‘లారీ’ వృక్షం
భారీ వృక్షాలను లారీపై తరలించిన దృశ్యం స్థానికులను అబ్బురపరిచింది. గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ సమీపంలోంచి లారీపై వీటిని తీసుకెళ్లారు. శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూర్ నుంచి శేరిలింగంపల్లి తెల్లాపూర్‌లోని ఓ ఫాంహౌస్‌కు తరలి స్తున్నట్లు వాహనదారులు తెలి పారు. ప్రొద్దటూర్ వద్ద రోడ్డు వెడల్పులో భారీ వృక్షాలు నేల కూల్చకుండా.. వాటిని రసాయనాలతో బతికించి ఇలా తరలిస్తున్నారు.
- మొయినాబాద్ రూరల్