collision
-
కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురి మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
Rajasthan: రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
సిరోహి: రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జీపు రాంగ్ డైరెక్షన్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీపు ప్రయాణికులతో నిండివుంది.జీపులో ప్రయాణిస్తున్నవారంతా పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించి, ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కంటల్ సమీపంలోకి రాగానే ఆ జీపు ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతిచెందారని పిండ్వారా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి హమీర్ సింగ్ తెలిపారు. మృతులు, గాయపడినవారు ఉదయపూర్ జిల్లాలోని గోగుండా, ఝడోల్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి -
‘అదే జరిగితే మానవజాతి అంతం!’
న్యూఢిల్లీ: గ్రహశకలం. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కల్గించే ఆస్టరాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. 370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్టరాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి. భారత్ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్ చెప్పారు. రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడు ప్రపంచదేశాలు కీర్తించాయి. -
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జవానులు దుర్మరణం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవానులు మృతి చెందగా, ఆర్మీకి చెందిన ఆరుగురితోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.నాగ్‌పూర్‌లోని కన్హాన్ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఆటో, బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఇద్దరు జవానులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు సైనికులతో పాటు ఆటో డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా తొమ్మది మంది ఉన్నారు. ఈ ఆర్మీ సిబ్బంది కమతిలోని గార్డ్ రెజిమెంట్ సెంటర్‌కు చెందినవారు. ఈ ప్రమాదంపై న్యూ కమతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి!
బీహార్‌లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్‌కలి సమీపంలో వేగంగా వస్తున్న వస్తున్న ఒక కారు..బైక్‌ను ఢీకొని, మరో లేన్‌లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల్లో గాయకుడు ఛోటూ పాండే కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ మాట్టాడుతూ స్కార్పియో వాహనం ససారం నుంచి వారణాసి వైపు వెళుతున్నదని, ఆ వాహనంలో ఎనిమిదిమంది ఉన్నారని తెలిపారు. మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్ 2లోని దేవ్‌కలి సమీపంలో, ఆ కారు ఒక బైక్‌ను ఢీకొని, డివైడర్‌ను దాటి.. మరో లేన్‌లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నదని తెలిపారు. -
అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి
సాక్షి, అనంతపురం జిల్లా: గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వోల్వో బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది. మృతులను గుత్తి మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సూర్యోదయాన్ని చూసి వస్తుండగా.. -
పదేళ్లయినా విస్తరించని కవచ్!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్... వేగవంతమైన, ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన రైలు. కానీ వేగంగా, విలాసవంతంగా ప్రయాణించడం కంటే రైళ్లు భద్రంగా గమ్యస్థానం చేరడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని విస్మరించిన రైల్వే శాఖ... రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ వ్యవస్థను విస్తరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై ఏకంగా 296 మంది ప్రయాణికులు దుర్మరణం పాలై నాలుగున్నర నెలలు దాటినా నేటికీ కవచ్ వ్యవస్థను కొత్తగా ఒక్క కిలోమీటర్ మేర కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ వ్యవస్థను విస్తరించి ఉంటే తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన తప్పి ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో కేవలం 5 డీజిల్ లోకొమోటివ్‌లలో దీన్ని ఏర్పాటు చేయడం తప్ప ఎలాంటి పురోగతీ లేదు. ఏటా 5 వేల కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇటీవల 3 వేల కి.మీ. మేర దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ పనుల్లో వేగం లేదు. టీకాస్ నుంచి కవచ్‌గా రూపాంతరం... రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్‌డెన్స్ సిస్టం (టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్‌నగర్ సెక్షన్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. 260 కి.మీ. నిడివిలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించింది. ఆరేళ్ల క్రితం దాని పేరును కవచ్‌గా మార్చింది. 2022 నాటికి కవచ్ ఎక్కడెక్కడంటే.. నాందేడ్–నిజామాబాద్–సికింద్రాబాద్–కర్నూలు–గుంతకల్ మార్గంలో 960 కి.మీ. పర్బణి–పర్లివైజ్నాథ్–లాతూర్–వికారాబాద్ మార్గంలో 31 కి.మీ. వాడి–వికారాబాద్–సనత్‌నగర్ మార్గంలో 174 కి.మీ. ఇవి తప్ప, దేశంలోని మిగతా ప్రాంతాల్లో వీటి ఏర్పాటు జరగలేదు. కవచ్ పనితీరు ఇలా... ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వే స్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కి.మీ.కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేస్లతో అనుసంధానిస్తారు. దీంతో ఎప్పటికప్పుడు ఇవి రైళ్లను నియంత్రిస్తుంటాయి. లోకో పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినా తనంతట తనుగా బ్రేక్‌లు వేసుకోవటం, హారన్ మోగించటం లాంటివి కవచ్ చేయగలదు. పొరపాటున ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే.. కనీసం 100 మీటర్ల దూరంలోనే అవి ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి. వందేభారత్‌లకూ పొంచి ఉన్న ప్రమాదం.. గంటకు 160 కి.మీ.వేగంతో (నిర్ధారిత పరిధి) దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లలోనూ కవచ్ వ్యవస్థ లేదు. అవి పరుగుపెట్టే ట్రాక్ మొత్తం కవచ్ వ్యవస్థ ఏర్పాటైతేనే పనిచేసే పరిస్థితి ఉన్నందున వందేభారత్ రైళ్లు కూడా ఎదురెదురుగా ఇతర రైళ్లను ఢీకొనే ప్రమాదపు అంచులో ఉన్నట్టే. వందేభారత్ ఎక్స్‌ప్రెస్..పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2016 చివర్లో తయారీపై మొదలైన ప్రయోగాలు 2018 నాటికి పూర్తి. అందుకే దీన్ని తొలుత ‘ట్రైన్–18’గా పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ–వారణాసి మధ్య తొలి రైలు పరుగు ప్రారంభించింది. ఆలోచన నుంచి పట్టాలెక్కడం వరకు పట్టిన సమయం కేవలం రెండున్నరేళ్లు. ఖర్చు: ఒక్కో రైలు తయారీకి అవుతున్న వ్యయం దాదాపు రూ. 100 కోట్లు. కవచ్ ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా నిరోధించేందుకు అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా రూపొందించిన వ్యవస్థ. పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2013లో ప్రయోగాలు మొదలు. అవి విజయవంతం కావడంతో ఆ వ్యవస్థను వినియోగించేందుకు 2021లో అనుమతి. ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్వర్క్ 1.29 లక్షల కి.మీ. మేర విస్తరించి ఉంది. కానీ కవచ్‌కు అంకురార్పణ జరిగి దశాబ్దం దాటుతున్నా ఇప్పటివరకు ఏర్పాటైంది కేవలం 1,425 కి.మీ. నిడివిలోనే.ఖర్చు: కిలోమీటర్‌కు రూ.50 లక్షలు. -
బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న బాలుడిని బీచ్‌లో ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్ రక్షించాడు. ఆదివారం ఓ కుటుంబం బాలుడితోపాటు ఆర్కే బీచ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యులంతా ఫొటోలు తీసుకోవటంలో బిజీగా ఉండటంతో బాలుడు తీరంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా పెద్దగా వచ్చిన కెరటం బాలుడిని లోపలకు లాక్కుపోయింది. అక్కడ ఉన్న బీచ్ ఫొటోగ్రాఫర్ భాస్కరరెడ్డి వెంటనే స్పందించి బాలుడిని రక్షించాడు. ఓ చేత్తో ఖరీదైన కెమెరాను మరో చేతితో బాలుడిని రక్షించాడు. బాలుడిని వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించగా.. భాస్కరరెడ్డిని బాలుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
అన్నమయ్య: పట్టణ పరిధిలోని చిట్వేలి బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్‌కిరణ్(15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మండలంలోని ఎస్.కొత్తపల్లికి చెందిన రోజువారీ కూలీలైన తిరుమలేశు, రాజేశ్వరిలకు ముగ్గురు కుమారులు. తల్లిదండ్రులు తమ ముగ్గురు బిడ్డల్ని పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. పెద్ద కొడుకు ఉదయ్‌కిరణ్ పదో తరగతి చదవుతున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు చిట్వేలి బైపాస్ రోడ్డు దాటుతుండగా రాజంపేట నుంచి రేణిగుంటవైపు వెళ్తున్న లాజిస్టిక్ లారీ ఢీకొంది. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే..
జైపూర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన వందే భారత్ రైలు ప్రారంభం నుంచే పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలు రైళ్లపై రాళ్లతో దాడి చేయగా.. మరికొన్ని చోట్ల ప్యాసింజర్లు చెత్తా చెదారం పడేసిన వార్తలొచ్చాయి. మరికొన్ని చోట్ల సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో పశువులు రైళ్లకు అడ్డుగా వచ్చి మృత్యువాత పడ్డాయి. తాజాగా రాజస్తాన్‌లో ఓ ఆవు వందే భారత్‌కు అడ్డుగా వచ్చి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మరో విషాదం ఏంటంటే.. ఆవు శరీర భాగాలు బలంగా ఢీకొట్టడంతో ఆ సమీపంలో మూత్రవిసర్జన చేస్తున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్వార్‌లోని అరవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న వందే భారత్ రైలు ఆవును ఢీకొనడంతో, దాని శరీర భాగాలు ఛిద్రమై 30 మీటర్ల దూరంలో మూత్రవిసర్జన చేస్తున్న శివదయాల్ శర్మపైపడి అతను అక్కడికక్కడే మృతి చెందడం కలచివేసింది. చదవండి: కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..! రైలును ఢీకొనడంతో.. ఆవు శరీర భాగం దూరంలో ఉన్న శివదయాల్‌పై పడటంతో అతను అక్కడికక్కడే మరణించాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు భారతీయ రైల్వేలో 23 ఏళ్లు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడని పోలీసులు తెలిపారు. శివదయాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఇదిలా ఉండగా సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లు ఆవులు, గేదెలను ఢీకొన్న సంఘటనలు ఎక్కువ శాతం ముంబాయి-గుజరాత్ రైల్వే లైన్లో జరిగినట్టుగా ఓ నివేదిక పేర్కొంది. చదవండి: ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ -
ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
ట్రాక్టర్ టెంపో ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల తోసహా నలుగురు మృతి. ఈ ఘటన రాజస్తాన్‌లో అల్వార్‌లోని కథూమర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి అక్రమ తవ్వకాలతో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరే కారణమంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు రహదారులను దిగ్బంధించి..సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా గ్రామస్తులు రాళ్లు రువ్వారు. ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. చివరికి పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. తదనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: గుడ్‌న్యూస్.. ప్యాసింజర్ రైళ్లు, నల్లగొండలో వందేభారత్‌కు హాల్ట్!) -
హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్..
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఎస్కార్ట్ వాహనం బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హాసన్ జిల్లా అర్సికెరెలోని గండాసి గ్రామంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి చామరాజనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కేత్రమైన మలే మహాదేశ్వర బెట్ట నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఐతే ప్రమాదం జరిగిన తర్వాత జ్ఞానేంద్ర అతని కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఐతే వ్యక్తిని ఢీకొట్టిన ఎస్కార్ట్ వాహనం ప్రధాన కాన్వాయ్‌లో భాగం కాదని, వారి వాహానాల వెనుకే ప్రయాణించిందని కర్ణాటక హోంమంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..) -
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తిరుపతికి వెళ్లి ప్రొద్దుటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని అనూష (35), ఓబుళమ్మ (50), రామలక్ష్మి (55) గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటర్‌పై వెళుతున్న అమ్మమ్మ, మనవరాలు మృతిచెందిన ఘటన తేనిలో జరిగింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాలు.. తేని జిల్లా వరుసనాడు సమీపంలోని మురుకోడై గ్రామానికి చెందిన అమావాసై, భార్య రాణి (44) కేరళ మున్నార్ సమీపంలోని బూపరాయ్ ప్రాంతంలో ఉంటూ తోట పని చేసేవారు. వీరి కుమారుడు సత్యరాజ్, కుమార్తె యోగాన కుటుంబం కూడా బూపరాయ్ ప్రాంతంలోనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం రాణి, ఆమె కుమారుడు కుమార్తె కుటుంబంతో కలిసి స్వగ్రామమైన తేని జిల్లా మురుకోడై వచ్చారు. మంగళవారం మోటారు సైకిల్, స్కూటర్‌పై బూపరాయ్ బయలుదేరారు. మోటారు సైకిల్‌ను రాణి అల్లుడు జయప్రకాష్ నడుపుతున్నాడు. అక్కడ అతని భార్య, కూతురు రుద్రశ్రీ (04), బంధువు జగతీశ్వరన్ (15) ఉన్నారు. స్కూటర్లో రాణి, ఆమె కోడలు వానతి (25), వానతి కుమారుడు ఉద్గేశ్వరన్ (07)లు వున్నారు. వానతి స్కూటర్ నడిపింది. తేని బోడి రోడ్డులోని తీర్థతొట్టి సమీపంలోని ఓ దుకాణం వద్ద ఆపి టీ తాగారు. తరువాత రుద్రశ్రీ అమ్మమ్మతో కలిసి స్కూటర్‌పై వెళ్లింది. తొప్పుపట్టి సమీపంలో రోడ్డు మలుపు వద్ద పెరియకుళం నుంచి వచ్చిన ప్రభుత్వ బస్సు వెనుక నుంచి ఢీకొంది. బస్సు చక్రం ఎక్కిదిగడంతో రాణి, రుద్రశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. 108లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పళని శెట్టిపట్టి పోలీసులు తామరైకులంకు చెందిన బస్సు డ్రైవర్ అయ్యన్న స్వామి (52)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ఒక గోల్ ఆటగాడి రక్తం కళ్ల చూసింది. ఈ ఘటన వార్సాలో జరుగుతున్న చాంపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా గ్రూఫ్-ఎఫ్‌లో రియల్ మాడ్రిడ్, షాఖ్తర్ దొనేత్సక్ల మధ్య బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి షాఖ్తర్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇవ్వడంతో రియల్ మాడ్రిడ్ గోల్ కొట్టడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆట 95వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ ఢిఫెండర్ ఆంటోనియో రూడిగర్ హెడర్ గోల్ చేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. బంతిని తలతో బలంగా కొట్టే క్రమంలో రూడిగర్ పైకి ఎగరగా.. అదే సమయంలో షాఖ్తర్ గోల్ కీపర్ అనటోలీ ట్రూబిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రూబిన్ తలభాగం రూడిగర్ నుదుటన గట్టిగా గుద్దుకుంది. అయితే అప్పటికే బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోవడంతో రియాల్ మాడ్రిడ్- షాఖ్తర్ దొనేత్సక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాము క్వార్టర్ ఫైనల్ చేరామన్న సంతోషంతో రియల్ మాడ్రిడ్ సంబరంలో మునిగిపోగా.. జట్టు ఆటగాడు రూడిగర్ తల పగిలి రక్తం కారసాగింది. అటు పక్కన ట్రూబిన్ తలకి కూడా బలంగానే తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే ఇద్దరు కాసేపు పడుకున్నారు. ఆ తర్వాత రూడిగర్, ట్రూబిన్లను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా ట్రూబిన్ తల చుట్టూ బ్యాండేజీ వేయగా.. రూడిగర్ మొహానికి 20 కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rudiger scores the equalizer 🤍 He got into an accident with Shakhtar goalkeeper, hopefully both are well.pic.twitter.com/SkFpH0X1Lb — Omar Aref 🇦🇪 (@LosB1ancos_) October 11, 2022 చదవండి: కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. దూల తీరింది! 'బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు' -
ల్యాండింగ్ చేస్తూ ఢీ కొట్టిన రెండు విమానాలు
వాషింగ్టన్: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేసే సమయంలో రెండు మినీ విమానాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వాట్సోన్‌విల్లే నగరంలోని స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ‘వాట్సోన్‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో 2 విమానాలు ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఢీకొన్నాయి. ఈ సంఘటనపై పలు ఏజెన్సీలు సత్వరం స్పందించాయి. పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు మాకు సమాచారం ఉంది.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఫెడరల్ ఏవియేషన్ ప్రకారం.. ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానంలో ఇద్దరు, సింగిల్ ఇంజిన్ సెస్నా152 విమానంలో పైలట్ ఉన్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అనే విషయం తెలియరాలేదని పేర్కొంది ఎఫ్ఏఏ. Multiple agencies responded to Watsonville Municipal Airport after 2 planes attempting to land collided. We have reports of multiple fatalities. Report came in at 2:56pm. Investigation is underway, updates to follow. pic.twitter.com/pltHIAyw5p — City of Watsonville (@WatsonvilleCity) August 18, 2022 ఇదీ చదవండి: ఆకాశమే ఆమె హద్దు.. -
ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు
రోడ్డు ప్రమాదాలు కొన్ని అనుకోకుండానో లేక మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల జరిగే పలు ప్రమాదాలు గురించి విని ఉంటాం. కొంతమంది నిర్లక్ష్యపూరితంగా, భాధ్యత రహితంగా రద్దీగా ఉండే రోడ్డుపై అతి వేగంగా కారు నడిపి ఘోర రోడు ప్రమాదాలకు కారణమవుతుంటారు. వారి ప్రాణాలే కాకుండా పక్కవారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తారు. అలాంటి ఘోర రోడ్డు ప్రమాదం యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లో చోటు చేసుకంది. వివరాల్లోకెళ్తే....అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో హిల్స్ ఏరియాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మెర్సిడేస్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గర్భిణి మహిళ, ఆమె ఏడాది వయసున్న చిన్నారి తోపాటు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున్న మంటలు లేవడంతో రెండు కార్లు అక్కడికక్కడే అగ్నికి ఆహుతై పోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నికోల్ లింటన్ అనే 37 ఏళ్ల నర్సు మెర్సిడేస్ కారుని అతి వేగంగా డ్రైవ్ చేస్తూ రోడ్డు పై ఉన్న వాహనాలను ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేగిసాయని, దీంతో సంఘటన స్థలంలోని రెండు వాహానాలు ఆహుతైపోయాయని చెప్పారు. సదరు నర్సు నికోల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని వెల్లడించారు. మృతి చెందిన గర్భిణి చెకప్ నిమిత్తం తన భర్త, కొడుకుతో కలిసి ఆస్పత్రికి వెళ్తున్న తరుణంలో ఈ ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది TW: Surveillance video shows violent crash that left 5 dead, intersection of La Brea and Slauson, about an hour ago. pic.twitter.com/gIb1hRTiU9 — Ray 鄺羡華 (@raykwong) August 5, 2022 (చదవండి: పులినే రమ్మంటూ బస్ విండో తెరిచాడు... అంతే ఒక్క జంప్ చేసి...) -
ఒకరినొకరు భయంకరంగా గుద్దుకున్నారు..
పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ అందుకునే క్రమంలో ఆటగాళ్లు ఒకరినొకరు భయకరంగా గుద్దుకున్నప్పటికి తమ లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. పెషావర్ జాల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది. చేజింగ్‌కు దిగిన పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కమ్రాన్ అక్మల్ భారీ షాట్‌కు యత్నించాడు. అయితే బ్యాట్‌కు సరైన దిశలో తగలని బంతి ఫైన్‌లెగ్ దిశగా హైట్లోకి వెళ్లింది. చదవండి: 'అది నీ తప్పు కాదు'.. ఇషాన్ కిషన్‌తో మెసేజ్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఒకవైపు నుంచి.. షాహనావాజ్ దహాని మరో ఎండ్ నుంచి క్యాచ్ కోసం పరిగెత్తారు. ఇద్దరు ఎదురుఎదురుగా వచ్చి ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. అనవసరంగా క్యాచ్ మిస్ అయిందని మనం అనుకునేలోపే అద్భుతం జరిగింది. కిందపడుతూనే దహాని ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకేముందు సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మహ్మద్ రిజ్వాన్ వచ్చి సారీ చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ సుల్తాన్స్ 42 పరుగుల తేడాతో పెషావర్ జాల్మీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మసూద్ 68, రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 34 రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ జాల్మీ 19.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. షోయబ్ మాలిక్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డుతో మెరిశాడు 😄#HBLPSL7 l #LevelHai l #MSvPZ pic.twitter.com/3caWheCXaK — PakistanSuperLeague (@thePSLt20) February 10, 2022 -
నువ్వేం మనిషివి.. సిగ్గులేకుండా సంబురాలా?
నాటకీయ పరిణామాల నడుమ బ్రిటిష్ప్రి రేస్ నెగ్గిన ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ని ఢీ కొట్టాడని, అతను ఆస్పత్రి పాలైతే.. లూయిస్ గెలిచి సంబురాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని హామిల్టన్‌ను నిలదీస్తున్నారు. ఆదివారం బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు మెర్సెడెస్ రైడర్ లూయిస్ హామిల్టన్. అయితే తొలి ల్యాప్‌లోనే రెడ్‌బుల్ రైడర్ మాక్స్ వెర్స్టాపెన్ను ప్రమాదకరమైన మలుపుతో ఢీకొట్టడం, ఆపై వెర్స్టాపెన్ను ఆస్పత్రికి తరలించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో లూయిస్‌కు పది సెకండ్ల పెనాల్టీ విధించారు. అయినప్పటికీ లూయిస్ రేస్ నెగ్గి, సంబురాలు చేసుకున్నాడు. అయితే తాను ఆస్పత్రి పాలైన టైంలో వేడుకలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు వెర్స్టాపెన్. ‘లూయిస్ తీరు సరికాదు. అమానుషం. స్పోర్టివ్ స్ఫూర్తికి విరుద్ధం. ఆటగాళ్లు వ్యవహరించాల్సిన తీరు అది కానేకాద’ని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు సిగ్గులేకుండా క్రాష్‌కి పాల్పడి.. గెలుపు సంబురాలు చేసుకున్నాడని, అదసలు గెలుపే కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. What a crash! @SkySports @SkySportsF1 @SilverstoneUK @redbullracing @Max33Verstappen @F1 #f1 #BritishGrandPrix #maxverstappen #RedBullRacing #britishgp #formula1 pic.twitter.com/zpFHwUwiEG — Killian Connolly (@Kill_Connolly) July 18, 2021 మొత్తం లక్షా నలభై వేలమంది వ్యూయర్స్ మధ్య ఆదివారం బ్రిట్రిష్ గ్రాండ్‌ప్రి జరిగింది. అయితే పోల్ పొజిషన్‌తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్, లూయిస్ ఢీ కొట్టడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. ఆ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక 52 ల్యాప్‌ల రేసును 58 నిమిషాల 23.284 సెకన్లలో పూర్తి చేశాడు లూయిస్. తద్వారా బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది.. ఓవరాల్‌గా ఏనిమిదో సారి విజేతగా నిలిచాడు. Glad I’m ok. Very disappointed with being taken out like this. The penalty given does not help us and doesn’t do justice to the dangerous move Lewis made on track. Watching the celebrations while still in hospital is disrespectful and unsportsmanlike behavior but we move on pic.twitter.com/iCrgyYWYkm — Max Verstappen (@Max33Verstappen) July 18, 2021 జాతి వివక్ష మరోవైపు రెడ్‌బుల్ ఈ విజయాన్ని క్రూరత్వంగా వర్ణిస్తోంది. హామిల్టన్‌కు పెనాల్టీ సరిపోయే శిక్ష కాదని చెబుతోంది. ఇదిలా ఉంటే లూయిస్ హామిల్టన్‌పై సోషల్ మీడియాలో జాతి వివక్ష కామెంట్లు మొదలయ్యాయి. కోతి(మంకీ) ఎమోజీలను ఉంచుతున్నారు చాలామంది. మరోవైపు మెర్సడెస్ ఈ కామెంట్లను ఖండిస్తోంది. వర్ణ వివక్షకు తాము వ్యతిరేకమని, టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే మా పని అంటూ పేర్కొంది. -
ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్‌మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కారులో ఇరుక్కుపోయినవారిని బయటకు తీశారు. క్షతగాత్రులను తరలించారు. ట్రక్కు నాగాలాండ్‌కు చెందినది కాగా.. కారు జార్ఖండ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. -
నాలుగేళ్ళ బాలికపై దూసుకెళ్ళిన పోలీసు వాహనం
-
భారత ఉపఖండం వల్ల భూమిపై అనేక మార్పులు!
వాషింగ్టన్: భారత ఉపఖండం కారణంగా భూమిపై అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయన్న విషయం మీకు తెలుసా..? 5 కోట్ల ఏళ్ల క్రితం ఆసియా ఖండం, భారత ఉపఖండం విడివిడిగా ఉండేవని మీరు ఎప్పుడైనా చదివారా..? అప్పట్లో ఆసియా ఖండం, భారత ఉపఖండం మధ్యలో ఉండే టెథీస్ అనే పురాతన సముద్రం గురించి మీరు విన్నారా..? అయితే మీరు 5 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జరిగిన మార్పులు తెలుసుకోవాల్సిందే. సరిగ్గా 5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండం ఆసియా ఖండాన్ని ఢీకొట్టి.. ప్రస్తుత ఆసియా ఖండంలా ఏర్పడింది. ఈ ఘటన ద్వారానే ఖండాల స్థితిగతులు, ప్రపంచ వాతావరణంతోపాటు ఇంకా మరెన్నో మార్పులు భూమిపై చోటుచేసుకున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. అయితే తాజాగా దీని కారణంగానే ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగినట్లు కనుగొన్నారు. దీంతో భూమిపై జీవించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎమ్మా కాస్ట్ తెలిపారు. దీనికోసం 7 కోట్ల ఏళ్ల క్రితం నాటి అతిసూక్ష్మ సముద్రపు గవ్వలను ఉపయోగించి సముద్రాల్లోని నైట్రోజన్‌ను రికార్డు చేశారు. అప్పటి నైట్రోజన్ పరిస్థితులను పోల్చి చూశారు. అలాగే పురాతన సముద్రాల్లో ఉండే 15ఎన్ –14ఎన్ నైట్రోజన్ పరిస్థితులను పునర్ నిర్మించారు. అనంతరం అప్పటి ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులను గమనించారు. దీన్ని బట్టి అప్పట్లో 15ఎన్–14ఎన్ నైట్రోజన్ స్థాయిలు అత్యధికంగా ఉండేవని, దీంతో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను బట్టి భవిష్యత్తులో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఊహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
బొలొరో వాహనం బైక్ ఢీ
-
గగనంలో ఉత్కంఠ
ముంబై: ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్ఐఆర్)లో ఘోర ప్రమాదం తప్పింది. సమీపంగా వచ్చిన మూడు విమానాలు ఢీకొనకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ), ఇతర ఆటోమేటిక్ హెచ్చరికలు నిలువరించాయి. ఆ సమయంలో 3 విమానాల్లో కలపి వందలాది ప్రయాణికులు ఉన్నారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) విచారణ ప్రారంభించింది. డచ్ విమానం కేఎల్ఎమ్, తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్, అమెరికా విమానం నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎన్సీఆర్ 840 దాదాపు ఢీకొనేంత దగ్గరికొచ్చాయి. తొలుత ఎన్సీఆర్ 31 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. ఇవా విమానం ఎన్సీఆర్కు చేరువగా వచ్చింది. రెండు విమానాల్లో అంతర్గత హెచ్చరికలు జారీచేయడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కేఎల్ఎమ్ 33 వేల అడుగుల ఎత్తులో ఉంది. హెచ్చరికల నేపథ్యంలో ఎన్సీఆర్ 35 వేల అడుగుల ఎత్తుకు ఎగిరి చక్కర్లు కొట్టింది. తర్వాత ఎడమ వైపు తిరగాలని ఏటీసీ ఆదేశించింది. ఈ మధ్యలో ఇవా.. కేఎల్ఎం ఎగురుతున్న 33 వేల అడుగుల ఎత్తుకు చేరడంతో మరో హెచ్చరిక జారీ అయింది. దీంతో ఇవాను పైలట్లు కేఎల్ఎం నుంచి దూరంగా నడిపారు. అదే సమయంలో ఎన్సీఆర్ 33 వేల అడుగుల స్థాయికి దిగిరావడంతో ఇవాకు సమీపంగా వచ్చింది. దీంతో మరోసారి హెచ్చరిక పంపి ప్రమాదాన్ని తప్పించారు. -
తప్పిన భారీ విమాన ప్రమాదం
సాక్షి బెంగళూరు: బెంగళూరు గగనతలంలో భారీ విమాన ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో రెండు ఇండిగో ఏ–320 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు బెంగళూరు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లో కలిపి 330 మంది ప్రయాణికులున్నారు. ఈ నెల 10న కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 6ఈ–779 విమానం, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే 6ఈ–6505 విమానం బెంగళూరు నగర గగనతలంలో ఒకదాని కొకటి దగ్గరగా రావడాన్ని గుర్తించిన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అధికారులు రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై : తమిళనాడులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కృష్ణగిరి సమీపంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి
సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ మండలకేంద్రంలోని స్వప్నా కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముత్తునూరి కొమరయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్వస్థలం పచ్చునూరు మండలం మానకొండూరు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రంగారెడ్డి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని యాచారం మండలం చౌదరిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. లారీ వెనుక ఉన్న గ్జైలో కారు డ్రైవర్ ఇది గమనించకపోవడతో.. కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
న్యాయవాది కారును ఢీకొన్న కానిస్టేబుల్ కారు
= పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు ధర్మవరం అర్బన్ : కర్నూలుకు చెందిన న్యాయవాది నాగమణి అద్దె వాహనంలో పుట్టపర్తికి వచ్చి తిరిగి వెళ్తుండగా ధర్మవరంలోని సబ్‌జైలు సమీపంలో రూరల్ పోలీస్ కానిస్టేబుల్ కారుతో వచ్చి ఆదివారం సాయంత్రం ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో న్యాయవాది ప్రయాణిస్తున్న కారు డోరు డ్యామేజీ అయ్యింది. న్యాయవాదితోపాటు డ్రైవర్ శ్రీనివాసులు సదరు కానిస్టేబుల్‌ను నిలదీశారు. ఆయన స్పందించకపోవడంతో బాధితులు పట్టణ సీఐ హరినాథ్‌కు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వాహనాన్ని నడపడమే కాకుండా కారును ఢీకొన్నాడని బాధితులు పట్టణ సీఐకు తెలియజేశారు. సీఐ కేసు విచారిస్తున్నారు. తమకు రాత్రి 9 గంటలైనా న్యాయం చేయలేదని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. -
లారీని ఢీకొట్టిన టాటాఏస్..ఇద్దరి మృతి
చౌటుప్పల్(నల్గొండ జిల్లా): చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు. టాటా ఏస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న పోలీస్ వాహనం
-
ఘోర రోడ్డు ప్రమాదం
హమిర్పూర్: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. గురువారం ఉదయం మోధ ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు లారీలు ఎక్కువ వేగంతో వెళ్తూ ఢీకొనడంతో అవిపూర్తిగా ధ్వంసమయ్యాయి. -
లారీ–డీసీఎం ఢీ.. వ్యక్తి మృతి
శంషాబాద్(రంగారెడ్డి): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘన్షిమియాగూడ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో.. ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
బైక్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్
కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు మృతి విద్యార్థికి స్వల్ప గాయాలు కారేపల్లి : బైక్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ సంఘటన సింగరేణి సెక్యూరిటీ చెక్‌పోస్టు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రొంపేడు గ్రామానికి చెందిన ధర్మసోత్ రవి(27) ఇల్లెందులోని 24 ఇంక్లై¯ŒSలో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ ఆర్ట్(డ్రాయింగ్) ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో మాణిక్యారం గ్రామానికి చెందిన మెరుగు జ్ఞానేశ్వర్ 5వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయినప్పటికీ తల్లిదండ్రులు స్పందించకపోవడంతో.. ఉపాధ్యాయుడు రవి బాలుడు జ్ఞానేశ్వర్‌ను తన బైక్‌పై ఎక్కించుకొని మాణిక్యారంలోని ఇంటి వద్ద దించేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రహదారిపై ఓసీ సమీపంలోని సింగరేణి సెక్యూరిటీ చెక్‌పోస్టు వద్ద గుర్తు తెలియని ఇసుక ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న జ్ఞానేశ్వర్ రోడ్డు పక్కనే ఉన్న గడ్డిపై పడగా.. బైక్ నడుపుతున్న రవి రోడ్డుపై పడ్డాడు. వెంటనే ట్రాక్టర్ టైర్లు అతడి నడుము, తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల వారు తేరుకునేలోపే ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి ఉడాయించాడు. విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ డి.రమేష్, ఇల్లెందు సీఐ నరేందర్, కారేపల్లి ఎస్సై ఏ.కిరణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. మృతుడు రవికి భార్య భద్రమ్మ, రెండేళ్ల కొడుకు, 5 నెలల చిన్నారి ఉన్నారు. కాగా.. సంఘటనా స్థలంలో సహ ఉపాధ్యాయులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
బాలికను ఢీకొట్టిన లారీ
కామేపల్లి : వేగంగా వచ్చిన లారీ బాలికను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తలింగాల సమీపంలోని ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుండటంతో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన నల్లగొండ జిల్లా మోతె మండలం సర్వారానికి చెందిన బాలిక మేదరమెట్ల రమ్య.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఆటోలో బంధువులు ఉండటంతో రోడ్డు దాటుతూ వారి వద్దకు వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఇసుక లారీ వేగంగా వచ్చి బాలికను ఢీకొట్టి.. రెండు కాళ్లపై నుంచి వెళ్లింది. కాళ్లు నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కోపోద్రిక్తులైన బంధువులు లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా.. బాలిక బంధువులు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. -
రెండు బైకులు ఢీ..ముగ్గురు మృతి
నరసాపురం(పశ్చిమగోదావరి): రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని థామస్ వంతెనపై ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. నరసాపురం పట్టణానికి చెందిన కర్రా గంగరాజు పల్సర్‌పై వెళుతూ ఎదురుగా మరో వస్తున్న మరో పల్సర్‌ను ఢీకొట్టాడు. దీంతో రెండు బైక్‌లపై ఉన్న కర్రా గంగరాజు, మొగల్తూరుకు చెందిన పాలనాగరాజు, కడవి పండు సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. -
గోడను ఢీకొట్టిన లారీ
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు. విజయవాడ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి ఘాట్‌రోడ్డు గోడను ఢీకొట్టి రోడ్డుపైనే నిలిచిపోయింది. క్యాబిన్ నుజ్జునుజ్జు కావటంతో అందులో చిక్కుకున్న డ్రైవర్ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. డ్రైవర్ స్వస్థలం గుంటూరు జిల్లా వేమూరు. -
ఆటోను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి
జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం రంగారెడ్డి గూడ వద్ద విద్యార్థులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టిప్పర్- ఆర్టీసీ బస్సు ఢీ... ఒకరు మృతి
రంగారెడ్డి: హయత్ నగర్ మండలం బాట సింగారం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు, టిప్పర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముస్తఖ్ క్యాబిన్‌లోనే ఇరుక్కు పోయి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు బస్సులోనే ఇరుక్కుపోయారు. 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదం జరిగనట్టు సమాచారం. -
తిరుమల ఘాట్‌రోడ్డులో కారును ఢీకొట్టిన బస్సు
-
రెండు రైళ్లు ఢీ... 100 మందికి గాయాలు
-
రైలు - కారు ఢీ : 13 మంది మృతి
-
స్కూటీని ఢీకొన్న ఆర్జ్టీసీ బస్సు
-
రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్రగాయాలు
కరీంనగర్: వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన రేణిగుంట టోల్ ప్రాజా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. ఇద్దరు మృతి
నర్సింహులపేట: వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నల్లగొండ జిల్లా కుక్కడం గ్రామానికి చెందిన కొండా భిక్షం (30), రామ్మూర్తి (28) పనుల నిమిత్తం శనివారం వరంగల్ జిల్లా దంతాలపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా... నర్సింహులపేట మండలం కుమ్మరికుంట్ల గ్రామం శివారులోని పాలేరు వాగు వద్ద సూర్యాపేట వైపు నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భిక్షం, రామ్మూర్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. -
