మొయినాబాద్ రూరల్: మండలంలోని రైతులు తమకున్న చిన్న కమతాల్లో ఆకుకూరల పంట ల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వర్షాభా వ పరిస్థితుల కారణంగా బోరుబావుల్లో ఆశించినంత నీరు లేకపోవడంతో వచ్చే కొద్దిపాటి నీటితో ఆయా పంటలు పండించుకుంటున్నారు. దీనికితోడు ఆకుకూర పంటలు వేసుకునేందుకు పెట్టుబడి వ్యయం కూడా తక్కువ అవుతుంది. మార్కెట్లో ఆకుకూరలకు ఎప్పుడూ ధర అధికంగా ఉండటంతో రైతులు అధిక లాభాలు ఆర్జించేందుకు వీలు కలుగుతోంది.
దీంతో మండల పరిధిలోని హిమాయత్‌నరగ్, అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం, అమ్డాపూర్, ఖాసింబౌలి, శ్రీరాంనగర్, సురంగల్, తోల్కట్ట, తదితర గ్రామాల రైతులు ఆకుకూర పంటలపై దృష్టి పెట్టారు. పాలకూర, తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వంటి పంటలు గ్రామాల్లో ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి.. పెట్టుబడి తక్కువ, కూలీల అవసరం అంతగా లేకపోవడంతో ఆదాయం బాగానే వస్తుందంటున్నారు ఇక్కడి రైతులు. పంట దిగుబడులను రైతులే నేరుగా మెహిదీపట్నం రైతుబజార్, గుడ్డిమల్కాపూర్ సబ్జిమండీ, శంషాబాద్ రైతు బజార్‌లకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు.
చిన్న కమతాల్లో ఆకుకూరల సాగు
Published Sun, Sep 21 2014 11:45 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement