
తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.