న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్‌లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్‌కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్‌పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్‌గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్‌ను కుదిపేసేలా కనిపిస్తోంది.
సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌ది
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్‌సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్‌కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్‌సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు.
ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్‌కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్‌సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు.
మణిపూర్‌పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్
లోక్‌సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్‌పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment