Beedies
-
ఎయిర్‌పోర్టులో బీడీ దొరక్కపోవడంతో గట్టిగా అరుస్తూ..
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి బీడీ కోసం వీరంగం వేసిన ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి విమానంలో బయల్దేరిన ఓ కుటుంబం బెంగళూరులో దిగింది. సదరు కుటుంబానికి చెందిన పెద్ద.. తన భార్య, కొడుకుతో బయటకు వస్తుండగా బీడీల కోసం షాపుల్లో అడిగి చూశాడు. అయితే, ఎక్కడా అవి దొరకకపోవడంతో గట్టిగా అరుస్తూ వీరంగం సృష్టించాడు. నోరు పీక్కుపోతోంది.. ఒక్క బీడీ కూడా దొరకదేంట్రా అని అసహనం వ్యక్తం చేశాడు. భార్య, కుమారుడు చాలా సేపటి వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలాగోలా క్యాబ్ ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. సీడీ కేసులో సిట్ నోటీసు బనశంకరి: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసులో ప్రధాన నిందితునిగా ఆరోపణలున్న శ్రావణ్‌కుమార్‌ను విచారణకు హాజరుకావాలని సిట్ నోటీస్ జారీ చేసింది. సిట్ బృందం నుంచి సీఆర్పీసీ 41 సెక్షన్ కింద ఏసీపీ ధర్మేంద్ర గురువారం నోటీస్ జారీ చేశారు. ఆడుగోడి టెక్నికల్ సెంటర్లో సిట్ ముందు విచారణకు హాజరు కావాలని తెలిపింది. చదవండి: ఘోరం: కుందేలు అనుకోని మిత్రునిపై తూటా.. దీంతో.. -
పొగరాయుళ్లకు చెక్: నో మోర్ లూజ్ సిగరెట్స్
బెంగళూరు: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే పొగరాయుళ్లకు చెక్‌పెడుతూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిగరెట్లతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపానాన్ని నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లూజ్ సిగరెట్లు, బీడీలు ఇతర చూయింగ్ పొగాకు ఉత్పత్తుల విక్రయం ఇకమీదట నేరంగా పరిగణిస్తారు. 2003 కోప్టా చట్టంలోని సెక్షన్లు 7, 8 ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం... సిగరెట్లను పెట్టెగానే విక్రయాలి. విడిగా అమ్మడం కుదరదు. విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శాలిని రాజేష్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంతో ధూమపానం తగ్గినప్పటికీ లూజ్ సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఈ నిషేధం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మరింత తగ్గిస్తుందని తాము భావిస్తున్నాన్నారు. సెప్టెంబరు 11 న ఈ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారంనుంచి ఈ నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాల పటిష్ట అమలుకోసం ఒక ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని యాంటీ టొబాకో సెల్‌లోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
మహిళపై ఉలితో దాడి
ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపురంలో మహిళపై ఓ వ్యక్తి ఉలితో దాడి చేశాడు. చెన్నూరి లక్ష్మి (35) సోమవారం తన ఇంట్లో బీడీలు చుడుతుండగా ఎదోలపు రవి ఈ దాడికి పాల్పడాడు. ఈ ఘటనలో లక్ష్మికి గాయాలు కాగా, ఆమెను ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.