బెంగళూరులో టెన్షన్‌.. టెన్షన్‌ | Karnataka Language Row: Protests Outside Over Kempegowda Airport Over Language Issues Intensified In Karnataka - Sakshi
Sakshi News home page

Karnataka Language Row: ‘ನಮ್ಮ ಕನ್ನಡ’ బెంగళూరులో టెన్షన్‌.. టెన్షన్‌

Published Wed, Dec 27 2023 12:28 PM | Last Updated on Wed, Dec 27 2023 1:49 PM

Karnataka Language Row: Protests Outside Kempegowda Airport - Sakshi

బెంగళూరు: కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు మొదలయ్యాయి. నేమ్‌ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎయిర్‌పోర్ట్‌ బయట కన్నడ కాకుండా(ನಾಮ ಫಲಕಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತ್ರ) ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో నేమ్‌ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌ బయట ఇతర భాషల నేమ్‌ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. 

ఈ మధ్యే యునెస్కో కెంపెగౌడ విమానాశ్రయానికి మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు ఇచ్చింది. ఈలోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు బెంగళూరు వ్యాప్తంగా హోటల్స్‌పైనా కన్నడ సంఘాలు దాడులకు దిగాయి. ఇంగ్లీష్‌లో నేమ్‌ ప్లేట్స్‌ ఉన్న హోటళ్లలోకి దూసుకెళ్లాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఇదిలా ఉంటే.. దుకాణాలకు ఫిబ్రవరి చివరికల్లా కన్నడ భాషలో నేమ్‌ ప్లేట్స్‌ గనుక ఉండకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవంటూ Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) హెచ్చరించింది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement