flying kiss
-
రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్సులు
-
'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' రాహుల్ ఫ్లయింగ్ కిస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే..
ఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ ఈ అంశంపై మాట్లాడటం రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే రాహుల్‌కు అమ్మాయిల కొరత ఏం లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ మాట్లాడటంపై బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో సభ నుంచి వాకౌట్ చేస్తున్న క్రమంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. అయితే.. రాహుల్ చర్యను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. తమను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. మహిళా ఎంపీలను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చర్య మహిళలపై కాంగ్రెస్ ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై బిహార్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నీతు సింగ్ తాజాగా స్పందించారు. If Rahul Gandhi wants to give flying kiss he has many women available He won’t give it to a 50 year old budhiya Congress MLA from Bihar : Neetu Singh Anti women Congress can even defend Rahul’s misdemeanours inside the House pic.twitter.com/oXRz67ZqlX — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 10, 2023 నీతు సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే.. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలకు ఇస్తాడు.. కానీ ఆ 50 ఏళ్ల మహిళకు ఎందుకు ఇస్తాడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్‌పై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అన్ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. యాంటీ మహిళా కాంగ్రెస్ రాహల్ చర్యను సమర్థిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: బ్రిటీష్ కాలం చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు -
లోక్ సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్
-
నిండు సభలో.. మహిళా మంత్రికి ముద్దులా?
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్‌లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్‌కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్‌పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్‌గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్‌ను కుదిపేసేలా కనిపిస్తోంది. సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌ది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్‌సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్‌కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్‌సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు. ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్‌కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్‌సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. మణిపూర్‌పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్ లోక్‌సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్‌పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు. -
మరో వివాదంలో రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేవలం స్త్రీద్వేషి మాత్రమే ఇలా తమ స్థానాల్లో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తారేమో అంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. తన చేష్టల ద్వారా ఆయన అగౌరవంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. In this video MP Rahul Gandhi can be showing blowing 'Flying Kiss'. pic.twitter.com/5XnHWHQwkD — Facts (@BefittingFacts) August 9, 2023 ఇదిలా ఉంటే రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు, మంత్రులు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, మోదీ సర్కార్‌పై విరుచుకుపడగా.. కౌంటర్‌గా స్మృతి ఇరానీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. బీజేపీది అనవసర రాద్ధాంతం ఇదిలా ఉంటే రాహుల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు వీడియోలో ఉందని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరోసారి క్విట్ ఇండియా చేపట్టాలి: స్మృతి ఇరానీ -
భార్య అనుష్కకు కోహ్లి ముద్దుల వర్షం
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఇక రాజస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లి చేసిన ఒక చర్య సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 14వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని జైశ్వాల్ భారీ షాట్‌కు యత్నించాడు. హర్షల్ వేసిన ఫుల్‌టాస్ బంతిని లాంగాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కోహ్లి చేతుల్లో సురక్షితంగా పడింది. అంతే కోహ్లి.. స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్కకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. True #ViratKohli fans will not scroll down without liking this picture. #IPL2023 #RCBvRR pic.twitter.com/ZN9Nf64qlG — Mayur (@133_AT_Hobart) April 23, 2023 pic.twitter.com/o7ZM5ofPmg — The Game Changer (@TheGame_26) April 23, 2023 -
గిల్ డకౌట్.. ఫ్లైయింగ్ కిస్‌తో సెలబ్రేషన్స్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా చేసిన సెలబ్రేషన్ వైరల్‌గా మారింది. Photo: IPL Twitter విషయంలోకి వెళితే.. కృనాల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతిని గిల్ లాంగాఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న బిష్ణోయి ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సమయంలో పాండ్యా ఆకాశంవైను చూస్తూ దేవుడా నువ్వు ఉన్నావు అన్నట్లుగా ప్లైయింగ్ కిస్‌తో సెలబ్రేషన్ చేసుకున్నాడు. pic.twitter.com/7qHlPdH8Eb — IPLT20 Fan (@FanIplt20) April 22, 2023 -
బీజేపీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్
జైపూర్: దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాజస్థాన్‌లో యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం ఝలావార్‌లో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ.. బీజేపీ కార్యాలయం దాటుతుండగా ఆ భవనంపై ఉన్న కాషాయ కార్యకర్తలకు ఫ్లైయింగ్ కిస్సెస్(ముద్దులు) వర్షం కురిపించారు. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజునే.. ఈ విధంగా ప్రవర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ప్రస్తుతం రాహుల్ గాంధీ ముద్దుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంగళవారం ఉదయం ఖేల్ సంకుల్ నుంచి యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఝలావర్ నగరాన్ని దాటుకుని వెళ్లారు. రాహుల్‌తో పాటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, ఆర్‌పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోటస్రా, సచిన్ పైలట్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సుమారు 12 కిలోమీటర్ల యాత్ర తర్వాత దేవరిఘాటాకు చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత 3.30 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే యాత్ర మోరు కలాలన్ ఖేల్‌కు చేరుకుంటుంది. नफ़रत का जवाब सिर्फ़ मोहब्बत है !!❤️🔥💗 ये तस्वीर देखिये..👇🏻 pic.twitter.com/IHkagK97xW — Rajasthan Youth Congress (@Rajasthan_PYC) December 6, 2022 ఇదీ చదవండి: ‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’ -
Viral Video: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి..
-
వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి..
పెళ్లి.. ఈ రెండక్షరాల పదం రెండు వ్యక్తుల జీవితాలను ఎల్లకాలం ముడిపెడుతుంది. రెండు కుంటుంబాలను ఒక్కటి చేసుంది. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో పెళ్లి అనేది కొత్త సవాళ్లకు నాంది పలుకుతుంది.. అత్తారిల్లు అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో బంధాలు, బాధ్యతలను నేర్పుతోంది. అలాంటి పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోవాలనే అందరూ కోరుకుంటారు. చదవండి: వైరల్: ‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారు’ ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. అసలిందులో ఏముందంటే.. పెళ్లి కోసం అందంగా ముస్తాబైన వధువు తనకు కాబోయే వాడికోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలోనే మగపెళ్లి వారంతా వధువు ఇంటి వద్దకు చేరుకుంటారు. ఊరేగింపుతో వరుడు వస్తుండగా బాల్కనీలో నుంచి చూస్తూ పెళ్లి కూతురు తెగ సంబరపడిపోతుంటుంది. చదవండి: వైరల్: మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి..! అయితే ఆమెను వరుడు చూడకపోవడంతో అక్కడున్న వేరే వారికి సైగలు చేసి చివరికి అతను చూసేలా చేస్తుంది. ఇంకేముంది వరుడు చూడటంతో సంతోషం పట్టలేక గాల్లో అతనికి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ తన ప్రేమను తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వెడ్డింగ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘హార్ట్ ఎమోజీని జతచేస్తూ, వారిద్దరు ఎంతో అదృష్టవంతులు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
స్పీకర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఎమ్మెల్యే!
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యే తమ నియోజకవర్గ సమస్యలను సభలో వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన పని సభలోని అందరిచేత నవ్వుల పువ్వులు పూయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఎస్ఎన్ పాత్రోకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే, ఇందులో వేరే ఉద్దేశం లేదని, తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని ఈ రోజు సమయం ఇవ్వటంతో కృతజ్ఙతతోనే ఇలా చేశానని ఆయన తెలిపారు. మొత్తం 147మంది ఎమ్మెల్యేలు సభలో ఉండగా.. తనకే మొదట మాట్లాడే అవకాశం స్పీకర్ కల్పించారని అందుకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. -
ఫ్లైయింగ్ కిస్ ఎఫెక్ట్.. మూడేళ్లు జైలులోనే
చండీగఢ్: ఆడవారిని చూడగానే కొందరు మగాళ్లకు బుద్ధి వెర్రి తలలు వేస్తుంది. వారిని ఏడిపించాలని.. అసభ్యంగా ప్రవర్తించాలనే బుద్ధి పుడుతుంది. దాంతో పనికి మాలిన వేషాలు వేస్తుంటారు. అవతలివారికి చిర్రెత్తుకొస్తే.. ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఇలాంటి సంఘటనే ఒకటి పంజాబ్ రాష్ట్రం మొహాలి పట్టణంలో జరిగింది. పొరుగింటి వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. దాని ఫలితం ఏంటంటే.. కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు.. వినోద్ అనే యువకుడు మొహాలిలోని ఓ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో వినోద్ ప్లాట్‌కు ఎదురుగా ఓ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది కాలం నుంచి వినోద్ సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెను చూడగానే ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వడం.. అసభ్యకర భంగిమలు చూపడం వంటివి చేస్తున్నాడు. దీని గురించి ఆ మహిళ తన భర్తకు చెప్పడం.. అతడు వినోద్‌కు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగాయి. కానీ వినోద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో విసిగిపోయిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు వినోద్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.3వేల జరిమానా కూడా విధించింది. -
‘ముద్దు’ మందారం
ముద్దు అంటే..? ఛీ.. ఏమిటా ప్రశ్న అని అనుకుంటున్నారా.? మీరు ఆ ఆలోచనల్లోంచి ముందు బయటకు వచ్చేయండి... ఎందుకంటే ముద్దు అంటే కేవలం శృంగార భావన మాత్రమే కాదు. అప్పుడే బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికందుకు పొత్తిళ్లలో అమ్మ ఇచ్చే తొలి కానుక ముద్దు. మీ అబ్బాయి చాలా మంచోడని ఎదుటివారి మెచ్చుకోలు విని నాన్న ఇచ్చే ప్రేమ బహుమతి ముద్దు. గెలుపు తలుపు తట్టినప్పుడు పట్టరాని సంతోషంతో స్నేహితుడు ఉద్వేగంతో ఇచ్చే తొలి కానుక ముద్దు. అందుకే ముద్దు అంటే రెండు బంధాలను కలిపే నులివెచ్చని స్పర్శ. ఆనందాన్ని పంచే లకింత. ఎదుటివారికి ఓ పలకరింత సాక్షి, విశాఖపట్నం : ఒక్కో బంధంలో ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుందీ ముద్దు. తల్లి బిడ్డకు ఇచ్చే ముద్దులో కడుపు తీపి, అన్న.. చెల్లికి ఇచ్చే ముద్దులో అనురాగం.. స్నేహితులు ఇచ్చుకునే ముద్దులో నమ్మకం.. ప్రేమికుడు ఇచ్చే ముద్దులో వలపు విశ్వాసం.. ఇలా ఒక్కో ముద్దు.. ఒక్కో అనుబంధాన్ని.. అనుభూతిని అందిస్తుంది. భావం వేరైనా ముద్దుతో పరవశాన్నే కాదు.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చుంబనాల సంగతుల్ని ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే సందర్భంగా ముద్దు ముద్దుగా చదువుకుందాం. పక్షులు ముక్కులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి.. పశువులు మూతులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి. ఏ ప్రాణి ఎలా ముద్దు పెట్టుకున్నా.. ముద్దు ప్రస్తావన మాత్రం తొలిసారి మహాభారతంలోనే వచ్చింది. అంటే.. అధర చుంబనానికి నాంది భారతదేశమే అయినా.. అది విశ్వవ్యాప్తం అవ్వడానికి మాత్రం అలెగ్జాండరే కారణమని చరిత్ర చెబుతోంది. ఏదేమైనా..గుండెల్లో ఘనీభవించిన ప్రేమను.. ధ్రువీకరించుకునే ప్రయత్నమే ముద్దు. నిన్ను ముద్దాడాలంటే మనసంటూ ఉండాలే వెర్రిదానా.. అన్నాడో సినీ కవి. నిజమే మరి.. ముద్దు పెట్టాలంటే మనసు ప్రతిస్పందించాలి. కిస్ అంటే ఇష్టం లేనివారెవ్వరూ లేరు ఈ సమాజంలో పసి పిల్లల ముద్దుల నుంచి బోసి నవ్వుల బామ్మల కిస్ వరకూ అందరికీ ఇష్టమే. సులభమైన మార్గంలో ఎదుటి వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఉన్న విశ్వంలోని ఏకైక భాష చుంబనం. ముద్దెందుకు పెట్టుకుంటారు... ఇది చిలిపి ప్రశ్నే అయినా.. సమాధానంలో మాత్రం చాలా భావం దాగి ఉంది. అసలు ఎందుకు చుంబించుకుం టారంటే.. సరదాకని కొందరు, ఆనందానికని ఇంకొందరు, ప్రేమతో అని మరికొందరు.. ఇలా నచ్చినట్లుగా చెబు తా రు. కానీ అసలు దాని వెనుక ఉన్న ప్రేరణ గురిం చి మాత్రం చెప్పలేరు. ఎందుకంటే.. ఎదుటి వ్యక్తిని ముద్దుపెట్టు కోవాలంటే శరీరంలో కొన్ని నరాల్లో ప్రకంపనాలు కలుగుతూ హార్మోనులు ఉత్పత్తై కిస్ చెయ్యాలనే ప్రేరణ కలిగిస్తాయి. పాలిచ్చినప్పుడు కొడుకుని చూసి మురిపెంతో ముద్దు పెట్టేందుకు కలిగే ప్రేరణ, బుల్లిపెదాలపై బోసి నవ్వులు పులుముకొని పలకరించేలా చూసే చిన్నారి బుగ్గల్ని ముద్దు పెట్టాలనే ప్రేరణ.. ఇలా హార్మోనులు మెదడుపై చూపించే ప్రభావమే ముద్దుకు మూలకారణం. ఆనందం పెరుగుతుందా... చుంబించుకుంటే.. అదో పెద్ద రిలీఫ్. ఎందుకంటే శరీరంలోని వివిధ కండరాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దాంతో శరీరమంతా రిలాక్స్అవుతుంది. అడ్రినల్, పిట్యుటరీ, గొనాడ్.. ఇలా అనేక గ్రంథులు ఇందుకు సహకరిస్తాయి. ఇవన్నీ మనిషిలో ముద్దు ప్రవర్తనను నియంత్రిస్తాయి. ఈ గ్రంథులు స్రవించే హార్మోన్లు రక్తంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వివిధ అవయవాలకు వెళ్లి వాటిపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే.. ఎదుటి వ్యక్తిని ముద్దు పెట్టిన తర్వాత.. మనసుకు హాయిగా ఉంటుంది. శరీరం అలసటతో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిని ముద్దు పెట్టుకుంటే ఒత్తిడి మాయమవుతుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి. చుంబనం.. ఓ దివ్యౌషధం... రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదని అంటారు కదా.. కానీ.. ఆపిల్ కొనుక్కోవడం ఖర్చుతో కూడుకున్న పని. అదే.. ఇష్టమైన వాళ్లకో ముద్దు ఇస్తే.. వైద్యుడు అవసరం లేదని తెలుసా..? లాకింగ్ పెదవుల మానసిక ప్రభావం మీ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ముద్దు అనేది మానసిక, శారీరక ఆరోగ్యాల్ని పెంపొందిస్తుంది. ► ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలవుతుంది. దీనివల్ల రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటును పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది. ► ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది. ► ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు.. ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ► ఒక బలమైన ముద్దుకి 8–16 కేలరీలను కరిగించే సామర్థ్యం ఉంది. ► ఎదుటి వ్యక్తిని చుంబించే సమయంలో 34 ముఖ కండరాలతో పాటు 112 ఇతర కండరాలు పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ► ఇన్ని లాభాలున్న ముద్దుతో.. కాస్తా.. జాగ్రత్తగా ఉండాలి సుమా.. ఎందుకంటే.. ముద్దు పెట్టుకున్నప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాతో పాటు 278 రకాల సూక్ష్మ జీవులూ దూసుకొచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సుమా.. ఎన్ని ముద్దులో... దేశాలు, ప్రాంతాలు, సంస్కృతులు బట్టి.. ముద్దు గౌరవాన్ని, హోదాని సంతరించుకుంది. ఇలా.. వివిధ దేశాలు, ప్రజలు, బంధాల మధ్య మొదలైన చుంబనం.. వివిధ రకాలుగా మారిపోయింది. అధర చుంబనం.. మహాభారతంలో చెప్పిన అధర చుంబనమే ఇప్పుడు ఫ్రెంచ్ కిస్‌గా మారిపోయింది. దీన్ని ఫ్లోరెంటీనా కిస్ అని కూడా అంటారు. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకల్లో ఈ అధర చుంబనం సంప్రదాయంగా మారింది. చేతి ముద్దు.. ఎదుటివారి చేతిపై పెట్టే ముద్దు ఇది. ఉన్నత స్థాయికి చెందినవారు.. గౌరవ సూచకంగా పెట్టే ముద్దు ఇది. ఈ ముద్దు పొందే వ్యక్తి తన చేతిని ముందుకు వంచిప్పుడు ఎదుటి వ్యక్తి ఆ చేతిని తీసుకొని సున్నితంగా వేళ్లపై చుంబిస్తారు. చెక్కిలి ముద్దు.. ఇంగ్లిష్‌లో చీక్ కిస్ అని పిలిచే ఈ ముద్దే ఎక్కువ మంది అందుకుంటుంటారు. ఎదుటి వ్యక్తిపై స్నేహం, ప్రేమ.. గౌరవం, భక్తితో ఇచ్చే ముద్దు ఇది. తల్లిదండ్రులు, స్నేహితులు ఎక్కువగా ఇచ్చుకునే ముద్దులివే. ఫ్లయింగ్ కిస్.. ఒక సంకేతంగా ఇచ్చే ఊహాజనితమైన ముద్దు ఇది. పెదాలను గుండ్రంగా చుట్టి.. చేతులపై శబ్దంతో ముద్దు పెట్టి.. దాన్ని గాల్లో పంపించడమే. ఇష్టపడే వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తారు. ఎస్కిమో కిస్ ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని ఎస్కిమో కిస్ అని పిలుస్తారు. తండ్రీ కుమార్తె, భార్య భర్తలు, ప్రేమికులు.. ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇచ్చి పుచ్చుకునే ముద్దు ఇది. ఇద్దరి ముక్కులతోనూ రబ్ చేసుకోవడమే ఎస్కిమో కిస్.. స్నిఫ్ కిస్... కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా కనిపించే ముద్దు ఇది. బుగ్గపైనా, చెవి వెనుకభాగంలో.. చెంపపైనా.. ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని స్నిఫ్ కిస్ అంటారు. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో ప్రాచుర్యం పొందిన ముద్దు. ఇవే కాదు.. ఫ్లావర్డ్ కిస్, ఫిష్ కిస్, లిక్ కిస్, స్లైడింగ్ కిస్.. ఇలా విభిన్న రకాల చుంబనాలతో ఎదుటివారి మనసు దోచెయ్యొచ్చు మనస్ఫర్థలు దూరం చేస్తుంది... ఆఫీస్ పని ఒత్తిడితో ఒక్కోసారి నా భార్యను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సమయంలో.. జీవిత భాగస్వామి చాలా బాధపడుతుంటారు. ఈ సమయంలోనే మనస్ఫర్థలు వచ్చి.. జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు.. ఒక్క ముద్దు ఇస్తే.. చాలు.. అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. – శ్రీను, ఉమ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు -
మంచిని పంచు.. మంచిని పెంచు
ఎక్కడో ఐర్లండ్‌లో ఓ బస్సు నుంచి ఒక వృద్ధురాలు దిగింది. ఆమె షూ లేస్ విడిపోయి ఇబ్బంది పెడుతున్నాయి. డ్రైవర్ ఆమెను లే సు కట్టుకొమ్మన్నాడు. అయితే ఆమె ముందుకు వంగి లేస్ బిగించి కట్టుకోలేదని ఆయనకు అర్థమైంది. అతడు బస్సు నుంచి దిగి, ఆమె షూలేస్‌ను కట్టేశాడు. దీంతో ఆ వృద్ధురాలు సంతోషంతో ఆ డ్రైవర్‌కు బస్సు కదిలే సమయంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. చేసి మరిచిపోయేంత చిన్నపాటి సాయం ఆ డ్రైవర్ చేసింది. కానీ ఆ మంచి పని ఓ ప్రయాణికురాలి గుండెను తాకింది. అది ఆమె సెల్ కెమెరాకు చిక్కింది. ఆమె దాన్ని ఫేస్బుక్లో షేర్ చేసింది. అంతే.. ఇంటర్నెట్ ఆ మంచిని పంచింది. మరింత పెంచింది. ఇప్పుడు ఫొటోలో వీపు మాత్రమే కనిపించే ఆ గుడ్ సమారిటన్ డ్రైవర్ ఒక హీరో అయిపోయాడు. ‘నేను చేసిన ఇంత చిన్న సహాయానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. నేను చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసిన వారున్నారు. కానీ వారికి గుర్తింపు రాలేదు. నాకు మాత్రం అనుకోకుండా గుర్తింపు వచ్చింది’ అని హారిస్ అనే ఆ డ్రైవర్ అన్నాడు. అవును మరి! విత్తనం చిన్నదే కావచ్చు. కానీ అది మొలకెత్తితే మహావృక్షం అవుతుంది. మంచి పని చిన్నదే కావచ్చు. కానీ సరైన ప్రచారం దొరికితే లక్షల గుండెలను తాకుతుంది. వేయి విత్తులై, లక్ష మొక్కలై, కోట్ల పూలై, శతకోట్ల విత్తనాలై వ్యాపిస్తుంది -
లవ్ కిస్మత్
‘పెదవికి పెదవి రాసే ప్రేమలేఖ ముద్దు’ అన్నాడో కవి. నిజమే కావచ్చు. ఎందుకంటే... చుంబనం అనేది ఓ భావ వ్యక్తీకరణ. తల్లి బిడ్డకు, ప్రేమికుడు ప్రేయసికి, భర్త భార్యకి... తమ మనసును, ప్రేమను తెలిపేందుకు ఉపయోగించే చక్కని సాధనం ముద్దు. ఇష్టం, ప్రేమ, ఆరాధన, అనురాగం, అనునయం, ఓదార్పు, పలకరింపు.. ఏ భావాన్నైనా అందంగా ప్రకటించగల శక్తి ఉంది దీనికి! ..:: సమీర నేలపూడి విదేశాల్లో ముద్దుకు దాపరికం ఉండదు. ఏటా వాలెంటైన్ వీక్‌లోని ఆరో రోజైన ‘కిస్ డే’ నాడయితే.. ప్రేమికులు వీధుల్లో గుంపులుగా చేరి చుంబించుకునే దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. అయితే మనకు ముద్దు అనేది వ్యక్తిగత వ్యవహారం. తల్లిదండ్రులు పిల్లలను ముద్దాడే సన్నివేశాలు సైతం తక్కువగానే కళ్లబడుతుంటాయి మనకి. ఇక ప్రేమికులు, భార్యాభర్తల చుంబనం పూర్తి రహస్యం. మన సంస్కృతి మనకు నేర్పిన క్రమశిక్షణ అది. ముత్యమంతా ముద్దు.. ప్రేమంటూ కలిగాక.. దానికి అవతలి వ్యక్తి అంగీకారం లభించాక.. అది మనసును అసలు కుదురుగా ఉండనివ్వదు. తనకు మరింత చేరువ కావాలని, తను మీకే సొంతం అన్న నమ్మకాన్ని పొందాలని ప్రతి క్షణం ఉవ్విళ్లూరుతుంటుంది. ఆ నమ్మకం కలగడానికి ఓ తీయని ముద్దు తప్పకుండా సహకరిస్తుంది. మనసులు ముడిపడిన తర్వాత, మనుషులను మరింత చేరువ చేయడంలో ముద్దుది పెద్ద పాత్రే. ఒకరికొకరు సొంతమన్న భరోసానూ కలిగిస్తుంది. అందుకే మీ ప్రేమపై ముద్దు ముద్ర వేయడంలో తప్పు లేదు. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేసే ప్రదేశానికో, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే జలపాతాల చెంతకో తనను తీసుకెళ్లండి. అలాంటి ప్రదేశాలకు మన సిటీలో కొదవేమీ లేదు కదా! ఓ మంచి చోటును సెలెక్ట్ చేసుకోండి. అక్కడికి తీసుకెళ్లి కాసేపు మనసు విప్పి మాట్లాడండి. ఇష్టాలు తెలుసుకోండి. అభిప్రాయాలను పంచుకోండి. చివరిగా ఓ చిన్న ముద్దుతో ముగింపు పలకండి. కానీ ఒక్క విషయం.. తనకి అభ్యంతరం లేకపోతేనే ప్రొసీడ్ అవ్వండి. తొలిముద్దు జీవితాంతం గుర్తుండే తీయని జ్ఞాపకం కావాలి తప్ప.. అనుబంధాన్ని ఆదిలోనే తుంచేసే ఆయుధంగా మారకూడదు. ముద్దు ముద్దుకో మీనింగ్ ఎయిర్ కిస్: దీన్నే ఫ్లయింగ్ కిస్ అనీ అంటుంటారు. కాస్త దూరంలో ఉన్న వారికి పలకరింపుగా గానీ, సెండాఫ్ ఇస్తున్నట్టుగా గానీ ఈ ముద్దును ఇస్తారు. ఫోర్‌హెడ్ కిస్: నుదుటి మీద పెట్టే ఈ ముద్దు స్నేహానికి, ప్రేమకు ప్రతీక. హ్యాండ్ కిస్: ఇది పలకరింపు ముద్దు. ఒక వ్యక్తిని కలసినప్పుడు వారి చేతిని అందుకుని, వెనక్కి తిప్పి ముద్దు పెడితే.. వారిపై మీ గౌరవాన్ని, భక్తిని, అభిమానాన్నీ చాటుతున్నట్లు అర్థం. చీక్ కిస్: మరీ కొత్తవారిని కాకుండా, బాగా పరిచయం ఉన్న వారిని, అభిమానించేవారిని చెంపలపై ముద్దాడుతాం కదా..! అదే చీక్ కిస్. ఎస్కిమో కిస్: మీ ముక్కును తన ముక్కుకి రాసి, తర్వాత ముక్కును చుంబిస్తే అది ముద్దుగా పెట్టే ముద్దు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ముద్దాడుతారు. ఏంజిల్ కిస్: మూసి ఉన్న కనుపాపలపై పెట్టే ముద్దు ఇది. నిద్ర లేచిన వెంటనే గానీ, సెండాఫ్ ఇచ్చేటప్పుడు గానీ ఇలా ముద్దాడుతుంటారు. ఫ్రెంచ్ కిస్: ఇది మోస్ట్ రొమాంటిక్ ముద్దు. చాలా పాపులర్ కూడా. అధరాలపై చేసే ఈ గాఢ చుంబనం ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అనురాగానికి గుర్తు. ఇంకా జాలైన్ కిస్, టీజర్ కిస్, వాంపైర్ కిస్, సీక్రెట్ మెసేజ్ కిస్ అంటూ చాలా రకాలున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రేమయాత్రను ప్రారంభించిన వారు హ్యాండ్ కిస్‌తోనో, ఫోర్‌హెడ్ కిస్‌తోనో మొదలుపెడితే బెటర్. బంధం బలపడేవరకూ ఫ్రెంచ్ కిస్ జోలికి వెళ్లొద్దు. మొదటికే మోసం రావచ్చు! -
'పరుగులు చేస్తేనే.. ఫ్లైయింగ్ కిస్'
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి మైదానం నుంచి తన ప్రియురాలికి గాల్లో ముద్దులు ఇవ్వడాన్ని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సమర్థించాడు. అయితే పరుగుల వరద పారించినప్పుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలంటూ సరదాగా అన్నాడు. కాలంతో పాటు వచ్చిన మార్పులను స్వాగతిస్తామని చెప్పాడు. 'విరాట్ కోహ్లి సెంచరీ చేసి ప్రియురాలికి గాల్లో ముద్దు విసిరితే నాకేం అభ్యంతరం ఉండదు. కానీ పరుగులేమీ చేయకపోతే ఇబ్బంది. మేము క్రికెట్ ఆడినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. మేము వీటిని అంగీకరిస్తాం' అని కపిల్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లు గుంపుగా ఆలింగనం ఎందుకు చేసుకుంటున్నారో అర్థంకావడం లేదని వ్యంగ్యంగా అన్నాడు. 'డ్రెస్సింగ్ రూములో ఏం చేస్తున్నారు. కోడిగుడ్లు మాత్రమే తింటున్నారా' అని సరదాగా ప్రశ్నించాడు. భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 25 శాతం మత్రమే ఉన్నాయంటూ కారణాలు వివరించాడు కపిల్.