బైక్, ఆటో ఢీ: ఇద్దరు మృతి
వైఎస్సార్ జిల్లా: లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్రవాహనం పక్కనుంచి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట జాతీయరహదారిపై ఆదివారం జరిగింది. వివరాలు.. కోడూరు గ్రామానికి చెందిన సోమశేఖర్(24) రాజంపేటకు చెందిన ఆంజనేయులు(28) ఇద్దరు రాజంపేట నుంచి కోడురుకు శుభకార్యానికి హాజరు కావడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మంగంపేట సమీపానికి రాగానే.. లారీని ఓవర్టేక్ చేయడానికి యత్నించి అదుపు తప్పి ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సోమశేఖర్ వివాహం జరగి కేవలం మూడు నెలలు మాత్రమే అవుతుంది. వీరిద్దరి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బైక్‌ను ఢీకొన్న లారీ..యువకుడు మృతి
హైదరాబాద్ సిటీ: ఉప్పల్ నుంచి రామాంతపూర్ వైపు బైక్ మీద వెళ్తున్న యువకుడిని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సమీర్(22) అనేయువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కొన్ని రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని బంధువలు శోకసంద్రం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
తమ్ముడిని చంపిన అన్నల అరెస్టు
నారాయణపేట రూరల్: కుటుంబకల హాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తమ్ముడు మృతిచెందాడు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రవీం ద్రప్రసాద్, ఎస్ఐ యాలాద్రి వివరాలు వెల్లడించారు. మండలంలోని జాజాపూర్ గ్రామానికి చెందిన రాజు, అంజ ప్ప, అర్జున్, యాదప్ప, భీమప్ప సొం త అన్నదమ్ములు. కొంతకాలంగా అర్జున్, రాజు మధ్య తగాదాలు ఉన్నా యి. రెండోఅన్న అంజప్ప మృతిచెందడంతో ముంబాయి నుంచి ఆయన అంత్యక్రియల కోసం ఈనెల 10న అర్జున్ స్వగ్రామానికి వచ్చాడు. అదేరోజు రాత్రి అర్జున్‌తో రాజు గొడవకు దిగాడు. వారి మధ్య మాటామాట పెరి గి ఘర్షణ చోటుచేసుకుని కర్రతో కొట్టడంతో అర్జున్ అక్కడికక్కడే మృతి చెం దాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా రాజుతో పాటు మిగతా అన్నదమ్ములు యాదప్ప, భీమప్ప, తమ బం ధువు ఆటోడ్రైవర్ హన్మంతు సహకారంతో గ్రామ శివారులోని శ్మశానవాటికకు శవాన్ని ఆటోలో తరలించి ఆనవా ళ్లు లేకుండా పూడ్చిపెట్టారు. ఈ విష యం గ్రామాస్తుల ద్వారా బయటికిపొక్కడంతో సమాచారం అందుకున్న పో లీసులు సోమవారం గ్రామానికి చేరుకున్నారు. ప్రధాన నిందితుడు రాజు కుటుంబాన్ని విచారించి ఆయనతో పాటు సహకరించిన ముగ్గురిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజు సమాచారంతో పూడ్చిన శవాన్ని వెలికితీసి ‘పేట’ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యుల కు అందజేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
బస్సును ఢీకొన్న లారీ
పెద్దాపురం రూరల్ / కాకినాడ క్రైం :ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొ న్న సంఘటనలో ఓ సొసైటీ ఉద్యోగి మరణించ గా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏడీబీ రోడ్డులోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. రాజమండ్రి నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ బస్సును ఏడీబీ రోడ్డులో ఓ లారీ అదుపుతప్పి ఢీకొంది. బస్సు వెనుక సీటులో కూర్చున్న ఏడు గురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను పెద్దాపురం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిలో ఆరుగురికి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో రం గంపేట సొసైటీ గుమస్తా వట్టికూటి వీరవెంకట రమణారావు (50) మరణించాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు హెచ్.మోహన్, మురళీకృష్ణ, జి.మోహన్, ఆకాశపు మణిసాయి కుమార్, కాకినాడకు చెందిన మచ్చ వినయ్‌కుమార్, ఎస్.మల్లికార్జున్, లారీ డ్రైవర్ వాసంశెట్టి కృష్ణ పెద్దాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెద్దాపురం సీఐ నాగేశ్వరరావు, ఎస్సై శివకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుభకార్యం పిలుపునకు వెళ్తూ.. రంగంపేట : ఈ నెల 23న తమ్ముడి కుమార్తె శుభకార్యం విషయమై చెల్లెలిని ఆహ్వానించడానికి విశాఖపట్నం వెళుతూ రమణారావు మరణిం చాడు. అతడికి భార్య అనంతలక్ష్మి, కుమారులు మణికంఠ, వీరదుర్గాప్రసాద్, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా, మణికంఠ మచిలీపట్నంలోను, వీరదుర్గాప్రసాద్ గైట్ కళాశాలలోను చదువుతున్నారు. -
ట్యాంకర్‌ను ఢీకొన్న టిప్పర్
జగ్గంపేట : ఎన్‌హెచ్‌పై రామవరం గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ఆగివున్న మిథనాల్ ట్యాంకర్‌ను హెవీ టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏలేశ్వరం మండలం సిరి పురం గ్రామానికి చెంది న టిప్పర్ క్లీనర్ దొడ్డి రమేష్ (20) క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెందాడు. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ రమణ, ట్యాంకర్ క్లీనర్ అనకాపల్లి మండలానికి చెందిన రమణలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం నుంచి మిథనాల్ లోడుతో వస్తున్న ట్యాంకర్ రామవరం వద్దకు వచ్చే సరికి వెనక టైరు గాలి తగ్గింది. దీంతో పెట్రోల్ బంక్ సమీపంలో ట్యాంకర్‌ను రోడ్డు పక్కనే ఉంచి డ్రైవర్ మధు, క్లీనర్ రమణలు టైరు మార్చుకుంటున్నారు. ఆ లారీని ఏలేశ్వరం నుంచి క్వారీ డస్ట్ లోడుతో జగ్గంపేట వైపు వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొంది. టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కుని క్లీనర్ రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ రమణ, ట్యాంకర్ క్లీనర్ రమణ తీవ్రంగా గాయపడ్డాడు. ట్యాంకర్ డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. కాగా, క్లీనర్ రమేష్ తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదస్థలాన్ని ఎస్సై సురేష్‌బాబు, సిబ్బంది పరిశీలించారు. -
విలేకరిని కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలి
కమాన్‌పూర్, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్,టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణను కవరేజీ చేస్తున్న విలేకరినికొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. బుధవారం మండలంలోని బేగంపేటలో ఓటింగ్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటర్లకు పార్టీ గుర్తు చూపిస్తూ ఓట్లు అభ్యర్థించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విలేకరులు ఫొటోలు తీస్తూ, వివరాలు తెలుసుకుంటున్నారు. గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటూనే అక్కడ ఉన్న విలేకరి మల్యాల సురేశ్‌పై చేయిచేసుకున్నారు. మిగితా లేకరులను కూడా దుర్భాషలాడారు. దీంతో విలేకరులు సీఐపై చర్యలు తీసుకోవాలని సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ శ్రీధర్, కమాన్‌పూర్ ఎస్సై సతీశ్ వచ్చి విలేకరులను సముదాయించారు. విచారణ జరిపి సీఐపై చర్యలు తీసుకుంటామని గోదావరిఖని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పూదరి సత్యనారాయణ, పీవీ రావు, బబ్బార్ఖాన్, బుర్ర తిరుపతి, పోసు భిక్షపతి, బండ సాయిశంకర్, గాదె బాలయ్య, బొల్లవరం వాసు, విజయ్, మాటేటి కుమార్, చేతి రవి, ఆరెపెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మినీవ్యాన్‌ను ఢీకొన్న బస్సు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: మినీవ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న సంఘటనలో పంచాయతీ అధ్యక్షురాలు సహా ఐదుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిిస్థితి విషమంగా ఉండడంతో చెన్నైకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా మన్నవేడు గ్రామానికి చెందిన పంచాయతీ అధ్యక్షురాలు మంజుల. పొన్నేరి సమీపంలోని యానంబాక్కం గ్రామంలో ఉన్న మంజుల బంధువు శనివారం సాయంత్రం మృతిచెందారు. ఈ నేపథ్యంలో బంధువుల మృతికి మన్నవేడు చెందిన 18 మంది ఆదివారం ఉదయం మినీవ్యాన్‌లో బయలుదేరారు. అంత్యక్రియల్లో పాల్గొని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరుగుపయనం అయ్యారు. వ్యాన్ పెద్దపాళ్యం వద్ద వస్తుండగా, రెడ్‌హిల్స్ నుంచి ఊత్తుకోట వైపు వెళుతున్న ప్రభుత్వ బస్సు, మినీవ్యాన్‌ను ఢీకొని వ్యవసాయపొలంలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో మినీవ్యాన్‌లో పయనిస్తున్న మన్నవేడు పంచాయతీ అధ్యక్షురాలు మంజుల సంఘటన స్థలంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు వ్యాన్‌లో చిక్కుకున్న వారిని రక్షించి 108కు సమాచారం అందించారు. అయితే గంట దాటినా 108 రాకపోవడంతో మరొక వ్యాన్‌లో గాయపడిన వారిని తరలించారు. అయితే మార్గమధ్యంలో మన్నవేడు గ్రామానికి చెందిన ఇళయాత్త(60), శశికళ(40), ఏలుమలై(50) మృతిచెందారు. ప్రమాదంలో మన్నవేడు గ్రామానికి చెందిన మునస్వామి (27), వినోద్ (07), సుకుమార్(10), రాబర్ట్ (58), హేమరాజ్ (30), గుణ (38), అరుల్‌జ్యోతి(45), మనోహరమ్మాల్ (50), రాజామ్మాల్ (50), దురైయమ్మాల్ (45), మల్లికా (52), కోట్టయమ్మా (30), అన్నామ్మాల్ (50), రోసి(43) గాయపడ్డారు. వీరిలో మనోహరమ్మాల్, రాజామ్మాల్ , దురైయమ్మాల్, మల్లిక పరిిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరువళ్లూరు వైద్యశాల నుంచి చెన్నైకు తరలించారు. చికిత్స పొందుతూ మరో మహిళ మృతిచెందారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో తిరువళ్లూరు వైద్యశాలకు దద్దరిల్లింది. సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆశిం చిన గ్రామంలో నలుగురు మృతిచెందడంతో గ్రామం లో విషాద చాయలు అలుముకున్నాయి. పెద్ద పాళ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న లారీ
నందిగామ రూరల్, న్యూస్‌లైన్ :పట్టణంలోని రైతుపేట పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద మంగళవారం ఓ పెద్ద ప్రమాదం తప్పింది. సేకరించిన సమాచారం ప్రకారం.. చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ జి.నూకరాజు పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకుని విజయవాడ వైపు బయలుదేరాడు. లారీ అదుపుతప్పి బం కు వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్న డ్రైయిన్‌లో పడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ నూకరాజుకు ఫిట్స్ రావడంతో లారీపై అదుపు కోల్పోయాడని, దీంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఈనెల ఏడో తేదీన విద్యుత్ షాక్‌కు గురై పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు క్లీనర్ బడేమియా అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ట్రాన్స్ఫార్మర్ రోడ్డు వెంబడే ప్రమాదకర పరిస్థితుల్లో ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్ను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ప్రైవేటు బస్సును ఢీకొన్న లారీ
కోటపాడు(రంగంపేట), న్యూస్‌లైన్ : మండలంలో కోటపాడు వద్ద ఏడీబీ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కాకినాడలోని వివాహ వేడుకకు పలువురు ముస్లింలు ప్రైవేటు బస్సులో వెళుతున్నారు. పెద్దాపురం వైపు నుంచి రాజమండ్రి వైపునకు వెళుతున్న కోడిగుడ్ల లారీ కోటపాడు సమీపంలోని అంబేద్కర్ కోళ్ల ఫారం వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు ఆకుల అన్నవరం, కె.శ్రీనివాస్పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. లారీలోని 8 మంది, బస్సులోని 20 మందికి స్వల్ప గాయాల య్యాయి. కొవ్వూరుకు చెందిన మహమ్మద్ నజీముద్దీన్ సోదరుని కుమారుని వివాహానికి వారు కాకినాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని రంగంపేట ఎస్సై టి. గణేష్ చెప్పారు. లారీ పెద్దాపురంలోని విజయలక్ష్మి పౌల్రీఫారంనకు చెందిన దన్నారు. రంగంపేటలో సల్మా, నసీమాబేగం, ఉస్మాన్, హసీఫ్ ఉన్నీసాలు చికిత్స పొందారు. చికిత్స కోసం కొంత మందిని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి, మరి కొందరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. నసీముద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గణేష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.