
సాక్షి, బళ్లారి/చిత్రదుర్గ: కర్ణాటక ప్రజలపై, కన్నడ భాషపై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన గురువారం కర్నాటకలోని మొళకాల్మూరులో పాదయాత్ర నిర్వహించారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రల్లో భాగంగానే కన్నడ భాషపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. కన్నడ ప్రజల, భాష జోలికి రావొద్దన్నారు. అవి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. రాహుల్ యాత్ర శుక్రవారం ఉదయం బళ్లారి జిల్లాలోకి ప్రవేశించనుంది.
Comments
Please login to add a commentAdd a comment