సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు.
బుధవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేవలం స్త్రీద్వేషి మాత్రమే ఇలా తమ స్థానాల్లో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తారేమో అంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. తన చేష్టల ద్వారా ఆయన అగౌరవంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు.
In this video MP Rahul Gandhi can be showing blowing 'Flying Kiss'. pic.twitter.com/5XnHWHQwkD
— Facts (@BefittingFacts) August 9, 2023
ఇదిలా ఉంటే రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు, మంత్రులు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, మోదీ సర్కార్‌పై విరుచుకుపడగా.. కౌంటర్‌గా స్మృతి ఇరానీ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
బీజేపీది అనవసర రాద్ధాంతం
ఇదిలా ఉంటే రాహుల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు వీడియోలో ఉందని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మరోసారి క్విట్ ఇండియా చేపట్టాలి: స్మృతి ఇరానీ
Comments
Please login to add a commentAdd a comment