counter attack
-
ఆర్మీ కాన్వాయ్‌పై ముష్కరుల కాల్పులు
జమ్మూ: జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వాస్తవాధీన రేఖకు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆర్మీ కాన్వాయ్‌పైకి ఉగ్ర మూకలు కాల్పులకు దిగాయి. బలగాలు అప్రమత్తమై దీటుగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ముష్కరులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన బలగాలు అదనంగా పోలీసులను, ఆర్మీని తరలించి గాలింపు ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద ఆయుధం స్వాధీనం చేసుసుకున్నారు. హెలికాప్టర్‌ను రంగంలోకి దించి బలగాలు ఓ భవనం బేస్మెంట్లో ఉగ్రవాదులు దాగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా భారీ పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు సభ్యుల ముష్కరుల ముఠా ఆదివారం రాత్రి సరిహద్దులు దాటి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అంబులెన్సుకు కనీసం డజను బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అంతకుముందు, ఉగ్రవాదులు అస్సన్ ఆలయంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ కోసం అక్కడి వారిని అడిగారు, ఇంతలోనే అటుగా వస్తున్న ఆర్మీ కాన్వాయ్‌ని గమనించి కాల్పులకు దిగారన్నారు. -
Russia-Ukraine war: రష్యాపై వందల డ్రోన్లతో ఉక్రెయిన్ ముప్పేట దాడి
కీవ్: రష్యా దురాక్రమణతో ఆగ్రహించిన ఉక్రెయిన్ మరోమారు డ్రోన్లతో ముప్పేట దాడికి తెగబడింది. డజన్ల కొద్దీ డ్రోన్లతో ఎదురుదాడిని పెంచింది. అయితే ఈ డ్రోన్లలో చాలావాటిని రష్యా విజయవంతంగా నేలకూల్చడంతో భారీ నష్టం ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీదకు రష్యా దండయాత్ర మొదలెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్ చేసి ప్రతిఘటనల్లో ఇదీ ఒకటని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. అయితే అటవీప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన మంటలతో కార్చిచ్చు వ్యాపించింది. ఒక భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. రష్యావ్యాప్తంగా ఏడు రీజియన్లలో పెద్దసంఖ్యలో ఉక్రె యిన్ డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 125 డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క ఓల్గోగ్రేడ్ రీజియన్‌లోనే 67 శత్రు డ్రోన్లను పేల్చేశామని రష్యా తెలిపింది. ఓరోనెజ్, రస్తోవ్ ప్రాంతాల్లోనూ డ్రోన్ల దాడులు, వాటిని రష్యా గగనతల రక్షణ వ్య వస్థ కూల్చేసిన ఘటనలు నమోద య్యాయి. డ్రోన్ల మంటలు పడి దాదాపు 50 ఎకరాల్లో అడవి తగలబడిపోయింది. -
Lok sabha elections 2024: కమలానికి పెనుసవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇటీవల వైరల్ చేసిన అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకేనా 400 సీట్లు? మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది. సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్ హెగ్డే, అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్‌పుత్‌లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. -
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్‌స్కీ ఎయిర్ ఫీల్డ్‌లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్‌స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
మావోల సరికొత్త ఎత్తుగడ
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో బంకర్ వెలుగుచూసిన నేపథ్యంలో మావోయిస్టులు సరికొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నట్టు తెలిసింది. దశాబ్దంన్నర కాలంగా బస్తర్ అడవుల్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న జనతన సర్కార్‌ను నిర్వీర్యం చేసేందుకు భద్రతాదళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వందల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ క్రమంగా అడవులపై పట్టు సాధిస్తున్నాయి. దీంతో పోలీసుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేసే పనిలో మావోయిస్టులు ఉన్నారు. ఈ మేరకు 80 పేజీలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్‌ను గోండు భాషలో తయారు చేశారు. ఇందులో ఉన్న రణతంత్ర వివరాలపై గతంలోనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, దీనిని ఆతర్వాత కొందరు హిందీలోకి అనువదించినట్టు తెలిసింది. ఆకాశదాడులు తిప్పికొట్టేలా.. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతాదళాలు తమపై రెండేళ్లుగా దాడులు చేస్తున్నాయంటూ మావోయిస్టులు ఆరోపిస్తుండగా, మావోయిస్టుల ఏరివేతకు వాయు దాడులు చేయడం లేదని భద్రతాదళాలు చెబుతున్నాయి. డ్రోన్లు ఉపయోగించినా నిఘా కోసమే తప్ప దాడులకు కాదంటున్నారు. ఇలా భిన్నవాదనలు ఉన్నా, ఆకాశ దాడులను తట్టుకోవడంతో పాటు తిప్పికొట్టే వ్యూహాలపై మావోయిస్టులు తీవ్రంగా ఆలోచించారు. ఈమేరకు రక్షణ వ్యూహాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల దాడుల నుంచి తప్పించుకునే అంశంపై డాక్యుమెంట్లో చర్చించారు. తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఎదురైతే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయించారు. డ్రోన్లు, హెలికాప్టర్ దాడులను తిప్పికొట్టేలా ‘చెట్లపై నుంచి రాకెట్ లాంచర్లు పేల్చడం’పై కేడర్‌కు శిక్షణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. డ్రోన్లపై తేలికగా దాడులు చేసేందుకు వీలుగా కొండపై ఎత్తయిన ప్రాంతాల్లో గస్తీ బృందాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే లాంగ్ పైప్ బాంబులను ప్రయోగించే దానిపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మూడడుగుల బంకర్లు డ్రోన్లు, హెలికాప్టర్ల కంట పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా డాక్యుమెంట్లో చర్చించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అడవిలో ఆరుబయట ప్రాంతంలో కాకుండా పైనుంచి చూస్తే కనిపించకుండా ఉండే చెట్ల కిందే విశ్రమించాలని నిర్ణయించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే...కనీసం మూడు అడుగుల లోతుతో బంకర్లు నిర్మించాలని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కొత్తగా మావోయిస్టు స్నైపర్ టీమ్‌లు మావోయిస్టులకు ఇప్పటికే బెటాలియన్లు, ప్లాటూన్లు, లోకల్ గెరిల్లా స్క్వాడ్, యాక్షన్స్ టీమ్‌లు ఉన్నాయి. అయితే అబూజ్మడ్ అడవుల్లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ క్యాంపులు పెరిగిపోతున్నాయి. ఒకేసారి వందల మందితో కూడిన బెటాలియన్లు అడవుల్లో నలుదిశలా కూంబింగ్ చేస్తున్నాయి. దీంతో భద్రతాదళాలపై అందుబాటులో ఉన్న కేడర్‌తో అంబూష్ దాడి చేయడం మావోయిస్టులకు సాధ్యం కావడం లేదు. కనీసం కూంబింగ్ స్పీడ్‌కు బ్రేకులు వేయడం సైతం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్నైపర్ టీమ్‌లు ఏర్పాటు చేసే అంశంపై మావోయిస్టులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అడవుల్లోకి వచ్చే భద్రతాదళాలపై స్నైపర్ టీమ్ దాడి చేసి కనీసం ఒక్కరిని గాయపరచగలిగినా భద్రతా దళాల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, తద్వారా కూంబింగ్ స్పీడ్‌కు బ్రేకులు పడతాయనేది మావోయిస్టుల వ్యూహంగా ఉన్నట్టు తెలిసింది. అగ్రనేతల సమావేశం? దంతెవాడ – బీజాపూర్ జిల్లా సరిహద్దులో వెలుగుచూసిన బంకర్లో మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావును మావోయిస్టు పార్టీ నియమించింది. అంతకుముందు ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన నాయకులు తాజాగా వెలుగు చూసిన బంకర్లోనే సమావేశమైనట్టు తెలుస్తోంది. :::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
-
కేసీఆర్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్
-
ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నం
చెన్నై: సనాతన ధర్మకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న తీవ్ర ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని మోదీ సహా కాషాయ పార్టీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వ్యాఖ్యలపై దాఖలైన కేసులన్నిటినీ చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో నెలలుగా కొనసాగుతున్న హింసపై విమర్శలను ఎదుర్కోలేని ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ, మంత్రులు సనాతన ధర్మపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు ‘జనహననం’అంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. తమను తాము రక్షించుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు’అని గురువారం ఉదయనిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. ‘మణిపూర్‌లో ఆగని హింసపై సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే మోదీజీ స్నేహితుడు అదానీని వెంటేసుకుని ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. మణిపూర్ హింసలో 250 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు..మోదీ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. వీటన్నిటినీ మరుగుపరిచేందుకే మోదీ, ఆయన బ్యాచ్ సనాతన వ్యాఖ్యలను వాడుకోవాలనుకుంటున్నారు. ప్రజల అమాయకత్వమే వారి రాజకీయాలకు పెట్టుబడి. ’అని విమర్శించారు. ‘ఈ రోజుల్లో సాధువులు కూడా ప్రచారం కోరుకుంటున్నారంటూ తన తలపై రూ.10 కోట్లు ప్రకటించిన సాధువుపై ఉదయనిధి వ్యాఖ్యానించారు. అంతా త్యాగం చేసిన ఆ సాధువుకు రూ.10 కోట్లు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమానవీయ విశ్వాసాలపైనే..: స్టాలిన్ సనాతన ధర్మంపై తన కొడుకు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై సీఎం స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంలో భాగమైన అమానవీయ సిద్ధాంతాలపైనే ఉదయనిధి మాట్లాడారని చెప్పారు. వీటి ఆధారంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. -
నిండు సభలో.. మహిళా మంత్రికి ముద్దులా?
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్‌లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్‌కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్‌పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్‌గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్‌ను కుదిపేసేలా కనిపిస్తోంది. సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌ది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్‌సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్‌కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్‌సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు. ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్‌కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్‌సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. మణిపూర్‌పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్ లోక్‌సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్‌పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు. -
రాహుల్ విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటర్
-
దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్
-
రష్యాపై ఎదురుదాడికి ఉక్రెయిన్ సన్నాహాలు!
బెర్లిన్: రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి విముక్తి కల్పించడానికి ఎదురుదాడికి దిగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన జెల్‌న్‌స్కీ ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కాల్జ్‌తో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ మీడియాకు లక్ష్యమని తెలిపారు. తమ ప్రాంతాలను రష్యాపై నుంచి తీసుకుంటామన్నారు. రష్యాపై దాడికి దిగేటంత ఆయుధ సంపత్తి తమ దగ్గర లేదన్నారు. రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని చెప్పారు. తమకు అండదండగా ఉంటూ 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్కు ధన్యవాదాలు తెలిపారు. -
ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
రఘునందన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రఘునందన్ ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్డిఎస్ భూములను కబ్జా చేశానని రఘునందన్ చెప్తున్నాడు. ఆర్డిఎస్ ఎక్కడుంది ఆయనకు తెలుసా? సర్వే నంబర్ 60 లో శ్రీశైలం ముంపు లో పోయింది. 2020 లో సర్వే చేయించిన తరవాతే మేము వాటిని ఖరీదు చేశాం. ఎవరు అప్లికేషన్ పెట్టినా సర్వే చేస్తారు. న్యాయవాదిగా ఉన్న రఘునందన్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు సర్వే చేసినా ఎంత భూమి ఉందో తెలుస్తుంది కదా? నేను విదేశాల్లో ఉన్నప్పుడే రిప్లై పంపించాను. ఆయన ఎప్పుడు వస్తారో చెప్పండి. మేము మళ్ళీ సర్వే చేయిస్తాం. మీరు తప్పు చేసినట్టు రుజువైతే తప్పయింది అని ఒప్పుకోవాలి. (ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లేనా?) నాకంటే చిన్న వాడివి. అపర మేధావి అని నాకు తెలుసు. పక్క నియోజకవర్గంలో వేలు పెట్టేపెట్టడం మానుకోవాలి. మా దగ్గర ఉన్న భూములకు రికార్డ్స్ ఉన్నాయి. మాకు భూమి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
పోటీ సంస్థలను దెబ్బతీస్తున్న జియో.. ఎయిర్టెల్ ఏం చెబుతోందంటే?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాము చౌక టారిఫ్‌లను అమలు చేస్తున్నామన్న దుగ్ధతోనే ఎయిర్టెల్ జియోఫైబర్‌పై ఫిర్యాదులు చేస్తోందని, కావాలనే తమ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలు చేస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. భవిష్యత్తులో ఇలాంటి చౌకబారు ఆరోపణలు మళ్లీ చేయకుండా ఎయిర్‌టెల్‌ను హెచ్చరించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో కోరింది. రిజిస్టర్ చేసుకోని డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాంలకు కంటెంట్‌ను అందించడం ద్వారా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు డౌన్‌లింకింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ట్రాయ్‌కు ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. తద్వారా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను జియో టీవీ ప్రసారం చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లయింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్జేఐఎల్) బ్రాడ్‌బ్యాండ్ ప్లానలతో పాటు పోటీ సంస్థలను దెబ్బతీసేలా చౌకగా లైవ్ టీవీ చానెళ్లు కూడా అందిస్తోందంటూ ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జియోకు ట్రాయ్ సూచించింది. తాము వినియోగదారులకు అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామనే అక్కసుతోనే ఎయిర్టెల్ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని జియో స్పష్టం చేసింది. తమ ప్లాన్లపై వివరణ ఇచ్చింది. -
కమలానికి కౌంటర్
-
Ram Gopal Varma: నాగబాబుపై ఆర్జీవీ సెటైర్లు.. వీడియో రిలీజ్
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన నాయకుల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్‌పై కామెంట్లు చేశారంటూ తనపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో ఆర్జీవీ మరోసారి కౌంటర్ ఎటాక్‌గా ముందుకొచ్చారు. ‘కొణిదెల నాగబాబు.. ఆయన తమ్ముడికి లేక అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు నాకు కాదు. నేను జనసేన మీదకాని పవన్ కల్యాణ్ మీద చేసిన ట్వీట్స్ పవన్ అభిమానిగా చేశాను. అది అర్ధం అవ్వకపోకడం నా దురదృష్టం.. అంతకన్నా ఎక్కువ పవన్ దురదృష్టం. కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే దాని తరువాత పవన్ కల్యాణ్ అవుట్ కమ్ ఏమిటో! జనమే చెపుతారు’ అంటూ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఈమేరకు ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు. Hello @Pawankalyan gaaru , Konchem mee bhaijaaan gaarini choosukondi pic.twitter.com/8ih8kgxlDC — Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2023 డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను — Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2023 -
TS: ఎన్నికలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
KTR.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పడిపోతోంది. మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కాంగ్రెస్‌ది.. కానీ, వారి షాకిస్తూ రెండు సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తుందనే తేల్చాయి. మా ప్రత్యర్థుల సర్వేలు కూడా మూడోసారి టీఆర్ఎస్ గెలుస్తుందని ఒప్పుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో గెలుస్తాము. నల్లగొండ, ఖమ్మంలో బీజేపీకి మండల స్థాయి నాయకులు లేరు. కాంగ్రెస్‌కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్ వివరంగా చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. పార్లమెంట్లో అన్‌పార్లమెంట్ పదాలు వాడేది బీజేపీ నేతలే. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని మోదీ ప్రైవేటు విజిట్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు వస్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మాకు ఎటువంటి పంచాయితీ లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్, రేవంత్ సిరిసిల్లకు వచ్చి ఏం చేస్తారు?. అందరు ప్రధానులు రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పులు చేశారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది?. కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్‌లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్‌హౌస్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు’’ని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడి -
ఇంటికే వస్తా అంటే రమ్మంటిని, కానీ, ఎక్కడా?: జూపల్లి
సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు. చదవండి👉🏼 విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి రాత్రి నుంచి చూస్తున్నా.. ఎక్కడా? ‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చదవండి👉🏼కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ -
‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’.. సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్
మీర్‌పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిత్యం పెరిగిపోతోన్న గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆదివారం రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చీపుళ్లు తిరగేస్తారనే భయంతోనే తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభకు మహిళలను ఆహ్వానించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఒక్కో రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపా రు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2వేల పింఛను ఇస్తుంటే..మరి కేంద్రం గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభలో అమిత్‌షా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ మాట్లాడలేదని.. అసలు సభ ఎందుకు పెట్టినట్లని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణుల మహాధర్నా. (ఇన్సెట్లో) కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న మంత్రి సబిత రానున్న రోజుల్లో మహిళల ఆగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని హెచ్చరించారు. హిందూ, ముస్లింల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజల్లోకి వస్తే గ్యాస్, ఇంధన ధరలు తగ్గించేంత వరకు తమ వద్దకు రావద్దని మహిళలే వారిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 111ను ఎత్తివేస్తామని బండి సంజయ్ చెప్పారని, దానిపై ఆయనకు అవగాహన లేదని, ఓ వైపు 111 జీవోను ఎత్తివేస్తేనే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్ని రూ.కోట్లు ఇచ్చామంటూ కిషన్‌రెడ్డి, అమిత్‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్న వారు ఇవే పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షానా.. అబద్దాలకు బాద్ షానా.. స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం కేంద్ర హోం మంత్రి పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కెంది. అమిత్ షా వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయ పర్యటకుల తాకిడి ఎక్కువైంది. హైదరాబాద్‌కి వచ్చి బిర్యానీ తిని, చాయి తాగి ఇక్కడి నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తున్నారు. అమిత్ షా మాట్లాడిన అబద్దాలు చూస్తుంటే తన పేరు మార్చుకోవాలి. తన పేరు అమిత్ షా కాదు అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలి. తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్ అంతా తుప్పే మాటలే. కేంద్ర మంత్రి హోదాలో ఉండి వాస్తవాలు చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళాడు. పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, హీనులు, చిల్లర పార్టీ బీజేపీ. కర్నాటకలో 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే నిధులు ఇచ్చే పరిస్థితి లేదు.. అవినీతి ఎవరిది?. సీఎం పదవిని అమ్ముకునే మీ పార్టీ అవినీతి పార్టీ కాదా?. చైతన్యవంతమైన పార్టీ టీఆర్ఎస్పైన పిచ్చిగా మాట్లాడటం మంచిది కాదు. నిజం చెప్పమని అడిగితే నిజాం గురించి మాట్లాడుతున్నాడు. నిజాం వారసులుగా బీజేపీ నేతలు పదే పదే తలుచుకుంటున్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలని అడిగాము. ఓ చదువుకోని బీజేపీ ఎంపీ 3 లక్షల 94 వేల కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. కానీ, నిన్న అమిత్ షా 2లక్షల కోట్లు ఇచ్చామని చెప్పాడు. బీజేపీ నేతల మాటలు అబద్దాలు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాలు బతుకుతున్నాయి. అప్పుల శాతంలో మనది 23వ రాష్ట్రం. 28 రాష్ట్రాలలో కింది నుండి 5వ స్థానం తెలంగాణది. 2014లో 56 లక్షల కోట్లు దేశం అప్పులు ఉంటే.. ఇప్పుడు 80 లక్షల కోట్లు అప్పు దేశానికి అయ్యింది. మేము అప్పు చేసేది అభివృద్ధి, సంక్షేమం కోసమే.. కానీ, బీజేపీ అప్పు చేస్తే కార్పొరేట్ మిత్రుల కోసం. అసమర్థ ప్రధాని ఉంటే దేశం ఇట్లా ఉంటది. మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది.. మీ స్టీరింగ్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు’’ అని కౌంటర్ ఇచ్చారు. Live: Addressing the Media at Telangana Bhavan https://t.co/Hkhvzr4vmk — KTR (@KTRTRS) May 15, 2022 ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి రాక ముందే బెంజ్ కారులో తిరిగా: మంత్రి -
రష్యా స్పేస్ చీఫ్‌కు ఎలన్ మస్క్ కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్‌కు.. రష్యాకు మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. తాజాగా రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్‌కు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మస్క్. ఉక్రెయిన్ పరిణామాల్లో ఫాసిస్ట్ బలగాలకు మిలిటరీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ద్వారా ఎలన్ మస్క్ మద్ధతు ఇస్తున్నాడంటూ రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు.. మూర్ఖుడంటూ మస్క్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను మస్క్ సీరియస్‌గానే తీసుకున్నాడు. మీడియాకు రోగోజిన్ ఇచ్చిన స్టేట్మెంట్ తాలుకా స్క్రీన్ షాట్లను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్లేషన్ చేసి మరీ ఎలన్ మస్క్ తన ట్విటర్ వాల్‌పై పోస్ట్ చేసి మరీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాడు. There are no angels in war — Elon Musk (@elonmusk) May 9, 2022 తాజాగా.. యుద్ధంలో దైవదూతలంటూ ఎవరూ ఉండరని రోగోజిన్‌కు పంచ్ వేశాడు. అంతకు ముందు చావు గురించి ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ మీద విపరీతమైన చర్చ నడిచింది. అనుమానాస్పద రీతిలో చనిపోతే.. అంటూ రష్యా నుంచి తనకు ముప్పు ఉందన్న కోణంలో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. రష్యా దురాక్రమణ మొదలైన తొలి నాటి నుంచే ఉక్రెయిన్‌కు మద్ధతు ప్రకటించాడు ఎలన్ మస్క్. అంతేకాదు తన శాటిలైట్ సర్వీస్ కంపెనీ స్టార్‌లింక్ నుంచి సేవలు సైతం అందించాడు. ఒకానొక టైంలో తనతో బాహాబాహీకి తలపడాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కే సవాల్ విసిరాడు ఎలన్ మస్క్. చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్ మస్క్ సంచలన ట్వీట్ -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్‌ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్ అహ్మద్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా వివరించారు.