ఉత్తర భారతదేశంలో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఇళ్లకే పరిమితమయ్యేలా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినా ఇవేమి లెక్కచేయకుండా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడోయాత్ర జయపద్రంగా సాగిపోతోంది. అదీగాకా రాహుల్ ఈ చలిలో కేవలం టీ షర్టు ధరించి చేయడం ఒక హాట్ టాపిక్‌గా కూడా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడూ ఈ గడ్డ గట్టే పొగమంచు చలిలో కాంగ్రెస్ కార్యక్తరలు బస్‌టాప్‌పై నుంచుని ప్రజలకు అభివాదం చేయగా..మరికొందరూ కాంగ్రెస్ మద్దతుదారులు బస్ టాప్‌పై నుంచోని డ్యాన్స్‌లు చేస్తూ ఆకర్షణగా కనిపించారు.
ఈ ఘటన హర్యానాలోని కర్నాల్‌లో సాగుతున్న జోడో యాత్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా, భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తిరిగి హర్యానాలోకి ప్రవేశించింది. జనవరి 10 కల్లా నాలుగు జిల్లాలను కవర్ చేయనుందని అధికారిక వర్గాల సమాచారం. అయినా డిసెంబర్ 21 నుంచి 23 వరకు మొదటి దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ తదితర జిల్లాను చుట్టి.. సుమారు 130 కిలో మీటర్లు పర్యటించినట్లు తెలిపారు.
#WATCH | Congress supporters dance shirtless amid dense fog during Bharat Jodo Yatra in Haryana's Karnal pic.twitter.com/0kmHmkL1nK
— ANI (@ANI) January 8, 2023
Comments
Please login to add a commentAdd a comment