AIU
-
బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్
ముంబై: అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్‌కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వెతకగా.. ఆ కుటుంబం నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గురించి ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(AIU)కు ముందుగానే సమాచారం అందింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచే ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు, ఏఐయూ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. గురువారం ఉదయం ముంబై ఛత్రపది శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ కుటుంబం కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇద్దరు వృద్ధులతో సహా ముగ్గురు ఉన్న ఆ కుటుంబం లగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాళ్ల సూట్‌కేసులో ఉన్న షూస్ లోపల, పట్టుచీరల మధ్య అమెరికన్ డాలర్లు ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారు. మొత్తం అమెరికన్ డాలర్ కరెన్సీ విలువ 4,97,000 డాలర్లుకాగా, మన కరెన్సీలో దాని విలువ రూ.4.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు జడ్జి. ఇంత డబ్బు ఎక్కడిది? ఎలా చేతులు మారింది? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. #WATCH | In a targeted op by AIU, Mumbai Airport Customs, a family of 3 Indian pax going to Dubai were intercepted. The baggage examination of the 3 led to seizure of foreign currency worth 4,97,000 USD (approx Rs 4.1 Cr). All 3 passengers were arrested: Customs (Source:Customs) pic.twitter.com/TdQVZd4wox — ANI (@ANI) November 3, 2022 -
డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్
ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ భారత మహిళా డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందు ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) శనివారం ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నవ్‌జీత్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో మాత్రం ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత జూన్‌లో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో, కజకిస్తాన్‌లో జరిగిన కొసనోవ్ స్మారక మీట్లో నవ్‌జీత్ స్వర్ణ పతకాలు సాధించింది. నవ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. -
వివాదంలో వరల్డ్ చాంపియన్
న్యూయార్క్: ప్రపంచ 100 మీ. స్ప్రింట్ చాంపియన్, అమెరికన్ స్టార్ క్రిస్టియాన్ కోల్‌మన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ టెస్టుకు పిలిచినపుడు అందుబాటులోకి రాకపోవడంతో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయంపై తుది విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి పోటీల్లో పాల్గొనరాదని ఆదేశించింది. గత ఏడాదే అతను ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను పాటించకపోవడంతో చర్య తీసుకోవాలనుకున్నప్పటికీ ప్రపంచ చాంపియన్‌షిప్ కావడంతో ఏఐయూ కాస్త వెనుకంజ వేసింది. అయితే గడిచిన 12 నెలల కాలంలో మూడుసార్లు టెస్టులకు ప్రయత్నించినా...తాను ఎక్కడున్నాడనే సమాచారాన్ని కోల్మన్ ఇవ్వకపోవడంతో తాజాగా చర్యలు తీసుకున్నారు. దీనిపై కోల్మన్ స్పందిçస్తూ గత డిసెంబర్ 9న ఏఐయూ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పటికీ తను క్రిస్మస్ షాపింగ్‌లో బిజీగా ఉండటం వల్లే కాల్‌కు స్పందించలేకపోయానని ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ఫోన్ కాల్కే తనను సస్పెండ్ చేయడం విడ్డూరమని అన్నాడు. దీనిపై ఏఐయూ మాట్లాడుతూ పలుమార్లు ప్రయత్నించినా టెస్టులు చేసుకునేందుకు అతను అందుబాటులో లేకపోవడంతోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల మేరకే చర్యలు తీసుకున్నామని తెలిపింది. -
నకిలీ సెల్‌ఫోన్.. విలువ ఎంతో తెలుసా?
► బెంగళూరు ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్టు బెంగళూర్: నకిలీ మొబైల్ఫోన్లో బంగారు బిస్కెట్లను తరలిస్తున్న మహిళను బుధవారం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని కనకనగర్కు చెందిన మీర్జా అనే మహిళ సీ.వీ.రామన్నగర్లో ఓ గార్మెంట్స్‌లో టైలర్‌గా పని చేస్తోంది. కొన్నిరోజుల కిందట దుబాయ్‌కి వెళ్లిన ఆమె బుధవారం ఎమిరేట్స్ విమానంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తనీఖీల్లో ఆమె వద్దనున్న మొబైల్‌ఫోన్ అనుమానాస్పందంగా కనిపించడంతో తెరచిచూడగా అందులో రూ.41 లక్షల విలువ చేసే 12 బంగారు బిస్కెట్లు లభించాయి. దీనిపై మహిళను ప్రశ్నించగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో పరిచయమైన కొంత మంది వ్యక్తులు ఈ మొబైల్‌ను బెంగళూరు ఎయిర్‌పోర్టు బయట ఎదురు చూస్తున్న తమ వ్యక్తులకు అందించాలని ఇచ్చారని, ఇందుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పారని అధికారులకు వివరించింది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే దుబాయ్ ఎయిర్ పోర్టులో మీర్జాకు మొబైల్ ఇచ్చిన వ్యక్తుల వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.