Bharat Jodo Yatra: Rahul Gandhi Blows Flying Kisses To Public As His Yatra Crossed BJP Office - Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: బీజేపీ కార్యకర్తలపై రాహుల్‌ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్‌

Published Tue, Dec 6 2022 12:00 PM | Last Updated on Tue, Dec 6 2022 3:08 PM

Rahul Gandhi Blew Flying Kisses As His Yatra Crossed BJP Office - Sakshi

జైపూర్‌: దేశవ్యాప్తంగా ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రస్తుతం రాజస్థాన్‌లో యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం ఝలావార్‌లో యాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ.. బీజేపీ కార్యాలయం దాటుతుండగా ఆ భవనంపై ఉన్న కాషాయ కార్యకర్తలకు ఫ్లైయింగ్‌ కిస్సెస్‌(ముద్దులు) వర్షం కురిపించారు. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజునే.. ఈ విధంగా ప్రవర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ ముద్దుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

మంగళవారం ఉదయం ఖేల్‌ సంకుల్‌ నుంచి యాత్రను ప్రారంభించారు రాహుల్‌ గాంధీ. ఝలావర్‌ నగరాన్ని దాటుకుని వెళ్లారు. రాహుల్‌తో పాటు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌, ఆర్‌పీసీసీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోటస్రా, సచిన్‌ పైలట్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సుమారు 12 కిలోమీటర్ల యాత్ర తర్వాత దేవరిఘాటాకు చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత 3.30 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే యాత్ర మోరు కలాలన్‌ ఖేల్‌కు చేరుకుంటుంది.

ఇదీ చదవండి: ‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెడుతున్నాం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement