kempegowda Airport
-
బెంగళూరులో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు: కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు మొదలయ్యాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ బయట కన్నడ కాకుండా(ನಾಮ ಫಲಕಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತ್ರ) ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. #WATCH | Bengaluru: Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada. pic.twitter.com/ZMX5s9iJd0 — ANI (@ANI) December 27, 2023 ఈ మధ్యే యునెస్కో కెంపెగౌడ విమానాశ్రయానికి మోస్ట్ బ్యూటీఫుల్ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు ఇచ్చింది. ఈలోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు బెంగళూరు వ్యాప్తంగా హోటల్స్‌పైనా కన్నడ సంఘాలు దాడులకు దిగాయి. ఇంగ్లీష్‌లో నేమ్ ప్లేట్స్ ఉన్న హోటళ్లలోకి దూసుకెళ్లాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇదిలా ఉంటే.. దుకాణాలకు ఫిబ్రవరి చివరికల్లా కన్నడ భాషలో నేమ్ ప్లేట్స్ గనుక ఉండకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవంటూ Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) హెచ్చరించింది కూడా. -
ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు!
చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండిగో 6E478 విమానం అమృత్సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు. 'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది. ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ -
గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ..
దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ దాచిన ఎలక్ట్రిక్ గిటార్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్ గిటార్లోపల స్యూడో ఎఫెడ్రిన్ అనే మత్తుమందును ప్యాక్ చేసి తమిళనాడు తిరుచ్చిలోని కొరియర్ ఏజెన్సీలో కొరియర్ చేశాడు. అది ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కెంపేగౌడ విమానాశ్రయంలో అధికారులు అనుమానంతో చెక్ చేయగా అందులో మత్తుమందు బయటపడింది. ఈ మత్తుమందు విలువ సుమారు రూ.50 లక్షలని అంచనా. మరో ఘటనలో... లారీ ఢీకొని బైకిస్టు మృతి తుమకూరు: లారీ ఢీ కొట్టడంతో బైకిస్టు మరణించాడు. ఈ ఘటన నగర శివార్లలో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగింది. గుబ్బి నుంచి తుమకూరు వైపు వస్తున్న బైక్‌ను ఎదురుగా మితిమీరిన వేగంతో వెళ్లిన లారీ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత.. -
ఎర్ర చందనం స్మగ్లర్ల ఎత్తుగడ.. కార్గో కస్టమ్స్ అధికారుల చిత్తు!
యశవంతపుర: బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో రూ.కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి. వివరాలు... ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త దుబా య్కు అక్రమంగా ఎర్రచందనం తరలించేం దుకు ప్లాన్ వేశాడు. దుంగలను ముక్కలు చేసి చెక్కపెట్టెల్లో ప్యాక్ చేసి బెంగళూరులోని ఒక రవాణా ఏజెన్సీ ద్వారా ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఇనుప పైపులు ఎగుమతి చేస్తున్నట్లు ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులను నమ్మించారు. అయితే ఇనుప పైపులకు పకడ్బందీ ప్యాక్‌పై అనుమానంతో తనిఖీ చేయగా.. ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు
దొడ్డబళ్లాపురం: టోల్ ఫీజు అడిగితే ఓ రైతు కొడవలి అందించాడు. ఈ ఘటన బెంగళూరు సమీపంలో చోటు చేసుకుంది. బెంగళూరు–హైదరాబాద్ మార్గంలోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో ఏర్పాటు చేసిన టోల్గేట్ వద్దకు గురువారం ఉదయం ఓ వ్యక్తి కారులో రాగా టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది అడిగారు. తాను స్థానికుడినని, రైతునని, పొలం పనికి వెళ్లి వస్తున్నానని చెప్పాడు. అయితే ఆయన లగ్జరీ కారులో రావడాన్ని బట్టి రైతు కాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యక్తి కారులో ఉన్న కొడవలి తీసి సిబ్బంది చేతికిచ్చి ఇప్పుడయినా నమ్ముతారా అని ప్రశ్నించారు. భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా చిక్కజాల పోలీసులు ఆయన్ను పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లారు. ఆయన స్థానిక రైతు అని తేలడంతో వదిలేశారు. చదవండి: ఆ ఉద్యోగం వద్దు.. పంజాబ్ ఎమ్మెల్యే స్పష్టీకరణ -
ఎయిర్‌పోర్టులో బీడీ దొరక్కపోవడంతో గట్టిగా అరుస్తూ..
