Try To Ban RSS Congress Will Burn To Ashes: Karnataka BJP Chief Warning - Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ను బ్యాన్‌ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక

Published Sat, May 27 2023 4:22 PM | Last Updated on Sat, May 27 2023 4:54 PM

Try to Ban RSS Congress Will Burn To Ashes: Karnataka BJP chief Warning - Sakshi

కర్ణాటకలో ఎన్నికలు ముగిసినా రాజకీయ రగడ మాత్రం చల్లారడం లేదు. తాము అధికారంలో వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌, బజ్‌రంగ్‌ దళ్‌ సంస్థలను బ్యాన్‌ చేస్తామంటూ కాంగ్రెస్‌ తమ మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ వివాదం నేటీకి కొనసాగుతోంది. నిజంగానే కర్ణాటక ప్రభుత్వం బజ్‌రంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తుందా అనే దానిపై.. ఇటీవల కాంగ్రెస్‌ మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఏ సంస్థనైనా సహించేది లేదన్నారు. అది పీటీఐ, ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌ అయినా సరే చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఆ సంస్థల్ని నిషేధించడానికి కూడా వెనకాడమన్నారు. 

ఇదే విషయంపై ప్రస్తుతం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దమ్ముంటే కాంగ్రెస్ బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని సవాల్ విసురుతోంది కాషాయ పార్టీ. తాజాగా ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌ స్పందించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడితే ఆర్‌ఎస్‌ఎస్‌ను బ్యాన్ చేస్తామంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను బ్యాన్‌ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ను బూడిద చేసేస్తామని హెచ్చరించారు. 
చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే?

"ఆర్‌ఎస్‌ బ్యాన్‌ చేస్తామని ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ప్రధాని నరేంర మోదీ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త. ఇప్పుడు ఆయన కేంద్రంలో అత్యున్నత పదవిలో ఉన్నారు. మేమంతా ఆ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన వాళ్లమే. అప్పట్లో  జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నర్సింహరావు ప్రభుత్వాలు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌నుని బ్యాన్ చేయాలని చూశాయి. కానీ.. వాళ్ల వల్ల కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ అదే ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ని కాల్చి బూడిద చేస్తాం. ప్రియాంక్ ఖర్గే ఈ దేశ చరిత్ర ఏంటో తెలుసుకుంటే మంచిది. తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి" అని నళిన్‌ కుమార్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement