
సాక్షి బెంగళూరు: బెంగళూరు గగనతలంలో భారీ విమాన ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో రెండు ఇండిగో ఏ–320 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు బెంగళూరు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లో కలిపి 330 మంది ప్రయాణికులున్నారు.
ఈ నెల 10న కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 6ఈ–779 విమానం, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే 6ఈ–6505 విమానం బెంగళూరు నగర గగనతలంలో ఒకదాని కొకటి దగ్గరగా రావడాన్ని గుర్తించిన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అధికారులు రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.