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి బీడీ కోసం వీరంగం వేసిన ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి విమానంలో బయల్దేరిన ఓ కుటుంబం బెంగళూరులో దిగింది. సదరు కుటుంబానికి చెందిన పెద్ద.. తన భార్య, కొడుకుతో బయటకు వస్తుండగా బీడీల కోసం షాపుల్లో అడిగి చూశాడు. అయితే, ఎక్కడా అవి దొరకకపోవడంతో గట్టిగా అరుస్తూ వీరంగం సృష్టించాడు. నోరు పీక్కుపోతోంది.. ఒక్క బీడీ కూడా దొరకదేంట్రా అని అసహనం వ్యక్తం చేశాడు. భార్య, కుమారుడు చాలా సేపటి వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలాగోలా క్యాబ్ ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. సీడీ కేసులో సిట్ నోటీసు బనశంకరి: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసులో ప్రధాన నిందితునిగా ఆరోపణలున్న శ్రావణ్‌కుమార్‌ను విచారణకు హాజరుకావాలని సిట్ నోటీస్ జారీ చేసింది. సిట్ బృందం నుంచి సీఆర్పీసీ 41 సెక్షన్ కింద ఏసీపీ ధర్మేంద్ర గురువారం నోటీస్ జారీ చేశారు. ఆడుగోడి టెక్నికల్ సెంటర్లో సిట్ ముందు విచారణకు హాజరు కావాలని తెలిపింది. చదవండి: ఘోరం: కుందేలు అనుకోని మిత్రునిపై తూటా.. దీంతో.. -
రన్‌వేపై ప్రయాణికుల ఆందోళన
దొడ్డబళ్లాపురం: విమానం ఆలస్యమైందంటూ ఆగ్రహించిన ప్రయాణికులు రన్‌వేపైకి వచ్చి విమానాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. బెంగళూరు నుంచి థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నగరానికి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరాల్సిన గో ఎయిర్‌బస్ విమానం సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ కాలేదు. దీంతో విమానంలోని 120 మంది ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పైలట్‌తోపాటు ఎయిర్‌హోస్టెస్‌లు తమ డ్యూటీ సమయం దాటిపోయిందంటూ వెళ్లిపోయారు. మరో మార్గం చూపుతామని అధికారులు చెప్పారు. అయితే ఉదయం 8 గంటలయినా మరో విమానం ఏర్పాటు చేయలేదు. అయిదారు గంటలపాటు విమానంలోనే కూర్చున్న ప్రయాణికులు చివరకు ఓపిక నశించి, రైన్వే పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇతర విమానాలకు ఎదురెళ్లి ఆటంకం కలిగించడానికి యత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. పుకెట్‌కు మరో విమానం ఏర్పాటు చేయాలని భావించినా బీసీఏఎస్ నుంచి అనుమతి లభించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. -
ఆ రోడ్డంటే హడల్
సాక్షి బెంగళూరు: ఐటీ సిటీలో కొన్ని రహదారుల్లో వెళ్లాలంటే మళ్లీ క్షేమంగా తిరిగివస్తామా? అనే సందేహం రాకమానదు. బెంగళూరు సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డులో వచ్చే బెట్టహలసూరు క్రాస్, ఎంవీఐటీ క్రాస్, సౌదహళ్లి క్రాస్‌లో నిరంతరం ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఆగస్టులో జరిగిన ప్రమాదాలే దీనికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ నెలలో జరిగిన ప్రమాదాలు.. ♦ 5వ తేదీ రాత్రి 7.20: బెట్టహలసూరు క్రాస్ జంక్షన్లో రోడ్డు దాటుతుండగా ఎయిర్పో ర్టుకు వెళ్లాల్సిన వాహనం వచ్చి ఢీకొనడంతో నరసింహమూర్తి అనే వ్యక్తి మరణించాడు. ♦ 6న ఉదయం 5.50: ఎంవీఐటీ జంక్షన్లో హౌస్ కీపింగ్ కంపెనీలో పని చేసే ముగ్గురు ఓమ్నీ వాహనంలో వెళ్తున్నారు. అయితే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ♦ 12న ఉదయం 5.15 గంటలకు: బెంగళూరు నుంచి బైక్‌పై నందికొండకు వెళ్తూ సౌదహళ్లి గేట్ సమీపంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలోబైక్ నడుపుతున్న విజయ్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ♦ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు: ఎంవీఐటీ కాలేజీ దగ్గరలో వస్తున్న కారు అటుగా నడుచుకుంటూ వెళ్తున్న సూర్యబాబు, లచ్చయ్యను ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. అతివేగం, రోడ్ల డిజైనింగ్ లోపాలు బళ్లారి రోడ్డులోని బెట్టహలసూరు క్రాస్, ఎంవీఐటీ క్రాస్ జంక్షన్, సౌదహళ్లి క్రాస్లు పాదచారులు, ద్విచక్రవాహనదారులకు యమదారులుగా మారాయి. గత పదిరోజుల్లో జరిగిన ఘటనల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ జంక్షన్ సమీపంలో నిర్మించిన అండర్‌పాస్, పాదచారుల ఫుట్‌పాత్ ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. క్రాస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుపైకి వాహనాలు వేగంగా రావడం, పాదచారులు నడిచేందుకు ప్రత్యేక బారికేడ్లు లేకపోవడం ప్రమాదాలను పిలుస్తోంది. ఎంవీఐటీ జంక్షన్లో.. హుణసమారనహళ్లి సమీపంలో గ్రామాలు, కాలేజీలు, ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. దీంతో ఆయా పనులకు వెళ్లే వారు ఎంవీఐటీ జంక్షన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. జంక్షన్‌లోని బస్టాండులో రోడ్డు విశాలంగా ఉంది. కానీ పాదచారులు నడిచేందుకు ప్రత్యేక బారికేడ్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అర కిలోమీటరు దూరంలో అండర్‌పాస్ ఉంది. ప్రజలు అక్కడికి వెళ్లకుండా బస్టాండు సమీపంలోనే రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బెట్టహలసూరు క్రాస్‌లో.. బెట్టహలసూరు క్రాస్‌కు 100 మీటర్ల దూరంలో అండర్ పాస్ ఉంది. అయితే జనాలు అక్కడికి వెళ్లకుండా జంక్షన్‌లోనే రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా రోడ్డుపై వేగంగా వాహనాలు ఢీకొంటున్నాయి. ప్రమాదంలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దారికి రెండువైపులా డౌన్‌ర్యాంపు ఉంది. కానీ ప్రజలు రోడ్డు గుండా దాటుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సౌదహళ్లి గేట్ వద్ద.. ఎయిర్‌పోర్టు టోల్‌గేట్‌కు సమీపంలో సౌదహళ్లి గేట్ సమీపంలో తరచూ ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కాగా రాత్రి వేళల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
తప్పిన భారీ విమాన ప్రమాదం
సాక్షి బెంగళూరు: బెంగళూరు గగనతలంలో భారీ విమాన ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో రెండు ఇండిగో ఏ–320 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు బెంగళూరు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లో కలిపి 330 మంది ప్రయాణికులున్నారు. ఈ నెల 10న కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 6ఈ–779 విమానం, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే 6ఈ–6505 విమానం బెంగళూరు నగర గగనతలంలో ఒకదాని కొకటి దగ్గరగా రావడాన్ని గుర్తించిన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అధికారులు రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమానం నిలిపివేత
సాక్షి, బెంగళూరు: కర్టాటక కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రయాణించాల్సిన విమానాన్ని గంటలపాటు నిలిపివేసిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని శిబిరానికి వచ్చేందుకుగానూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, ఆరుగురు తాజా ఎమ్మెల్యేలు కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆసీనులయ్యారు. కానీ.. విమానం టేకాఫ్ అయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యేలు, నేతలు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం పెరిగిపోయింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే విమానాన్ని నిలిపివేశారేమోనన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అందుకే బస్సుల్లో వచ్చారు..: కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం రాత్రి కూడా సరిగ్గా ఇలానే జరిగింది. ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలనుకున్నా, అందుకు ఎయిర్‌పోర్టు అధికారులు నిరాకరించడంతో చివరికి బస్సుల్లో తరలించారు. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి నేతలు శుక్రవారం బయలుదేరారు. గంటల నిరీక్షణ అనంతరం.. విమానానికి అనుమతి దొరకడంతో నేతలు హైదరాబాద్ వైపునకు ఎగిరివెళ్లారు. తాజ్‌కృష్ణలో సీఎల్పీ భేటీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో సీఎల్పీ సమావేశం జరుగనుంది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరమైన హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్లోనే సాయంత్రం 5గంటలకు సీఎల్పీ భేటీ జరగనుంది. రేపటి బలపరీక్షలో సభ్యులు అనుసరించాల్సిన విధానంపై సీనియర్లు సూచనలు చేయనున్నారు. -
ఎయిర్‌పోర్టులో బొమ్మల కొలువు
సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో దసరా బొమ్మల కొలువు సందడి చేస్తోంది. గత రెండేళ్లుగా ఎయిర్‌పోర్టు అధికారులు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల నుండి అనూహ్య స్పందన రావడంతో ఈ సంవత్సరం కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. భారతదేశపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. విదేశీయులు బొమ్మల కొలువు గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఇక సెల్ఫీలకైతే కొదువేలేదు. సాయంత్రం నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు ఫిదా అవుతున్నారు. దసరా ముగిసే వరకూ ఈ బొమ్మల కొలువు ఉంటుందని ఎయిర్‌పోర్టు ముఖ్య అధికారి సజీత్ తెలిపారు. -
నకిలీ సెల్‌ఫోన్.. విలువ ఎంతో తెలుసా?
► బెంగళూరు ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్టు బెంగళూర్: నకిలీ మొబైల్ఫోన్లో బంగారు బిస్కెట్లను తరలిస్తున్న మహిళను బుధవారం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని కనకనగర్కు చెందిన మీర్జా అనే మహిళ సీ.వీ.రామన్నగర్లో ఓ గార్మెంట్స్‌లో టైలర్‌గా పని చేస్తోంది. కొన్నిరోజుల కిందట దుబాయ్‌కి వెళ్లిన ఆమె బుధవారం ఎమిరేట్స్ విమానంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తనీఖీల్లో ఆమె వద్దనున్న మొబైల్‌ఫోన్ అనుమానాస్పందంగా కనిపించడంతో తెరచిచూడగా అందులో రూ.41 లక్షల విలువ చేసే 12 బంగారు బిస్కెట్లు లభించాయి. దీనిపై మహిళను ప్రశ్నించగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో పరిచయమైన కొంత మంది వ్యక్తులు ఈ మొబైల్‌ను బెంగళూరు ఎయిర్‌పోర్టు బయట ఎదురు చూస్తున్న తమ వ్యక్తులకు అందించాలని ఇచ్చారని, ఇందుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పారని అధికారులకు వివరించింది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే దుబాయ్ ఎయిర్ పోర్టులో మీర్జాకు మొబైల్ ఇచ్చిన వ్యక్తుల వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.