బైక్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌ | Park sand collision with tractor | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌

Published Fri, Sep 9 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

బైక్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌

బైక్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌

  • కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుడు మృతి
  • విద్యార్థికి స్వల్ప గాయాలు
  •  
    కారేపల్లి : బైక్‌ను ఇసుక ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఓ కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ సంఘటన సింగరేణి సెక్యూరిటీ చెక్‌పోస్టు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రొంపేడు గ్రామానికి చెందిన ధర్మసోత్‌ రవి(27) ఇల్లెందులోని 24 ఇంక్లై¯ŒSలో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్‌ ఆర్ట్‌(డ్రాయింగ్‌) ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో మాణిక్యారం గ్రామానికి చెందిన మెరుగు జ్ఞానేశ్వర్‌ 5వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయినప్పటికీ తల్లిదండ్రులు స్పందించకపోవడంతో.. ఉపాధ్యాయుడు రవి బాలుడు జ్ఞానేశ్వర్‌ను తన బైక్‌పై ఎక్కించుకొని మాణిక్యారంలోని ఇంటి వద్ద దించేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రహదారిపై ఓసీ సమీపంలోని సింగరేణి సెక్యూరిటీ చెక్‌పోస్టు వద్ద గుర్తు తెలియని ఇసుక ట్రాక్టర్‌ వెనక నుంచి వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న జ్ఞానేశ్వర్‌ రోడ్డు పక్కనే ఉన్న గడ్డిపై పడగా.. బైక్‌ నడుపుతున్న రవి రోడ్డుపై పడ్డాడు. వెంటనే ట్రాక్టర్‌ టైర్లు అతడి నడుము, తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల వారు తేరుకునేలోపే ట్రాక్టర్‌ డ్రైవర్‌ వేగంగా అక్కడి నుంచి ఉడాయించాడు. విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ డి.రమేష్, ఇల్లెందు సీఐ నరేందర్, కారేపల్లి ఎస్సై ఏ.కిరణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. మృతుడు రవికి భార్య భద్రమ్మ, రెండేళ్ల కొడుకు, 5 నెలల చిన్నారి ఉన్నారు. కాగా.. సంఘటనా స్థలంలో సహ ఉపాధ్యాయులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement