
( ఫైల్ ఫోటో )
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి బీడీ కోసం వీరంగం వేసిన ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి విమానంలో బయల్దేరిన ఓ కుటుంబం బెంగళూరులో దిగింది. సదరు కుటుంబానికి చెందిన పెద్ద.. తన భార్య, కొడుకుతో బయటకు వస్తుండగా బీడీల కోసం షాపుల్లో అడిగి చూశాడు.
అయితే, ఎక్కడా అవి దొరకకపోవడంతో గట్టిగా అరుస్తూ వీరంగం సృష్టించాడు. నోరు పీక్కుపోతోంది.. ఒక్క బీడీ కూడా దొరకదేంట్రా అని అసహనం వ్యక్తం చేశాడు. భార్య, కుమారుడు చాలా సేపటి వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలాగోలా క్యాబ్ ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లారు.
సీడీ కేసులో సిట్ నోటీసు
బనశంకరి: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసులో ప్రధాన నిందితునిగా ఆరోపణలున్న శ్రావణ్‌కుమార్‌ను విచారణకు హాజరుకావాలని సిట్ నోటీస్ జారీ చేసింది. సిట్ బృందం నుంచి సీఆర్‌పీసీ 41 సెక్షన్ కింద ఏసీపీ ధర్మేంద్ర గురువారం నోటీస్ జారీ చేశారు. ఆడుగోడి టెక్నికల్ సెంటర్‌లో సిట్ ముందు విచారణకు హాజరు కావాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment