Bharat Jodo Yatra
-
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్‌గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024 -
రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్సులు
-
రాహుల్ గాంధీ యాత్రపై సస్పెన్స్.. మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంపై సస్పెన్స్ నెలకొంది. ఈనెల 14వ తేదీ మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్ యాత్రకు అనుమతి లేనట్టు సమాచారం. అయితే, తాజాగా మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాహుల్ యాత్రపై సీఎం బీరెన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరేలో తాజాగా మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో మణిపూర్ పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో మోరేలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన సాయుధ సిబ్బందిని పట్టుకునేందుకు అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసుల ఉమ్మడి ప్రయత్నం ద్వారా ప్రస్తుతం కూబింగ్ కార్యక్రమం జరుగుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ యాత్రపై బీరెన్ సింగ్ స్పందించారు. రాహుల్ యాత్రకు అనుమతి అంశంలో పరిశీలనలో ఉంది. ఈ విషయంపై వివిధ భద్రతా సంస్థల నుండి నివేదికలు తీసుకుంటున్నాము. వారి నుండి నివేదికలు అందిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు, రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14న ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ యాత్ర కొనసాగనుంది. 66 రోజుల ప్రయాణంలో 6,713 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. చివరకు భారత్ న్యాయ్ యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగియనుంది. ఇక, రాహుల్ యాత్ర సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలతో ప్రచారం ప్రారంభించారు. Bharat Jodo Nyay Yatra Preparation in full swing. Visuals from Assam. Nyay Ka Haq Milne Tak! pic.twitter.com/hd6AudvmU8 — Amit Kumar (@yadav_Amit025) January 10, 2024 -
రాహుల్ ఓ రిజర్వ్‌బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాహుల్ గాంధీ ఓ రిజర్వ్‌బ్యాంక్ లాంటివారు. రిజర్వ్ బ్యాంకును ఖాళీ చేసేస్తే ఎలా?..’’ అని కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడతను వెంటనే చేపట్టాలని పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు ఆదివారం నాటి సమావేశాల్లో కోరగా.. ‘‘రాహుల్ గాంధీ సేవలను అవసరార్థం వినియోగించుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఖాళీ అయితే ఇబ్బంది కదా.. మీరంతా ఏం చేస్తారు? ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండండి. పార్టీని బలోపేతం చేయండి..’’ అని ఖర్గే హితబోధ చేసినట్టు సమాచారం. దేశంలో ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉందని, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ ఎజెండా ఉచ్చులో పడకుండా మన సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాలని.. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన అంశంగా ముందుకు సాగాలని మార్గనిర్దేశనం చేసినట్టు సమాచారం. కట్టు తప్పితే సహించేది లేదు పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పితే సహించేది లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కినా.. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా ఉంటామని, చర్యలు తీసుకున్నాక నిందించవద్దని పేర్కొన్నారు. ఇక ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అంశాన్ని త్వరగా తేల్చాలని కొందరు సీడబ్ల్యూసీ సభ్యులు కోరగా.. ఆ చర్చ వచ్చినప్పుడు రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటానని ఖర్గే హామీ ఇచ్చారు. మీరు చేసే సూచనల మేరకే సీట్ల సర్దుబాటు ఉంటుందని, ఆందోళన వద్దని సూచించారు. కర్ణాటక మోడల్‌తో ముందుకు.. తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వాలని, దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచించారు. పార్టీ నేతలంతా కలసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. అంతర్గతంగా సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప.. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు. రజాకార్లు మా ఇంటినీ తగలబెట్టారు మొదట దేశం మొత్తం స్వాతంత్య్రం లభించినా హైదరాబాద్ స్టేట్‌లోని ప్రజలకు స్వాతంత్రం లభించలేదని.. ఆ సమయంలో నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు ఆకాశాన్ని అంటాయని మల్లికార్జున ఖర్గే చెప్పారు. తమ ఇంటిని కూడా రజాకార్లు తగలబెట్టారని తెలిపారు. సెప్టెంబర్ 17న నిజాం పాలనకు చరమగీతం పాడటంలో సర్దార్ పటేల్, కాంగ్రెస్ నేతలుకృషి చేశారని చెప్పారు. సోనియాకు బహుమతి ఇస్తాం: రాష్ట్ర నాయకులు సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఇచ్చినప్పటికీ.. గత రెండు దఫాలుగా కాంగ్రెస్‌ను గెలిపించి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వలేకపోయాం. ఈసారి తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆమెకు బహుమతిగా ఇస్తాం’’ అని పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. -
'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ యూనివర్సిటీలోని కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులు ఇండియా పేరును భారత్ గా మార్చడంపై ప్రశ్నించగా రాహుల్ దీనిపై సానుకూలంగా స్పందించారు. రెండిటిలో ఏ పేరైనా తనకు ఆమోదయోగ్యమేనని అన్నారు. ఏదైనా ఓకే.. ఐరోపా రాజకీయ నాయకులతోనూ ప్రవాస భారతీయ నేతలతోనూ సమావేశమయ్యేందుకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ పారిస్‌లోని పీవో యూనివర్సిటీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును 'భారత్'గా మార్చడంపై ఆయన అభిప్రాయం కోరగా రాజ్యాంగంలో ఆ రెండు పేర్లను ప్రస్తావించారు.. ఇండియాగా పిలవబడే భారత్ రాష్ట్రాల సమూహమని అందులో పేర్కొన్నారు కాబట్టి తనకు ఆ రెండిటిలో ఏ పేరు పెట్టినా ఆమోదయోగ్యమేనని తెలిపారు. दिलचस्प बात है, हम जब भी अडानी पर सवाल उठाते हैं, मोदी जी एक नया ‘distraction’ ले आते हैं। 'INDIA या भारत' भी एक ऐसा ही मुद्दा है। pic.twitter.com/zZDxuavXOV — Rahul Gandhi (@RahulGandhi) September 8, 2023 'భారత్' జోడో? అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమికి ఇండియా అని పేరు పెట్టి బహుశా వారికి విసుగు తెప్పించి ఉంటాము. అందుకే వారు ఇండియా పేరునే మార్చేందుకు సిద్ధమయ్యారన్నారు. మా కూటమికి మేము వేరే పేరును పెట్టేవారమే కానీ దానివలన ప్రయోజనమేమి ఉండదు. కానీ అదేంటో మనుషులు చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంటారని అన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాద యాత్రకు 'భారత్ జోడో' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. మార్చాల్సిన అవసరమేంటి? ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సందర్బంగా భారత రాష్ట్రపతి అతిధులకు పంపిన డిన్నర్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ముద్రించడంతో దేశం పేరు మారుస్తున్నారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వారంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా రాహుల్ మాత్రం పేరు మార్పుపై అయిష్టాన్ని తెలుపుతూనే పేరు ఆమోదయోగ్యమన్నారు. The BJP government seems to be irritated with the name of our coalition. Now, they've decided to change the name of the country. People act in strange ways. : Shri @RahulGandhi 📍Sciences PO University, Paris Watch the full video here: https://t.co/uuqbjyPGMy pic.twitter.com/vlkXdBq5Yv — Congress (@INCIndia) September 10, 2023 'ఇండియా' కూటమి కాదు.. ఇక ఇండియా కూటమి పేరుపై సాక్షాత్తు ప్రధానమంత్రే అనేక సందర్భాల్లో విమర్శించిన విషయం తెలిసిందే. ఆ కూటమిని 'ఇండియా' అని కాకుండా 'ఘామండియా'(అంటే మూర్ఖులు) అని పిలవమన్నారు. ఇది కూడా చదవండి: మమతా బెనర్జీపై కాంగ్రెస్ అసంతృప్తి -
దేశ భద్రత కోసమే రాహుల్ పోరాటం
సాక్షి, హైదరాబాద్ / ఖైరతాబాద్ / దిల్సుఖ్నగర్ / గచ్చిబౌలి: దేశాన్ని ఒక్కటి చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాల వరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఐమాక్స్ ఇందిరాగాంధీ రోటరీ చౌరస్తాలో మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని అహింసా పోరాటాన్ని పునాదిగా వేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు, 4,183 కిలోమీ టర్లు రాహుల్ గాంధీ నడిచారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటించాలి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటే వరకు తరమాల్సిన బాధ్యత ప్రజ లందరిమీద ఉందని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను గెలిపించాలని ప్రతిసారీ అసదుద్దీన్ చెప్తున్నాడని, అసలు ఎందుకు గెలిపించాలని నిలదీశారు. త్రిపు ల్ తలాక్‌కు మోదీకి మద్దతుగా నిలిచినందుకా, 370 ఆర్టికల్‌కు ఓటు వేసినందుకా, నోట్ల రద్దు, జీఎస్టీలో మద్దతు తెలిపినందుకు గెలిపించాలా.. అని అసదుద్దీన్‌ను ప్రశ్నించారు. లక్ష కోట్లు లూటీ చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి మద్దతు తెలుపుతున్నారంటే దాని ఆంతర్యమేంటన్నారు. దేశ హోంమంత్రికి చిల్లర రాజకీయం తగునా 16,17,18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని తలపెడితే అధికారం ఉంది కదా అని తాము బుక్ చేసుకున్న గ్రౌండ్‌ను రద్దు చేసి బీజేపీ వాళ్లు గుంజుకున్నారని రేవంత్ నిందించారు. ఇంత చిల్లర రాజకీయం హోంశాఖ మంత్రి చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేశాయని, ఇందుకు ప్రతిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కదలి వచ్చి మూడు రోజులపాటు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టాలని, అత్యద్భుతంగా ఏఐసీసీ సమావే శాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ... దేశాన్ని కలిపేందుకు ధర్మాలను ఒకటి చేసేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేశారని ఇది ప్రపంచ రికార్డ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్, రోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలో భట్టి.. కోదాడలో ఉత్తమ్..ఎల్బీనగర్లో యాష్కీ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టా యి. మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేటలో జరిగిన పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కోదాడలో జరిగిన యాత్రలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్బీనగర్లో జరిగిన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. రేపు భట్టి పాదయాత్ర ‘డైరీ’ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర డైరీని శనివారం ఆవిష్కరించనున్నారు. సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సురేందర్ రచించిన ఈ డైరీని గాంధీభవన్‌లో విడుదల చేయనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే హాజరుకానున్నారు. మేకిన్ ఇండియా అని భారత్ పేరు పెడతారా.. మేకిన్ ఇండియా అన్న పీఎం మోదీ ఇప్పుడు ఇండియా పేరు తీసేసి భారత్ పేరు పెడతాననడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు కలిసి ఇండియా కూటమి కడితే.. దాన్ని ఎదుర్కోలేక ఇండియా పేరు మారుస్తానన్న భావదారిద్య్రం ప్రధాన మంత్రికి, బీజేపీకి వచ్చిందంటే సిగ్గుపడాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే గానీ ఈ దేశం పేరు మారిస్తే ఎవరి బతుకుల్లోనూ మార్పులు రావన్నారు. మోదీ పాలనలో దేశ భద్రతకే ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: పొంగులేటి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని... అందరికీ ఇందిరమ్మ పథకాలు అందిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో–చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీనియర్ నేత రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లో ర్యాలీ నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ జోడో యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్న రాహుల్ ప్రధాని అయిన తరువాత పరిష్కరిస్తారని తెలిపారు. -
భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తైన వేళ హైదరాబాద్‌లో ర్యాలీ
-
యాత్ర 2.0 కోసం కొత్త స్ట్రాటజీ
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. మొదటి దఫా భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం.. ఫలితం విషయంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉండడంతో రెండో దఫా ఎప్పుడుంటుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యాత్ర 2.0 మొదలుకానుందని కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో యాత్ర నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ హెడ్ దిగ్విజయ్ సింగ్.. యాత్ర 2.0 కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గత వారం నుంచి పలువురు పార్టీ కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర-2 ప్రారంభ తేదీ, రూట్‌మ్యాప్ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ మెంబర్ ఒకరు చెబుతున్నారు. ఈ అంశాలపై తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని అంటున్నారాయన. గాంధీ పుట్టిన గడ్డ నుంచే.. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022లో కన్యాకుమారి(తమిళనాడు) నుంచి ప్రారంభమై.. జనవరి 30, 2023 శ్రీనగర్(జమ్ముకశ్మీర్)తో ముగిసింది. యాత్రను ప్రారంభించడానికి ముందు అహ్మదాబాద్(గుజరాత్)లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పించాడు కూడా. దీంతో గాంధీ జన్మస్థలం అయిన పోర్బందర్(గుజరాత్) నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. అలా.. పోర్బందర్ నుంచి పలు రాష్ట్రాల గుండా అగర్తలా(త్రిపుర)తో యాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని భావిస్తోంది. జోడో యాత్రలా కాకుండా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. దీంతో రెండో దఫా యాత్రను పశ్చిమం నుంచి తూర్పు వైపునకు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఎంతలేదన్న యాత్రకు ఆరు నెలల టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి.. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని ఓ సీనియర్ నేత అభిప్రాయపడుతున్నారు. అలాగే సార్వత్రి ఎన్నికలకూ పెద్దగా సమయం ఉండదు. సమయం తక్కువగా ఉండడంతో యాత్రను మొదటి యాత్రలా పూర్తి మార్గం గుండా కాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో(అదీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో) చేసేలా ఏర్పాట్లు చేసుకునే ఆలోచనను భారత్ జోడో యాత్ర నేషనల్ కమిటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘అడ్డుకునేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నించింది’
శాన్ ఫ్రాన్సిస్కో: భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం శతవిధాల ప్రయత్నాలు చేసిందని.. ప్రజలు సంఘటితంగా దానిని విజయవంతం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రను ఆపేందుకు ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించింది. బీజేపీ.. తన అధికారిని ఉపయోగించి ప్రజలను బెదిరించింది. అలాగే ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసింది. కానీ ఏదీ ఫలించకపోగా.. యాత్ర ప్రభావం మరింతగా పెరిగింది. జాయిన్ ఇండియా అనే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయంలో పాతుకుపోయినందువల్లే ఇది జరిగింది. ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు కావాల్సినదంతా ఆర్సెస్-బీజేపీ నియంత్రణలో ఉండిపోయింది. అందుకే భారత్ జోడో యాత్రను ప్రారంభించాల్సి వచ్చిందని రాహుల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అవి(ఆరెస్సెస్-బీజేపీలను ఉద్దేశించి..) భారత రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉన్నాయి. దేశంలో ప్రజల నడుమ కులం, మతం అనే గీతలు గీసి విభజించేందుకు చూస్తున్నాయి. అయితే.. భారత్ జోడో యాత్ర దేశ ప్రజలను ఏకం చేసింది. భారత్ జోడో యాత్ర ఆద్యంతం ప్రేమ, అప్యాయత, గౌరవంతో కొనసాగింది. ఒకసారి దేశ చరిత్రను గమనిస్తే గురునానక్ దేవ్ జీ, గురు బసవన్న జీ, నారాయణ గురు జీ వంటి ఆధ్యాత్మికవేత్తలు దేశాన్ని ఇదే విధంగా ఏకం చేశారు. వాళ్ల మార్గంలో నేను కూడా దేశ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ స్పష్టం చేశారు. 2022, సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. దాదాపు మూడువేలకిలోమీటర్ల పాటు సాగి ఈ ఏడాది జనవరి 30వ తేదీన కన్యాకుమారిలో ముగిసింది. ఇదిలా ఉంటే.. మరికొన్ని రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈలోపు మూడు నగరాల పర్యటన కోసం అమెరికా వెళ్లిన రాహుల్ అక్కడి చట్ట సభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీలను కలుస్తున్నారు. सरकार ने भारत जोड़ो यात्रा को रोकने के लिए पूरी ताकत लगा दी। लेकिन कुछ काम नहीं किया और यात्रा का असर बढ़ता गया। यह इसलिए हुआ क्योंकि 'भारत जोड़ो' का आइडिया सबके दिलों में है। : अमेरिका के सैन फ्रांसिस्को में @RahulGandhi जी pic.twitter.com/l5W6Fjy25g — Congress (@INCIndia) May 31, 2023 ఇదీ చదవండి: రెజ్లర్ల డెడ్‌లైన్‌పై బ్రిజ్ స్పందన ఇది -
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ ‘జోష్’..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్‌ను తెచ్చింది. అటు ఇతర రాష్ట్రాల్లో, ఇటు స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలాకాలంగా ఓటములను భరిస్తూ వస్తున్న టీపీసీసీ నేతల్లో ఈ విజయం మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయని, తెలంగాణలోనూ తామే అధికారంలోకి వస్తామని ఢంకా బజాయించి చెప్పే స్థాయిలో ఈ ఫలితాలు రాష్ట్ర నేతలకు ఊపు తెచ్చి పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్న అంచనాతో ఎన్నికలకు వెళ్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ఓడిపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేదని, కానీ కర్ణాటక ఫలితం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు తెచి్చందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీ నుంచి వలసలు తగ్గుతాయని, అదే సమయంలో పారీ్టలోకి చేరికలు పెరుగుతాయని చెబుతున్నారు. కలిసికట్టుగా.. కర్ణాటక కాంగ్రెస్‌తో పోలిస్తే తెలంగాణ పారీ్టలో నెలకొన్న గ్రూపు తగాదాలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతున్నాయి. అక్కడ శివకుమార్, సిద్దరామయ్యలు సీఎం కుర్చీ కోసం పోటీపడినప్పటికీ ఎక్కడా అంతర్గత కలహాలు బయటపడకుండా నెట్టుకొచ్చారని, ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. అధికారం దక్కాలంటే అందరం కలిసి పనిచేయాల్సిందేనని, అదే భావనకు అందరు నేతలు వస్తారని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తారని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. జోడో యాత్రపై ఆశలు కర్ణాటకలో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర నిర్వహించిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 చోట్ల కాంగ్రెస్ గెలుపొందడం తెలంగాణ పార్టీ నేతల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. గత అక్టోబర్, నవంబర్‌లో తెలంగాణలోనూ రాహుల్ జోడో యాత్ర జరిగింది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగ్గా, ఆయా స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు అక్కడి నేతల్లో మొదలయ్యాయి. నారాయణ పేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పుర, చారి్మనార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగపల్లి, పఠాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది. కర్ణాటక ఫలితాలను బట్టి ఆయా స్థానాల్లో కొంచెం కష్టపడితే విజయం సాధించగలమనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద గెలుపునకు మొహం వాచినట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరిహద్దు కర్ణాటకలో దక్కిన విజయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు వెయ్యి ఏనుగుల బలాన్నిచి్చందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
Karnataka election results 2023: కలసి ఉంటే కలదు సుఖం
రాహుల్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో, మల్లికార్జున ఖర్గే మంత్రాంగంతో ఉప్పు, నిప్పుగా ఉండే దిగ్గజ నేతలు సిద్ధూ, డీకే ఒక్కటయ్యారు. పోస్టర్ల నుంచి ప్రచారం వరకు ఒకే మాట ఒకే బాటగా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మత రాజకీయాలను సమష్టిగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అందరికీ కొత్తగా కనిపించింది. అనూహ్య విజయంతో లోక్‌సభ ఎన్నికలకు కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. అవినీతిపై ప్రచారం రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. పేటీఎంను గుర్తుకు తెచ్చేలా ‘‘పేసీఎం’’ అంటూ బొమ్మై ముఖం, క్యూఆర్ కోడ్‌తో పోస్టర్లు వేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 40% కమీషన్ సర్కార్ అంటూ ప్రచారాన్ని గ్రామ గ్రామల్లోకి తీసుకువెళ్లారు. గ్రామీణాభివృద్ధి మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులో 40% కమీషన్‌ను డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు 40 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. సిద్దూ, డీకే కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి మరే రాష్ట్రంలో లేని విధంగా బలమైన నాయకులు కర్ణాటకలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ జోడు గుర్రాలుగా మారి గెలుపు రథాన్ని పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఎన్నికల వ్యూహాల దగ్గర్నుంచి పార్టీ మేనిఫెస్టో వరకు, టిక్కెట్ల పంపిణీ నుంచి బూత్ మేనేజ్మెంట్ వరకు సంయుక్తంగా వ్యూహాలు రచించారు. పార్టీలో దిగ్గజ నాయకులిద్దరూ ఒక్కటి కావడంతో నాయకులంతా చేతులు కలపడం రావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఖర్గే అనుభవం ఏ పార్టీకైనా అనుభవజ్ఞలైన పెద్దలే కొండంత అండ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 80ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకులైన సిద్దరామయ్య, శివకుమార్లను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఖర్గే సగం విజయం సాధించారు. టిక్కెట్ల పంపిణీపై ముందస్తుగా కసరత్తు చేసి 124 మందితో తొలి జాబితా విడుదల చేయడం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తూ నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు లేకుండా చూశారు. అటు అధిష్టానానికి, ఇటు స్థానిక నాయకత్వానికి వారధిగా ఉంటూ నెల రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. సానుభూతే ఆయుధం బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన కక్షపూరిత రాజకీయాలు కూడా వికటించాయి. ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని వారు కాంగ్రెస్ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధించడం ప్రజల్లో సానుభూతిని పెంచింది. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటునెదుర్కోవడం, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌పై సీబీఐ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టడం వంటివి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే దీనికి తార్కాణం. లింగాయత్ ఓట్లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతుదారులైన లింగాయత్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చీల్చింది. బి.ఎస్. యడీయూరప్పని సీఎంగా తప్పించడంతో ఆ వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికలకు కాస్త ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాదిలు కాంగ్రెస్ గూటికి చేరడం కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ స్వయంగా లింగాయత్ మఠాలన్నీ సందర్శించి తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లన్నీ తీరుస్తామన్న హామీలు ఇవ్వడంతో ఈ సారి లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్లారు. ‘సార్వత్రిక’ విజయానికి తొలి మెట్టు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తొలి మెట్టు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వొచ్చేమో. బీజేపీయేతర పార్టీలు ఇక త్వరగా ఏకతాటి మీదకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ మత రాజకీయాలను ఓడించిన ప్రజలకు జేజేలు’’ – కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య లోకల్ వోకల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి స్థానిక సమస్యలపైనే అత్యధికంగా దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించే అంశాల జోలికి వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌పై ఆధారపడి బీజేపీ ఎన్నికలకి వెళ్లడాన్ని పదే పదే ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలే తప్ప ప్రధాని మోదీ గురించి ఎన్నికలు కాదంటూ ప్రతీ సభలోనూ గళమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పవర్ఫుల్ నాయకులనే ముందుంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకమైపోతూ స్థానిక అంశాలపైనే వారితో ముచ్చటించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా హస్తం గుర్తుకే ఓట్లు గుద్దేశారు. గ్యారంటీ కార్డుకి కురిసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈసారి ఎన్నికల్లో ఓట్లు కురిపించాయి. అయిదు హామీలతో కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీ కార్డులో గృహజ్యోతి (గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ఇంటి మహిళా యజమానికి నెలకి రూ.2 వేలు ఆర్థిక సాయం), అన్న భాగ్య (నిరుపేద కుటుంబాలకు నెలకి 10 కేజీల ఉచిత బియ్యం) యువనిధి (నిరుద్యోగ యువతకి రెండేళ్లు ఆర్థిక సాయం) శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం) హామీలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టాయి. మైనార్టీల అండదండ.. పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అందరూ భావించారు. కానీ మైనార్టీ ఓట్ల ఏకీకరణ జరిగి కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఓల్డ్ మైసూరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలతో ముస్లిం ఓటర్లందరూ ఏకమయ్యారు. ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయేవి. కానీ ఈ సారి అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ వెంటే మైనార్టీలు నడిచారు. జోడో యాత్ర జోష్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా పార్టీ విజయానికి దోహదపడింది. కర్ణాటకలో అత్యధికంగా 24 రోజులు నడిచిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎనిమిది జిల్లాల్లో 500 కి.మీ. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ నడిచారు. 2018 ఎన్నికల్లో ఈ 20 సీట్లలో అయిదు స్థానాలనే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాల్లో విజయభేరి మోగించింది. -
కర్నాటక ఎన్నికల వేళ రఘువీరా రీఎంట్రీ.. క్రియాశీల పాత్ర పోషిస్తారా?
నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళ క్రితం వరకు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సొంతూరులో వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు హఠాత్తుగా రఘువీరా మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. ఒకనాటి ఈ కాంగ్రెస్ నేత సెకండ్ ఇన్నింగ్స్‌కు కారణం ఏంటి..? మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళుగా సైలెంట్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన్ను ఓటమి పలుకరించింది. అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన రఘువీరా రాజకీయ జీవితంపై రాష్ట్ర విభజన ప్రభావం బాగా పనిచేసింది. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ నాయకులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో రఘువీరా కూడా సైలెంట్‌గా రాజకీయాల నుంచి పక్కకు జరిగి సొంత గ్రామం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతున్నపుడు ఆయన వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో హఠాత్తుగా ఆయనకు రాజకీయాల మీద గాలి మళ్లింది. కాంగ్రెస్ హైకమాండ్ రఘువీరాను బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలోనే తన స్వగ్రామం నీలకంఠాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలతో రఘువీరా సమావేశం నిర్వహించారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. కర్నాటక ఎన్నికల్లో తాను చురుగ్గా పాల్గొనబోతున్నట్లు చెప్పిన రఘువీరా.. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఏపీ రాజకీయాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు. గతంలో మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా? లేదా అన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికైతే కర్నాటక ఎన్నికల ప్రచారం మీదే ఆయన దృష్టి సారించారు. అక్కడ ఫలితాలు బాగుంటే తిరిగి ఏపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతారేమో చూడాలి. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న రఘువీరా ఇప్పుడు హఠాత్తుగా కర్నాటక ఎన్నికల రంగంలోకి దిగడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. -
జోడో యాత్రతో కొత్త జాతీయ ఒరవడి
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు. గత పదేళ్లలో ఇంటి బడ్జెట్ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతోందని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. రాహుల్ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాల కోసమే..
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు మరోసారి స్పందించారు. సదరు బాధిత మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించడంతోపాటు రక్షణ కలి్పంచడానికి వీలుగా వారి వివరాలు తెలుసుకొనేందుకు ఆదివారం ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. ప్రత్యేక కమిషనర్ సాగర్‌ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసుల బృందం ఉదయం పదింటికి తుగ్లక్ రోడ్డులోని రాహుల్ ఇంటికి వెళ్లినా ఆయన్ను కలవలేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వెళ్లిపోయింది. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి రావడం ఇటీవల ఇది మూడోసారి. ‘లైంగిక వేధింపులకు గురవుతున్నామంటూ మిమ్మల్ని వేడుకున్న మహిళల వివరాలు తెలపండి’ అంటూ రాహుల్‌కు ప్రశ్నావళితో నోటీసు పంపించారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ ఇంటికి పోలీసుల వచ్చారన్న సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ ఖేరా, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్ తదితరులు ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో జోడో యాత్ర జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్థానికంగా దర్యాప్తు జరిపామని, మహిళలపై లైంగిక వేధింపులు జరిగినట్లు, సమస్యను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు నిర్ధారణ కాలేదని ప్రత్యేక కమిషనర్ సాగర్‌ప్రీత్ హుడా చెప్పారు. ‘‘రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలో తానే స్వయంగా ఆయనను కలిసి, వివరాలు తెలుసుకుంటా’’ అని చెప్పారు. అదానీపై ప్రశ్నిస్తున్నందుకే: రాహుల్ తన ఆరోపణపై రాహుల్ ఆదివారం సాయంత్రం 4 పేజీల్లో ప్రాథమిక ప్రతిస్పందనను పోలీసులకు పంపించారు. గౌతమ్ అదానీ అంశంలో పార్లమెంట్ లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశి్నస్తున్నందుకే పోలీసులు తన ఇంటికి వస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఇతర పార్టీలు ప్రకటనలపై కూడా ఇలాంటి శల్యపరీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వడానికి 8 నుంచి 10 రోజుల సమయం కోరారు. కుట్రపూరితంగానే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వెళ్లడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక రాహుల్‌ను వేధించి, బెదిరించే కుట్ర ఉందని పార్టీ నేతలు అశోక్ గహ్లోత్, జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చేసే ప్రకటనలపై కేసులు నమోదు చేసే దుష్ట సంస్కృతికి మోదీ సర్కారు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర పారీ్టల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేసే ప్రకటనలపై ఇకపై ఇలాంటి కేసులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. పోలీసులు వారి విధులను వారు నిర్వర్తించారని, ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని తేల్చిచెప్పారు. చట్టప్రకారమే వారు నడుచుకున్నారని తెలిపారు. अडानी के साथ PM मोदी के रिश्ते पर श्री राहुल गांधी के सवालों से बौखलाई सरकार पुलिस के पीछे छिप रही है। भारत जोड़ो यात्रा के 45 दिन बाद राहुल गांधी जी को दिल्ली पुलिस ने नोटिस दिया है, जिसमें उन महिलाओं की जानकारी मांगी गई है जो उनसे मिलीं और खुद के उत्पीड़न के बारे में बात की। pic.twitter.com/fgioVK413V — Congress (@INCIndia) March 16, 2023 చదవండి: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ.. -
ప్రజాస్వామ్యంపై దారుణ దాడి
లండన్: నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్.. భారత ప్రజాస్వామ్య మౌలిక స్వరూపంపై దాడికి తెగబడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌దాకా భారత్ జోడో యాత్రగా ముందుకు కదిలామని ఆయన వివరించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం సాయంత్రం లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఐజేఏ) కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘ దేశ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం ప్రమాదంలో పడింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మోదీ సర్కార్ ముమ్మరం చేసింది. దేశం గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ యత్నాన్ని అడ్డుకునేందుకు భారత్ జోడో యాత్రగా ప్రజల వాణిని వినిపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే యాత్ర చేపట్టాం. విపక్షాల ఐక్యత కోసం సంప్రతింపులు చురుగ్గా సాగుతున్నాయి. నిరుద్యోగిత, పెరిగిన ధరలు, మహిళలపై హింసతో పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి జరుగుతోంది’ అని రాహుల్ అన్నారు. ‘ఇటీవల ముంబై, ఢిల్లీలో బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖతో సర్వే పేరిట ఆకస్మిక దాడులు చేయించి భయపెట్టి, కేంద్రం మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. బీబీసీ మోదీ సర్కార్ మాట వింటే సంస్థపై మోపిన తప్పుడు కేసులన్నీ మాయమవుతాయి’ అని ఆరోపించారు. ప్రతిష్ట దిగజార్చింది ఆయనే విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ మాట్లాడారని శుక్రవారం బీజేపీ చేసిన విమర్శలపై రాహుల్ బదులిచ్చారు. ‘ నా దేశాన్ని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అది నా స్వభావం కూడా కాదు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లి మోదీయే ఆ పనిచేశారు. గత దశాబ్దకాలంలో భారత్ అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. దేశ పురోగతికి పాటుపడిన ఇక్కడి ప్రజలను ఆయన అవమానించలేదా ? ’ అని ప్రశ్నించారు. -
ఉద్యమకారులను విస్మరించి ద్రోహులకు పదవులా?
సిరిసిల్ల: తెలంగాణ వచ్చినంక కాపలా కుక్కలాగా ఉంటానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు పిచ్చి కుక్కలాగా మారారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. ఆ కుక్కను తరిమికొట్టాలని ప్రజల కు పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో శనివారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్నచౌక్‌లో రేవంత్ ప్రసంగించారు. ఉద్యమకారులెవరూ ఆస్తులు కూడబెట్టలేదు.. చరిత్రలో ఎందరో ఉద్యమకారులున్నా ఎవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కానీ సీఎం కేసీఆర్‌కు మాత్రం వంద ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను ఆయన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ల్యాండ్, స్యాండ్, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఓ చిన్నారిని కుక్క కరిచి చంపితే సీఎం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, ఆదుకోవాలనే సోయి కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ ఇచ్చినోళ్లకు అవకాశం ఇవ్వండి.. ‘తెలంగాణ తెచ్చానని చెప్పే కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిచ్చారు. మరి తెలంగాణ ఇచ్చినోళ్లకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి’అని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. 2004లో కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటి సోనియాకు కృతజ్ఞతగా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల నేతన్నలనూ మోసం చేస్తూ.. బతుకమ్మ చీరల పేరిట, మ్యాక్స్ సంఘాల పేరిట మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేతన్నలను మోసగిస్తూ మాఫియాలను పెంచి పోషిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. నేతన్నలకు నూలు డిపోలు అందుబాటులోకి రాలేదని, అపెరల్ పార్క్ పూర్తి కాలేదని, నేత కార్మికులు ఓనర్లు కాలేదన్నారు. కాగా, నేరెళ్ల దళితులపై పోలీసులు దాడి చేసినప్పుడు మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని, ఎవరికి లొంగిపోయారని రేవంత్ ప్రశ్నించారు. సభలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కార్యక్రమ ఇన్చార్జి గిరీశ్, నేతలు షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కె.కె.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కమీషన్లు వస్తేచాలా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమాని రాష్ట్రాన్ని శాసిస్తున్న కేటీఆర్.. సొంత నియోజకవర్గంలో శ్రీపాదసాగర్ ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కాల్వ పనులు పడకేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘మీకు కమీషన్లు వచ్చేస్తే చాలా?.. కాల్వల్లోకి నీళ్లు రావాల్సిన అవసరం లేదా?’అని ఆ ట్వీట్లో రేవంత్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో అపశ్రుతి ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): హాథ్‌సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శివారులోని సింగసముద్రం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. సింగసముద్రంలోకి వెళ్లే కాల్వను పరిశీలించి సిరిసిల్లకు తిరిగి వస్తుండగా రాచర్లతిమ్మాపూర్ స్టేజీ సమీపంలోని తుర్కపల్లి వద్ద రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో రాగట్లపల్లికి చెందిన రవితోపాటు పలువురు విలేకరులు గాయపడ్డారు. రేవంత్ క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
2024 General Election: పొత్తులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
నవ రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్): ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భావసారూప్య పార్టీలతో చేయిచేయి కలిపేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. లక్ష్య సాధన కోసం త్యాగాలు చేసేందుకు వెనుకాడబోమని ఉద్ఘాటించారు. రాయ్‌పూర్‌లో పార్టీ ప్లీనరీలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఢిల్లీ ప్రధానసేవకుడైన ఆయన ముఖచిత్రంతో రోజూ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఆయన మాత్రం తన సొంత స్నేహితుడి కోసం సేవలందిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘పేదల వ్యతిరేక వైఖరి బీజేపీ డీఎన్ఏలోనే ఉంది. ప్రజాస్వామ్యం ఖూనీకాకుండా ఆపేందుకు ప్రజాఉద్యమం వెల్లువలా రావాల్సిన అవసరమొచ్చింది. భారత్ జోడో యాత్ర.. ప్రజాసమస్యలకు గొంతుకగా మారింది. బీజేపీ హయాంలో రాజ్యాంగ విలువలు, సామాజిక సామరస్యం దెబ్బతిన్నాయి. చైనాతో సరిహద్దు వివాదం, పెచ్చరిల్లుతున్న విద్వేషం, పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆర్థిక అసమానతలు దేశానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని భావసారూప్య పార్టీలే కొత్త ప్రభుత్వపాలన ద్వారా ప్రజాసంక్షేమాన్ని సాధ్యంచేయగలవు. అందుకోసం ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సదా సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటరీ, రాజ్యాంగ సంప్రదాయాలను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ఈడీ, సీబీఐలను బీజేపీ రంగంలోకి దింపింది. ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ సమావే శాలకు ఇబ్బందికలిగేలా ఇక్కడి నేతలపై ఈడీ దాడులకు తెగబడింది. అయినా నేతలు తెగవతో ఎదుర్కొని సమావేశాలు సజావుగా సాగేలా చేశారు’ అని అన్నారు. రైతుకు రూ.27.. వారికి రూ.1,000 కోట్లు కుబేరుడు గౌతమ్ అదానీని ఉద్దేశిస్తూ.. ‘ దేశం ఎటు పోతోంది? ఓవైపు రైతుకు రోజుకు కేవలం రూ.27 ఆదాయం దక్కుతుంటే ప్రధాని స్నేహితుడు రోజుకు రూ.1,000 కోట్ల ఆదాయం ఎలా రాబట్టగలుగుతున్నారు? కోవిడ్ కాలంలో ప్రధాని స్నేహితుల సంపద 1,300 శాతం ఎగసింది. రైల్, భెయిల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్), సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా).. ఇలా ప్రతీదీ వారికే ధారాదత్తం చేస్తున్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐ అయినా ఉంచుతారో లేక వీరికే అమ్మేస్తారోనని ప్రజల్లో ఆలోచనలు పెరిగాయి. ధరాఘాతంతో దేశ ప్రజల ఇంటి బడ్జెట్ తలకిందులవుతుంటే ఇక్కడి పారిశ్రామికవేత్తలు అపరకుబేరుల అవతారం ఎత్తుతున్నారు. అధికార బుల్డోజర్ కింద పేదలు నలిగిపోతున్నారు. ఓవైపు చైనా భారత భూభాగంలోకి చొరబడుతుంటే విదేశాంగ మంత్రి జైశంకర్ తన తండ్రికి అప్పట్లో ప్రమోషన్ దక్కలేదని వాపోతారు’ అని ఖర్గే అన్నారు. ఇవే మా లక్ష్యాలు ‘ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నిత్యావసర సరకుల ధరలు దించుతాం. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గిస్తాం. రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పిస్తాం. విద్వేష వాతావరణాన్ని చెదరగొట్టి సామరస్యాన్ని సాధించి చూపుతాం. ధన బలం, అధికార బలం లేకుండా చూస్తాం. దేశ పురోభివృద్ధిలో ప్రజలతో కలిసి నడుస్తాం. ముందుండి నడిపిస్తాం’ అన్నారు. సీడబ్ల్యూసీలో 50 శాతం వారికే వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ తన పార్టీ రాజ్యాంగానికి సవరణ చేసింది. సవరణ ప్రకారం పార్టీ నుంచి ప్రధానులైన నేతలు, మాజీ ఏఐసీసీ చీఫ్‌లకు సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఉంటుంది. సీడబ్ల్యూసీ సభ్యుల సంఖ్యను 25 నుంచి 35కు పెంచారు. ఇకపై పార్టీలో కేవలం డిజిటల్ మెంబర్షిప్, రికార్డులను కొనసాగిస్తారు. మూడో ఫ్రంట్‌తో ఎన్డీయేకే మేలు మూడో ఫ్రంట్ అనే మాటే వినపడకుంటే భావసారుప్యత ఉన్న అన్ని పార్టీలను ‘గుర్తించి’, ‘సమీకరించి’, ‘ఏకంచేసే’ బృహత్తర పనికి వెంటనే పూనుకోవాలనే రాజకీయ తీర్మానం ముసాయిదాలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు లౌకిక, సామ్యవాద శక్తుల ఏకీకరణే అసలైన హాల్‌మార్క్‌గా నిలుస్తుంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయాల్సిన అత్యవసరస్థితి ఇది. ఆలస్యం చేస్తే అది ఎన్డీయేకే మేలు చేస్తుంది’ అని ముసాయిదాలో నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. -
‘జోడో’ను మూడు రోజులకే ముగిద్దామనుకున్నారు!
