నకిలీ సెల్‌ఫోన్.. విలువ ఎంతో తెలుసా? | Gold Smuggler arrested at Bangalore Airport | Sakshi
Sakshi News home page

నకిలీ సెల్‌ఫోన్.. విలువ ఎంతో తెలుసా?

Published Thu, May 25 2017 3:37 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

నకిలీ సెల్‌ఫోన్..  విలువ ఎంతో తెలుసా? - Sakshi

నకిలీ సెల్‌ఫోన్.. విలువ ఎంతో తెలుసా?

► బెంగళూరు ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్టు

బెంగళూర్: నకిలీ మొబైల్‌ఫోన్లో బంగారు బిస్కెట్లను తరలిస్తున్న మహిళను బుధవారం ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇంటెలిజెన్స్ యూనిట్‌(ఏఐయూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని కనకనగర్‌కు చెందిన మీర్జా అనే మహిళ సీ.వీ.రామన్నగర్‌లో ఓ గార్మెంట్స్‌లో టైలర్‌గా పని చేస్తోంది. కొన్నిరోజుల కిందట దుబాయ్‌కి వెళ్లిన ఆమె బుధవారం ఎమిరేట్స్‌ విమానంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

తనీఖీల్లో ఆమె వద్దనున్న మొబైల్‌ఫోన్ అనుమానాస్పందంగా కనిపించడంతో తెరచిచూడగా అందులో రూ.41 లక్షల విలువ చేసే 12 బంగారు బిస్కెట్లు లభించాయి. దీనిపై మహిళను ప్రశ్నించగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో పరిచయమైన కొంత మంది వ్యక్తులు ఈ మొబైల్‌ను బెంగళూరు ఎయిర్‌పోర్టు బయట ఎదురు చూస్తున్న తమ వ్యక్తులకు అందించాలని ఇచ్చారని, ఇందుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పారని అధికారులకు వివరించింది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో మీర్జాకు మొబైల్‌ ఇచ్చిన వ్యక్తుల వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement