోలు అంశం’పై ఫిర్యాదు కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ హార్స్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన ఈడీని కోరినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన రూ.100 కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని ఆయన ఈడీకి కోరనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: దేవుడి మీద ఒట్టు.. నాకేం తెలియదు!
Comments
Please login to add a commentAdd a comment