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా భారత్ జోడో యాత్రను మూడు రోజులకే ఆపేయాలనుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. రాహుల్‌కు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వేణు గోపాల్ శనివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మోకాలి నొప్పితో ఇబ్బందిపడిన రాహుల్..యాత్రలో తన బదులుగా మరొకరిని పెట్టాలనుకున్నారని కూడా ఆయన చెప్పారు. తన స్థానంలో సీనియర్ నేతలెవరికైనా ఆ బాధ్యతలను అప్పగించాలని సోదరి ప్రియాంకా గాంధీకి చెప్పారన్నారు. కన్యాకుమారి నుంచి యాత్ర మొదలైన మూడు రోజులకే రాహుల్ మోకాలి నొప్పి తీవ్రమైందన్నారు. అయితే, దేవుడి దయతో ఆ తర్వాత నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. రాహుల్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర జనవరి 30న జమ్మూలో ముగిసిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా.. ‘హాథ్ సే హాథ్’ యాత్రలు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 26న లాంఛనంగా ప్రారంభమైన ఈ పాదయాత్రలను సోమవారం నుంచి రెండు నెలలపాటు కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ములుగు నియోజకవర్గంలోని మేడారం నుంచి యాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే ములుగు చేరుకున్న కాంగ్రెస్ నేతలు మల్లు రవి, బలరాంనాయక్, విజయరమణారావు, సిరిసిల్ల రాజయ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8కి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రేవంత్ మేడారానికి బయలుదేరనున్నారు. ములుగుకు వెళ్లిన తర్వాత గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మేడారం చేరుకుని అక్కడ సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాదయాత్ర ప్రారంభించి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్, పస్రా జంక్షన్ల మీదుగా రామప్ప గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసిన తర్వాత మలిరోజు ఆ గ్రామం నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారని, వారంపాటు అదే నియోజకవర్గంలో తన పాదయాత్ర సాగిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ ఆమోదం తర్వాత భట్టి యాత్ర హాథ్ సే హాథ్ జోడో యాత్రల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కూడా మేడారం వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలను ప్రారంభించేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్‌కు ఆమోదం పొందిన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఇతర ఎమ్మెల్యేలు ఈ యాత్రలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరోవైపు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నేతలందరూ సోమవారం తమ తమ నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్రలను ప్రారంభించనున్నారు. -
వేయాల్సిన అడుగులు ఎన్నో...
దాదాపు 5 నెలలు... 135 రోజులు... 12 రాష్ట్రాలు... 2 కేంద్ర పాలిత ప్రాంతాలు... 75 జిల్లాలు... 4 వేల కిలోమీటర్లు... దేశానికి దక్షిణపు కొస నుంచి ఉత్తరపు కొస దాకా పాదయాత్ర... కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ (బీజేవై)కు అనేక లెక్కలున్నాయి. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో దెబ్బతిన్నాక, 2022 వేసవిలో ఉదయ్‌పూర్ ‘చింతనా శిబిరం’లో ఆత్మవిమర్శలో పడ్డ కాంగ్రెస్ దూరమైన ప్రజలకు దగ్గర కావాలన్న ‘నవ సంకల్పం’తో చేసుకున్న పాదయాత్ర ప్రతిపాదన ఎట్టకేలకు విజయవంతమైంది. విద్వేషాన్ని పెంచుతున్న బీజేపీకి విరుగుడు తామే అన్న పార్టీ చిరకాలపు మాటను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తనకు తానే తరలిన ఆకాశంలా రాహుల్ నడక సాగించారు. కార్యకర్తల్లో ఉత్సాహంతో సారథిగా ఆయనను బలోపేతం చేసినా, సోనియా మార్కు పొత్తుల చతురత కనిపించని ఈ యాత్ర వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు లాభిస్తుందన్నది ప్రశ్న. పార్టీ పునరుజ్జీవనానికి ఇదొక్కటీ సరిపోతుందా అన్నది అంతకన్నా కీలక ప్రశ్న. 2014 ఎన్నికల్లో కనిష్ఠంగా 44 సీట్లే గెలిచిన గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 2017 డిసెంబర్లో అధ్యక్షుడై, ఆపైన 2019లో 52 సీట్లే తేగలిగిన నేతగా రాహుల్‌కు ఇది పరీక్షాకాలం. వదులుకున్న పార్టీ కిరీటాన్ని మరోసారి నెత్తినపెట్టాలని తల్లి సోనియా, సమర్థకులు ప్రయత్నించినా, యువరాజు దేశసంచారానికే మొగ్గుచూపారు. అసమ్మతి, పార్టీ నుంచి పెద్దల నిష్క్రమణలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీనీ, కార్యకర్తల్నీ ఒక్కతాటిపైకి తేవడానికీ, మరీ ముఖ్యంగా తన వెంట నడపడానికీ ఆయన అందుకున్న వ్యూహాత్మక అస్త్రం బీజేవై. ప్రాంతీయ పార్టీలు, మోదీ ప్రభంజనం మధ్య కాంగ్రెస్ నానాటికీ తీసి కట్టుగా మారుతున్నప్పుడు ఆ పార్టీకి దశాబ్దాలుగా మూలస్తంభమైన కుటుంబానికి శ్రమదమాదులు తప్పవు. ‘ఇది భారత్ జోడో కాదు, కాంగ్రెస్ జోడో’ అని బీజేపీ ఆది నుంచి అల్లరి చేస్తున్నది అందుకే. అయితే, మతం ఆసరాగా విభజన రాజకీయాలు విజృంభిస్తున్న వేళ... దేశమంతా ‘కలసి పాడుదాం ఒకే పాట... కదలి సాగుదాం వెలుగుబాట’ అంటూ ప్రేమ, సమైక్యతల రాగంతో రాహుల్ ముందుకు రావడం విస్మరించలేనిది. ఈ యాత్ర అనేక లోపాలతో నిండిన చిరు ప్రయత్నమే అయినప్పటికీ... వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల్లో, నేతల్లో, మేధావుల్లో కాంగ్రెస్‌కు కొంత సానుకూలత తెచ్చింది. ప్రతి ఒక్కరితో సంభాషిస్తూ, పెరిగిన గడ్డంతో, సామాన్యుల్లో ఒకరిగా తిరుగుతున్న యువరాజుపై సదభిప్రాయమూ పెంచింది. విభజనకు అడ్డుకట్టగా భారతదేశపు మూలకందమైన భిన్నత్వంలో ఏకత్వపు ప్రేమను రాహుల్ భుజాన వేసుకోవడం దేశానికి చారిత్రక అవసరమనే భావన కలిగించింది. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్కీ ఇది అత్యవసరమే. అందుకే, సరైన సమయానికి భారత్ జోడో జరిగిందనుకోవాలి. గత నాలుగేళ్ళలో మూడే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా గెలిచిన కాంగ్రెస్‌కు రానున్న ఎన్నికల్లో విజయం కీలకం. దాని మాటేమో కానీ, 75 ఏళ్ళ క్రితం భారత తొలి ప్రధాని నెహ్రూ శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో తొలిసారి జాతీయ జెండా ఎగరేసినచోటే, పాదయాత్ర ఆఖరి రోజున రాహుల్ కూడా పతాకావిష్కరణతో చెప్పినమాట చేసిచూపారు. ప్రతీకాత్మకమే అయినా ప్రజాబాహళ్యంలోకి కాంగ్రెస్ అనుకున్న సందేశాన్ని పంపడానికి ఇది పనికొచ్చింది. అధికార బీజేపీపై సమరానికి ప్రతి పక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పాలనుకున్న బహిరంగ సభ వ్యూహం మాత్రం ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేదు. ఏకంగా 21 పార్టీల నేతల్ని కాంగ్రెస్ ఆహ్వానించినా, భారీ హిమపాతం సహా కారణాలేమైనా వచ్చింది ఒకరిద్దరే. ఇది నిరాశాజనకమే. పైగా, ఆమధ్య ఢిల్లీలో, మళ్ళీ ఇప్పుడు ఇలాగే జరిగి, ప్రతిపక్ష ఐక్యత మిథ్యేనని తేలిపోవడం మరో దెబ్బ. వ్యక్తిగతంగా మాత్రం రాహుల్‌కు ఈ పాదయాత్ర కలిసొచ్చింది. ‘నాన్ సీరియస్ పొలిటీషియన్’, ‘పప్పు’ లాంటి ఎకసెక్కపు మాటల ఇమేజ్ను ఈ యువనేత తుడిపేసుకోగలిగారు. నడకలో పదుగురితో మమేకమై, ప్రజా సమస్యలను లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే, పాదయాత్ర చేసినంత మాత్రాన ఓటర్లు వరాల వర్షం కురిపిస్తారనీ, సారథ్యం స్థిరపడుతుందనీ అనుకుంటే పొరపాటు. ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేసినప్పుడే అవి సాధ్యం. సుదీర్ఘ యాత్రతో రాహుల్ మారిన మనిషయ్యారని ఒక విశ్లేషణ. ఆయన స్నేహశీలత జనానికి తెలియడమూ మంచిదే. హర్యానా సహా కొన్ని రాష్ట్రాల్లో ఆయన పాపులారిటీ పెరిగిందనీ సర్వేల సారం. కానీ, ఇప్పటికీ మోదీకి దీటుగా కాంగ్రెస్, రాహుల్ మారనే లేదన్నది నిష్ఠురసత్యం. దాన్ని సరిదిద్దుకొనేలా ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ చేపడతారన్నది ఆసక్తికరం. ప్రతిపక్ష కూటమికి దీర్ఘకాలం సహజ సారథి అయిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ స్థానానికి కూడా పోటీని ఎదుర్కొంటోంది. మోదీకి ప్రత్యామ్నాయం తామేనని చిత్రించుకొనేందుకు పలువురు ప్రాంతీయ సారథులు తొందరపడుతున్నారు. తమలో తాము తోసుకుంటున్నారు. ఈ అనైక్యతతో చివరకు పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీరుస్తుంది. ప్రతిపక్షాలు అది గ్రహించాలి. 2024 సార్వత్రిక ఎన్నికల లోగా ఈ ఏడాదే 9 రాష్ట్రాల అసెంబ్లీ పోరు ఉంది. ఈ ప్రయాణంలో పెద్దన్నగా కాంగ్రెస్ ఆచరణాత్మక దృక్పథంతో పట్టువిడుపులు చూపాలి. ప్రేమ పంచిన ప్రేమ వచ్చును అని కవి వాక్కు. ‘మొహబ్బత్ కీ దుకాన్’ పెట్టుకొని దేశం తిరిగిన పార్టీకీ, నేతకూ ఏం చేయాలో చెప్పనక్కర్లేదు. దేశం ఈ మూల నుంచి ఆ మూలకు ఒక పాదయాత్ర ముగిసిపోయి ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్, రాహుల్‌లు నడవాల్సిన దూరం చాలానే ఉంది. వేయాల్సిన అడుగులు మిగిలే ఉన్నాయి. -
ముగిసిన జోడో యాత్ర..
ముగిసిన జోడో యాత్ర.. -
Bharat Jodo Yatra: హింసను ప్రేరేపిస్తున్నారు
శ్రీనగర్: ‘‘దేశంలో స్వేచ్ఛాయుత, లౌకిక విలువలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ నిత్యం దాడి చేస్తున్నాయి. వాటికి పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం నిరంతరం హింసను ప్రేరేపిస్తున్నాయి’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఆ విలువల పరిరక్షణకే భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు పునరుద్ఘాటించారు. జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. సభలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని, షేర్ ఏ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో సభ నిర్వహించింది. దీనిలో తొమ్మిది విపక్ష పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విపరీతంగా కురుస్తున్న మంచులో తడుçÜ్తూనే రాహుల్ మాట్లాడారు. హింస ఎంతటి బాధాకరమో మోదీ లాంటివారికి ఎన్నటికీ అర్థం కాదంటూ ఆక్షేపించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీల హత్యోదంతాలను గుర్తు చేసుకున్నారు. ‘‘వారిక లేరని ఫోన్ కాల్స్ ద్వారానే తెలుసుకున్నా. ఆ దుర్వార్తలు విని విలవిల్లాడిపోయా. అలాంటి ఫోన్ కాల్స్ అందుకోవాల్సి రావడంలో ఉండే అంతులేని బాధను, నొప్పిని కశ్మీరీలు అర్థం చేసుకోగలరు. పుల్వామా వంటి ఉగ్ర దాడులకు బలైన ఆర్మీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలు అర్థం చేసుకోగలవు. నేను, నా చెల్లెలు అర్థం చేసుకోగలం. అంతేగానీ మతిలేని హింసను ప్రేరేపించే మోదీ, అమిత్ షా (కేంద్ర హోం మంత్రి), అజిత్ దోవల్ (జాతీయ భద్రతా సలహాదారు), ఆరెస్సెస్ నేతల వంటివాళ్లు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దాని తాలూకు బాధను వాళ్లెప్పుడూ అనుభవించనే లేదు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సైనికుడు కావచ్చు, సీఆర్పీఎఫ్ జవాను కావచ్చు, కశ్మీరీ కావచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తమ వారు ఇక లేరనే దుర్వార్త మోసుకొచ్చే అలాంటి ఫోన్ కాల్స్‌కు శాశ్వతంగా తెర దించడమే జోడో యాత్ర లక్ష్యం. అంతే తప్ప నా స్వీయ లబ్ధి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. దేశ ప్రజల కోసం. దేశ పునాదులను నాశనం చేయజూస్తున్న భావజాలానికి అడ్డుకట్ట వేయడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. కశ్మీర్లో నడవాలంటే వారికి భయం బీజేపీ అగ్ర నేతలకు దమ్ముంటే తనలా జమ్మూ కశ్మీర్లో పాదయాత్ర చేయాలని రాహుల్ సవాలు విసిరారు. ‘‘అది వారి తరం కాదు. చేయలేరు. ఒక్కరు కూడా జమ్మూ కశ్మీర్లో నాలా నడవలేరు. ఎందుకంటే వారికి అంతులేని భయం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కశ్మీర్లో పాదయాత్ర వద్దని నాకు సలహాలొచ్చాయి. బులెట్ ప్రూఫ్ కార్లో చేయాలని స్థానిక యంత్రాంగమూ సూచించింది. నడిస్తే నాపై ఏ గ్రెనేడో వచ్చి పడొచ్చని హెచ్చరించింది. బహుశా నన్ను భయపెట్టడం వారి ఉద్దేశం కావచ్చు. కానీ నేను భయపడలేదు. నన్ను ద్వేషించేవారికి నా తెల్ల టీ షర్టు రంగు (ఎర్రగా) మార్చే అవకాశం ఎందుకివ్వకూడదని ఆలోచించా. ఈ రాష్ట్రం నా సొంతిల్లు. కశ్మీరీలు నావాళ్లు. వాళ్లతో కలిసి నడిచి తీరాలని నిర్ణయించుకున్నా. కశ్మీరీలు నాపై గ్రనేడ్లు విసరలేదు. హృదయపూర్వకంగా అక్కున చేర్చుకున్నారు. అంతులేని ప్రేమతో ముంచెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మనస్ఫూర్తిగా స్వాగతించి నన్ను తమవాణ్ని చేసుకున్నారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘నాకు లేనిదీ, బీజేపీ నేతలకున్నదీ భయమే. నిర్భయంగా జీవించడాన్ని మహాత్మా గాంధీ నుంచి, నా కుటుంబం నుంచి నేర్చుకున్నా’’ అన్నారు. కాంగ్రెస్ ర్యాలీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రాతో పాటు డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), సీపీఐ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్ నేతలు మాట్లాడారు. 22 పార్టీలకు ర్యాలీకి కాంగ్రెస్ ఆహ్వానం పంపగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీ(యూ) తదితర ముఖ్య పక్షాలు గైర్హాజరయ్యాయి. సోదరితో సరదాగా... భారీ భద్రత, యాత్ర, రాజకీయాలు, ప్రసంగాలు, విమర్శల నడుమ రాహుల్ కాసేపు సోదరి ప్రియాంకతో సరదాగా స్నోబాల్ ఫైట్ చేస్తూ సేదదీరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక వీడియోలో రాహుల్ రెండు మంచు ముక్కలను వెనక దాచుకుని ప్రియాంకను సమీపించి ఆమె తలపై కొట్టి ఆట పట్టించారు. ఆమె కూడా ఆయన వెంట పడి తలంతా మంచుతో నింపేశారు. తర్వాత జోడో యాత్ర క్యాంప్ సైట్ వద్ద, అనంతరం పీసీసీ కార్యాలయంలోనూ రాహుల్ జాతీయ జెండా ఎగురవేశారు. యాత్రలో తనతో పాటు కలిసి నడిచిన భారత యాత్రీలకు కృతజ్ఞతలు తెలిపారు. వణికించే చలిలోనూ ఇన్ని రోజులుగా కేవలం తెల్ల టీ షర్టుతోనే యాత్ర చేసిన రాహుల్ ఎట్టకేలకు సోమవారం జాకెట్ ధరించారు. తర్వాత పొడవాటి సంప్రదాయ బూడిద రంగు కశ్మీరీ ఫేరన్ ధరించి ర్యాలీలో, సభలో పాల్గొన్నారు. ఇదే సొంతిల్లు కశ్మీర్ తన సొంతిల్లని రాహుల్ పదేపదే గుర్తు చేసుకున్నారు. ‘‘రాష్ట్రంలో నడుస్తుంటే అప్పుడెప్పుడో సరిగ్గా ఇవే దారుల గుండా నా పూర్వీకులు కశ్మీర్ నుంచి అలహాబాద్ వెళ్లారన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. నేను నా ఇంటికి తిరిగొస్తున్నట్టు ఫీలయ్యా. ఎందుకంటే నాకంటూ ఓ ఇల్లు లేదు. చిన్నతనం నుంచీ ప్రభుత్వ ఆవాసాల్లోనే బతికాను. వాటిని నా ఇల్లని ఎప్పుడూ అనుకోలేకపోయాను. నా వరకూ ఇల్లంటే ఓ ఆలోచన. జీవన విధానం. కశ్మీరియత్ శివుని ఆలోచనా ధార. శూన్యత్వం. అహంపై పోరాడి గెలవడం. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. దీన్నే ఇస్లాంలోనూ ఫనా అన్నారు. అస్సాం, కర్నాటక, మహారాష్ట్ర... అన్ని రాష్ట్రాల్లోనూ ఈ భావధార ఉంది. దీన్నే గాంధీ వైష్ణో జనతో అన్నారు. నా పూర్వీకులు ఇక్కణ్నుంచి వెళ్లి అలహాబాద్‌లో గంగా తీరాన స్థిరపడి కశ్మీరియత్‌ను యూపీలో ప్రచారం చేశారు. అదే గంగా యమునా పవిత్ర సంగమం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా ఇంటికి వెళ్తున్నట్టు అన్పిస్తోంది’ అంటూ జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించే ముందు తల్లి సోనియాకు, తనకు రాహుల్ మెసేజ్ చేశారని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఎవరేమన్నారంటే... ఎన్నికల యాత్ర కాదు భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దేశ ప్రజలనందరినీ ఒక్కటి చేయగలనని రాహుల్ పాదయాత్రతో నిరూపించారు – మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు లౌకిక పార్టీలన్నీ ఒక్కటవాలి బ్రిటిష్ పాలనపై ఐక్యంగా పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. అలాగే బీజేపీ పాలనపైనా పోరుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలి. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి పశ్చిమం నుంచి తూర్పుకూ... శాంతి, సౌభ్రాతృత్వాలు కోరుకునే వారికి దేశంలో కొదవ లేదని జోడో యాత్ర నిరూపించింది. దక్షిణం నుంచి ఉత్తరానికి చేసినట్టుగానే దేశ పశ్చిమ కొస నుంచి తూర్పుకు కూడా రాహుల్ పాదయాత్ర చేయాలి. నేను ఆయన వెంట నడుస్తా. ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ రాహుల్ ఓ ఆశాకిరణం రాహుల్‌గాంధీలో దేశానికి ఒక నూతన ఆశా కిరణం దొరికింది. – మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు విభజన రాజకీయాలే ముప్పు విభజన రాజకీయాలు దేశానికెప్పుడూ హానికరమే. వాటిని వ్యతిరేకిస్తూ నా సోదరుడు చేసిన యాత్రకు జనం వస్తారో లేదోనని అని నేను మొదట్లో అనుకున్నా. కానీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆద్యంతం వారు భారీగా తరలి వచ్చి సంఘీభావంగా నిలిచారు. ఐక్యతా స్ఫూర్తిని చాటారు. దేశమంతా యాత్రకు ఇంతగా మద్దతుగా నిలవడం నిజంగా గర్వకారణం. – ప్రియాంకా గాంధీ వద్రా చదవండి: కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్.. -
కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్..
శ్రీనగర్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో సోమవారం ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. భారీ సభకు ఏర్పాట్లు చేసింది. అయితే కశ్మీర్లో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి మంచు వర్షం కురుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం చూసి రాహల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి మంచులో ఆటలాడుకున్నారు. ఒకరిపై ఒకరు మంచు పెల్లలు విసురుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా రాహుల్ మంచు విసిరి ఆహ్లాదంగా, సంతోషంగా గడిపారు. రాహుల్, ప్రియాంక మళ్లీ చిన్న పిల్లల్లా మారిపోవడం చూసి కార్యకర్తలు మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. शीन मुबारक! 😊pic.twitter.com/V9Y8jCf0MS — Congress (@INCIndia) January 30, 2023 చదవండి: త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్! -
నేటితో ముగియనున్న జోడో యాత్ర
శ్రీనగర్: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్లో ముగియనుది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ క్లాక్ టవర్ వద్ద అత్యంత కటుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948లో ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగరేయడం విశేషం. రాహుల్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చుకున్నానని చెప్పారు. సెప్టెంబర్ 7న మొదలైన రాహుల్ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 4 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. మతసామరస్యమే ప్రధాన ఎజెండా సాగిన ఈ యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ ఉల్లాసంగా కనిపించారు. సోమవారం ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్కే స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. బీజేపీపై పోరుకు విపక్షాలు ఏకం విపక్షాల మధ్య విభేదాలున్నా, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై పోరులో అవి ఐక్యంగా ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జోడో యాత్రలో పాల్గొనబోమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చెప్పడంపై ఆయన స్పందించారు. జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి చేరినప్పటికీ ఫలితం మాత్రం దేశమంతటా ఉందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల విద్వేషం, అహంకారంల స్థానంలో తమ యాత్ర దేశానికి సోదరభావమనే ప్రత్యామ్నాయాన్ని చూపిందని అన్నారు. -
చలో ‘భారత్ జోడో’ సభ
సాక్షి, హైదరాబాద్: గతేడాది సెప్టెంబర్ 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు తరలివెళ్లారు. సోమవారం జరిగే ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఆదివారమే రేవంత్‌రెడ్డి శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీని కలిశారు. వీరితోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు శ్రీనగర్‌కు వెళ్లారు. భారత్ జోడోయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులకు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఈ నాయకులందరూ శ్రీనగర్ బాట పట్టారు. నేడు సంఘీభావంగా సర్వమత ప్రార్థనలు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. భారత్ జోడోయాత్ర ముగింపు, గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాల్లో ప్రత్యేక పూజలు చేయాలని ఇటీవల జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. జనవరి 26న హాథ్ సే హాథ్ జోడో యాత్రలను లాంఛనంగా ప్రారంభించగా, 30న అన్ని మతాల ప్రార్థనలు చేసి, ఫిబ్రవరి 6 నుంచి అట్టహాసంగా హాథ్ సే హాథ్ జోడో యాత్రలను ప్రారంభించి రెండు నెలలపాటు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.